‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్నవారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతిఒక్కరం చేయి చేయి కలపాలి’’ అని పిలుపునిచ్చారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఉభయ సభల అధ్యక్షులు, పలువురు కీలక నేతలు, భాషాభిమానులు వేడుకలో పాలుపంచుకున్నారు.
Published Tue, Dec 19 2017 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement