woman conductor
-
సుమ.. తొలి మహిళా బస్ కండక్టర్
తొలి మహిళా బస్ డ్రైవర్, తొలి మహిళా లోకో పైలట్, ఫలానా జిల్లాలో తొలి మహిళా కండక్టర్... ఇవన్నీ మనకు ఇప్పటికీ తాజాదనం నిండిన వార్తలే. కేరళలో ఇలాంటి తాజా వార్తగా ప్రచురితమై 28 ఏళ్లయింది. అప్పుడు తొలి మహిళా కండక్టర్‌గా ఉద్యోగంలో చేరిన సుమ ఈ నెలాఖరుకి రిటైర్ అవుతున్నారు. అది 1992, జూలై నాలుగవ తేదీ. త్రివేండ్రంలో ఆర్టీసీ బస్‌స్టాప్ కెళ్లింది సుమ. తనకు ఉద్యోగం కొత్త, తాను ఉద్యోగాన్ని ఎంచుకున్న రంగం మహిళలకు కొత్త. తెలిసిన బస్‌స్టేషన్ కూడా ఆమెకి కొత్తగా కనిపిస్తోంది. తనలో అలజడి కారణంగా అలా అనిపిస్తుందేమో అనుకుంది. కానీ అక్కడ ప్రయాణికులు మాత్రమే కాకుండా పోలీసులు, విలేఖరులు, ఫొటోగ్రాఫర్లు కూడా వచ్చారు. ప్రాంగణం కోలాహలంగా ఉంది. మహిళ... కండక్టర్ ఉద్యోగంలో చేరడాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించింది. అధికారికంగా ప్రారంభించడానికి రాష్ట్ర రవాణా మంత్రి బాలకృష్ణ పిళ్లై వచ్చారు. మంత్రి స్వయంగా సుమ చేతిలో టికెట్ ర్యాక్ పెట్టి సెక్రటేరియట్ హాల్ వరకు టికెట్ తీసుకున్నారు. ఆ వార్తను స్థానిక, జాతీయ పత్రికలు కూడా రాశాయి. ‘‘ప్రతి ఉద్యోగంలోనూ సమస్యలుంటాయి. నువ్వు కనుక ఆ సమస్యలకు భయపడి ఈ ఉద్యోగం మానేసి వెళ్లిపోతే తర్వాత తరం మహిళలు ఈ ఉద్యోగానికి రావడానికి ఇష్టపడరు. అదే జరిగితే మహిళలకు ఒక రంగంలో అవకాశాలు మూసుకుపోయినట్లే. ధైర్యంగా నిలబడి, నిబద్ధతతో ఉద్యోగం చేస్తే ఈ రంగంలో మహిళలకు సరికొత్త దారులు వేసిన దానివి అవుతావు’’ అని అప్పుడు మంత్రి చెప్పిన మాటలను రిటైర్ అవుతున్న సందర్భంగా గుర్తు చేసుకున్నారు సుమ. ఫస్ట్ ర్యాంకు ‘‘కేరళ రాష్ట్రప్రభుత్వం 1992లో మహిళలను కండక్టర్లుగా నియమించడానికి తొలి అడుగు వేసింది. రాతపరీక్షలో 300 మంది పాసయ్యారు. వారిలో నాది తొలి ర్యాంక్. ఇంటర్వ్యూలో పదిమందిమి సెలెక్ట్ అయ్యాం. మాకు త్రివేండ్రంలో స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రయాణికులెవ్వరూ నా పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు. స్కూలు, కాలేజీలకెళ్లే అమ్మాయిల పట్ల అశ్లీలంగా వ్యవహరించే వారి విషయంలో నేను చాలా ఖండితంగా ఉండేదాన్ని. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి ఒకమ్మాయితో అసభ్యంగా వ్యవహరించాడు. బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్తున్నప్పుడు అతడు తాను రిటైర్ అయిన పోలీసు అధికారినని మమ్మల్ని బెదిరించాడు. ఇలాంటి విషయాల్లో నేను కోరలున్న సింహానికే భయపడను, కోరలూడిన తోడేలుకి భయపడతానా... అని అతడి మీద కేసు ఫైల్ చేయించాం. ఇన్నేళ్ల ఉద్యోగంలో మరిచిపోలేని మరో సంఘటన 1997లో బస్సు ప్రమాదం. అప్పుడు నేను గర్భిణిని. మా బస్సు మరుత్తమ్కుజి దగ్గర ప్రమాదానికి గురైంది. నాకు చిన్న గాయాలు తప్ప ప్రమాదమేమీ లేదు. గాయాలను తుడుచుకుని, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఆర్మీ ట్రక్కులోకి ఎక్కించి హాస్పిటల్‌కు పంపించడంలో సహాయం చేశాను. ఇవి మర్చిపోలేని సంఘటనలు’’ అన్నారు సుమ. కండక్టర్ మెమొరీ నా చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన కండక్టర్స్ మెమొరీ అంటే ఏమిటో ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత తెలిసింది. ఒక అబ్బాయికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉండేది. పాఠాలను తరచూ మర్చిపోతుండేవాడు. అప్పుడు మా టీచర్ కండక్టర్ మెమొరీ ఉండాలని చెప్పారు. బస్సులో ప్రయాణికులందరి ముఖాలతోపాటు ఎవరు ఏ స్టాప్‌లో దిగుతారో గుర్తుపెట్టుకోవాలి. చిల్లర ఇచ్చేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కచ్చితంగా ఇవ్వగలగాలని