ప్రత్యేక హోదా కోసం తాము చేసిన రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంటుందని, స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు తమ రాజీనామాలపై మాట్లాడం సరికాదన్నారు. చంద్రబాబువి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలేనని విమర్శించారు