‘మిలియన్ మార్చ్’ పిలుపు నేపథ్యంలో ట్యాంక్‌బండ్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నిషేధించారు.