ఆస్తి వివాదం: పెద్దమ్మను చితకబాదిన కుమారులు | Woman Brutally Beaten by Her Brother in Laws Sons  | Sakshi
Sakshi News home page

ఆస్తి వివాదం: పెద్దమ్మను చితకబాదిన కుమారులు

Published Fri, May 18 2018 11:31 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

దేశ రాజధాని నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో పెద్దమ్మను మరుదుల కుమారులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని జగత్‌పూరిలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొద్ది రోజుల నుంచి ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదాల్లో పెద్ద అన్న భార్య తలదూర్చింది. దీంతో ఆవేశానికి లోనైన మరుదుల కుమారులు.. ఆమెను నడిరోడ్డుపై చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement