ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాటం కొనసాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం పార్లమెంటులో ఆందోళన చేపట్టింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా హైకోర్టు భవనం నిర్మించలేదని ఎద్దేవా చేశారు.