Top Stories
ప్రధాన వార్తలు

బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో నిన్న (జూన్ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం (జూన్ 4) ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోలేదు. విజయోత్సవ వేడులు బుధవారానికి బదులు ఆదివారం (జూన్ 8) నిర్వహించుకోవాలని సూచించారు.టైటిల్ గెలిచిన మరుసటి రోజే వేడుకలు నిర్వహిస్తే అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, ఇది తీవ్రమైన గందరగోళానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఆదివారం వరకైతే విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని వాదించింది.వేడుకలు ఆదివారానికి వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. వేడి మీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది.ఆర్సీబీ టైటిల్‌ను గెలిచిన మరు క్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న అభిమానులు తెగ హడావుడి చేశారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మానం జరుగుతుందని తెలియడంతో అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గుమికూడవద్దని పోలీసులు ముందే హెచ్చరించినా అభిమానులు వినలేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో స్టేడియం చుట్టూ రెండు లక్షలకు పైగా జనం ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ సాధించడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్‌లో ఆటగాళ్ల ఊరేగింపుకు ప్లాన్ చేసింది. అయితే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు వారించడంతో వెనక్కు తగ్గింది. తీరా చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్యాన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తే, అది చివరికి విషాదాంతమైంది.

మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీమరాజా మరికొందరు ఫుల్‌గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.తాను వైఎస్సార్సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు.

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్‌లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్‌టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్‌నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..
సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్‌ని రాకెట్లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్‌కు చెందిన ఆక్సియమ్ స్పేస్ మిషన్‌ని స్పేస్ఎక్స్-నాసా భాగస్వామ్యంతో మరికొద్దిరోజుల్లోనే ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్‌కు భారత్‌కి చెందిన శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు. మరీ ఈసారి జీరో గ్రావిటీలో చేరుకున్నందుకు గుర్తుగా వ్యోమగాములు ఏ బొమ్మను తీసుకువెళ్తున్నారు..? దాని ప్రత్యేకత వంటి విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!..ఆక్సియమ్ స్పేస్ మిషన్ ఈ నెల జూన్ 10న ప్రారంభకానుంది. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ లాంఛ్ అవుతుంది. ఈ రాకెట్ నలుగురికిపైగా వ్యోమగాములు, వారి పరిశోధన సామాగ్రితో సహా అంతరిక్ష కక్ష్యలోకి తీసుకువెళ్లనుంది. వారితోపాటు జీరో-గ్రావిటీకి గుర్తుగా ఓ చిన్న బొమ్మ కూడా ఈ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ బొమ్మను జీరోగ్రావిటీ ఇండికేటర్‌గా వ్యవహరిస్తారు.ఈ మేరకు ప్రీ-ఫ్లైట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ఆక్సియం-4 సిబ్బంది మిషన్ జీరో-గ్రావిటీ ఇండికేటర్‌ను ఆవిష్కరించారు. అదేంటంటే సరస్వతి దేవి వాహనమైన 'హంస'. భారరహిత స్థితిలోకి చేరుకున్న దృశ్యమానాన్ని సూచించడానికి వ్యోమగాములు తమ వెంట ఏదో ఒక బొమ్మ తీసుకువెళ్లే సంప్రదాయంలో భాగంగా ఈ సారి హంసను ఎంపిక చేసుకున్నట్లు ఆక్సియం మిషన్ పేర్కొది. ఇదే ఎందుకంటే..భారతీయులు జ్ఞానాన్ని, ఉన్నత విద్యను అందించే దేవతగా సరస్వతి మాతను ఆరాధిస్తారు. ఆమె వాహనమే ఈ హంస. ఆంనదాన్ని హంసతో పోలుస్తారు. హంస రంగులా ఆనందం నిర్మలమైన తెలుపులో ఉంటుదనేందుకు సూచిక. అలాగే దాని ముక్కు పసుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. అంటే సవాళ్లు, విజయాలు ఒకదాని వెంట ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అదీగాక ఈ మిషన్‌లో ప్రయాణించి నలుగు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ హంసనే సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా ఆ సభ్యులలో ఒకరైన భారతీయ వ్యక్తి వ్యోమగామి శుక్లాకు ఆ బొమ్మతో మతపరంగా మరింత లోతైన సంబంధం ఉంది. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ శుక్లా మాట్లాడుతూ..హంసకు పాల నుంచి నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందని విశ్వసిస్తారు. ఇది జ్ఞానానికి సూచిక. ఈ బొమ్మ మా మిషన్‌ని విజయంతం చేసేలా స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఇక ఈ మిషన్ కమాండర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మాట్లాడుతూ..వ్యోమగామి సిబ్బంది మైక్రోగ్రావిటీ గుర్తుగా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లోపల ఈ హంస బొమ్మ స్వేచ్ఛగా తేలుతున్నట్లు కెమెరాల్లో చూడొచ్చన్నారు. అంతేగాదు ఈ ఆక్సియమ్ రాకెట్‌ను ప్రయోగించిన కొద్దిసేపటికే.. ఈ టాయ్ మైక్రోగ్రావిటీలో మన రాకను సూచిస్తుందని చెప్పారు. ఇక మిషన్‌లో పాల్గొన్న మూడు దేశాల వ్యోమగాముల ఆకాంక్షలకు చిహ్నం కూడా ఈ హంస బొమ్మే. అదేలా అంటే..భారతదేశంలో ఇది జ్ఞానానికి చిహ్నం కాగా, పోలాండ్, హంగేరిలో ఇది దయకు సంకేతం. అంతేగాదు ఆ నలుగురు వ్యోమగాముల వైవిధ్యానికి, ఐక్యతకు చిహ్నంగా ఈ హంస బొమ్మ నిలవడం మరింత విశేషం. కాగా, ఈ ఆక్సియమ్ 4 మిషన్ గత నెల మే29న ప్రారంభం కావలి, అనివార్య కారణాల రీత్యా జూన్ 8కి షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత జూన్ 10 సాయంత్రం 5.52 నిమిషాలకు లాంఛ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది స్పేస్ఎక్స్. మిషన్ సోవియట్ సోయుజ్ T-11తో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడు కాగా, సరిగ్గా 41 ఏళ్లకు, ఆక్సియమ్ 4 మిషన్‌తో గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలిచారు. అంతేగాదు బహుళ భారతీయ ఏజెన్సీల భాగస్వామ్యంతో శాస్త్రీయ ప్రయోగాలతో కూడిన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొన్న మొదటి భారత పౌరుడు కూడా ఆయనే.(చదవండి: భారత్‌పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్‌చేస్తే..)

ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ నిలిచింది. 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్‌లోని ఎస్బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్..’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్‌కు ఎస్బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్, భారత్‌కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV— Harsh Goenka (@hvgoenka) June 4, 2025ఇదీ చదవండి: మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రిఎస్బీఐ ట్వీట్ నిజమేనా?వైరల్‌గా మారుతున్న మాల్యా ట్వీట్‌కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్‌ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది.

జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్
బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్‌లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్‌లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్‌లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50శాతం మేరకు బుకింగ్‌ల తగ్గుదల ఉందని హాంకాంగ్‌లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.చెప్పినవి చెప్పినట్లే జరిగాయి1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్ జపాన్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’

చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్‌బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్‌లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్‌బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్‌గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు.

కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్‌గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్‌గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్‌గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్‌గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025

పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్‌నగర్‌లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్‌కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్‌లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..!
ప్రతీది రాజకీయమే.. కమల్ 'కన్నడ' వివాదంపై రానా రియాక్షన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
Hyderabad: సూట్‌కేసులో యువతి మృతదేహం
సంక్రాంతికి కర్చీఫ్ వేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన!
‘తలపై గురిపెట్టేవారితో మాట్లాడేదే లేదు’: ఎంపీ శశి థరూర్
Chitrakoot చరిత్ర చెక్కిన రామాయణం.. అడుగడుగునా విశేషమే!
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..
సంజూ శాంసన్ ఉదారత
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
పీఓకేలో నిరసనల హోరు
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్‌తో టెస్టు డ్రా
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
మనది నేషనల్ లెవల్ సార్! వెన్నుపోటులో మనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్‌స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
మా పేరేంట్స్‌కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
చదువు పేరుతో సహజీవనం..!
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..!
ప్రతీది రాజకీయమే.. కమల్ 'కన్నడ' వివాదంపై రానా రియాక్షన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
Hyderabad: సూట్‌కేసులో యువతి మృతదేహం
సంక్రాంతికి కర్చీఫ్ వేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన!
‘తలపై గురిపెట్టేవారితో మాట్లాడేదే లేదు’: ఎంపీ శశి థరూర్
Chitrakoot చరిత్ర చెక్కిన రామాయణం.. అడుగడుగునా విశేషమే!
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..
సంజూ శాంసన్ ఉదారత
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
పీఓకేలో నిరసనల హోరు
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్‌తో టెస్టు డ్రా
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
మనది నేషనల్ లెవల్ సార్! వెన్నుపోటులో మనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్‌స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
మా పేరేంట్స్‌కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
చదువు పేరుతో సహజీవనం..!
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
సినిమా

భర్తతో విడాకులు.. సింగర్‌కు క్యాబ్ డ్రైవర్ వేధింపులు!
హైదరాబాద్: భర్తతో విడాకులు తీసుకున్న ఓ ఫిమేల్ సింగర్‌ను క్యాబ్ డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే..బేగంపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన గాయనికి 2012లో వివాహం జరగ్గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా 2024లో విడాకులు తీసుకుంది. అయితే సింగర్ విడాకులు తీసుకున్న విషయం తెలుసుకున్న బల్కంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఉమామహేష్ గతంలో 2006లో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఆమెకు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు విషాదం.. కమల్ హాసన్ ట్వీట్!
బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పోస్ట్ చేశారు. ఈ ఘటన హృదయ విదారకంగా అనిపించిందని.. తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.కాగా.. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన పరేడ్ విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. చాలామంది ఫ్యాన్స్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు.మరోవైపు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. అయితే కన్నడ భాషపై ఆయన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. Heart wrenching tragedy in Bangalore. Deeply distressed and my heart reaches out to the families of the victims in this moment of grief. May the injured recover soon.— Kamal Haasan (@ikamalhaasan) June 4, 2025

నేను పెద్ద అందగాడినేం కాదు.. దేవుడిని ఒక్కటే కోరుకున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మంచు విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలనేది ఆశయమని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నేను పుట్టినప్పటి నుంచి యాక్టర్ కావాలనేది నా ఆశయం. కానీ నా చిన్నప్పుడు నేనేం పెద్ద అందగాన్ని కాదు. ఇప్పుడు కూడా అందగాడినేమి కాదు. దేవుడిని ఒకటే అడిగేవాన్ని. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. దాన్ని నిలబెట్టుకుంటాను చెప్పేవాడిని. దేవుడు నాకు వరమిచ్చాడు.. ఈ జన్మ ఎత్తింతి నేను నటుడిగానే ఉండాలి. మిగతావన్నీ నాన్న ఇచ్చిన బాధ్యతలు. యూనివర్సిటీ నాకు రెస్పాన్సిబిలిటీ. నటనలో ఎలాగైతే ఉంటానో.. యూనివర్సిటీ, స్కూల్ నడపడం నాకు చాలా సులభం. నా తర్వాత కూడా మన యూనివర్సిటీ పేరు నిలిచిపోవాలి. రిలయన్స్, టాటా కంపెనీకి ఎలా బ్రాండ్ ఉందో మనందరికీ తెలుసు. రతన్ టాటా లేకపోయినా ఆ బ్రాండ్‌కు ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అలా ప్రొఫెషనల్‌గా ఉండాలి' అని అన్నారు.కాగా.. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్ లా్, అక్షయ్ కుమార్, మెహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నంచి శ్రీకాళహస్తి సాంగ్‌ను విడుదల చేయగా అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ పాటలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించారు. నేను అందగాడ్ని కాదు.. కానీ నటించడానికే ఈ జన్మ ఎత్తా - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/v49DQe5esw— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2025

కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్‌గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్‌గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్‌గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్‌గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

మాటలు రావడం లేదు.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరుష్క
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్ సెలబ్రేషన్స్ తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్‌ప్లేయర్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది‘ అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ‘‘చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’అని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి టైటిల్ కప్ కైవసం చేసుకోవడంతో అసంఖ్యాక అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఒక అంచనా. ఈ అంచనా పోలీసుల అంచనాని మించిపోయి వాళ్ల చేతులు దాటిపోయింది. అదే సమయంలో.. ఏడో నెంబర్ గేటు దగ్గర విపరీతమైన రద్దీ, ఫ్రీ టికెట్ పుకార్లు, వర్షం, స్టేడియంలో జనాల బరువుకు కాలువ పైకప్పు కుప్పకూలిపోవడం.. ఇలా ఒకేసారి అన్నింటితో పరిస్థితి అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) కారణమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై కేఎస్‌సీఏ విచారం వ్యక్తం చేసింది. ’చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్సీబీ, కేఎస్‌సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.’అని ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్‌సీఏ ప్రకటించింది. ఇక.. ఈ దుర్ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అది తమ ఈవెంట్ కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు. "పూర్తి వాస్తవాలు తెలియకుండా నేను ఇప్పుడు ఎవరినీ నిందించదలచుకోలేదు. గత ఏడాది వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు, స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించాం. లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అన్ని నిబంధనలు పాటించాం" అని సైకియా తెలిపారు.

గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 22–20తో పొలీనా బురోవా–యెవెనియా కాంటెమిర్ (ఉక్రెయిన్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకోగా... రెండో గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో యుకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో (జపాన్)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; అశిత్ సూర్య–అమృత జోడీలు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సతీశ్–ఆద్య జోడీ 15–21, 21–16, 21–17తో యె హోంగ్ వె–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. రుత్విక–రోహన్ 14–21, 9–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) చేతిలో, అశిత్–అమృత 15–21, 9–21తో మాడ్స్ వెస్టెర్గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) చేతిలో, తనీషా–ధ్రువ్ 11–21, 21–16, 14–21తో టాంగ్ జి చెన్–ఈ వె తో (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి ఓటమి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం లక్ష్య సేన్, ప్రణయ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... రెండో రోజు బుధవారం కిరణ్ జార్జి కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 20–22, 9–21తో ఓడిపోయాడు.

కరువానాపై అర్జున్ విజయం
స్టావెంజర్: నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ జోరుకు బ్రేక్ పడగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయంతో టైటిల్ రేసులోకి వచ్చాడు. ఎనిమిదో రౌండ్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల గుకేశ్ 50 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ అర్జున్ 71 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. క్లాసికల్ గేమ్‌లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్‌లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్‌లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. ఎనిమిదో రౌండ్ ముగిశాక కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 పాయింట్లతో కార్ల్సన్ రెండో స్థానంలో, 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 10.5 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో, వె యి (చైనా) 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో ఉన్నారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 13.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హంపి 58 ఎత్తుల్లో సారా ఖాదెమ్ (స్పెయిన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి 37 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్పై సంచలన విజయం సాధించింది.

ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
లండన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో వన్డేలో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 40 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (71 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుడకేశ్ మోతీ (54 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అల్జారీ జోసెఫ్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో విండీస్ గౌరవప్రద స్కోరును సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా... సాఖిబ్ మెహమూద్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 246 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ ధనాధన్ ఆటతీరుతో కేవలం 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు జేమీ స్మిత్ (28 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెన్ డకెట్ (46 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు అవుటయ్యాక జో రూట్ (49 బంతుల్లో 44; 1 ఫోర్), హ్యారీ బ్రూక్ (36 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), జోస్ బట్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. జేమీ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... జో రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ శుక్రవారం మొదలవుతుంది.
బిజినెస్

మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి
అంతరిక్ష సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కీలకంగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్‌మస్క్ ఆలోచనలను ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ వ్యతిరేకించారు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం చేస్తున్న గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఎర్రోల్ మస్క్ విమర్శలు గుప్పించారు. రాకెట్లు మానవులు, ఇతర గ్రహాలను కాలనీలుగా మారుస్తాయని మస్క్ అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎర్రోల్ మస్క్ తోసిపుచ్చారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. శాస్త్రీయంగా లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు.ఎలాన్ మస్క్ దీనికి బదులుగా గురుత్వాకర్షణ, అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని కుదించేలా అధ్యయనం చేయడం మేలని ఎర్కోల్ మస్క్ చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో ఈమేరకు చేసే అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కృషిని ప్రస్తావిస్తూ మానవాళి కేవలం రాకెట్లపై ఆధారపడకుండా లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: ‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..స్పేస్ఎక్స్ ద్వారా అంగారక గ్రహంలో మానవుల నివాసానికి అనువుగా ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను నాటకీయంగా తొలగించి 2023 చివరిలో తిరిగి కంపెనీ సీఈఓగా నియమించుకున్న ఘట్టాన్ని ఫీచర్ ఫిల్మ్ ‘ఆర్టిఫిషియల్’ను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్ లూకా గ్వాడాగ్నినో చర్చలు జరుపుతున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్, జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు. నిర్మాతగా వ్యవహరిస్తున్న సైమన్ రిచ్ స్క్రీన్ ప్లే కూడా అందించాలనుకుంటున్నారు. జెన్నిఫర్ ఫాక్స్ సంస్థ నిర్మాణ బృందంలో చేరడానికి చర్చలు జరుపుతోంది.ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కో, ఇటలీని కీలక షూటింగ్ ప్రాంతాలుగా గుర్తించారు. సమ్మర్ షూట్ కోసం చర్చలను వేగవంతం చేస్తున్నారు. కాస్టింగ్ ఒప్పందాలు ఏవీ ఇప్పటివరకు ఖరారు కానప్పటికీ, ప్రారంభ చర్చల ప్రకారం ఆల్టమన్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించవచ్చని, మోనికా బార్బరో కంపెనీ సీటీఓ మీరా మురాటి పాత్రను పోషించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆల్ట్‌మన్‌ను తొలగించే ప్రయత్నానికి నాయకత్వం వహించిన సహవ్యవస్థాపకురాలు ఇలియా సుట్స్కేవర్ పాత్రలో యురా బోరిసోవ్ నటించవచ్చని చెబుతున్నారు.తొలగింపునకు కారణం ఇదే..ఓపెన్ ఏఐ(OpenAI) సంస్థ సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్‌మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్దాంతో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ మళ్లీ ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏఐ ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్‌మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్‌లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్‌లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్‌గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా ఎక్స్‌ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

దేశంలోని తొలితరం సంపన్న మహిళలు
దేశంలో తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘2025 కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్’ లిస్ట్ ప్రకారం పది మంది తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా సాఫ్ట్వేర్, హెల్త్‌కేర్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మొదటి నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఈ జాబితాలో చోటు సంపాదించారు.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..లిస్ట్‌లో జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ.55,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.48,900 కోట్ల సంపదతో ఉన్నారు. టాప్ 10 మహిళల్లో ఏడుగురు భారత్‌లో ఉండగా, మిగిలిన ముగ్గురు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం సంపదలో రూ.1.11 లక్షల కోట్లతో సాఫ్ట్వేర్, సేవల రంగం ఆధిపత్యం సాగిస్తోంది. హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్, టెక్స్ టైల్స్, మీడియా తదితర రంగాలకు చెందినవారున్నారు.పేరు సందప(రూ. కోట్లల్లో)వయసుకంపెనీరాధా వెంబు55,30052జోహో కార్పొరేషన్జయశ్రీ ఉల్లాల్48,90063అరిస్టా నెట్ కిరణ్ మజుందార్ షా32,00071బయోకాన్ఫాల్గుణి నాయర్29,00061నైకానేహా నర్ఖేడే6,80041సంగమంకవితా సుబ్రమణియన్6,50043అప్స్టాక్స్నేహా బన్సాల్5,10043లెన్స్కార్ట్ఇంద్ర కె నూయి4,80069పెప్సికో జూహీ చావ్లా4,60057నైట్ రైడర్స్ మీనా సేథీ2,70080ఓరియంట్ ఫ్యాషన్
ఫ్యామిలీ

కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!
ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్‌పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్లో తన కలను సాకారం చేసుకున్నాడు. విచిత్రంగా విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నిజంగా ఒక గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!. View this post on Instagram A post shared by DelhiPolice (@delhi.police_official) (చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం)

Menstruation మౌనాన్ని బద్దలుకొట్టింది, ప్రతిష్టాత్మక అవార్డు పట్టింది
గుర్గావ్కు చెందిన ప్రియాంషి బగ్గా చిన్న వయసులోనే చాలా పెద్దమనసుతో ఆలోచించింది. ఎవ్వరూ చేయని సాహసానికి పూనుకుంది. మాట్లాడానికి అందరూ ఇబ్బందిపడే పీరియడ్స్ గురించి 17 ఏళ్ల వయసులో ధైర్యంగా మాట్లాడింది. అంతేకాదు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయం, రుతుక్రమ పరిశుభ్రత ను మార్చే లక్ష్యంతో బ్రేక్ ది సైలెన్స్ (మౌనం వీడండి..చుప్పీ తోడో, ) అనే కార్యక్రమాన్ని స్థాపించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఆమె వేలాదిమంది బాలికలకు అవసరమైన శానిటరీ ప్యాడ్లను అందించింది. అలాగే శానిటరీ ప్యాడ్స్ అవసరమైన బాలికలకు అందేలా పాఠశాలల్లో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఉద్యమం కోసం రూ. 5 లక్షలకు పైగా సేకరించింది, పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలతో బాలికలకు సాధికారత కల్పించడం దీని లక్ష్యం, అమ్మాయిల డ్రాప్-అవుట్ రేటును కూడా తగ్గిస్తుంది2024లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఆచరించేలా ప్రోత్సహిస్తోంది. పీరియడ్ సమస్య కారణంగా ఆడపిల్లలు చదువును ఆపకుండా, అంతరాయం లేకుండా క్లాసులకు హాజరయ్యేలా, వారి కలలను కొనసాగించడానికి సాధికారత కల్పిస్తోంది. వారి విద్య, ఆరోగ్యం, సాధికారతను ప్రోత్సహిస్తోంది. యువత తలచుకుంటే సామాజిక ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంషి.ఇదీ చదవండి: Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!చుప్పీ తోడో ఐడియా ఎలా వచ్చిందిప్రియాంషికి చిన్నప్పటినుంచీ చదువు అంటే ప్రాణం. అదృష్టవశాత్తూ బాల్యంనుంచి చదువు విషయంలో తనకుఎలాంటి ఆటంకం రాలేదు. కానీ ఆమె గ్రామీణ పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేసినప్పుడు, ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు ఉన్నత తరగతుల్లో చదువు మానేస్తున్నారని గమనించింది.. ఋతుస్రావం వంటి సహజమైన శారీరక ప్రక్రియ వారి విద్యకు అడ్డుగా నిలబడటం చాలా అన్యాయమని భావించింది. "విద్య అనేది అవకాశానికి ద్వారం" అని విశ్వసించే ప్రియాంషి దీన్ని అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం కాదని, మౌనం వీడి గొంతెత్తాల్సిన సమస్యని అని తెలుసుకుంది. అంతే. .బ్రేక్ ది సైలెన్స్ తో ముందుకు వచ్చింది. గృహ హింస, యాసిడ్ దాడులు, ఇతర సామాజిక దురాచారాల లాగ్గానే దీనికి గురించికూడా పాడ్కాస్ట్లోఎ విస్తృతంగా చర్చించడం మొదలు పెట్టింది. దీనికి మంచి ఆదరణ లభించింది. ఆమె వినిపించే కథలు పలువుర్ని కదిలించేవి. కంట తడిపెట్టించేవి.చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!ఈ ప్రాజెక్ట్ క్రమం తప్పకుండా ఋతు పరిశుభ్రత వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది .శానిటరీ ఉత్పత్తుల ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్యానికి మద్దతు ఇవ్వడానికి స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తుంది. ఆ బృందాలు మహిళలు తమ కమ్యూనిటీలలో ఈ ఉత్పత్తులకు నిధులు సమకూర్చడానికి , పంపిణీకి వీలు కల్పించింది. "శానిటరీ ప్యాడ్ వాడకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా , సరసమైనదిగా చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపింది. ప్రియాంషి కృషిని గుర్తించింది ఐక్యరాజ్యసమితి, ఈ ప్రాజెక్ట్ గర్ల్‌అప్ ప్రాజెక్ట్ అవార్డుతో సత్కరించింది. అశోక విశ్వవిద్యాలయం సహ-హోస్ట్ చేసిన టాకో బెల్ యాంబిషన్ యాక్సిలరేటర్‌కు ఫైనలిస్ట్‌గా నిలవడం విశేషం.

Sirimanu Utsavam అంబరాన్నంటిన సిరిమాను సంబరం
పార్వతీపురం టౌన్: మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. వీరితో పార్వతీపురం పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను కనులారా వీక్షించిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. మహిళలు ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవా ర్లను పూజించారు. అమ్మవార్ల పూజార్లు జన్నిరామారావు, నక్క వాసుదేవరావులు అమ్మవారి దండకం చదివి సాయంత్రం 5 గంటల సమయంలో సిరిమానును అధిరోధించారు. అంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది. అమ్మవార్లను ఎమ్మెల్యేలు బోనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, తదితరులు దర్శించుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు సిరిమాను సంబరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించా యి. తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవార్ల వేషధారణలు, కాంతారా, బళ్లు వేషాలు ఆకట్టుకున్నాయి. 450 మందితో పోలీస్ బందోబస్తు పార్వతీపురం ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 సీసీ కెమెరాలు అమర్చి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జిల్లా కేంద్ర సరిహద్దుల్లో భారీ వాహనాలను నిలిపివేసి, అత్యవసర, కార్లు, ద్విచక్ర వాహనాలను బైపాస్ మార్గం గుండా మళ్లించారు. పోలీస్ బందో బస్తును ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాన, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్బీ సీఐ పి.రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు పర్యవేక్షించారు.

లాస్ట్ మీల్ ఎన్నింటికి తింటున్నారు..? నటి కరీనా కపూర్ ఏకంగా..
సాయంత్రం కాస్త ఎర్లీగా భోజనం తినేయమని చెబుతుంటారు నిపుణులు. అదే ఆరోగ్యకరమని పదే పదే నొక్కి చెబుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం అదే మాట అన్నారు. తాను కూడా అలానే తింటానని చెప్పారు కూడా. పైగాఅదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పారామె. ఆరోగ్యప్రదాత సూర్యుడి గమనం ఆధారంగానే మన జీవక్రియ పనిచేస్తుందని..దానికనుగుణంగా తింటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు కూడా. సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్న ఈ హెల్దీ ట్రిక్ గురించి సవివరంగా చూద్దామా..!.నాలుగు పదుల వయసులో ఉన్న కరీనా కపూర్ సైతం సౌందర్యపరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా చాలా మంచి జీవశైలికి పేరుగాంచిన నటి. ఈ ఏజ్‌లో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా కట్టిపడేసే గ్లామర్ కరీనా సొంతం. ఆమె చాలా క్రమశిక్షణాయతమైన జీవనశైలిని ఫాలో అవుతానని పలు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారామె. పోషకాహారంతో కూడిన డైట్, బాడీకి తగిన వర్కౌట్లు, త్వరిత గతిన నిద్రకు ఉపక్రమించడం వంటి మంచి అలవాట్లనే అనుసరిస్తారామె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చివరి మీల్ కచ్చితంగా సాయంత్రం 6.30 కల్లా పూర్తి అయిపోయేలా చూసుకుంటానన్నారామె. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత త్వరగానే అని అనుకున్నారు కూడా. కానీ కరీనా మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది తప్పనిసరని చెబుతోంది.అలానే మంచిదా అంటే.. సూర్యదోయం వేళ మన శరీరం చాలా చురుకుగా ఉంటుందట. ఆ సమయంలోనే మన జీవక్రియలు యాక్టివ్‌గా ఉంటాయట. అంటే పగలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా..సులభంగా అరిగిపోతుందట. పైగా మనం మేల్కోనే ఉంటాం కాబట్టి సులభంగా ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుందట. ఇక సూర్యాస్తమయ వేళ్లకు మన శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి ఆ టైంలో జీర్ణమవ్వడానికి అధిక సమయం తీసుకునే ఫుడ్‌కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైగా అది కూడా సూర్యస్తమయంలోపే ఫినిష్ చేస్తే మంచిదట. దానివల్ల మనం పడుకునే సమయానికి అరిగిపోయి..త్వరితగతిన మేల్కొనడానికి ఉపకరిస్తుంది. మన శరీరధర్మానికి అత్యంత అనువైన జీవన విధానం ఇదేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మన పూర్వీకులు దీన్ని బాగా అనుసరించేవారని చెబుతున్నారు. ఇలా సాయంత్రం 6.30 కల్లా భోజనం తినేస్తామో..అప్పుడు మనం దాదాపు 12 నుంచి 14 గంటలు అడదడపా ఉపవాసం ఉన్నట్లువతుంది. పైగా ఉదయమే చక్కటి లెమన్ విత్ హనీ వాటర్‌తో రోజుని మొదలుపెట్టి, నచ్చిన ప్రూట్ సలాడ్ వంటి పోషకాహారాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచిదట. ఈ విధానంలో మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ దూరంగా ఉండటం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలు..జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందికడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉండదుఇలా ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది కూడాదీనివల్ల విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయిబరువు అదుపులో ఉంటుందినిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందటరోజంతా చురుగ్గా ఉంటారట మరీ అంత తొందరగా తినలేకపోయినా..కనీసం సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం ఫినిష్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి..సత్ఫలితాలను పొందండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇరాన్లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం
టెహ్రాన్: ఇరాన్లో గల్లంతైన ముగ్గురు భారతీయుల ఆచూకీ లభ్యమైందని భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.ఇస్లామిక్ రిపబ్లిక్ మెహార్ న్యూస్ ప్రకారం.. భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్భందానికి గురయ్యాడు. ట్రెహాన్‌లో స్థానిక ట్రావెల్ కంపెనీ బాధితుడికి ఆస్ట్రేలియాలో ఉన్నత ఉద్యోగాలు, అత్యధిక శాలరీ ఇప్పిస్తామంటూ నమ్మించింది. టెహ్రాన్ నుంచి ఆస్ట్రేలియాలి వెళ్లాల్సి ఉంది. కానీ వాళ్లు మోసపోయారు. మోసగాళ్లు వారిని నిర్బందించారు. Three missing Indian citizens freed by Tehran policeLocal media in Iran say police have found and released three Indian men who had gone missing in Iran.https://t.co/YAkirkKRHg— Iran in India (@Iran_in_India) June 3, 2025 చిత్ర హింసలకు గురి చేశారు. బాధితుల బంధువులకు వీడియో కాల్లో భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే వదిలేస్తామని, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన గురైన బాధిత కుటుంబ సభ్యులు కేంద్రం, ఇరాన్‌లోని భారత దౌత్య కార్యాలయాలనికి ఫిర్యాదు చేశారు. ఘటనపై భారత ఎంబసీ స్పందించింది. ఇరాన్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.భారత్ రాయబార కార్యాలయంలో విజ్ఞప్తితో రంగంలోకి దిగిన ఇరాన్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. దక్షిణ టెహ్రాన్‌లోని వరమిన్‌లో బందీలుగా ఉన్న బాధితుల్ని సురక్షితంగా రక్షించారు. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వానికి సమాచారం అందించడంతో కథ సుఖాంతమైంది. త్వరలో బాధితులు భారత్‌కు రానున్నారు.

పాకిస్తాన్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో మాలిర్ జైలు నుంచి 216 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. కరాచీ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రాత్రి మాలిర్ జైలు నుంచి ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించాడు. ముగ్గురు భద్రతా సిబ్బందితోపాట జైలు అధికారి ఒకరు గాయపడ్డారు. భూకంపం తర్వాత జైలు బ్యారక్ల నుంచి 600 మందికిపైగా ఖైదీలను బయటకు తీసుకురాగా, 216 మంది పరారయ్యారు. 80 మందిని మళ్లీ అదుపులోకి తీసుకోగలిగారు. పరారీలో ఉన్న మిగతా ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా 136 మందిని పట్టుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన మాలిర్ జైలులో మొత్తం 6,000 మంది ఖైదీలు ఉన్నారు.

అమెరికా.. భయం భయం
వాషింగ్టన్: సమఉజ్జీలుగా మాత్రమేకాదు అమెరికా, రష్యాలకు సువిశాల భూభాగం విషయంలోనూ సారూప్యత ఉంది. రష్యాపై ఉక్రెయిన్ ‘స్పైడర్ వెబ్’ డ్రోన్ల దాడి తర్వాత అమెరికాకు ఇదే తరహా ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇప్పుడు అమెరికా పౌరుల భయాందోళనలను పెంచేస్తున్నాయి. అమెరికా సొంత భూభాగంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాల పరిధిలోని అమెరికా నేవీ, వైమానిక స్థావరాలపై డ్రోన్ల మెరుపుదాడి తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘‘ తమకు ఇలాంటి ముప్పు లేదని అమెరికా రాజకీయ శ్రేణులు, సైనిక వర్గాలు చెప్పడానికి లేదు. రష్యా మాదిరే అమెరికా సైతం బుల్లి డ్రోన్ల దాడులను ముందే పసిగట్టడం చాలా కష్టం. వైమానిక స్థావరాల్లోని బాంబర్ విమా నాలు బాగా బలిసిన బాతుల్లా అక్కడే తిష్టవే స్తాయి. వీటిని సులభంగా డ్రోన్లతో నాశనంచేయొచ్చు’’ అని గతంలో యుద్ధక్షే త్రాల నుంచి ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేసిన మాజీ డిఫెన్స్ జర్నలిస్ట్ టైలర్ రోగోవే వ్యాఖ్యా నించారు. టైలర్ ప్రస్తుతం ‘ది వార్ జోన్’ అనే పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైనిక, భద్రతా వ్యవహా లపైనే ఈ పత్రిక ప్రధానంగా కథనాలు వెలువర్చుతుంది. చైనాలో 400.. అమెరికాలో 22అమెరికాలో యుద్ధవిమానాలకు రక్షణ ఏర్పా ట్లు ఏపాటివో ‘అమెరికా కాంగ్రెషనల్’ నివేది కలే స్పష్టంచేస్తున్నాయి. యుద్ధ విమానాలు షెల్టర్ల కోసం చైనా ఏకంగా 400 వరకు అత్యంత పటిష్టమైన హ్యాంగర్వంటి నిర్మాణా లను పూర్తిచేసింది. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటివి కేవలం 22 ఉన్నాయి. డ్రోన్లు లోపలిదాకా వచ్చి నేరుగా విమానంపైనా పడకుండా ఇలాంటి నిర్మాణా లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. తైవాన్ విషయంలో చైనాతో అమెరికా గగనతల యుద్ధానికి దిగితే చైనా డ్రోన్ల ఆధిపత్యం తప్పదని ఓ నివేదిక పేర్కొంది. వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయ నాల కేంద్రం(సీఎస్ ఐఎస్) 2023 నివేదిక ప్రకారం చైనా డ్రోన్లు/ క్షిపణులు అమెరికా విమానాలు గాల్లోకి లేచేలోపే పార్కింగ్ స్థలాల్లోనే నాశనంచేసి అక్కడే సమాధి చేస్తా యని ఆ నివేదిక సారాంశం. ‘‘ఇన్నాళ్లూ అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లుగా పిలుచుకునే వస్తువులు వాస్తవానికి శత్రు నిఘా డ్రోన్లు అయి ఉండొచ్చు. ఇన్నాళ్లూ వాటిని గుర్తు తెలియని ఎగిరే వస్తువులుగా పొరపడ్డారు. దశాబ్దాలుగా ఈ ఎగిరే వస్తువులు చాలా వరకు అమెరికా వ్యూహాత్మక ప్రదేశాలపైనే చక్కర్లు కొట్టడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది’’ అని టైలర్ రోగోవే అన్నారు.

పాక్‌లో మరో ఘోరం.. ఎవరీ సనా యూసఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్(Sana Yousuf) అనే టీనేజర్ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్ సుంబల్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్‌లో ఉండగా పట్టుకున్నారు. నిందితుడిని ఉమర్ హయత్(Umar Hayath) అలియాస్ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్ అంగీకరించాడు. సనాకు టిక్‌టాక్‌లో 7.40 లక్షల మంది, ఇన్‌స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్ కూడా టిక్టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సనా(17) మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్ యాక్టివిస్ట్ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్‌లోని సొంతూరు చిత్రాల్‌కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి. కాగా, పాకిస్తాన్(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్‌లో మహిళా టిక్‌టాకర్‌ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్‌లో మరో మహిళా టిక్‌టాకర్ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు..
జాతీయం

ఆ గురుద్వారా అలాగే ఉండనివ్వండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయం మానుకోండి అని సూచించింది. షాదారా గురుద్వారా స్థలం ‘మసీదు తకియా బబ్బర్ షా’కు చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు 2010 సెపె్టంబర్లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో గురుద్వారా చాలా ఏళ్లుగా ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగనివ్వాలని పిటిషనర్‌కు స్పష్టంచేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది. ఆ స్థలంలో 1947 నుంచి గురుద్వారా ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఓ సాక్షి చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

న్యాయ వ్యవస్థలో అవినీతి అరికట్టాలి!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వంటివి ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. అంతిమంగా న్యాయ వ్యవస్థలో నిజాయతీ, సమగ్రతపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ సుప్రీంకోర్టులో ‘న్యాయ వ్యవస్థ సమగ్రత, ప్రజల విశ్వాసం కొనసాగింపు’ అనే అంశంపై తాజాగా జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని, ప్రభుత్వ పదవులు స్వీకరించడాన్ని తప్పుపట్టారు. ఇది నైతికతకు సంబంధించిన అంశమని, ప్రజల పరీక్షకు గురి కావాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో దక్కబోయే పదవులను దృష్టిలో పెట్టుకొని జడ్జీలు తీర్పు లు ఇస్తారని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై సందేహాలు తలెత్తుతా య న్నారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవు లు స్వీకరించబోమంటూ తనతోపాటు మరికొందరు సహచరులు ప్రమాణం చేసినట్లు వెల్లడించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలన్న ధ్యేయంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అలాగే న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వెలుగులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ జోక్యం వద్దు...కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో రాజకీ య, ప్రభుత్వ జోక్యం ఉండరాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థను ఆయన సమర్థించారు. ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం ఉండడం లేదన్న వాదనను ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో న్యాయ మూర్తుల స్వతంత్రత అనేది అత్యంత కీలకమని స్పష్టంచేశారు. శాసన లేదా కార్యనిర్వాహక వ్యవ స్థల చట్టబద్ధత బ్యాలెట్ ద్వారా ఏర్పడుతుందని గుర్తుచేశారు. కానీ, జ్యుడీషియరీ చట్టబద్ధత రాజ్యాంగ విలువల పరిరక్షణతో అనుసంధానమై ఉంటుందన్నారు.

బీజేపీ ‘ఆపరేషన్ బిహార్’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్న బిహార్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం వినూత్నంగా ‘దేశవ్యాప్త’ వ్యూహం రూ పొందించింది. ఉపాధి కోసం దేశవ్యాప్తంగా వలస వెళ్లి న 2.75 కోట్ల మంది బిహారీల ఓట్లను సాధించడమే లక్ష్యంగా పథకరచన చేసింది. ఇందులో భాగంగా పార్టీ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించి వా రందరినీ వ్యక్తిగతంగా కలుసుకోనున్నారు. బిహార్‌లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కనీసం 15 వేల నుంచి 20 వేల మంది వలసదారులున్నట్టు చెబుతు న్నారు. వారిలో కనీసం ఐదేసి వేల మందైనా బీజేపీకి ఓటేసే లా ప్రభావితం చేయాలన్నది టార్గెట్. ఈ దిశ గా బిహారీ వలసదారుల సమాచారాన్ని సేకరించను న్నా రు. ‘ఆమ్ బిహారీ ప్రవాసీ కీ జాన్‌కారీ’ పేరు తో 14 ప్రశ్నలతో కూడిన జాబితాను బీజేపీ సిద్ధం చేసు కుంది. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, వృత్తి, అసెంబ్లీ నియోజకవర్గం, బీజేపీ మద్దతుదారుడా కాదా, ఓటరు గుర్తింపు కార్డు ఉందా లేదా వంటి సమాచారాన్ని సేక రించనున్నారు. ఈ ఏడాది బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిహారీ దివస్‌కు కొనసాగింపుగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు దొరికిన ఉదంతంలో ఆయన అభిశంసనకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సారథ్యంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై సమగ్ర చర్చ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్‌తో పాటు 16 విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారమే లేఖ రాయడం తెలిసిందే. ఈ డిమాండ్‌పై రిజిజు స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రతి సమావేశాలూ ప్రత్యేకమేనన్నారు. విపక్షాలు కోరుతున్న అన్ని అంశాలనూ వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టవచ్చని సూచించారు. కానీ పార్లమెంటు ప్రత్యేక భేటీ నుంచి మోదీ సర్కారు పారిపోయిందని కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఎద్దేవా చేశాయి. అందుకే వర్షాకాల భేటీల తేదీలను ఏకంగా 47 రోజుల ముందు వెల్లడించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. కేంద్రానికి పార్లమెంటోఫోబియా పట్టకుందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ విమర్శించారు. ఏకగ్రీవంగా ‘అభిశంసన’ జస్టిస్ వర్మ అభిశంసనకు వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం లభిస్తుందని రిజిజు ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘న్యాయవ్యవస్థలో అవినీతిని రాజకీయ దృక్కోణం నుంచి చూడలేం. అందుకే అభిశంసన తీర్మానాన్ని పార్టీలన్నీ ఏకగ్రీవంగా ప్రవేశపెట్టాలన్నది కేంద్రం ఉద్దేశం. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయతి్నస్తున్నాం. ప్రధాన పార్టీలకు ఇప్పటికే నేను స్వయంగా మేరకు సమాచారమిచ్చా. చిన్న పార్టీలను కూడా సంప్రదిస్తున్నా’’అని మంత్రి తెలిపారు. తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలో నిర్ణయించాల్సి ఉందన్నారు. న్యాయమూర్తుల (విచారణ) చట్టం ప్రకారం తీర్మానాన్ని సభ అనుమతించాక అభియోగాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో సభాపతి ఒక కమిటీని నియమిస్తారు. అందులో భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రఖ్యాత న్యాయ కోవిదుడు సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీ సమరి్పంచే నివేదికపై సభ చర్చించిన అనంతరం అభిశంసన ప్రక్రియ చేపడుతుంది. అయితే జస్టిస్ వర్మ ఉదంతంపై సీజేఐ కమిటీ ఇప్పటికే నివేదిక సమరి్పంచిందని రిజిజు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు.
ఎన్ఆర్ఐ

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్‌లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్‌లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్‌లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)

ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ సీఈవోకి గూగుల్ రూ. 855 కోట్ల ఆఫర్
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ (Neal Mohan Youtube CEO) ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రముఖ సెర్చ్ ఇంజీన్ గూగుల్‌ను వీడి ట్విటర్లో చేరకుండా ఉండేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో నీల్ మోహన్ తన అనుభవాలను, విశేషాలను పంచుకున్నారు. Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఇటీవల తన 'People by WTF' పాడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్లో నీల్ మోహన్‌తో సంభాషించారు. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం నుండి ప్లాట్‌ఫామ్ అల్గోరిథంను ఛేదించే చిట్కాల వరకు ఇద్దరూ అనేక అంశాలపై చర్చించారు.సుదీర్ఘకాలంగా యూట్యూబ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా సేవలు అందించి 2023నుంచి గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం సీఈవోగా ఉన్న ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ (ఎక్స్)లో చేరకుండా ఉండేందుకు 2011లో 15 ఏళ్ల క్రితం గూగుల్ మీకు 100 మిలియన్ డాలర్లు (దాదాపు 855 కోట్ల రూపాయలు) చెల్లించిదటగా అని ప్రశ్నించాడు నిఖిల్ కామత్ వాదనను ఖండించకపోవడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. అయితే 2011 టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం అనేక సంవత్సరాలు కొనసాగే పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో , గూగుల్ ఆఫర్ ఇచ్చిందట నీల్‌మోహన్‌కు. అలా నీల్ మోహన్‌కు దూకుడు కళ్లెం వేసిందని తెలిపింది. అప్పటికే గూగుల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యూహంలో కీలకంగా ఉన్న నీల్మోహన్ను వదులుకోవడానికి ఇష్టపడని గూగుల్ యూట్యూబ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్య దీర్ఘకాలంలో గూగుల్‌కు మంచి ఫలితాలను అందించింది. అంతేకాదో సుందర్ పిచాయ్‌ను బోర్డులోకి తీసుకురావడానికి ట్విటర్ ప్రయత్నించిందట. దీంతో పిచాయ్‌కి కూడా 50 మిలియన్ల స్టాక్ గ్రాంట్ ఆఫర్ ఇచ్చింది గూగుల్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ,స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఆ తరువాత నీల్ మోహన్, ఆండర్సన్ కన్సల్టింగ్ (ఇప్పుడు యాక్సెంచర్)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ చివరికి బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తరువాత . 2007లో గూగుల్ డబుల్ క్లిక్‌ను 3.1 బిలియన్డాలర్లకు కొనుగోలు చేయడంతో గూగుల్ యాడ్స్ విభాగంలో ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 2023లో సుసాన్ వోజ్సికి తర్వాత నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్‌పై ఫ్యాన్ కామెంట్ వైరల్అప్పట్లో హిందీ రాదు, తలచుకుంటే నవ్వొస్తుంది...తన తండ్రి ఇండియాలో ఐఐటీలో చదవి పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లారని మోహన్ తెలిపారు. తన తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా ఉన్నప్పుడే తాను పుట్టానని, తన బాల్యంలో ఎక్కువ భాగం అమెరికాలో గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే 1986లో భారతదేశానికి తిరిగి వచ్చా.. ఆ సమయంలో లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చేరినపుడు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు హిందీమీద అంత పట్టు లేదు, ఏడో తరగతిలో అదో పెద్ద సవాల్ అంటూ గుర్తు చేసుకున్నారు.చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్
క్రైమ్