అప్పుడామె వివరించారు. నాకు అవన్నీ ఆచరణలోకి వచ్చిన తర్వాత టీచర్ చెప్పిన మాటలో పరమార్థం తెలిసి వచ్చింది. –సుమ, తొలి మహిళా బస్ కండక్టర్, కేరళ కొన్నేళ్లుగా డెస్క్ డ్యూటీలో ఉన్న సుమ గత ఏడాది తిరిగి బస్ డ్యూటీకి వచ్చారు. ‘‘బస్సులో డ్యూటీ చేస్తూ రిటైర్ కావాలనేది నా కోరిక. కోవిడ్ కారణంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. నేను రిటైర్ అయ్యే లోపు బస్సులు తిరిగితే బావుణ్నని ఎదురు చూశాను. ఈ నెల 20వ తేదీన తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. డ్యూటీ చేస్తున్నాను’’ అని చెప్పారామె సంతోషంగా. – మంజీర -
మహిళా కండక్టర్‌పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు!
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్ శ్రీలతపై.. కానిస్టేబుల్ దాడి చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చర్లపల్లి జైలు నుంచి ఓ నిందితుడిని జడ్చర్ల కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తీసుకెళ్తున్న క్రమంలో జడ్చర్లలో హైద్రాబాద్–2 బస్‌డిపోకు చెందిన బస్సు ఎక్కారు. అనంతరం టికెట్ తీసుకోవాలని కోరిన కండక్టర్‌తో కానిస్టేబుల్ రామకృష్ణాగౌడ్ గొడవపడి దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఇందుకు బాధ్యులైన కానిస్టేబుల్ రామకృష్ణగౌడ్‌తో పాటు మరో హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డిని సైతం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మహిళా కండక్టర్‌పై దాడి, డ్రెస్ చించివేత
సాక్షి, చిత్తూరు: విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గుర్రంకొండ తరికొండల మధ్య తిరిగే మదనపల్లి డిపో బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్ ఎందుకు తీసుకోలేదని అడిగిన మహిళా కండక్టర్‌పై శివారెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె మీద దాడి చేయటమే కాకుండా డ్రెస్ చింపివేశాడు. డ్రైవర్, ప్రయాణికులు అడ్డుకున్నా లెక్కచేయకుండా అందరి సమక్షంలో కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వారంతా కలిసి అతడిని అదుపుచేసి పోలీసులకు అప్పగించారు. దాడికి గురైన మహిళ కండక్టర్ వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వలంగా గాయపడిన మహిళా కండక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తమ తోటి కార్మికురాలిపై దాడిని ఆర్టీసీ కార్మిక నాయకులు ఖండించారు. (చదవండి: మీకు నచ్చిన బ్రాందీ అమ్ముతారా..?) -
మహిళా కండక్టర్‌పై దాడి
-
మహిళా కండక్టర్ ఆత్మహత్య
-
ఖమ్మంలో మహిళా కండక్టర్ ఆత్మహత్య
సాక్షి, సత్తుపల్లి : మరో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ ఆత్మహత్య చేసుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఖమ్మంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా నిజామాబాద్–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్, ముషీరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్(37) గుండెపోటుతో మృతి చెందగా, ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే నార్కెట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజు కూడా కొనసాగుతోంది. చదవండి: డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత ‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’ -
అతివకు ఇక్కట్లు
ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. బస్సుల్లో వారంతా ఎక్కువ గంటలు నిలబడే విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో పాటు పల్లెలకు ఉన్న బస్సుల్లో ఉదయం, సాయంత్రం ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. జనాల మధ్యన ఆవస్థలు పడి టిక్కెట్లు కొడుతుంటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. చాలామంది 40 ఏళ్లు వచ్చేసరికి పలు రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని సీనియర్ కండక్టర్లు చెబుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని విన్నవిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు: జిల్లాలో 8 డిపోల పరిధిలో 858 బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 మందికి పైగా మహిళలు కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బద్వేలు డిపోలో 27 మంది, మైదుకూరు డిపొలో 26 మందికిపైగా, కడప 70 మందికిపైగా, ప్రొద్దుటూరు 50 మంది వరకు ఇలా ఎనిమిది డిపోలలో 400 మంది వరకు మహిళలు కండక్టర్లుగా పని చేస్తున్నారు. వీరిలో పది, పదిహేనేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 150 మంది వరకు ఉన్నారని అంచనా.. వీరంతా దీర్ఘకాలిక వ్యాధులతో నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వేళకు తిండిలేకపోవడం, ఎక్కువ పని గంటలు నిలబడే విధులు నిర్వహించడం, విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో అనార్యోగానికి గురి కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సరైన రక్షణ చర్యలతో పాటు ఆరోగ్య నియమాలు వర్తించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నా పట్టించుకునే దిక్కు లేరని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. అధికంగా వచ్చే సమస్యలివే.. ఆర్టీసీలో మహిళా కండక్టర్లు తమ ఎనిమిది గంటల విధుల్లో అధికశాతం నిలబడే ఉంటారు. రోజూ నిలబడే విధులు నిర్వహింస్తుండడంతో పలు సమస్యలు వస్తున్నాయి. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి, కీళ్ల సమస్యలు, మోచేతులు ఆరిగిపోవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక విధులు నిర్వహించే మహిళా కండక్టర్లు చాలా మంది ఉన్నారు. దీంతో వయస్సు పెరిగే కొద్దీ వారి సమస్యలు తీవ్రమయ్యే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుటుంబ పోషణ, తమ చిన్నారుల భవ్యిషత్తు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మహిళా కండక్టర్లకు సింగిల్ క్రూ డ్యూటీలు ఎక్కువగా వేస్తున్నారు. పగలంతా విధులే.. రోజూ తెల్లవారుజామున ఆరు, ఏడు గంటలకు డ్యూటీ ఎక్కి రాత్రి ఏడు, ఎనిమిది వరకు విధుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పాటు కనీసం విశ్రాంతి తీసుకుందామన్నా సరైన సవతి గృహాలు లేవు. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఇదే పరిస్థితి. బద్వేలు, రాయచోటి, మైదుకూరు డిపొల పరిధిలో రెస్ట్‌రూమ్‌ల పరిస్తితి అంతే. 40 ఏళ్లు పైబడిన వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆర్టీసీ డిస్పెన్సరీల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం లేదు. తీవ్ర అనారోగ్యానికి గురైతే విజయవాడ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. దీంతో అంతదూరం వెళ్లలేక ఆర్థికభారమైన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. మోకాళ్ల నొప్పులు ఎక్కువ బస్సుల్లో ఎనిమిది గంటలు నిలబడి డ్యూటీ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దూరప్రాంతాలు, ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండే రూట్లో విధులు నిర్వహించే మహిళా కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు సరైన విశ్రాంతి గదుల్లేవు. – లక్మిదేవి, బద్వేలు డిపో -
మహిళా కండక్టర్‌పై స్వామిజీ దాడి
