ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్లుగా పోరాడుతోందని రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ నేత వీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. హోదా రాష్ట్రానికి సంజీవని అని వైఎస్సార్ సీపీ నమ్ముతోందని, హోదా సంజీవని కాదని టీడీపీ బాహాటంగా చెప్పిందని అన్నారు. రాష్ట్రానికి హోదా సంజీవని అని వైఎస్సార్ సీపీ, జనసేన, వామపక్షాలు బలంగా నమ్ముతున్నాయన్నారు.