traffic restructions
-
సీఎం బహిరంగ సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరించారు. సికింద్రాబాద్ నుంచి సభకు వచ్చే వారు పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, ఓల్డ్ నుంచి వచ్చే వాహనాలకు పీపుల్ ప్లాజా వద్ద పార్కింగ్ అనుమతి ఇచ్చారు. ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీలో నిలపాలని తెలిపారు. మెదీపట్నం నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ గ్రౌండ్ టూ అండ్ త్రీ వద్ద పార్క్ చేయాలన్నారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి మాస్క్ భౌతిక దూరం శానిటైజర్ తప్పనిసరి అని తెలిపారు. -
పలు రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ పనుల వల్ల ఈ నెల 15, 16 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు 15వ తేదీన లింగంపల్లి –నాంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 10 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నారు. అలాగే 16వ తేదీన లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య 3 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. ⇔ పూర్ణ–హైదరాబాద్ ప్యాసింజర్ 15వ తేదీన పూర్ణ నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది.తిరుగు ప్రయాణంలోనూ లింగంపల్లి నుంచే బయలుదేరుంది. ⇔ హైదరాబాద్–కొచువెలి స్పెషల్ ట్రైన్ నాంపల్లి స్టేషన్ నుంచి కాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 15వ తేదీ రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. తాండూరు–హైదరాబాద్ ప్యాసింజర్‌ను లింగంపల్లి వరకే నడుపుతారు. హైదరాబాద్–పర్భని ప్యాసింజర్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.10 కి బయలుదేరుతుంది. హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు : నగరంలో గురువారం నుంచి గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచి ప్రారంభమవుతుంది. శనివారం నుంచి 22 వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ నిమజ్జనం కోలాహలం నెలకొననున్న నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు, మళ్లింపులు ఇలా... హోటల్ మారియట్ ‘టి’ జంక్షన్ వద్ద: కర్బాలామైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా మీదుగా పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్లే వాహనచోదకులు కవాడీగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్లాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్లే వాహనచోదకులు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. నెక్లెస్ రోటరీ వద్ద:ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. వీటిని నెక్లెస్ రోడ్ లేదా మింట్ కాంపౌండ్ మీదుగా పంపిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా వద్ద:ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలామైదాన్ మీదుగా వెళ్లాలి. డీబీఆర్ మిల్స్ వద్ద:గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా పంపిస్తారు. -
ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్ మార్చ్’ ట్రాఫిక్ ఆంక్షలు
-
ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ‘మిలియన్ మార్చ్’ పిలుపు నేపథ్యంలో ట్యాంక్‌బండ్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ♦ సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్ దాటి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్–కవాడిగూడ–డీబీఆర్ మిల్స్–కట్టమైసమ్మ–అంబేడ్కర్ విగ్రహం–తెలుగుతల్లి–రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు. ♦ నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు. వీటిని గగన్‌మహల్–ఇందిరాపార్క్ మీదుగా పంపిస్తారు. ♦ నిరంకారి, పాత సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఇక్బాల్ మీనార్ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను మింట్ కాంపౌండ్/సెక్రటేరియేట్–ఎన్టీఆర్ మార్గ్–నెక్లెస్ రోటరీ–సంజీవయ్య పార్క్–నల్లగుట్ట–సికింద్రాబాద్ మీదుగా మళ్లిస్తారు. ♦ లిబర్టీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీఆర్కే భవన్–తెలుగుతల్లి –నెక్లెస్ రోటరీ–వీవీ స్టాట్యూ లేదా నెక్లెస్ రోడ్–సంజీవయ్యపార్క్–సికింద్రాబాద్ మీదుగా పంపిస్తారు. ♦ బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను మోర్ మెడికల్ హాల్–బాలాజీ గ్రాండ్ బజార్–క్రిస్టల్–తెలుగుతల్లి–ఇక్బాల్ మీనార్ మీదుగా పంపిస్తారు. నేడు పార్కులకు సెలవు తార్నాక: మిలియన్ మార్చ్‌ను పురస్కరించుకుని హెచ్ఎండీఏ పరిధిలోని పార్కులకు శనివారం సెలువు ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఎన్టీఆర్, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటాయని ప్రజలు గమనించాలని హెచ్ఎండీఏ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. -
'అమ్మ’ను చూసేందుకు కిలోమీటర్ల మేర జనం
-
‘అమ్మ’ను కడసారి చూసేందుకు..
-
‘అమ్మ’ను కడసారి చూసేందుకు..
జనసంద్రమైన చెన్నై వీధులు చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజాజీహాల్ ప్రాంతంతో పాటు చెన్నైవీధులు జన సంద్రమైయ్యాయి. చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూలాల నుంచి అమ్మ అభిమానులు, ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో చెన్నై నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజల సందర్శనార్ధం పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ పరిసర ప్రాంతాల్లోను భద్రత కట్టుదిట్టం చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి క్యూలలో ప్రజలను పంపిస్తున్నారు. జయలలితతో తమకున్న అనుబంధాన్ని పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అమ్మకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. చెన్నై మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.