కొలిమిగుండ్ల(కర్నూలు) : విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై సోమవారం ఓ స్వామిజీ దాడికి పాల్పడ్డాడు. నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఉదయం తాడిపత్రికి బయలుదేరింది. ఆ బస్సులో వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన కండక్టర్ బూరుగల సుబ్బలక్ష్మి విధులు నిర్వర్తిస్తున్నారు. మార్గంమధ్యలో ఇటిక్యాల గీతాశ్రమానికి చెందిన జయదేవ్‌స్వామి బనగానపల్లెలో బస్సు ఎక్కాడు. కొలిమిగుండ్ల వరకు టికెట్ తీసుకోవడంతో స్టేజీ రాగానే దిగాలని కండక్టర్ సూచించారు. అందుకు అంగీకరించని స్వామి తాను ఇటిక్యాలలో దిగుతానని పట్టుబట్టాడు. ఎక్స్‌ప్రెస్ సర్వీసు కావడంతో టికెట్ తీసుకున్న స్టేజీలోనే దిగాలని పేర్కొన్నా పట్టించుకోలేదు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సు జమ్మలమడుగు క్రాస్ రోడ్డు వద్దకు చేరగానే ఆవేశంతో ఊగిపోయిన ఆయన కండక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు అడ్డుకుని జయదేవ్‌స్వామికి దేహశుద్ధి చేశారు. బస్సును కొలిమిగుండ్ల స్టేషన్‌కు తీసుకొచ్చి కండక్టర్ స్వామిపై ఫిర్యాదు చేశారు. -
బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్
-
బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్
పశ్చిమగోదావరి: ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించిన అధికారులకు.. తీసుకున్న టికెట్ల కన్నా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కువ ఉన్నారని.. తెలవడంతో కండక్టర్ పై రిమార్క్ రాశారు. దీంతో మనస్తాపం చెందిన ఓ మహిళా కండక్టర్ బస్సులోంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలోని ఎల్ఎన్డీ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు.. జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బి.పద్మావతి కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఎన్డీ కాలనీ వద్ద తనఖీ అధికారులు బస్సు ఆపి తనిఖీ చేయగా.. టికెట్ల కన్నా బస్సులో 18 మంది ప్రయాణికులు ఎక్కువ ఉన్నట్టు గమనించారు. దీంతో కండక్టర్ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ రిమార్క్ అధికారలు రిమార్క్ రాశారు. ఇది గమనించిన పద్మావతి బస్సులోంచి కిందికి దూకేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కలకలం రేపిన మహిళా కండక్టర్
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కంకిపాటి వాణిశ్రీ తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో ఆదివారం రాత్రి బస్టాండ్‌లో కలకలం రేగింది. డిపోలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని, మనస్తాపంతో బస్టాండ్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె గణపవరంలో ఏఎస్సైగా పనిచేస్తున్న సోదరుడు రవికి, జంగారెడ్డిగూడెం పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న జి.వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో వారు ఆమె కాపాడాలని స్థానిక పాత్రికేయులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై కె.శ్రీహరిరావు, ఏఎస్సై రామచంద్రరావు, సిబ్బంది అక్కడకు చేరుకుని వాణిశ్రీని వారించారు. ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను గతంలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌లో ఉన్నానని, ఇటీవల తాను యూనియన్ మారానని చెప్పారు. యూనియన్ మారడంతో అప్పటి నుంచి డిపోలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మనస్తాపానికి గురై అత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడకు చేరుకున్న ఆమె భర్త వెంకటేశ్వరరావు వాణిశ్రీని అనునయించి ఇంటికి తీసుకెళ్లారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఎస్సై కె.శ్రీహరి వాణిశ్రీని కోరారు.