ప్రధాన వార్తలు

‘సుప్రీం తీర్పు’.. చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్లో పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు @ncbn గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2025

కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి చానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌లోని ముఖ్యాంశాలు:కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది.

KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడుచట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్‌కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌పై దుయ్యబట్టారు.అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…— KTR (@KTRBRS) June 13, 2025

ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్‌లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్‌లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్‌పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కొమ్మినేని అరెస్ట్ టు బెయిల్! ఎప్పుడేం జరిగిందంటే..
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్ సిటిజన్, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం(13 జూన్) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.

Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్‌కు వెళ్లాల్సిన గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన భూమి చౌహాన్ అనే మహిళ.. అహ్మదాబాద్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్ మిస్ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్ ఎక్కలేదు. బోర్డింగ్ ప్రాసెస్‌కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్ మిస్ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్‌లోనే ఉన్నా. ఆ ఫ్లైట్ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్ అవుతుంది. బోర్డింగ్ ప్రోసెస్ అంతా 12.10 కల్లా కంప్లీట్ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చా. నేను చెక్ ఇన్ గెట్ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్ చేశా. మొత్తం ప్రొసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్‌కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్‌గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్‌తో నా కూతురు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్ ప్రాసెస్‌కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు.

అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..)

బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
సినిమా హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. అయితే రజనీకాంత్ లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిసూ..సాధారణ వ్యక్తులాగానే జీవితాన్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదు..బయట కుడా విగ్లోనే తిరుగుతారు. వయసు మీద పడినా..అభిమానుల ముందు కుర్రాడిలా కనిపించేందుకు ఫేక్ మీసాలు.. విగ్గులు ధరిస్తుంటారు. అవి లేకుండా బయట కాలు కూడా పెట్టరు. అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒకరు. విగ్గు, పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు.ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయకున్నది పెట్టుడే మీసాలే అన్న విషయం బయటకు వచ్చింది. ఓ స్టేజ్‌పై ఆయన మాట్లాడుతుండగా.. మూతికి అతికించుకున్న ఫేక్ మీసాలు ఊడిపోయాయి. అందరి ముందే గమ్ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు.నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 65వ పుట్టిన రోజు(జూన్ 10)ని బసవతారకం ఆస్పత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుకున్నాడు. కత్తిని గాల్లో తిప్పుతూ కేకు కట్ చేసి అభిమానులను అలరించాడు. అనంతరం ఆయన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడాడు. తన స్పీచ్‌లో ఎప్పటిలాగానే తన బ్లడ్ వేరు..బ్రీడ్ వేరు అని ఊదరగొట్టాడు. అయితే బాలయ్య ఇలా మాట్లాడుతన్న సమయంలో తన పెట్టుడు మీసం కాస్త ఊడిపోయింది. దీంతో కాస్త షాకయిన బాలయ్య.. వెంటనే తేరుకొని గమ్ ఇవ్వండంటూ సిబ్బందిపై గరం గరం అయ్యాడు.గమ్ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో విగ్గులు, పెట్టుడు మీసాలు అవసరమా?’, ‘మనదంతా ఓపెన్ బుక్ అని ప్రతిసారి చెప్పే బాలయ్య..ఇలా బయట ఫేక్ మీసాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది?’, ‘సినిమాల్లో ఎలాగో తప్పదు.. నిజ జీవితంలో అయినా సహజంగా బతుకొచ్చు కదా?’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.Papam Bulbul Balayya 😂😂😂Chusukovali kada Mental 😜🤡 pic.twitter.com/9Dqp6BNf20— We Love Chiranjeevi (@WeLoveMegastar) June 11, 2025బాలకృష్ణ గమ్ము గమ్ము అని అడుగుతుంటే ఎందుకబ్బా స్పీచ్ మధ్యలో bubblegum లేక chewing gum అడుగుతున్నాడని మొదట అర్థం కాలేదు తర్వాత అర్థమయింది 😁😁 pic.twitter.com/etuvYFQX5I— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) June 11, 2025

బోయింగ్ డ్రీమ్‌లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్‌బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్‌లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్‌లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్‌ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్‌పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్‌ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్‌లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్‌పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.

విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్‌పై ఫేక్ ప్రచారం..
Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌పై ఫేక్ ప్రచారంబ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.బ్లాక్ బాక్స్‌పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్‌తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దుఅహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్లు రద్దుగుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా
‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
అక్క డిప్రెషన్లో.. దయచేసి ప్రాణాలు తీయొద్దు.. ఏడ్చేసిన వర్ష
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
'క్షీణించిన బిగ్‌బాస్ విన్నర్ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా'
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
ఇన్ఫోసిస్‌లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఇదిగో కొత్త డేటా
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్‌కు బంపరాఫర్.. కెప్టెన్‌గా ఎంపిక
ప్రపంచం మన మాట వినట్లేదేం?
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి : సింగర్ సునీత ఫ్యామిలీ పిక్స్ (ఫొటోలు)
నన్ను క్షమిస్తావు కదూ.. పూర్ణ ఎమోషనల్ పోస్ట్ (ఫోటోలు)
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి
ఒక్క లాడెన్‌కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
మీరిచ్చిన గూగుల్ మ్యాప్‌లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా
‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
అక్క డిప్రెషన్లో.. దయచేసి ప్రాణాలు తీయొద్దు.. ఏడ్చేసిన వర్ష
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
'క్షీణించిన బిగ్‌బాస్ విన్నర్ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా'
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
ఇన్ఫోసిస్‌లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఇదిగో కొత్త డేటా
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్‌కు బంపరాఫర్.. కెప్టెన్‌గా ఎంపిక
ప్రపంచం మన మాట వినట్లేదేం?
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఒక్క లాడెన్‌కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
మీరిచ్చిన గూగుల్ మ్యాప్‌లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
సాక్షి కార్టూన్ 11-06-2025
సినిమా

తొలిసారి బేబీ బంప్‌తో కనిపించిన మెగా కోడలు
మెగా కోడలు త్వరలో తల్లి కాబోతుంది. గత నెలలోనే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. తన భార్య లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భంతో ఉందని తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పటినుంచి అటు వరుణ్ గానీ ఇటు లావణ్య గానీ మీడియా కంట పడట్లేదు. తాజాగా ఇద్దరూ కలిసి మాల్దీవుల్కు వెకేషన్ వెళ్లారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లావణ్య బేబీ బంప్‌తో కనిపించింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. 'శక్తిమాన్')కలిసి రెండు సినిమాలు చేసిన వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత చాలావరకు సినిమాలు తగ్గించేసిన లావణ్య.. అంతకు ముందే ఒప్పుకొన్న ఒకటి రెండు సినిమాలు, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. అలా ఈ ఏడాది మే 6న తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.ఇప్పుడు బేబీ బంప్‌తో బీచ్ ఒడ్డున భర్తతో కలిసి కనిపించింది. ప్రస్తుతం వరుణ్-లావణ్య.. మాల్దీవుల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మెగా కోడలు ఇప్పట్లో కొత్త సినిమాలు చేయడం కష్టమే. ఒకవేళ బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తే కనిపించొచ్చు. లేదంటే మొత్తానికే కెరీర్‌ని వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు వరుణ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే కొంతమేర షూటింగ్ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)

శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్‌తో డీల్?
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామాయణ్ (Ramayan Movie) ఒకటి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.ప్రియాంక అవుట్తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉందట. దీంతో రామాయణ్ చిత్రయూనిట్.. ప్రియాంకను వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్‌ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్ వెంటనే రామాయణ్‌కు ఓకే చెప్పినట్లు భోగట్టా!రామాయణ్..ఈ క్రమంలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్.. చివరగా మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: కూతురి బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

అల్లు అర్జున్.. 'శక్తిమాన్'
90స్ జనరేషన్‌కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్‌గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) రీసెంట్గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్‌తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు)

కూతురి బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్‌డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్‌డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్‌డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్‌తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్‌లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఐదు రోజుల్లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కెనడా స్విమ్మర్
విక్టోరియా: కెనడా స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే కెనడా జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో 18 ఏళ్ల మెకింటోష్ ఐదు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ రికార్డు తిరగరాసింది. బుధవారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ రేసులో 4 నిమిషాల 23.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును (4 నిమిషాల 24.38 సెకన్లు) తిరగరాసింది.గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన మెకింటోష్... వచ్చే నెలలో సింగపూర్ వేదికగా జరగనున్న ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే మెకింటోష్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాలలో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ‘పోటీకి ముందే ఏదో ప్రత్యేకంగా చేస్తానని అనుకున్నా. నా కెరీర్లో ఇది అత్యుత్తమ టోర్నీ. ప్రపంచ రికార్డులు నమోదయ్యేవి బద్దలవడానికే. కొలనుకు వీడ్కోలు చెప్పేంతవరకు వాటిపై నా పేరే ఉండే విధంగా చూసుకుంటా’ అని మెకింటోష్ పేర్కొంది.

చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు
అంతర్జాతీయ వన్డేల్లో క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ సంచనలం సృష్టించింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యాన్ని డచ్ టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. వన్డేల్లో టాప్-2 లక్ష్య ఛేదన రికార్డులు సౌతాఫ్రికా పేరిట నమోదై ఉన్నాయి.🚨 HISTORY BY NETHERLANDS 🚨- Netherlands chase down 370 runs against Scotland in the final over, third highest chase in ODI History with Max ODowd scoring 158*(130) with 12 fours & 4 Sixes 🤯 pic.twitter.com/dJkWRcyBlr— Johns. (@CricCrazyJohns) June 13, 2025వన్డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు..2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438/9 (లక్ష్యం 435)2016లో డర్బన్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 372/6 (లక్ష్యం 372)2025లో డండీలో స్కాట్లాండ్పై నెదర్లాండ్స్ 374/6 (లక్ష్యం 370)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. ఓపెనర్ జార్జ్ మున్సే అతి భారీ శతకంతో (191) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ క్రాస్ (59) అర్ద సెంచరీతో రాణించగా.. చార్లీ టియర్ 23, బ్రాండన్ మెక్‌ముల్లెన్ 21, లియామ్ నేలర్ 14, ఫిన్లే మెక్‌క్రీత్ 9, మైఖేల్ లీస్క్ 28 (నాటౌట్), మార్క్ వ్యాట్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. మ్యాక్స్ ఓడౌడ్ (158) అజేయ శతకంతో విరుచుకుపడటంతో 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో తేజ నియమానూరు (51), నోవా క్రోయిస్ (50) అర్ద సెంచరీలతో రాణించగా.. మైఖేల్ లెవిట్ 44, స్కాట్ ఎడ్వర్డ్స్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు.గతంలో తృటిలో మిస్ అయ్యింది..! నెదర్లాండ్స్ టీమ్ 2023లోనే ఈ రికార్డును తృటిలో మిస్ అయ్యింది. నాడు విండీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ సమం చేసింది. ఫలితంగా ఆ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ గెలిచినా అది విజయవంతమైన రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా పరిగణించబడలేదు.వన్డేల్లో నెదర్లాండ్స్ బ్యాటర్ ద్వారా అత్యధిక వ్యక్తిగత స్కోరు..158* - మాక్స్ ఓ'డౌడ్ వర్సెస్ స్కాట్లాండ్, డండీ, 2025137* - వెస్లీ బరేసి vs కెన్యా, లింకన్, 2014134* - క్లాస్-జాన్ వాన్ నూర్ట్విజ్క్ vs నమీబియా, బ్లూమ్ఫోంటెయిన్, 2003123 - బాస్ డి లీడే vs స్కాట్లాండ్, బులవాయో, 2023

న్యూజిలాండ్ ఓపెనర్ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ మహోగ్రరూపం దాల్చాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ లీగ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న అలెన్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఇవాళ (జూన్ 13) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధిక సిక్సర్లు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న అలెన్ 19 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అలెన్ సెంచరీని కేవలం 34 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఎంఎల్సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ. గతంలో ఈ రికార్డు పూరన్ పేరిట ఉండేది. పూరన్ 2023 ఎడిషన్‌లో 40 బంతుల్లో శతక్కొట్టాడు. నేటి మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎంఎల్సీ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. గతంలో కూడా ఈ రికార్డు యూనికార్న్స్ (215/5) పేరిటే ఉంది.నేటి మ్యాచ్‌లో యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో సంజయ్ కృష్ణమూర్తి 20 బంతుల్లో 36, హసన్ ఖాన్ 18 బంతుల్లో 38 (నాటౌట్), టిమ్ సీఫర్ట్ 10 బంతుల్లో 18, జేక్ ఫ్రేజర్ 9 బంతుల్లో 6, కూపర్ కన్నోలీ 7 బంతుల్లో 5, కోరె ఆండర్సన్ 6 బంతుల్లో 3 (నాటౌట్) పరుగులు చేశారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 2, నేత్రావల్కర్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ గట్టిగానే ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతుంది. 10 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ స్కోర్ 118/8గా ఉంది. బెన్ సియర్స్ (1), ఇయాన్ హోలాండ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (20 బంతుల్లో 39), రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 42), వన్ డౌన్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ (7 బంతుల్లో 21) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఆతర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (5), గ్లెన్ ఫిలప్స్ (0), ఆండ్రియస్ గౌస్ (2), ఒబస్ పియనార్ (2), ముక్తార్ అహ్మద్ (1) దారుణంగా విఫలమయ్యారు. యూనికార్న్స్ బౌలర్లలో రౌక్స్, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లు తీయగా.. లియామ్ ప్లంకెట్ ఓ వికెట్ పడగొట్టాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు..ఫిన్ అలెన్-19 (న్యూజిలాండ్)క్రిస్ గేల్-18 (వెస్టిండీస్)సాహిల్ చౌహాన్-18 (సైప్రస్)క్రిస్ గేల్-18 (వెస్టిండీస్)