పర పురుషునితో పరారైన భార్యను..!
మైసూరు: పర పురుషునితో పరారైన తన భార్యను చంపిన ఘటన చామరాజనగరలోని సోమవారపేటె బడావణెలో జరిగింది. విద్య (26) అనే మహిళను ఆమె భర్త గిరీష్ హత్య చేసి పరారయ్యాడు. వివరాలు.. కరినంజనపుర బడావణెకు చెందిన విద్యకు సోమవారపేటెకు చెందిన గిరీష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్ని రోజుల క్రితం విద్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. తరువాత వాపసు వచ్చిన ఆమెను పుట్టింటివారు, భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు. దీంతో ఆమె మహిళా సాంత్వన కేంద్రంలో ఆశ్రయం పొందింది. ఇటీవల తన మొబైల్‌ను భర్త నుంచి తీసుకుంది. భర్త గిరీష్ సాంత్వన కేంద్రానికి వెళ్లి మొబైల్ వాపసు ఇవ్వాలని గొడవ పడ్డాడు. ఫిర్యాదు చేసి వెళ్తుండగా దాడి దీంతో విద్యా తన భర్త గిరీష్ తనను వేధిస్తున్నాడంటూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళా సాంత్వన కేంద్రానికి వెళుతుండగా ఆమెను అడ్డుకున్న గిరీష్ పదునైన కొడవలితో దాడికి యతి్నంచాడు. ఆమె చేయిని అడ్డు పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది. ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఓ కెఫె ముందు పడిపోయింది. భర్త ఆమె మెడ, భుజనం, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో కెఫెలోని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచగా వారిపై గిరీష్ తిరగబడ్డాడు. కొడవలిని అక్కడే పారేసి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు వైపు పరుగెత్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యా మృతదేహాన్ని అంబులెన్స్‌లో నగర శివార్లలోని సిమ్స్ బోధనాస్పత్రికి తరలించారు. ఎస్పీ డాక్టర్ బీటీ కవిత, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ లక్ష్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

రూ. 2.2 కోట్లు కొట్టేసారు!
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబంధిత కేసు పేరుతో నగరానికి చెందిన విశ్రాంత వైద్యురాలిని ఫోన్లో బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.2.2 కోట్లు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన వైద్యురాలికి గత నెల 27న ఫోన్‌కాల్ వచ్చిoది. లక్నో నుంచి మాట్లాడుతున్న ఐపీఎస్ అధికారి ప్రేమ్ కుమార్‌గా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తమ పరిధిలో నమోదైన ఉగ్రవాద సంబంధ మనీలాండరింగ్ కేసులో వైద్యురాలి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో నిందితురాలిగా చేరుస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆమె ఈ షాక్ నుంచి కోలుకోకముందే వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అప్పుడు మాట్లాడిన సైబర్ నేరగాడు తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ సదానంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు. తాము కొందరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి స్వాదీనం చేసుకున్న వాటిలో ఏటీఎం కార్డులతో పాటు కొన్ని ఫొటోలు ఉన్నాయని చెప్పాడు. ఆ ఫొటోల్లో 17 ఆర్మీ అధికారులవి అయితే.. ఒకటి మాత్రం సదరు వైద్యురాలిదని పేర్కొన్నాడు. ఇది ఉగ్రవాద సంబంధిత కేసు కావడంతో విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని స్పష్టం చేశాడు. వెరిఫికేషన్ చేయాలంటూ.. ఏటీఎం కార్డుల్లో కొన్ని మీ పేరుతో తెరిచిన ఖాతాలతో లింకై ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద ఎత్తున జరిగిన మనీలాండరింగ్‌తో ఉగ్రవాదులకు నిధులు అందాయని భయపెట్టాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఉగ్రవాదులతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు ఎన్ఐఏ డైరెక్టర్‌గా చెప్పుకున్న వ్యక్తితో వాపోయారు. ఆ విషయం ఖరారు కావాలంటూ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, దీనికోసం తాము చెప్పిన ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయాలని సూచించాడు. ఈ నగదు పూర్తిగా రిఫండబుల్ అని చెప్పిన కేటుగాడు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి బదిలీ చేసేస్తామని చెప్పాడు. ఆమెను పూర్తిగా నమ్మించడానికి ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జడ్జ్ పేరుతో నకిలీ లేఖ కూడా సృష్టించి పంపారు. దీంతో నేరగాళ్ల వలలో పడిపోయిన వైద్యురాలు గత నెల 29 నుంచి 31వ తేదీ మధ్య వారు సూచించిన ఖాతాల్లోకి ఏకంగా రూ.2.2 కోట్లు బదిలీ చేశారు. తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తంతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు విత్‌డ్రా చేసి, తెలిసిన వారి నుంచి కొంత తీసుకుని ఇలా బదిలీ చేశారు. ఆ మొత్తం రిఫండ్ రాకçపోవడంతో పాటు వారి ఫోన్ నెంబర్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బా«ధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దారుణం.. ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృతదేహం
సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్‌తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎంత పని చేశావ్ బ్రహ్మయ్య!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: తోపూరి నరసింహంను దారుణంగా హత్య చేసిన చలంచర్ల బ్రహ్మయ్యను అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హజరుపరిచినట్లు గుడ్లూరు సీఐ మంగారావు చెప్పారు. బంగారు ఉంగరం కోసమే బ్రహ్మయ్య హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వివరాలను సీఐ మంగళవారం వెల్లడించారు. పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామానికి చలంచర్ల బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పదేళ్ల నుంచి పెంట్రాల ఎస్టీ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత నెల 30వ తేదీన నరసింహం నిమ్మతోటకు కంచె వేసేందుకు బ్రహ్మయ్యను తీసుకెళ్లాడు. పని చేస్తుండగా నరసింహం చేతికున్న పచ్చరాయి బంగారపు ఉంగరాన్ని చూసి దానిని ఎలాగైనా దక్కించుకోవాలని బ్రహ్మయ్య భావించాడు. నరసింహంను మొద్దుకత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఉంగరాన్ని తీసుకుని కందుకూరులో విక్రయించాడు. రాత్రి మృతదేహాన్ని పక్క పొలంలోకి లాక్కెళ్లి ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. బ్రహ్మయ్యను విచారించగా తాను బంగారు ఉంగరం కోసమే నరసింహంను హత్య చేసినట్లు అంగీకరించాడని సీఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హాజరుపరచగా మేజి్రస్టేట్ రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.