ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతిపట్ల ఖమ్మం బసు డిపో ఎదుట నిరసన తెలియజేస్తున్న కార్మికులను పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కండక్టర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.