ఇండియా వండరర్స్‌ | India beat South Africa in eventful Johannesburg final Test | Sakshi

Jan 28 2018 8:09 AM | Updated on Mar 21 2024 8:11 PM

వాండరర్స్‌ మైదానం మనకు మరోసారి అచ్చొచ్చింది. అందీ అందనట్లుగా ఊరిస్తున్న విజయాన్ని టీమిండియా నిజం చేసుకుంది. పచ్చిక పిచ్‌పై పేస్‌తో బెంబేలెత్తిద్దామని భావించిన ప్రొటీస్‌ను అదే పేస్‌తో బోల్తా కొట్టించింది. ప్రత్యర్థి ప్రతిఘటనతో ఒక దశలో చేజారుతుందేమో అనిపించిన మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొని... సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ పరాభవాన్ని తప్పించుకుంది. మహమ్మద్‌ షమీ (5/28) నిప్పులు చెరిగే బంతులకు బుమ్రా (2/57), ఇషాంత్‌శర్మ (2/31)ల పదునైన బౌలింగ్‌ తోడవటంతో 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 177కే ఆలౌటైంది. ఓపెనర్‌ ఎల్గర్‌ (86 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఆపద్బాంధవుడు ఆమ్లా (52) పోరాడినా... తర్వాతి బ్యాట్స్‌మెన్‌ చేతులేత్తేశారు. దీంతో శనివారం ఇక్కడ ముగిసిన మూడో టెస్టులో భారత్‌ 63 పరుగుల తేడాతో గెలుపొందింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement