ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం.. రాజకీయ విజయం మాత్రమే కాదని, ఒక నిబద్దత కలిగి.. ప్రజలకు అంకితమై.. ప్రజా జీవితంలో నైతిక విలువలను పాటిస్తూ.. ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ.. విలువలు కలిగిన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుని, నిర్ణయించిన విజయమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.