తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబం ఆత్మగౌరవంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేటీఆర్ ఉద్దేశం అని ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కె తారకరామారావు తెలిపారు. కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ డబుల్ బెడ్‌రూమ్‌లకు శంకుస్థాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రెండువేలకు పైగా మురికివాడలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి అందిస్తే డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. మురికి వాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్ళు అగ్గిపెట్టెల్లా ఉండేవని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో విశాలవంతమైన డబుల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ళకు రూ.18 వేల కోట్లు
Published Sat, Feb 10 2018 12:47 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
Advertisement