బామ్మ కోరిక తీర్చిన మహేష్‌ బాబు | Mahesh Babu meets his 106-year-old female fan | Sakshi
Sakshi News home page

బామ్మ కోరిక తీర్చిన మహేష్‌ బాబు

Nov 26 2018 12:21 PM | Updated on Mar 20 2024 5:06 PM

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తనను కలవాలని ఉందన్న ఓ బామ్మ కోరిక తీర్చారు. వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల రేలంగి సత్యవతి అనే బామ్మకు మహేష్‌ కుటుంబం అంటే చాలా ప్రేమ. కొంతకాలం కిందట మహేష్‌ను చూడాలనేది తన కోరిక అని ఆమె తెలిపారు. ఇది కాస్త మహేష్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెను తన మహర్షి సినిమా షూటింగ్‌ జరుగుతున్న చోటుకు పిలిపించుకున్న మహేశ్‌.. షూటింగ్‌కు కాసేపు విరామం ఇచ్చి ఆమెతో ముచ్చటించారు. ఎలా ఉన్నారని అప్యాయంగా పలకరించారు. ఆమె వేసిన కుశల ప్రశ్నలకు మహేశ్‌ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఆ బామ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా మహేష్‌ను కలుసుకున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement