Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Kalvakuntla Kavitha letter to KCR1
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్‌ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్‌, నెగిటీవ్‌ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వ‌ర్ జూబ్లీ త‌ర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్‌ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్‌ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్‌ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్‌ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్‌ఎస్‌ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Ys Jagan Comments On Chandrababu Government2
‘చంద్రబాబు సర్కార్‌’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది...కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్‌ఆర్‌ అంజనేయులు, డీజే ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌ కుమార్, అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌ ఐపీఎస్, సీనియర్‌ ఆఫీసర్, ఐజీ ర్యాంక్‌ కాంతిలాల్‌ రాణా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌ రెడ్డి ఐపీఎస్‌ లు, ఐపీఎస్‌ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్‌ లోడ్‌ చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Sakshi Editorial On Maoist Party3
మావోలకు పెద్ద దెబ్బ

విస్తీర్ణంలో చాలా దేశాలతో పోలిస్తే ఎంతో పెద్దదైన మధ్య భారతంలో కొన్ని దశాబ్దాలుగా సాగు తున్న వామపక్ష తీవ్రవాదం క్షీణిస్తున్న జాడలు గత కొన్నేళ్లుగా కనబడుతుండగా... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అబూజ్‌మఢ్‌ అడవుల్లో జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌లో ఆయనతోపాటు మరో 26 మంది నక్సలైట్లు చనిపోయారని, వారిలో పలువురు కీలక నేతలు ఉండొచ్చని అధికారిక ప్రకటన చెబుతోంది. ఇరుపక్షాల మధ్యా జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాల్లోని ఒక జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ) కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారని అధికారిక కథనం. ప్రధాన కార్య దర్శి స్థాయి నేత మరణించటం మావోయిస్టు పార్టీకి నిస్సందేహంగా కోలుకోలేని దెబ్బ. అందుకే కావొచ్చు... ఈ ఎన్‌కౌంటర్‌ గర్వించదగ్గ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం, దోపిyీ నిరోధానికీ ఆయుధం పట్టామని చెబుతున్న మావోయిస్టులు ఇన్ని దశాబ్దాల పోరాటంలో తమ చర్యల పర్యవసానాలనూ, వాటి నిరర్థకతనూ గమనించి సరిచేసుకోలేకపోయారని అర్థమవుతుంది. నక్సలైట్‌ ఉద్యమం పూర్వాపరాలు గమనిస్తే అదెప్పుడూ పడుతూ లేస్తూనే సాగింది. కానీ తమ పోరాటాలపై రాజ్యం ప్రతిసారీ ఎందుకు పైచేయి సాధించ గలుగుతున్నదన్న అంశంపై వారు దృష్టి పెట్టినట్టు లేదు. అంతకుముందు దేశంలో చెదురుమదురుగా జరిగిన సాయుధ పోరాటాలు అంతరించాయనుకుంటున్న తరుణంలో 1967లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా సిలిగుడి డివిజన్‌లో మారుమూల గ్రామమైన నక్సల్బరీలో రాజు కున్న ఉద్యమం వేగంగా విస్తరించి సీపీఐ(ఎంఎల్‌) ఆవిర్భావానికి దారితీసింది. మూడేళ్ల లోపునే పోలీసులు ఆ ఉద్యమాన్ని అణిచేయగలిగారు. దానివెంబడే అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వెల్లువెత్తిన ఉద్యమం సైతం ఎన్‌కౌంటర్ల పరంపర తర్వాత మూడేళ్లకే సద్దుమణిగింది. తిరిగి మరో ఆరేళ్లకు ఉత్తర తెలంగాణలో తలెత్తి విస్తరించిన ఉద్యమం ఒక్కటే దీర్ఘకాలం సాగిందనుకోవాలి. ఈ మూడు చోట్లా ఒకేవిధంగా మొదట్లో మధ్యతరగతి, మేధావి, విద్యార్థి వర్గాలను ఆకర్షించిన ఉద్యమాలు అనంతర కాలాల్లో ఆ వర్గాలకు ఎందుకు దూరమయ్యాయన్న విశ్లేషణను మావోయిస్టులు చేసుకోలేదని వారి ఆచరణ తీరు గమనిస్తే అర్థమవుతుంది. మరోపక్క నక్సల్‌ ఉద్యమం చీలికలూ, పేలికలూ అయింది. సీపీఐ (ఎంఎల్‌) భిన్నవర్గాలుగా విడిపోయింది. లిబరేషన్‌ వంటి పార్టీలు పార్ల మెంటరీ పంథాకు మళ్లి చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నాయి. పాలకులెవరైనా ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటానికీ, ప్రభుత్వ విధా నాలు సక్రమంగా లేవనుకుంటే ప్రజల్ని కూడగట్టి ఉద్యమించటానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక భూసేకరణ చట్టం సవరించినప్పుడూ, అనంతర కాలంలో సాగు చట్టాలు తీసుకొచ్చినప్పుడూ రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు కేంద్రం ఆ చర్యల్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. మావోయిస్టు పార్టీ వీటిని గమనంలోకి తీసుకుందా? అంతక్రితం 1977 తర్వాత ఉద్యమాల్లోకి ప్రజల్ని కూడగట్టడంలో విజయం సాధించినా అటుపై ఆ ఉద్యమాలకు తోడు సాయుధ చర్యలు కూడా మొదలయ్యాయి. పర్యవసానాలు తెలియని యువ తను మొదట్లో ఇవి ఆకర్షించివుండొచ్చు. కానీ ప్రభుత్వ బలగాలు పకడ్బందీ వ్యూహాలు అమలు చేయటం ప్రారంభించాక ఆ సాయుధ చర్యలు వ్యతిరేక ఫలితాలిస్తాయి. సమస్యలెన్నివున్నా ప్రజలు మౌలికంగా శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు. నిత్యం ఉద్రిక్త తల నడుమ అనిశ్చితిలో బతికే స్థితి ఉన్నప్పుడు దాన్నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడటా నికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వాలు అణచివేత చర్యలతోపాటు వారి ప్రశాంతతకు హామీ ఇచ్చిన ప్పుడు సహజంగానే ఉద్యమాల వైపు మొగ్గు తగ్గుతుంది. మొదట్లో ఉన్నత చదువులు చదివినవారు భద్రమైన జీవితాన్నీ, బంగారు భవిష్యత్తునూ వదులుకుని ఆ ఉద్యమాల వైపు వెళ్లిన మాట వాస్తవం. అందుకు నిరుద్యోగం, ప్రభుత్వ వ్యవస్థల్లో పెరిగిన అవినీతి వంటివి కారణం అయ్యాయి. కానీ 1990వ దశకం చివరిలో ప్రపంచీకరణ తర్వాత మన దేశంలో పెట్టుబడులు వెల్లువలా రావటం, యువతకు మెరుగైన అవకాశాలు ఏర్పడటం మొదలయ్యాక ఉద్యమాల పట్ల విముఖత ఏర్పడింది. ఈ తరం విద్యార్థులు అటువైపు వెళ్లటం మాట అటుంచి, వారిలో అత్యధికులకు ఆ ఉద్య మాలపై కనీస అవగాహన కూడా లేదు. మావోయిస్టు ఉద్యమంలో కొత్త రిక్రూట్‌మెంట్‌ గణనీయంగా తగ్గి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యమంలో మధ్యతరగతి వర్గానికి బదులు ప్రస్తుతం ఆదివాసీల ప్రాబల్యం గతంతో పోలిస్తే పెరిగింది. కానీ దానికి సమాంతరంగా ఆదివాసీలను తమవైపు తిప్పుకోవటంలో భద్రతా బలగాలు సైతం విజయం సాధించగలిగాయి. నంబాల కేశవరావు తదితర ఉద్యమ నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించటం ఆ పర్యవసానమే! వర్తమానంలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంకేతికత సైతం బలగాలకు అందివచ్చింది. నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తరచూ చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది సాధ్యమేనన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదేమైనా ఈ సమస్య హింసకు తావులేకుండా శాంతియుతంగా పరిష్కారమైతే సమాజం సంతోషిస్తుంది. అందుకు మావోయిస్టులు తమ పంథా మార్చుకుని సహకరించాలి. వారు పునరాలోచించుకునేందుకు కేంద్రం కూడా వ్యవధినివ్వాలి.

Sakshi Guest Column On Crop yield4
పెరిగేది... దిగుబడా? సమస్యలా?

మొన్న మే 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దేశంలో మొదటి సారిగా జీనోమ్‌ ఎడిట్‌ చేసిన రెండు కొత్త వరి రకాలను విడుదల చేశారు: డీఆర్‌ఆర్‌ రైస్‌ 100 (కమల), పూసా డీఎస్‌టీ రైస్‌ 1. కమల రకాన్ని సాంబా మహసూరి (బీపీటీ 5204) ఆధారంగా ఐసీఏఆర్‌–ఐఐఆర్‌ఆర్‌ హైదరా బాద్‌ అభివృద్ధి చేసింది. రెండవ రకం– పూసాను ఎంటీయూ 1010 ఆధారంగా ఐసీఏఆర్‌–ఐఏఆర్‌ఐ న్యూఢిల్లీ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వీటి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి: దిగుబడిలో 19 శాతం పెరుగుదల. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలలో 20 శాతం తగ్గింపు. 7,500 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సాగునీరు ఆదా. కరువు, లవణీయత, వాతావరణ ఒత్తిళ్లను మెరుగ్గా తట్టుకోగలగడం.ఈ ప్రకటన ప్రకారం, ఈ రకాలు పంట కాలాన్ని 20 రోజులు తగ్గిస్తాయి. తద్వారా కర్బన ఉద్గారాలను, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే, మొత్తం సమాచారం బయటపెట్టలేదు. వీటి విడుదల ఆహారానికి, ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది కాబట్టి తెలుసుకోవడం, ప్రతిస్పందించడం ప్రజల హక్కు. ఇతర దిగుబడి సమస్యలో?దాదాపు 50 ఏండ్ల క్రితం అధిక దిగుబడి వంగడాల పేరిట హైబ్రిడ్‌ రకాలను విడుదల చేయడం వల్ల కొనసాగుతున్న అనర్థాలు అనేకం. ఈ రెండు వరి రకాలు వాతావరణ మార్పులను తట్టుకునేవి అనుకుందాం (ఇది ఒక సందేహాస్పద వాదనగానే కనిపిస్తుంది). మరి దిగుబడి ఎట్లా పెరుగుతుంది? వరి దిగుబడిపై ప్రభావం చూపే కారణాలలో విత్తనాలతో సహ అనేకం ఉన్నాయి– సారవంతమైన నేల, సరైన పోషకాలు, నీరు, పొలంలో ఇతర జీవాల పాత్ర, వగైరా. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర రకాల జీవులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. వాటిలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. తెగుళ్లు కూడా ఉన్నాయి. కేవలం వరి ధాన్యానికి వాతావరణ మార్పు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందా? దిగుబడిని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఆ విధమైన శక్తిని సంపాదించకుంటే, వరి దిగుబడి స్థిరంగా ఉంటుందా? వరి జన్యువులో ఒకటి మార్చినంత మాత్రాన దిగుబడి పెరగదు. ప్రధానంగా, భారతదేశంలో వరి దిగుబడి సమస్య చాలా కాలంగా అనేక రూపాలలో కనిపిస్తున్నది. నిరంతరం ఒకే పంట వేయడం వల్ల, అధిక నీరు ఇవ్వడం నేల సారం పూర్తిగా పడిపోయింది. కృత్రిమ, రసాయన ఎరువులు వేయనిదే పంట రావడం లేదు. ఈ రకమైన దిగుబడి సమస్య మీద పరిశోధన చేయకుండా ఇంకేదో చేయడం సరి కాదు. వాస్తవానికి, ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2025 ఏప్రిల్‌ 1 నాటికి వరి నిల్వలు రికార్డు స్థాయిలో 63.09 మిలియన్‌ టన్నులు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం కంటే 13.6 మిలియన్‌ టన్నులు అధికం. మరింత దిగుబడి పెరిగితే రైతుకు గిట్టుబాటు కాదు. ప్రభుత్వం కొనదు! మరి ఈ రెండు కొత్త వరి విత్తన రకాల ద్వారా శాస్త్రవేత్తలు ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు? సరళంగా చెప్పాలంటే, శాస్త్రవేత్తల అవగాహన రైతుల సమస్యలకు భిన్నంగా ఉంటున్నది. రైతులు తక్కువ దిగుబడి గురించి ఫిర్యాదు చేయడం లేదు. అధిక సాగు ఖర్చులు, గిట్టుబాటు లేని ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తాజా వరి రకాల విడు దలలో భారతీయ రైతులకు ఏమి అవసరమో అది కాకుండా, కంపెనీ లకు ఉపయోగపడే శాస్త్రీయ పరిశోధన పేరుతో కొత్త రకాలను నెత్తిన రుద్దుతున్న వైనం కనబడుతోంది.‘శుద్ధి’ చేయడం సాధ్యమా?ఈ వరి రకాలు ఒక కొత్త సాంకేతిక విప్లవం అని ఢంకా బజాయిస్తున్నారు. గింజలను అధికంగా ఉత్పత్తి చేసే జన్యువు పని సానుకూలం చేశాము అంటున్నారు. పోషకాలు లేదా ఇతర ‘సహాయం’ లేకుండా ఒక జన్యువు అధికంగా గింజలను సాధించగలదా? గాలిలో నుంచి సాధువు భస్మం పుట్టించినట్టు వరి గింజలోని ఒక జన్యువు అధిక దిగుబడి ఇస్తుంది అంటున్నారు. పర్యవసానాలు, దీర్ఘకాలిక పరిణామాల గురించి చెప్పడం లేదు. ఈ ఆహారం తినే మనుష్యుల మీద, జంతువుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియదు. విత్తనాల జన్యుక్రమం, సహజ సంపదకు కలిగే దీర్ఘకాలిక పరిణామాల గురించి అసలే తెలియదు. ఈ రకమైన విత్తనాల వల్ల సహజ, మంచి రకం విత్తనాలు కలుషితం అయితే తిరిగి వాటిని ‘శుద్ధి’ చేయడం అసాధ్యం. పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలను కొన్ని ఏళ్ల పాటు ప్రయోగశాలలో జరపాల్సి ఉండగా, కేంద్రం తొందర పడి ఈ రెండు రకాలను విడుదల చేయడంలో సార్వజనీన సంక్షేమ లక్ష్యం కనపడటం లేదు. విదేశీ ప్రైవేట్‌ కంపెనీల గుప్పిట్లో ఉన్న ఈ టెక్నాలజీకి ప్రభుత్వమే ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం ఆశ్చర్యం కలిగి స్తున్నది. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు ముందట పెడుతున్నా దీని వెనుక విదేశీ, లాభాపేక్ష శక్తులు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. విత్తనాలు, జన్యు సంపదతో ఆడుకోవడానికి శాస్త్రవేత్తలకు క్రిస్పర్‌ (సీఆర్‌ఐఎస్‌పీఆర్‌) ఒక సాధనంగా మారింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా 40 పంటల మీద పరిశోధనలు జరుగుతున్నా యని కేంద్రం ప్రకటించింది. వరి జన్యుక్రమంలో జన్యువులను తమ ఇష్టానుసారంగా తొలగించి, శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగా ‘స్పంది స్తుందని’ మనకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధిక దిగుబడి, వాతావరణ ఒత్తిళ్లకు తట్టుకునే శక్తి సామాజిక–ఆర్థిక లక్ష్యాలు. ఇవి ఇప్పుడు ప్రకృతిలో చొప్పించబడ్డాయి. ప్రకృతిపై ఇటువంటి పరిశోధన నిరపాయ కరమైనది కాదు. ఈ పరిశోధన వెనుక ఉన్నతమైన ఆదర్శాలు లేవు. స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టి వ్యాపారం పెంచుకోవడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆక్షేపించదగినది. భారత ప్రభుత్వం ఈ రకం పరిశోధనలను నియంత్రించాలి, నిషేధించాలి. అంతగా అవసరం అనుకుంటే ప్రయోగశాలలకే పరిమితం చేయాలి. క్రిస్పర్‌ ఆధారిత జన్యుమార్పిడి పంటల మీద భారత సమాజంలో విస్తృత, బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది.దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Predicts That Gold Will Soar To 25000 Dollars And Silver To 70 Dollars5
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి

ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్‌లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్‌కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.THE END is HERE: WHAT if you threw a party and no one showed up?That is what happened yesterday. The Fed held an auction for US Bonds and no one showed up.So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025

GT vs LSG 2025: Mitchell Marsh Maiden IPL Ton6
మిచెల్ మార్ష్ విధ్వంసక‌ర సెంచ‌రీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను మార్ష్ ఊతికారేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఆస్ట్రేలియన్ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు. బౌల‌ర్ల‌ను ఎంత‌మందిని మార్చినా మార్ష్ నుంచి వ‌చ్చిన స‌మాధాన‌మే ఒక్క‌టే. ల‌క్నో ఇన్నింగ్స్ 12 ఓవ‌ర్ వేసిన ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్ష్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్ల‌తో ఏకంగా 25 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 56 బంతుల్లో త‌న సెంచ‌రీ మార్క్‌ను మార్ష్ అందుకున్నాడు. మార్ష్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. కాగా ఈ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.మార్ష్‌ సాధించిన రికార్డులు ఇవే..👉ఒకే సీజ‌న్‌లో ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ త‌రపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా మార్ష్ నిలిచాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో మార్ష్ ఇప్ప‌టివ‌ర‌కు 560 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్‌(616) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. 👉అదేవిధంగా ఒక సీజ‌న్‌లో ల‌క్నో త‌ర‌పున అత్యధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ రికార్డును మార్ష్ స‌మం చేశాడు. ఐపీఎల్‌-2022 సీజన్‌లో రాహుల్ 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. ఈ ఏడాది సీజన్‌లో మార్ష్ కూడా సరిగ్గా ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. మార్ష్ మరో హాఫ్ సెంచరీ చేస్తే రాహుల్‌ను అధిగమిస్తాడు.𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗜𝗣𝗟 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬 𝗙𝗢𝗥 𝗠𝗔𝗥𝗦𝗛! 💯As rightly said in the Bhojpuri commentary box, it’s been a "𝘿𝙖𝙣𝙙𝙞 𝙈𝙖𝙧𝙨𝙝" in Ahmedabad! 😁Will his knock prove to be a hurdle in Gujarat Titans' #Race2Top2 tonight? 🤔Watch the LIVE action in Bhojpuri ➡… pic.twitter.com/fmKMj5z25j— Star Sports (@StarSportsIndia) May 22, 2025

Tamannaah Bhatia Select Brand Ambassador for Mysore Sandal Soap After Explains Karnataka Govt7
మైసూర్ శాండల్‌తో తమన్నా ఢీల్‌పై విమర్శలు.. మంత్రి వివరణ

నటి తమన్నా భాటియాను ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే, ఈ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక బ్రాండ్‌గా ఉన్న మైసూర్ శాండల్ సబ్బుకు ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక నటుడిని ఎందుకు ఎంపిక చేయలేదని కన్నడిగులు ప్రశ్నించారు.ఈ వ్యతిరేకతను ప్రస్తావిస్తూ.. కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్‌ అయ్యారు. ప్రస్తుత మార్కెట్‌లో పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయంటూ.. ఈ నిర్ణయాన్ని సమర్థించారు. కన్నడ చిత్ర పరిశ్రమపై తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. కానీ, కెఎస్‌డిఎల్ సంస్థ కర్ణాటకను దాటి తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే తాము పాన్-ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా ఎంపిక చేశామన్నారు.తమన్నా ఎందుకు?మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంచుకోవడం వెనుక నాలుగు ముఖ్య కారణాలను మంత్రి వివరించారు.పాన్-ఇండియా రేంజ్‌లో గుర్తింపు: తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటించారు. జాతీయ స్థాయి మార్కెట్‌లో ఆమెకు గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటే మరింతగా విస్తరించవచ్చు.మార్కెట్ విస్తరణ: KSDL కర్ణాటకేతర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశంలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రొఫెషనల్ బ్రాండింగ్ అనుభవం: తమన్నాకు హై-ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్‌కేర్ బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడిర్‌గా పనిచేశారు. ఆమెకు ఈ విషయంలో అనుభవం ఉంది. ఆమె ద్వారా సులువుగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందొచ్చు.బోర్డు ఆమోదం: తమన్నా ఎంపికను మార్కెటింగ్ నిపుణుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ద్వారా మాత్రమే తీసుకున్నారు. అందుకు PSU డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదించింది.రూ. 6.2 కోట్ల డీల్కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తయారు చేస్తున్న మైసూరు శాండల్ స‌బ్బుల‌తో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమించబడ్డారు. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుంది. ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం కర్ణాటక చెల్లించనున్నట్లు సమాచారం.కర్ణాటకకు గుర్తింపుగా ఉన్న మైసూరు శాండల్ సోప్‌కు ఒక కన్నడ స్టార్‌ను ఎంపికి చేసుంటే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి. ప్రాతీయ గుర్తింపును ప్రోత్సహించడంలో విఫలం అయ్యారని చెబుతున్నారు. కర్ణాటకతో వందేళ్ల అనుబంధం ఉన్న ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కన్నడ నటిని కాకుండా మరొక ప్రాంత నటిని తీసుకోవడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార లక్ష్యాలను అందుకునే వ్యూహాత్మకతలో భాగమని పేర్కొంది. KSDL has deepest respects and regards for Kannada Film Industry. Some Kannada Movies are giving competition to even Bollywood movies. Mysore sandal has a very good brand recall within Karnataka. Which shall be strengthened. However the intent of Mysore Sandal is to also… https://t.co/qnXe3MyJYn— M B Patil (@MBPatil) May 22, 2025

YS Jagan Declared June 4th As Vennupotu Day8
జూన్‌ 4న వెన్నుపోటు దినం: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు

Heart Breaking Washington Israeli Embassy Couple staffers Incident9
ఉంగరంతో ప్రపోజ్‌ చేద్దామనుకున్నాడు, ఈలోపే..

చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్‌, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్‌, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్‌ చేయాలని యారోన్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్‌ రాయబారి యెచెయిల్‌ లెయిటర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్‌ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్‌

US Court Says  Google And Character AI Company Must Face Lawsuit Filed By Mother Over Her Death Of Son10
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'

టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్‌బాట్‌ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement