
మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (ఫైల్ ఫొటో)
సాక్షి, తిరుపతి: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని బూటు కాలితో తన్నిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తిరుపతి అన్నమయ్య కూడలిలో గల సదరు కళాశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు ఆర్.ఐ.ఓతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న అనంతరం ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు బాధ్యుడైన అధ్యాపకుడిపైనా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు.