
సాక్షి, చిత్తూరు: విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గుర్రంకొండ తరికొండల మధ్య తిరిగే మదనపల్లి డిపో బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్ ఎందుకు తీసుకోలేదని అడిగిన మహిళా కండక్టర్‌పై శివారెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె మీద దాడి చేయటమే కాకుండా డ్రెస్ చింపివేశాడు. డ్రైవర్, ప్రయాణికులు అడ్డుకున్నా లెక్కచేయకుండా అందరి సమక్షంలో కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వారంతా కలిసి అతడిని అదుపుచేసి పోలీసులకు అప్పగించారు.
దాడికి గురైన మహిళ కండక్టర్ వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వలంగా గాయపడిన మహిళా కండక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తమ తోటి కార్మికురాలిపై దాడిని ఆర్టీసీ కార్మిక నాయకులు ఖండించారు. (చదవండి: మీకు నచ్చిన బ్రాందీ అమ్ముతారా..?)
Comments
Please login to add a commentAdd a comment