WTC Final 2025: కమిన్స్ ట్రిపుల్ సెంచరీ
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రెండు రోజుల్లోనే ఇరు జట్లకు చెందిన 28 వికెట్లు కూలడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు మారింది. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నా, నిలబెట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (16), నాథన్ లియోన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 43/4 వద్ద రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 95 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. బెడింగ్హమ్ 45, బవుమా 36 పరుగులు చేసి సౌతాఫ్రికాను మూడంకెల స్కోర్ దాటించారు. వీరు కాక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వెర్రిన్ (13), రికెల్టన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మార్క్రమ్ (0), ముల్దర్ (6), స్టబ్స్ (2),జన్సెన్ (0), మహారాజ్ (7), రబాడ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కమిన్స్ 6 వికెట్లతో చెలరేగిపోయి ప్రొటీస్ పతనాన్ని శాశించాడు. సౌతాఫ్రికాను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో స్టార్క్ (2/41), హాజిల్‌వుడ్ (1/27) కూడా తలో చేయి వేశారు. 74 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా సఫారీ బౌలర్ల ధాటికి వణికింది. ఆ జట్టును అలెక్స్ క్యారీ (43) అదుకున్నాడు. స్టార్క్ ఆసీస్‌ను 300 పరుగుల టార్గెట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో క్యారీ, స్టార్క్ కాకుండా లబూషేన్ (22), స్టీవ్ స్మిత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా 6, గ్రీన్ 0, హెడ్ 9, వెబ్‌స్టర్ 9, కమిన్స్ 6 పరుగులకు ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌కు చుక్కలు చూపించారు. జన్సెన్, ముల్దర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.కమిన్స్ ట్రిపుల్ సెంచరీతొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆసీస్ సారధి కమిన్స్.. ఈ ప్రదర్శన అనంతరం పలు రికార్డులు సాధించాడు. ఈ ప్రదర్శనతో కమిన్స్ టెస్ట్‌ల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మైలురాయిని తాకిని 40వ బౌలర్‌గా.. ఎనిమిదో ఆసీస్ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 30వ పేసర్‌గా.. ఆరో ఆసీస్ పేసర్‌గా పలు ఘనతలు సాధించాడు.ఈ ప్రదర్శనతో కమిన్స్ సాధించిన మరిన్ని రికార్డులు ఇవే..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.
బిజినెస్

అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్‌పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్‌బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్‌బాక్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్‌లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్‌బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్‌లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు.

సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ కామ్స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్‌గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్‌లైన్ సిస్టమ్స్‌లో కీలక సంస్థగా సోనా కామ్స్టర్ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.గ్లోబల్‌గా విస్తరణసంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్‌లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలుసంజయ్ నాయకత్వంలో సోనా కామ్స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!పరిశ్రమ నాయకత్వానికి సహకారంభారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు.

ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.92,950 (22 క్యారెట్స్), రూ.1,01,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.1,950, రూ.2,120 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,120 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.92,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,950 పెరిగి రూ.93,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,120 పెరిగి రూ.1,01,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

పీఎల్ఐ స్కీములతో పెట్టుబడులకు దన్ను..
ఎలక్ట్రిక్, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాలతో పని చేసే హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) తయారీ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెడితే మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఈ విభాగంపై తయారీ సంస్థలు, సరఫరాదారులు పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేయకపోవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్‘పీఎల్ఐ స్కీమును ప్రకటిస్తే కొత్త పెట్టుబడులు వస్తాయి. తయారీ, ఇంజినీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే హెచ్ఈఎంఎంలను దేశీయంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి‘ అని భారతీయ ఖనిజ పరిశ్రమ సమాఖ్య (ఎఫ్ఐఎంఐ) రూపొందించిన నివేదిక తెలిపింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌తో కలిసి ఎఫ్ఐఎంఐ దీన్ని రూపొందించింది. మైనింగ్ కార్యకలాపాల్లో కీలకమైన హెచ్ఈఎంఎంలు.. కర్బన ఉద్గారాలకు కారకంగా ఉంటున్నందున పర్యావరణహితమైన మెషినరీపై ఆసక్తి ఏర్పడుతోంది.
ఫ్యామిలీ

పికిల్స్.. పీక్స్.. టన్నుల కొద్దీ : భారీ డిమాండ్
మామిడి సీజన్ ముగుస్తుండగానే మరోవైపు.. పచ్చడి మామిడి సీజన్ హడావుడి మొదలవుతోంది. తెలుగుతనానికి ప్రతీకలైన ఆవకాయ, మాగాయ వంటి పచ్చళ్ల తయారీ ఇంటింటా ఊపందుకోగా.. నగరం నుంచి విదేశాలకు ఎగుమతి కోసం పచ్చళ్ల తయారీ మొదలైంది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తయారీదారులు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు ఏటా జూన్లోభారీగా ఎగుమతయ్యే నేపథ్యంలో ఆ హడావుడి, సందడి కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు జూన్ నెల వస్తుందంటే నోరూరించే పచ్చళ్ల కోసం లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్లో వారి పచ్చళ్ల ప్రియత్వాన్ని తీర్చడంలో నగరమే కీలకంగా మారుతోంది. ఉద్యోగం, ఇతరత్రా వ్యాపకాల రీత్యా నగరం నుంచి వెళ్లి విదేశాల్లో నివసిస్తున్న తమ బంధువుల కోసం ఈ మామిడికాయ పచ్చళ్లను సిటిజనులు పంపిస్తుంటారు. ప్రస్తుతం హోమ్మేడ్ ఆర్గానిక్ పచ్చళ్ళకు ఎక్కువ ఆదరణ ఉంది. అలాగే ఆర్గానిక్ వెరైటీలకు కూడా డిమాండ్ భారీగా ఉందని సరఫరాదారులు చెబుతున్నారు. చదవండి: Hanuman Chalisa: మోస్ట్ వ్యూడ్ వీడియో! 460 కోట్లుఎందరో తయారీ ‘దారులు’.. నగరానికి చెందిన పికిల్ కార్ట్, తెలుగు పికిల్స్, అమ్మ చేతి వంట వంటి కొన్ని ప్రత్యేక డెలివరీ స్టార్టప్స్, సంస్థలు ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా విదేశాలకు నేరుగా డెలివరీ చేస్తూన్నాయి. ఇక మియాపూర్‌లోని పికిల్స్ బై శ్రీదేవి, కూకట్‌పల్లిలోని మై గ్రాండ్ మా పికిల్స్, ఇసీఐఎల్ అనంత్ నగర్‌లోని పికిల్స్ బై రేణుక, గచ్చిబౌలిలోని అమ్మచేతి వంట, మాదాపూర్‌లోని తెలుగు హోమ్ ఫుడ్స్ ఇలా అనేక సంస్థల పచ్చళ్లు విదేశాల ఎగుమతులకు పేరొందాయి. అలాగే పచ్చడి తయారు చేయడం కంటే, దాన్ని విదేశాలకు పంపించడానికే ఎక్కువ ఖర్చు అవుతోందని తయారీదారులు అంటున్నారు. ఒక కేజీ ఆవకాయ పచ్చడి తయారీ ఖర్చు అన్ని దినుసులకూ కలిపి రూ.125 నుంచి రూ.150 వరకూ అవుతుందని అంచనా. అదే కేజీ ఆవకాయను అమెరికాకు పంపించేందుకు అన్ని రకాల పన్నులూ కలిపి రూ.900 వరకూ అవుతుంది. చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!టన్నుల కొద్దీ సరఫరా.. నగరంలో తయారయ్యే ఆవకాయ, మాగాయ, ముక్కాళి తదితర సంప్రదాయ హోమ్మేడ్ పచ్చళ్లకు విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి సంవత్సరం వేసవి ముగింపు దశలో, జూన్ నెల నుంచే పచ్చళ్ల సరఫరా గణనీయంగా పెరుగుతుంది. నగరం నుంచి కనీసం 1500–2000 టన్నుల వరకూ వివిధ రకాల పచ్చళ్ళను అనేక దేశాలకు తరలిస్తారని అంచనా. ఇందులో 70% భాగాన్ని ఆవకాయ ఆక్రమిస్తుంది. ప్రధానంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) ఈ పచ్చళ్ల భారీ సరఫరాకు కేంద్రబింధువుగా నిలుస్తోంది. మరోవైపు వీటిని పెద్ద ఎగుమతిదారులు సముద్ర మార్గం ద్వారా కూడా ముంబై పోర్టు లేదా చెన్నై పోర్ట్ ద్వారా కూడా కన్సైన్మెంట్లు పంపిస్తున్నారు. ఎక్కడెక్కడికి.. ఎక్కువగా.. నగరం నుంచి అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి రాష్ట్రాలకు, కెనడాలోని టొరంటో, వాంకూవర్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్, బర్మింగ్‌హామ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, మిడిల్ ఈస్ట్‌లో దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియాలకు అత్యధిక పరిమాణంలో ఈ పచ్చళ్లు సరఫరా అవుతాయి. అక్కడి ఇండియన్ స్టోర్లలో ఇవి రిటైల్ ఫార్మాట్లో పికిల్స్ విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. అమెరికాలోని పటేల్ బ్రదర్స్, అప్నా బజార్ తదితర స్టోర్లలో హైదరాబాద్ పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఆవకాయ బిర్యానీకి ఆదరణ.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్స్‌లో ఆవకాయ బిర్యానీ హల్ చల్ చేస్తోంది. దీని కోసం కూడా పచ్చళ్ల తయారీ దారులు ఆవకాయను పెద్ద యెత్తున తరలిస్తున్నారు. ‘ఈ సీజన్లో వందల కిలోల పరిమాణంలో ఆవకాయను పంపిస్తాం. అక్కడ ఉన్న మన బావార్చి రెస్టారెంట్ సహా పలు స్టాల్స్‌కి వీటిని సరఫరా చేస్తాం’ అంటూ చెప్పారు మల్కాజ్‌గిరిలో ఆవకాయ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే వ్యాపారి.

మోస్ట్ వ్యూడ్ వీడియో.. 460 కోట్లు
స్థానిక కళాకారులతో కలిసి పాటల కచేరి నిర్వహించినా, అంతర్జాతీయ వేదికలపై ఆడిపాడినా హరిహరన్ (Hariharan) గళానికి ఉన్న ప్రత్యేకత వేరు. తాజా విషయానికి వస్తే...ఈ ప్రముఖ గాయకుడు పాడిన ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) యూట్యూబ్‌లో( Youtube) ‘మోస్ట్ వ్యూడ్ వీడియో’గా నిలిచింది. 4.6 బిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఊహించని స్పందన ఇది. ఎక్కడకు వెళ్లినా హనుమాన్ చాలీసా గురించే మాట్లాడుతున్నారు’ అంటున్నాడు హరిహరన్.జీమ్యూజిక్కు రెడ్ డైమండ్ ప్లే బటన్మన దేశంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్‌లో ‘జీ మ్యూజిక్ కంపెనీ’ ఒకటి. తాజా విషయానికి వస్తే... యూట్యూబ్‌లో 100 మిలియన్ సబ్స్క్రైబర్లతో ‘వావ్’ అనిపించింది. యూట్యూబ్ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘రెడ్ డైమండ్ ప్లే బటన్’ను సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ అందుకున్న ప్రపంచంలోని రెండో మ్యూజిక్ లేబుల్... జీ మ్యూజిక్. దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘జీ మ్యూజిక్’ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.మోస్ట్ వ్యూడ్ వీడియో.ఇవీ చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!
వరల్డ్ చిన్నతనంలోనే అంజనశ్రీ (Anjana Sri) ప్రమాదవశాత్తు కాలు కోల్పోయింది. కూచిపూడి నాట్యం అంటే ఈ చిన్నారికి ఎంతో ఇష్టం.ఇక నాట్యానికి దూరం కావాల్సిందేనా? ‘లేదు’ అన్నది ఆ చిన్నారిలోని ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కూచిపూడి నాట్యంలో అంజనశ్రీ రాణిస్తోంది.జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది.... జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి నాగరాజు, గౌతమి దంపతుల కుమార్తె అంజనశ్రీ నాలుగు సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పూర్తిగా కోల్పోయింది. నాట్యప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని సుధాచంద్రన్ నిరూపించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వాటిని అధిగమించిన తీరును అంజనశ్రీకి కథలుగా చెప్పేవాళ్లు తల్లిదండ్రులు. అంతేకాదు, కూచిపూడి నాట్యకారుడు మచ్చ దేవదాసు వద్ద శిక్షణ ఇప్పించారు. దురదృష్టవశాత్తు రెండోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. కుడికాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. అయినప్పటికీ కృంగిపోకుండా కూచిపూడిలో శిక్షణను కొనసాగించింది.ఇప్పటి వరకు జాతీయస్థాయిలో యాభైకి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది అంజనశ్రీది పేద కుటుంబం. నాన్న బొమ్మకంటి నాగరాజు చిన్నపాటి పాల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి గౌతమి గృహిణి. ‘మా అమ్మాయి కూచిపూడి నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు అంజనశ్రీ తల్లిదండ్రులు.చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగిఆ మాటే ధైర్యం చెప్పిందినాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. యాక్సిడెంట్లో కాలుపోవడంతో ఇక ఎప్పుడూ డ్యాన్స్ చేయలేను అని బాధపడేదాన్ని. నా తల్లిదండ్రులు మాత్రం ‘నువ్వు ఎప్పటిలాగే మళ్లీ డ్యాన్స్ చేస్తావు’ అని ధైర్యం చెప్పారు. వారి ఆశీర్వాదబలంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ‘పట్టుదల ఉంటే కానిది లేదు’ అనే మాటను స్కూలు పాఠాల్లో విన్నాను. ఆ మాట నాకు ధైర్యం చెప్పినట్లు అనిపించేది. – అంజనశ్రీ– కందుకూరి శశిధర్, సాక్షి, జగిత్యాలచదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

పువ్వుల డిజైనర్‌వేర్‌లో స్టైలిష్‌గా కనిపిద్దాం ఇలా..!
పువ్వులకు మగువలకు విడదీయరాని బంధం ఉంటుంది. పువ్వులను తమ భుజాల మీదుగా మణికట్టు వరకు అలంకరించుకుని అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్ గౌన్లలో విరివిగా కనిపించే ఈ స్టైలు ఇప్పుడు ఎల్లలు దాటి మన సంప్రదాయ డిజైనర్ వేర్‌లోనూ కనువిందు చేస్తోంది. ఫ్యాబ్రిక్‌తో పువ్వులు వచ్చేలా కుట్టడం ఈ స్టైల్ ప్రత్యేకత. ఇక పువ్వులు చేతుల్లో కాదు, చేతులకు అందంగా అలంకరించుకోవచ్చు.పింక్, పీచ్ కలర్ బ్లౌజ్ అయితే ఫెమినైన్ లుక్, రెడ్ కలర్ అయితే స్టేట్మెంట్ అటైర్గా, తెలుపు, గోధుమరంగు అయితే వేదికలపైన పల్లకీ లుక్‌తో కనిపిస్తారు. ఏ స్టైల్లో కనిపించాలనుకుంటే ఆ డ్రెస్సింగ్‌కి సరిగ్గా నప్పే ఈ గులాబీల గుచ్చాలు ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ఫొటోలలోనూ విలాసంగా ఉంటుందనే ఆలోచన కూడా దీనికి క్రేజ్ పెంచుతోంది. నిన్నటి వరకు పిల్లల డ్రెస్సింగ్‌లో కనిపించే ఈ స్టైల్ పెద్దవారి చీరకట్టుకూ అందాన్ని తీసుకువచ్చింది. రిసెప్షన్, సంగీత్.. వంటి వేడుకలలో గ్రాండ్‌గా వెలుగుతోంది.స్లీవ్స్ డిజైన్ బోల్డ్‌గా ఉంటే, నెక్ సింపుల్‌గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆభరణాలు కాకుండా సన్నని చైన్లు వాడచ్చు.గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం ఈ స్టైల్ స్పెషల్. ఈ పువ్వులు లేయర్లుగా మంచి ఫ్లేర్ వచ్చేలా డిజైన్ చేస్తారు. వీటిని ఎక్కువగా నెట్, ఆర్గాంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేస్తారు.ఇండో వెస్టర్న్ డ్రెస్సుల్లో, ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ + స్కర్ట్ లుక్, పెప్లం టాప్స్, షరారా, పలాజో సెట్లలో విరివిగా కనిపిస్తున్నాయి.సంప్రదాయ డ్రెస్సులకు రెండు వైపులా ఫ్యాబ్రిక్ గులాబీల కుచ్చు ఉంటే, వెస్ట్రన్ స్టైల్స్‌లో బ్లౌజ్ లేదా గౌన్‌కు, సింగిల్ షోల్డర్ ఫ్రాక్‌కి ఒకవైపు గులాబీ గుచ్చం కనువిందు చేస్తుంది.శారీ లేదా లెహంగా కూడా సింగిల్ షోల్డర్ రోజ్ బొకేని డిజైన్ చేయించుకోవచ్చు.శారీ బ్లౌజ్ ట్రెండ్లలో గులాబీ స్లీవ్స్ అందంగా అమరిపోతున్నాయి.రోజ్ స్లీవ్స్ ఎంచుకున్నప్పుడు జుట్టును పోనీటైల్ లేదా బన్ స్టైల్ వేసుకుంటే డ్రెస్సింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.హై నెక్ టాప్ అయితే డ్యూయల్ రోజ్ స్లీవ్స్ బాగుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..)
ఫొటోలు
అంతర్జాతీయం

మస్క్ క్షమాపణలపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌లు మళ్లీ దగ్గరకానున్నరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ ఇద్దరు స్నేహితులు సోషల్ మీడియాలో పరిస్పరం విమర్శలు చేసుకున్నారు. వీరి వివాదం ఎటువైపునకు దారితీస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే ఇంతలో ఎలాన్ మస్క్ ట్రంప్‌ను క్షమాపణలు కోరుతూ, ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘న్యూయార్క్ పోస్ట్’తో జరిగిన ఫోన్ ఇంటర్వ్యూలో మస్క్ క్షమాపణలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. తన భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, తనకు కఠినమైన భావాలు లేవని ట్రంప్ అన్నారు. మస్క్ తనను క్షమాపణలు కోరడం చాలా బాగుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బడ్జెట్ బిల్లుపై మస్క్ పలు విమర్శలు చేశారని, అందుకు అతనిని నిందించనని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని కూడా అన్నారు.ట్రంప్‌కు మాజీ సహాయకుడు ఎలోన్ మస్క్ గత వారంలో ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తూ, సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో వీరి మధ్య వైరం పెరిగింది. ఆ తరువాత ట్రంప్ తన రాజకీయ విజయంలో మస్క్ పాత్రను తక్కువ చేస్తూ స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా 2024 ఎన్నికల్లో ట్రంప్ తన మద్దతు కారణంగానే విజయం సాధించారని మస్క్ పేర్కొన్నారు. తాజాగా మస్క్ తాను గతంలో ట్రంప్‌పై ఆరోపణలు చేస్తూ, చేసిన పోస్టులలో కొన్నింటిని తొలగించి క్షమాపణలు కోరారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్‌తో ప్రైవేట్‌గా మాట్లాడిన తర్వాత మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను క్షమాపణలు కోరారు. సోమవారం మస్క్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను కలిసినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ట్రంప్.. ఎలాన్ మస్క్ క్షమాపణలను అంగీకరించారని సమాచారం. అయితే వారి మునుపటి సంబంధాలను పునరుద్ధరించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయలేదని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం

హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్‌ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్‌లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్‌ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్‌ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు.

భారత్‌కు కొత్త టెన్షన్!.. పాక్‌కు అండగా అమెరికా భారీ ప్లాన్?
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్, ఖొరాసన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్‌లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్‌తోపాటు పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్‌తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి."Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్‌ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది."Ties with India cannot cost ties with Pakistan" General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS— BRADDY (@braddy_Codie05) June 11, 2025అమెరికా భారీ స్కెచ్..ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్‌కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్‌ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్‌ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్‌కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం
ఢాకా : బంగ్లాదేశ్‌లో మరో విధ్వంసం చోటుచేసుకుంది. సిరాజ్గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఒక సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.సందర్శకుడిని బంధించి..స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కచ్చరిబారికి ఒక సందర్శకుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు. మోటారుసైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఆ సందర్శకుడికి, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సందర్శకుడిని కార్యాలయ గదిలో బంధించి, మ్యూజియం సిబ్బంది అతనిపై దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దర్యాప్తుకు ప్రత్యేక కమిటీఇది స్థానికులలో ఆగ్రహానికి కారణమయ్యింది. వారంతా దీనిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. తర్వాత వారు కచ్చరిబారి ఆడిటోరియంలోకి చొరబడి ధ్వంసం చేశారు. సంస్థ డైరెక్టర్‌పై దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటన నేపధ్యంలో ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఐదు రోజులలోగా కమిటీ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. కచ్చరిబారి అధికారి హబీబుర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల కారణంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశామన్నారు. బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి డివిజన్లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలాకాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. దీనిని మ్యూజియంగా మలచారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం..
జాతీయం

కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్‌లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి

రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025

విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా?
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగం (ఫ్లాప్) ముడుచుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్పుడు ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతక మేనని చెబుతున్నారు.సాధారణంగా విమానం టేకాపైన వెంటనే, అంటే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిరిండియా విమానం టేకాఫ్ కాగాన్ లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటికి వచ్చింది. "బహుగా విమానానికి కావాల్సిన వేగం (థ్రస్ట్) లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ చోటుచేసుకోవడమో జరిగి ఉండాలి. అది గమనించి పైలట్ ముందు జాగ్రత్తగా లాండింగ్ గేర్‌ను తెరిచి ఉంటారు. దాంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేపేందుకు కావాల్సిన థ్రస్ట్ కోసం ఫ్లాప్‌ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడు" అని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు."కానీ 800 అడుగుల ఎత్తులో ఇది చాలా రిస్క్. ఇలాంటప్పుడు విమానం అటూ ఇటూ ఉగిపోతుంది. ఎయిరిండియా విమానం మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలేదాకా సజావుగానే ప్రయాణించింది. అందుకు పైలట్ సామర్థ్యమే కారణం కావచ్చు. దీంతో పాటు రైట్ రడ్డర్ సమస్య తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇది లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్యూర్‌కు సంకేతం, ఇవన్నీ కలగలిసి విమానాన్ని ఢీకొనడానికి ముందే సకాలంలో పైకి లేపడంలో పైలట్ విఫలమై ఉంటారు" అని వారు విశ్లేషించారు. అంతేగాక పక్షులు ఇంజన్‌ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చుంటున్నారు. "ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని ఆవాస ప్రాంతాలున్నాయి. కనుక అక్కడ చాలా పక్షులుంటాయి. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తిని కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట అందుకోలేకపోయి ఉంటాయి" అని వారన్నారు.

ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్‌లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025
ఎన్ఆర్ఐ

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్‌లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్‌లోని డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.
క్రైమ్

నా చావుకు.. నా భార్యే కారణం..
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్‌కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సాగర్ హైవేపై ఘోర ప్రమాదం
యాచారం(హైదరాబాద్): నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కియా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస సాయితేజ(24), వాస రాఘవేంద్ర(22), వాస పవన్‌కుమార్(26), వాస శివకుమార్, వాస సాయికుమార్(ఇద్దరు అన్నదమ్ములు), ఇదే జిల్లా మూసాపేట మండల కేంద్రానికి చెందిన మేకల సందీప్ సమీప బంధువులు. వీరంతా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంగళవారం వాస శివకుమార్ పుట్టిన రోజు కావడంతో బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన స్నేహితుడు శివకుమార్ గౌడ్‌తో కలిసి..ఉదయం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సంబ రాలు ముగించుకుని మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మాల్ సమీపంలోకి రాగానే నగరం నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సాయితేజ, రాఘవేంద్ర, పవన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్, సాయికుమార్, శివకుమార్ గౌడ్, సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాల్, మన్నె గూడలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పారీ్టకి వెళ్లిన వారిలో పవన్‌కుమార్ ఒక్కడికే వివాహం జరిగింది. ఇతనికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. సాగర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ సాగర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచి్చందని గ్రామస్తులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు.

మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్‌కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్‌ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్‌కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు.

హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్‌తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్‌కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్‌సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్‌లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.