ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల శాఖ పనితీరుపై ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ చేపట్టిన ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కే ధనంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.