సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: మోదీ | Prime Minister Narendra Modi Address Nation | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: మోదీ

Published Sat, Nov 9 2019 6:44 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

 అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ.. శనివారం సాయంత్రం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. నూతన భారత్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వస్తున్న వివాదానికి నేటి తీర్పుతో శాశ్వతంగా ముగింపు పలికిందని మోదీ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని, ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిపోయిందని అన్నారు. ‘నవంబర్‌ 9 ఎంతో చారిత్రాత్మకమైన రోజు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement