సీతారాములకు భారీ కానుకలు సమర్పించిన కంభం వాసి | Bhadrachalam Lord sri sita ramachandra swamy gets a Rs 18 lakhs gift | Sakshi
Sakshi News home page

సీతారాములకు భారీ కానుకలు సమర్పించిన కంభం వాసి

Published Wed, Aug 21 2013 10:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రకాశం జిల్లా కంభంకు చెందిన భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం రెండు బంగారు కిరీటాలను బహుకరించారు.

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామీకి ప్రకాశం జిల్లా కంభంకు చెందిన భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం రెండు బంగారు కిరీటాలను బహుకరించారు. ఆ రెండు కిరీటాలను శ్రీ సీతారామచంద్రస్వామీ ఆలయ అధికారులకు వారు అందజేశారు. ఆ కిరీటాలను శ్రీ సీతారాములకు అలంకరించవలసిందిగా వారు ఆలయ అధికారులను కోరారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం భద్రాద్రిలోని శ్రీసీతారాములను దర్శించుకున్నారు.

 

అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రూ.18 లక్షలతో ఆ రెండు కిరీటాలను తయారు చేయించినట్లు శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు తెలిపారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పర్వదినాల్లో శ్రావణ పౌర్ణమి ఒకటి. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీతారాములను దర్శించుకునేందుకు భద్రాద్రి దేవాలయానికి భక్తులు పొటెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement