భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘పోలవరానికి 1935 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదు. పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాలో కలపమని కాంగ్రెస్ పార్టీ ఆనాడు బిల్లులో పెట్టలేదు.. అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే. ప్రాజెక్టు కోసం బీజేపీ శిత్తశుద్దితో పని చేస్తోంది. కేంద్రం సిమెంట్ రోడ్లు, 24 గంటలు కరెంట్ ఇస్తే వాటిని చంద్రబాబు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు.
బీజేపీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది
Published Tue, Jun 26 2018 12:43 PM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM