Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Tweet Against Chandrababu Scams In AP1
‘స్కాంస్టార్ బాబు’.. హ్యాష్ ట్యాగ్‌ రిలీజ్‌ చేసిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్‌ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్‌ జగన్‌ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. అనంతరం, ‘స్కాంస్టార్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్‌తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్‌లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025

A person Namaz at Tirumala Kalyana Vedika2
తిరుమలలో ఘోర అపచారం, ఇంకెన్ని దారుణాలు చూడాలో?

తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్‌కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్‌(Namaz) చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.మద్యం సేవించడం, ఎగ్‌ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్‌ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, నమాజ్‌ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.

Bangladesh Muhammad Yunus Planning To Resign3
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. మహమ్మద్‌ యూనస్‌ రాజీనామా?

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్‌ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్‌ పార్టీ చీఫ్‌ నహిద్‌ ఇస్లామ్‌ తెలిపారు. ఈ విషయంపై యూనస్‌తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI— Deep Halder (@deepscribble) May 22, 2025యూనస్‌ను సవాళ్లు.. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్‌ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్‌కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్‌ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ‘బ్లడీ కారిడార్‌’మరోవైపు.. యూనస్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్‌ సరిహద్దుల్లో మానవతా కారిడార్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్‌’ అంటూ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్‌ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్‌ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్‌లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్‌ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.వకారుజ్జమాన్‌ ఏమన్నారు? రఖైన్‌ కారిడార్‌ను బ్లడీ కారిడార్‌ అంటూ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్‌ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్‌ బుధవారం యూనస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్‌ కారిడార్‌ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్‌ను కోరారని ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది.

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt4
మద్యం ముడుపుల డాన్‌ బాబే: వైఎస్‌ జగన్‌

ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా(ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించకపోవ­డంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో బాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌లిచ్చారు. ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బలమైన కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్‌ నియమ, నిబంధనలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’‘‘చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్‌ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తాం. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయ్యే రోజు సందర్భంగా సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’-మీడియాతో వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి పాల్పడి ఆ కేసులో బెయిల్‌పై ఉన్న సీఎం చంద్రబాబు ఆ కేసు దర్యాప్తును నీరుగారుస్తూ గత ప్రభుత్వ పారదర్శక మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 2019–24 మధ్య అసలు మద్యం స్కామ్‌ ఎక్కడ జరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. భేతాళ కథలు సృష్టించి.. జరగని స్కామ్‌ను జరిగినట్లు చిత్రీకరించి.. ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి లొంగదీసుకున్న వ్యక్తులతో తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని.. వాటి ఆధారంగా సంబంధం లేని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఒక్క ఫైలైనా సీఎంవోకు వచ్చినట్లుగానీ.. సంతకం చేసినట్లుగానీ చూపించగలరా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఎవరికైనా లాభాలు వచ్చేలా చేస్తే లంచాలు ఇస్తారేమోగానీ.. పన్నులు బాదేసి, పర్మిట్లు రద్దు చేసి, వారి లాభాలు తగ్గించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లంచాలు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజమైన మద్యం స్కామ్‌స్టర్‌ చంద్రబాబేనని పునరుద్ఘాటించారు. 2014–19 మధ్య చంద్రబాబు మద్యం కుంభకోణానికి పాల్పడి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారని.. ఆ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసును నీరుగార్చడానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మద్యం కుంభకోణానికి పాల్పడి దోపిడీ చేసిన తరహాలోనే ఇప్పుడూ దోచేస్తున్నారని.. దాన్ని సమర్థించుకోవడానికే 2019–24 మధ్య జరగని మద్యం స్కామ్‌ జరిగినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి.. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. సీసీఐ (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) తీర్పు, 2014–15 మధ్య కేబినెట్‌ ఆమోదం లేకుండా.. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా మద్యంపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు మూడు చోట్ల సంతకం చేసిన నోట్‌ ఫైలు.. 2014–19 మధ్య మద్యం అమ్మకాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం లాంటి వాటిని సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ దుర్నీతిని కడిగి పారేశారు. చంద్రబాబు మోసాలను నిలదీస్తూ.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్‌ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా ప్రజలతో కలసి, ప్రజల కోసం సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహి­స్తామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో ఘోర వైఫల్యం..ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా కూడా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఏడాది దాటింది. రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌లిచ్చారు.లిక్కర్‌ స్కామ్‌.. ఫ్యాబ్రికేషన్‌..ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు తనకు తెలిసిన మాస్టర్‌ ఆర్ట్‌ను బయటకు తెచ్చారు. వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రశ్నించే గొంతులను నొక్కడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా లిక్కర్‌ స్కామ్‌ అంటూ రాజకీయ కక్షకు దిగారు. అసలు స్కామ్‌ ఎక్కడ జరిగింది? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతున్నా. మీ మనస్సాక్షిని అడగండి. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యం ఎక్కువ అమ్మి, అమ్మకాలు పెంచి, దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక పన్నులు పెరిగి, అమ్మకాలు తగ్గిపోతే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా?రెండు ప్రభుత్వాలు.. మద్యం విక్రయాలుఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే.. మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ హయాంలో కంటే మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే.. పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్‌ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్‌ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.2014–19 మధ్య మద్యంలో అవినీతి.. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్లుగానే కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మేలు చేసేలా ప్రైవేటు లిక్కర్‌ షాప్‌ల నుంచి ఇండెంట్‌ పెట్టించడం ద్వారా 2014–19 మధ్య కేవలం ఐదు డిస్టిలరీలే రాష్ట్రంలో 69 శాతం మద్యాన్ని సరఫరా చేశాయి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలిన ఆరు వేర్వేరు ప్రభుత్వాల్లో అనుమతి పొందాయి. అంతేకాదు.. మద్యం సేకరణకు ఆ 20 డిస్టిలరీలను లిస్ట్‌ చేసింది (ఎంప్యానల్‌) కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మేం కొత్తగా ఏ డిస్టిలరీనీ చేర్చలేదు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మా విధానం సహేతుకమని సీసీఐ తీర్పు.. చంద్రబాబు అండ్‌ కో కంపెనీలు మా ప్రభుత్వ మద్యం విధానంపై 2022లో కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో కేసు వేశాయి. ఆ పిటిషన్‌లో ఉన్న అంశాలన్నీ టీడీపీ వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న అభియోగాలే. అందుకే అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నా. ఆ అభియోగాలు ఏమిటంటే.. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టేశారని, సప్లయ్‌ ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆరోపించారు. సీసీఐ ఆ అభియోగాలన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి సంబంధిత రికార్డులు, సప్లయ్‌ ఆర్డర్లన్నింటినీ పరిశీలించి 2022 సెప్టెంబర్‌ 19న చారిత్రాత్మక జడ్జిమెంట్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమ­లు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, మా ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మ­కాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పు ఇచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పులో పేరాగ్రాఫ్‌ 85, 90, 95, 96, 97, 98, 101లో మొత్తం వివరాలు ఉన్నాయి. సీసీఐ జడ్జిమెంట్‌ కాపీలు పబ్లిక్‌ డొమైన్లో ఉంచుతాం. ఏం విలువ ఉంటుంది? చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్ల టర్మ్‌ ఉండగానే చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు పదవికి రాజీనామా చేశాడు. వైఎస్సార్‌సీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు తన అభ్యరి్థని పంపించే అవకాశం ఉండదని, కూటమికి మేలు జరుగుతుందని తెలిసి కూడా ప్రలోభాలకు గురై రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది? ⇒ మరో నిందితుడిగా చెబుతున్న రాజ్‌ కేసిరెడ్డికి బెవరేజెస్‌ కార్యకలాపాలతో ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్న ఆయన ఒక వ్యాపారస్తుడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకరు. అదీ రెండేళ్లు మాత్రమే. అది కూడా కోవిడ్‌ సమయంలో. ఇక విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. ఆయనకు ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే టీడీపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, సులభంగా ప్రలోభ పెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్‌గా మారుస్తామన్నారు. అయితే అబద్ధం చెప్పకపోవడం వల్ల నిందితుడిగా చేర్చారని ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇలా చేయదల్చుకుంటే ఎవరి మీదనైనా భేతాళ విక్రమార్క కథలు అల్లేసి ఏమైనా చెప్పించవచ్చు. బెవరేజెస్‌ కార్పొరేషన్, లిక్కర్‌తో ఎంపీ మిథున్‌రెడ్డికి ఏం సంబంధం? వాళ్ల నాన్న కనీసం ఈ శాఖ మంత్రి కూడా కాదు. అరెస్టు చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డికి ఈ కేసుతో ఏం సంబంధం? మద్యానికి సంబంధించి ఒక్క ఫైలు అయినా సీఎంవోకు వచ్చినట్లు, ఒక్క సంతకం అయినా చూపించగలరా? అని సవాల్‌ విసురుతున్నా చంద్రబాబుకు. ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్‌ శాఖ కూడా చూసేవారు కాదు. మల్టీ నేషనల్‌ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ.. బాలాజీ గోవిందప్ప మల్టీ నేషనల్‌ కంపెనీ వికాట్‌లో హోల్‌టైమ్‌ డైరెక్టర్‌. 12 దేశాల్లో వాళ్లకు కార్యకలాపాలు ఉన్నాయి. ఆయన అసలు ఏపీలోనే ఉండరు. వికాట్‌ యూరప్‌ టాప్‌ 5 సిమెంట్‌ కంపెనీల్లో ఒకటి. చంద్రబాబు, ఈనాడు రాతలు, మాటలు చూస్తే.. ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవారని రాసుకొచ్చారు. నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు చాలామంది నాకున్నారు. అసలు వికాట్‌ అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్‌లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్‌ నాది అయిపోదు. నాకు ఓనర్‌షిప్‌ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్‌ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్‌ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నాది కాని కంపెనీలో డైరెక్టర్లు, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? ఒక మల్టీ నేషనల్‌ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, కేసులు.. వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులో భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి చంద్రబాబు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సత్యప్రసాద్‌ ఒక సాధారణ సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగి. సూపరింటెండెంట్‌లు పదుల సంఖ్యలో ఉంటారు. అనూష ఔట్‌ సోర్సింగ్‌లో పని చేసిన క్లరికల్‌ ఉద్యోగి. వాళ్లను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు. ఆయన్ను బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాక కేంద్ర సర్వీస్‌కు వెళ్లిపోవడానికి ఎన్‌ఓసీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది? అసలు లంచాలు ఎప్పుడిస్తారు..?మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మితే లంచాలు ఇస్తారా? షాపులు తగ్గించి, పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాపులను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? లేకప్రైవేటు వ్యక్తులకు లిక్కర్‌ వ్యాపారం అప్పజెప్పి అడ్డగోలుగా రోజంతా అమ్మి లాభాలు గడిస్తే, డిస్టిలరీలకు ఎక్కువ ఆదాయం వస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించినా తమకు కావాల్సిన వారికే షాపులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరైనా షాపులు దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. రోజంతా యథేచ్ఛగా అమ్ము­తున్నారు. చివరకు డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. బెల్టుషాప్‌ల నిర్వహణకు వేలంపాట పాడుతున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. అలా వస్తున్న ఆదాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్‌ వేయిస్తారు. ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు. ఇది మా హయాంలో జరిగిందా? ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మారా? మరి లంచాలు ఎవరికి ఇస్తారు? ప్రైవేటు షాపుల చేత, వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీకి ఎక్కువ ఆర్డర్‌ ఇస్తే లంచాలు ఇస్తారా? లేక మా హయాంలో మాదిరిగా ప్రతి బాటిల్‌పై క్యూఆర్‌ కోడ్‌ పెట్టి దాన్ని అమ్మేటప్పుడు స్కాన్‌ చేసి ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ చేసే విధానం అమలు చేశాం. ఆ డిమాండ్‌ మేరకు ఆయా డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చాం. అలా చేస్తే లంచాలు ఇస్తారా?స్కామ్‌స్టర్‌ చంద్రబాబేమద్యంలో అసలు స్కామ్‌స్టర్‌ ఎవరంటే చంద్రబాబే. 2014–2019 మధ్య చేసిన లిక్కర్‌ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై లేరా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్‌ మీరే చూడండి.. ⇒ రాష్ట్రంలో 4,380 లిక్కర్‌షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్‌ చేశారు. తన ఎమ్మెల్యేలు, మంత్రులు, బినామీలు, తన మనుషులు రిగ్గింగ్‌ చేసి షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికేట్‌ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్‌గా పర్మిట్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ఏకంగా 43 వేల బెల్ట్‌షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్‌ షాపుల సిండికేట్‌ ఏర్పాటు చేసుకుని తనకు కావాల్సిన డిస్టిలరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్‌ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్‌ ఇప్పించారు. 2015– 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్స్‌ దక్కాయి. ⇒ కొన్ని బ్రాండ్లకు కృతిమ డిమాండ్లు సృష్టించారు. 2014 నవంబర్‌లో జీవో 993 ప్రకారం ఏర్పాటైన కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసి ప్రైవేటు వైన్‌షాప్‌లు, బార్లకు లబ్ధి చేకూర్చారు. అందుకోసం 2015 డిసెంబర్‌ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. క్యాబినెట్‌ అనుమతి లేకుండా మూడుసార్లు చంద్రబాబు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్‌ను కాగ్‌ కూడా తప్పుబట్టింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబుపై బలమైన కేసు నమోదైంది. చంద్రబాబు ఆ కేసులో ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని కప్పి పుచ్చుకుంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. తన ట్రేడ్‌ మార్క్‌ పాలసీ ప్రకారం స్కామ్‌లు చేస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా? ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో.. కేరళా మాల్ట్‌ ఎప్పుడన్నా చూశారా? షార్ట్‌ విస్కీ ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ.. బెంగళూరు బ్రాందీ.. రాయల్‌ ల్యాన్సర్‌ విస్కీ.. ఓల్డ్‌ క్లబ్‌.. గుడ్‌ ఫ్రెండ్స్‌ అంట.. ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి? ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్‌ చేస్తున్నారు? ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తనకు కావాల్సిన డిస్టిలరీస్‌కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా? ధరలు తగ్గిస్తానని చెప్పి..చంద్రబాబు తానొస్తే ధరలు తగ్గిస్తానన్నాడు.. తగ్గించింది లేదు కానీ షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్‌ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్‌ పెంచాడు. ఇది స్కాం కాదా? ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. విలేకరులు గ్రామాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? రూ.99కే లిక్కర్‌ ఇస్తానని క్వాలిటీ గతంలో కంటే ఒక లెవల్‌ తగ్గించి అమ్ముతున్నారు. ఆ చీపెస్ట్‌ చీప్‌ లిక్కర్‌ కూడా పొరుగు రాష్ట్రాల్లో రూ.10 తక్కువ. అన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో..చంద్రబాబు హయాంలో లిక్కర్‌లో దోపిడీకి సంబంధించి వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నాం. వైఎస్సార్‌ సీపీ హ్యాష్‌ ట్యాగ్‌.. వైఎస్సార్‌ సీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో నా పర్సనల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో 22 పేజీల డాక్యుమెంట్‌ పెడతాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. డౌన్‌ లోడ్‌ చేసుకోండి. మద్యం అక్రమాలు, రెడ్‌ బుక్‌ మీద కూడా ఇంగ్లిష్‌, తెలుగు వెర్షన్‌ కాపీలు పెడతాం. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వంచంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.అధికారులకు వేధింపులుటీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజీ ర్యాంకు అధికారి.. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, డీజీ ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌ కుమార్, అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌ ఐపీఎస్, సీనియర్‌ ఆఫీసర్, ఐజీ ర్యాంక్‌ కాంతిరాణా టాటా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌ రెడ్డి ఐపీఎస్‌ లు, ఐపీఎస్‌ అధికారి పి.జాషువా వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్, నావ్యక్తి గత ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్‌ లోడ్‌ చేస్తాం. మచ్చలేని అధికారులు.. ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్‌. రిటైర్డ్‌ ఐఏఎస్‌. పాపం ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కృష్ణమోహన్‌ అన్న కుమార్తెకు ఇటీవలే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప తన కుమార్తె పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సునీల్‌ కుమార్‌ డీజీ స్థాయి దళిత ఐపీఎస్‌ అధికారి. ఆయన్ను సస్పెండ్‌ చేసి హరాస్‌ చేస్తున్నారు. సంజయ్‌ అడిషనల్‌ డీజీ, దళిత ఆఫీసర్‌. ఆయన్ను సస్పెండ్‌ చేసి కేసులు పెట్టారు. విజయ్‌ పాల్‌ను తప్పుడు కేసులతో అరెస్టు చేశారు. కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ సీనియర్‌ ఐపీఎస్‌లు ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారి జాషువాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్‌. రిషాంత్‌ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్‌. వీరికి పోస్టింగులు లేవు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీకి దీన్ని వెల్లడించింది. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అందుకే ఐఏఎస్‌లే కాదు, ఐపీఎస్‌లు కూడా మీటింగ్‌ పెట్టుకోవాలి.నిప్పు రవ్వలు‘‘మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చినా రాష్ట్రాన్ని గొప్పగా సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపాం. అదే చంద్రబాబు ఏడాది పాలన.. కాగ్‌ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్‌రేట్‌ కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశంలో 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠా జేబులోకి వెళ్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పులు చేశారు. చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. 436 గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం..’’ పారిశ్రామికవేత్తలకు బెదిరింపులుఇప్పటికే సజ్జన్‌ జిందాల్‌ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేశారు. ఆంధ్ర అంటే నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్‌ జిందాల్‌ చెబుతున్నాడు. అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబుకి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్‌ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. చివరకు షిప్, బియ్యం పోయాయి. ఇప్పుడు వికాట్‌ మల్టీ నేషనల్‌ కంపెనీపై పడ్డారు. వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ నమస్కారం పెడుతోంది. ఇలా పారిశ్రామిక­వేత్తలను హడలెత్తిస్తున్నారు.

LSG Captain Rishabh Pant Comments Over Win5
వారిద్దరి ఆట అద్భుతం.. మరింత మెరుగుపడాలి: పంత్‌

ఐపీఎల్‌-2025లో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ ఎట్ట‌కేల‌కు మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు చెక్‌ పెట్టింది. గుజరాత్‌ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగుల‌కు ప‌రిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్‌ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్‌ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జ‌ట్టుగా మేము మంచి క్రికెట్ ఆడ‌గ‌ల‌మ‌ని నిరూపించాం. టోర్నమెంట్‌లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్ల‌ప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్‌, నికోల‌స్ పూర‌న్‌లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మ‌రికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్‌ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్‌ఎస్‌జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్‌ పూరన్‌ (56 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 5×6), మార్‌క్రమ్‌ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్‌ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్‌ ఖాన్‌ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్‌. ఎల్‌ఎస్‌జీ బౌలర్లలో ఒరూర్క్‌ (3/27), ఆయుష్‌ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్‌ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

Trump Administration Revokes Harvards Right to Enroll Foreign Students6
ట్రంప్‌ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్‌’లో నో అడ్మిషన్

వాషింగ్టన్‌ డీసీ: ట్రంప్ పరిపాలనా విభాగం విదేశీ విద్యార్థులకు పిడుగుపాటు లాంటి వార్త వినిపించింది. ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విశ్వవిద్యాలయంపై కొనసాగించిన దర్యాప్తు దరిమిలా ట్రంప్‌ పరిపాలనా విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు.క్రిస్టి నోయెమ్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ఈ వివరాలను తెలియజేస్తూ వర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోగలగడం అనేది హక్కు కాదని, అది ప్రత్యేక అవకాశం అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందే అవకాశాన్ని వర్శిటీ కోరుకుంటే 72 గంటల్లోపు అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన విభాగం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుత విద్యార్థులను ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేయవలసి వస్తుందని, లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోయేలా చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(Department of Homeland Security తెలిపింది.దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం ఇది ట్రంప్‌ ప్రతీకార చర్య అని, ఈ నిర్ణయం విశ్వవిద్యాలయానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని, 140కిపైగా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా గత ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్‌ను ఒక జోక్‌గా అభివర్ణించారు. హార్వర్డ్‌ను ఇకపై మంచి అభ్యాస ప్రదేశంగా కూడా పరిగణించలేమని, దానిని ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒకటిగా పరిగణించకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇది అక్కడి మొత్తం విద్యార్థులలో27 శాతం. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. ఇది కూడా చదవండి: జ్యోతి పోలీస్‌ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు

Mega Fans Calls Boycotting Bhairavam Movie7
డైరెక్టర్‌ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ భైరవం’

‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్‌ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్‌పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్‌ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్‌కాట్‌ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఒకవైపు వైఎస్సార్‌సీసీ ఫ్యాన్స్‌..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్‌ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎ‍ట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున​ నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్‌ కనకమేడల చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్‌లో పొలిటికల్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో వైఎస్సార్‌సీసీ శ్రేణులు విజయ్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్‌కాట్‌ భైరవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్‌లో వైరల్‌ చేస్తున్నారు. విజయ్‌ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్‌ కూడా విజయ్‌పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో విజయ్‌ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్‌ కనకమేడల ఫేస్‌బుక్‌లో 2011లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లపై ఒక పోస్ట్‌ పెట్టాడు. హిందీలో అమితాబ్‌, అభిషేక్‌ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్‌ని మార్పింగ్‌ చేసి చిరంజీవి, రామ్‌ చరణ్‌ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’ అనే టైటిల్‌ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్‌ ఫైర్‌ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్‌ చరణ్‌లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్‌ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్‌ పిలుపునిచ్చారు.హ్యాక్‌ అయిందా? అదేలా?సోషల్‌ మీడియాలో బాయికాట్‌ భైరవం ట్యాగ్‌ ట్రెండ్‌ కావడంలో విజయ్‌ కనకమేడల దీనిపై రియాక్ట్‌ అయ్యాడు. ఆ పోస్ట్‌ తాను పెట్టింది కాదని, హ్యాక్‌ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్‌ మాత్రం హ్యాకింగ్‌ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్‌ని ఎలా హ్యాక్‌ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్‌బుక్‌ని చెక్‌ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025

China to expand satellite support for Pakistan Army8
భారత్‌ టార్గెట్‌.. పాకిస్తాన్‌కు అండగా చైనా మరో ప్లాన్‌

ఇస్లామాబాద్‌: భారత్‌కు వ్యతిరేకంగా మరోసారి దాయాది పాకిస్తాన్‌, డ్రాగన్‌ చైనా కొత్త కుట్రలకు ప్లాన్‌ చేస్తున్నాయి. భారత్‌ దాడులకు కుదేలైన పాకిస్తాన్‌ ఆర్మీకి సపోర్ట్ అందించేందుకు చైనా మళ్లీ ముందుకు వచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా దెబ్బతిన్న పాకిస్తాన్‌ ఆర్మీకి శాటిలైట్‌ సపోర్టు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.వివరాల ప్రకారం.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాకిస్తాన్‌లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్‌తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు జరిపింది. దీంతో, పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థ, శాటిలైట్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు చైనా మరోసారి ముందుకు వచ్చింది. పాకిస్తాన్‌కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సాయాన్ని అందిస్తోంది. రియల్ టైమ్ కో-ఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దాడులను తప్పించుకోలేకపోయింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్‌లు, క్షిపణి వ్యవస్థలను‌ భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్‌ని మోహరించింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా మోహరించింది. దీంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది.

Supreme Court stays ED money laundering investigation9
హద్దులన్నీ దాటుతోంది

న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్‌ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌(టాస్మాక్‌)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్‌ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్‌ రిటైలర్‌ సంస్థపై ఈడీ మనీలాండరింగ్‌ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, అమిత్‌ ఆనంద్‌ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్‌ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్‌ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్‌ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్‌ 23వ తేదీన మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్‌ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్‌ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్‌ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్‌ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్‌ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్‌ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్‌ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్‌ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్‌ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్‌ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్‌ఎస్‌ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్‌ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ సారథ్యంలో డీఎంకే సర్కార్‌ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్‌ఎస్‌ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి.

NMACC India Weekend Bringing India to New York City10
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు

న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్‌లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్‌ స్వాగత్‌’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్‌ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, స్టాక్‌ మార్కెట్‌, కరెన్సీ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement