సస్పెన్షన్ వేటుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ స్పందించారు. పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ వీ హనుమంతరావుకు తొత్తులా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణా సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగేశ్ గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు. తనపై పార్టీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆయన విమర్శించారు.
నా సస్పెన్షన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం
Published Mon, May 13 2019 6:10 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
Advertisement
Advertisement
Advertisement