
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా రేపు ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరించారు. సికింద్రాబాద్ నుంచి సభకు వచ్చే వారు పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, ఓల్డ్ నుంచి వచ్చే వాహనాలకు పీపుల్ ప్లాజా వద్ద పార్కింగ్ అనుమతి ఇచ్చారు. ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీలో నిలపాలని తెలిపారు. మెదీపట్నం నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ గ్రౌండ్ టూ అండ్ త్రీ వద్ద పార్క్ చేయాలన్నారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి మాస్క్ భౌతిక దూరం శానిటైజర్ తప్పనిసరి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment