అచ్చం బూమ్రా లాగనే | Pakistan Fan Tries To Imitate Jasprit Bumrah Bowling Actions | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 3:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బూమ్రా ఓ బుడ్డోడి బౌలింగ్‌కు ఫిదా అయ్యాడు. అచ్చం తనలాగే బౌలింగ్‌ చేస్తున్న ఆబుడ్డోడిని చూసి ఈ ప్రపంచ నెం1 బౌలర్‌ మురిసిపోతున్నాడు. ప్రస్తుతం  ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దాయదీ పాకిస్తాన్‌కు చెందిన ఆ బాలుడు బూమ్రాకి వీరాభిమాని. దీంతో అతని బౌలింగ్‌ శైలిని అనుకరిస్తూ తన స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా ఒకరు వీడియో తీసి ట్విటర్‌ వేదికగా బుమ్రా దృష్టికి తీసుకొచ్చారు. ‘పాకిస్తాన్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు మీ వీరాభిమాని. ఇటీవల జరిగిన ఆసియా కప్‌ టోర్నీలో మీ బౌలింగ్‌ చూసినప్పటి నుంచి మిమ్మల్ని అనుకరిస్తూ బౌలింగ్‌ చేస్తున్నాడు’ అంటూ ఆ వ్యక్తి బూమ్రాకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement