సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పైడి భీమవరం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు మంటల్లో కాలి బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద ఘటనతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మంటల్లో ట్రావెల్స్ బస్సు,తప్పిన పెనుప్రమాదం
Published Sun, Jan 5 2020 8:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement