పుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తనపై చేసిన ‘బాడీ షేమింగ్’, వర్ణ వివక్ష పూరిత కామెంట్లపై 1997 ‘మిస్ వరల్డ్’, నటి డయానా హెడెన్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు ఓసారి ఆలోచించుకోవాలని సీఎం బిప్లబ్‌కు సూచించారు. దాంతోపాటుగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి బుద్ధి చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, డయానా హెడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బిప్లబ్ దేబ్ వెనక్కి తగ్గారు. స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పారు.