విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గుర్రంకొండ తరికొండల మధ్య తిరిగే మదనపల్లి డిపో బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్ ఎందుకు తీసుకోలేదని అడిగిన మహిళా కండక్టర్‌పై శివారెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె మీద దాడి చేయటమే కాకుండా డ్రెస్ చింపివేశాడు. డ్రైవర్, ప్రయాణికులు అడ్డుకున్నా లెక్కచేయకుండా అందరి సమక్షంలో కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వారంతా కలిసి అతడిని అదుపుచేసి పోలీసులకు అప్పగించారు.
మహిళా కండక్టర్‌పై దాడి
Published Tue, Feb 25 2020 7:10 PM | Last Updated on Thu, Mar 21 2024 11:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement