ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి అందిన హైకోర్టు కాపీ | TSRTC Strike:Transport Minister Ajay, RTC MD meets again CM KCR | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి అందిన హైకోర్టు కాపీ

Published Sun, Oct 20 2019 4:04 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి హైకోర్టు ఆదేశానికి సంబంధించిన పూర్తి పాఠం ప్రతి ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ కుమార్‌ శర్మ మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లారు. కోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా చర్చల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ వద్ద ఓసారి చర్చలు జరిగాయి. అయితే హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తూ, కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని, విజయం సాధించేవరకూ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆర‍్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement