నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. భూమా బ్రహ్మానందరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయపన్ను (ఐటీ) రిటర్న్స్ సమర్పించలేదని వైఎస్‌ఆర్ సీపీ నేతలు సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కాగా టీడీపీ యధేచ్ఛగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘిస్తూ నిన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు పొన్నాపురం కాలనీ కోదండ రామాలయం ప్రాంగణంలో టీడీపీ బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు.