ganta srinivas rao
-
మాజీ మంత్రి గంటా కుమారుడు రవి తేజ అధికార దర్పం
-
గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
-
పొలిటికల్ బిడారీ.. ఈసారెటు పరారీ
అప్పట్లో బిడారులు ఉండేవాళ్ళు..అంటే వాళ్లకు ఒక స్థిరనివాసం ఉండదు.. ఒక్కో ఊళ్ళో కొన్నేసి రోజులు ఉంటూ మళ్ళీ బతుకుదెరువుకోసం పయనం.. ఇంకో ఊళ్ళో కొన్నాళ్ళు నివాసం.. అలాగే రాజకీయాల్లో కూడా బిడారులు ఉంటారు.. అంటే ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో చోట పోటీ చేస్తారన్నమాట.. మళ్ళీ ఎన్నికల సమయానికి అక్కడ ఉండరు.. ఇంకో ఊరు చూసుకుంటారు. అదే కోవకు చెందినవారు సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాస్.. 2004లో టీడీపీతో కెరీర్ మొదలెట్టి చోడవరంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయన పాలసీ ప్రకారం నియోజకవర్గం మార్చేయాలి కాబట్టి. 2009లో ఏకంగా పార్టీని కూడా మార్చేసి ప్రజారాజ్యం తరఫున అనకాపల్లిలో గెలిచారు.. ఈసారి మళ్ళీ ఎన్నికలొచ్చాయి.. మళ్ళీ కొత్త నియోజకవర్గముతోబాటు కొత్త పార్టీ కావాలి కాబట్టి.. మళ్ళీ 2014లో భీమిలిలో టీడీపీ నుంచి గెలిచారు. ఇంకా 2019 లో మళ్ళీ ఎన్నికలొచ్చాయి... పార్టీ మార్చడం కుదరలేదు.. నియోజకవర్గం మార్చేశారు.. విశాఖ నార్త్ కు వచ్చి గెలిచారు.. మళ్ళీ 2024 ఎన్నికలు రాగా అయ్హన అక్కడా ఇక్కడా పోటీ చేసేందుకు ట్రై చేసినా చంద్రబాబు పడనివ్వలేదు..ఈసారి ఏకంగా జిల్లామారిపోయి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలనీ ఆదేశించారు. తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయినట్లు ఎక్కడా సీట్ లేదని పోయిపోయి బొత్స ఎదురుగా పోటీ చేయడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టుముందు తొడగొట్టడమే.. ఆ ముక్క గంటాకు తెలుసు.. అందుకే ఉహు.. నేను పోను అన్నారు. చీపురుపల్లి వస్తే ఏమవుతుందో గంటాకు తెలుసు.. ఇన్నాళ్లూ పార్టీలు నియోజకవర్గాలు మారుతూ గెలుస్తూ వస్తున్న తనకు చీపురుపల్లి వెళ్తే సీను సితార్ అని అర్థమైంది. అందుకే అబ్బబ్బే పోయినుగాక పోను అనేసారు.. పోకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకో.. భీమిలి టిక్కెట్ నెల్లిమర్ల ఇంచార్జ్ బంగార్రాజుకు కానీ ఇంకెవరికో అయినా ఇస్తాను.. మీరు వెళ్తే భీమిలి వెళ్ళండి లేదా రెస్ట్ తీసుకోండి అని చంద్రబాబు చెప్పేశారు. దీంతో ఈ పొలిటికల్ బీదవారికి సీట్ దక్కకుండా పోయింది. ప్రతి ఎన్నికకూ ఒక్కో పార్టీలో చేరడం.. ఒక ప్యాకేజి మాదిరి నాలుగైదు సీట్లు దక్కించుకుని తన మిత్రులతోకలిసి గెలవడం.. ప్రభుత్వాన్ని ఆడించడం రివాజుగా పెట్టుకున్న గంటాకు ఈసారి గంట పగిలిపోయినట్లయింది. పోనీ ఎక్కడా లేదు కదాని చీపురుపల్లి వస్తే ఇక్కడి జనాలు కొండచీపురుతో కొట్టడం ఖాయం.. దానికితోడు చీపురుపల్లిలో నాలుగు మండలాల్లో సగం జనాన్ని పెట్టి పిలిచే చనువు.. విస్తృత పరిచయాలు ఉన్న బొత్స మీద పోటీ అంటే మాటలు కాదు.. వేరే జిల్లానుంచి ఇంపోర్ట్ అయిపోయి నేరుగా డబ్బులు విసిరేసి ఎన్నికలు చేద్దాం అంటే ఇక్కడ కుదరదు. అయన వస్తే ఓటర్లు సంగతి అటుంచి ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు సైతం వ్యతిరేకంగా పనిచేస్తారు. తోటి కాపు వాడు అనే సంగతి సైతం మరిచిపోయి ఎక్కణ్ణుంచో వచ్చి ఇక్కడెలా పెత్తనం చేస్తావు అంటూ నెత్తి వాచిపోయేలా గంట వాయిస్తారు.. స్థానికుడు టీడీపీ తరఫున పోటీ చేస్తే అదో లెక్క.. తప్పదు కాబట్టి పార్టీ కోసం పని చేస్తారు కానీ వేరే జిల్లాల నుంచి వచ్చేసి నేను కాపు.. నేను టీడీపీ కాబట్టి మీరంతా నన్ను గెలిపించండి అంటే కుదరదు.. ఆ విషయం గంటాకు తెలుసు.. అందుకే ఒళ్లనోరి మామా నేనొల్లను.. చీపురుపల్లి పోనే పోను అని మొరాయించారు.. ఈసారి గంటా విషయంలో చంద్రబాబు కూడా గట్టిగానే ఉన్నారు.. చెప్పాను కదా.. వెళ్తే చీపురుపల్లి వెళ్ళు.. లేదంటే మానెయ్.. అది నీ ఇష్టం.. మీటింగ్ ఓవర్.. నువ్విక వెళ్లొచ్చని తేల్చేసారు... దీంతో ఇప్పుడు ఈ రాజకీయ బిడారికి సీటు కరువైంది. ///సిమ్మాదిరప్పన్న/// -
జనసేన టికెట్ పై గంటా పోటీ ?
-
టీడీపీకి రాజీనామా ?..గంటా దారెటో
-
గంటాకు బాబు బిగ్ షాక్
-
గంటా రాజీనామా ఆమోదం స్పీకర్ నిర్ణయం
-
గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటో?
ప్రతీ ఎన్నికలోనూ పార్టీనీ నియోజక వర్గాన్నీ మారుస్తూ పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈ సారి మారడానికి నియోజక వర్గం దొరకడం లేదు. ఉన్న నియోజక వర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న గంటా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజక వర్గానికే బదలీ అవుదామని అనుకుంటోన్నా అక్కడి టిడిపి-జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వనే ఇవ్వద్దని తెగేసి చెబుతున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడు అయిన విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజక వర్గం దొరికేలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజక వర్గాలను సామాజిక సమీకరణలకోసం మారిస్తే.. ఎమ్మెల్యేలను కూడా బదలీ చేస్తారట అంటూ డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతీ ఎన్నికలోనూ కొత్త నియోజక వర్గానికి బదలీ అయ్యే గంటా శ్రీనివాసరావు గుర్తుకు రాలేదు కాబోలు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటి సారి టిడిపి తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. అయిదేళ్ల కాలంలో నియోజక వర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా చోడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్ల పాటు నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈ సారి చోడ వరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతే కాదు టిడిపి లోనే ఉంటే డిపాజిట్లు రావని గమనించారు. అంతే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్లు పాటు నియోజక వర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెందింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ పార్టీ మార్చి టిడిపిలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి తాను చేసిందేమీ లేకపోవడంతో గెలిచే అవకాశాలు శూన్యమని తెలుసుకున్నారు. అంతే మరోసారి తన నియోజక వర్గాన్ని భీమిలికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ అయిదేళ్లు పూర్తయ్యింది. భీమిలిలోనూ గంటా పనితీరుగురించి మాట్లాడుకోడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టిడిపిలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజక వర్గం మార్చారు. భీమిలి నుండి విశాఖ నార్త్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చాయన్న ఆరోపణల నేపథ్యంలో వివాదస్సద విజయాన్ని మూటకట్టుకున్నారు. అయదేళ్లు కాలిమీద కాలేసుకుని కాలక్షేపం చేశారేతప్ప నియోజక వర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ^నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈ సారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే అది అంత వీజీగా కనపడ్డం లేదు. భీమిలిలో టిడిపి నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్ లు ఇద్దరూ కూడా గంటాకు భీమిలి నుండి టికెట్ ఇవ్వద్దని నారా లోకేష్ చెవులు రెండూ కొరికేస్తున్నారట. ఒక వేళ గంటాకే టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజక వర్గమే కనపడ్డం లేదని పార్టీలో గుస గుసలు వినపడుతున్నాయి. భీమిలి నియోజక వర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. మరి నియోజక వర్గంతో పాటు పార్టీకూడా మార్చే అలవాటున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి ట్రాన్స్ పర్ అయ్యి భీమిలి టికెట్ కొనుక్కుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలంగా భీమిలిలో జనసేన కోసం పనిచేస్తోన్న పంచకర్ల సందీప్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే జనసేనకు గుడ్ బై చెప్పి గంటాను ఓడించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి గంటా ఏం చేస్తారనేది చూడాలి. చదవండి: ఏపీ బీజేపీకి కొత్త టెన్షన్.. డ్యామేజ్ తప్పదా? -
గురువుకా... రాజ గురువుకా పరీక్ష?
తప్పు.. తప్పు కాకుండా పోయేదెప్పుడు? నేరం చేసినవారిపై కేసులు పెట్టడమే నేరమయ్యేదెప్పుడు? అక్రమాలను అడ్డుకోవటమే పాపమయ్యేదెప్పుడు? ఈ ప్రశ్నలకు ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు మాత్రమే ఠక్కున జవాబివ్వగలరు. అది... ‘చంద్రబాబు అధికారంలో లేనప్పుడు’ అని! ‘గురువులకే పరీక్ష’ అంటూ బుధవారం ‘ఈనాడు’ పతాక శీర్షికతో అచ్చేసిన కథనం ఇలాంటిదే మరి. దొంగతనం చేసిన వ్యక్తి తానెలాంటి పరిస్థితుల్లో ఆ దొంగతనం చేశాడో చెబితే కరిగిపోవటానికి ఇదేమైనా సినిమానా రామోజీ? కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే... కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోతారని తెలియదా? విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికేగా పరీక్షలు? లక్షన్నర మంది ఉపాధ్యాయుల్లో ఓ 10 మంది చేసిన తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు రావటం లేదా? తప్పు జరిగినపుడు దాన్ని తప్పు అని చెప్పకపోతే ఎలా? వారు అలా చేయటం కరెక్టేనన్నట్టు ఆ రాతలేంటి? అధికారంలో ఉన్నది చంద్రబాబు కాకుంటే ఎంత తప్పయినా ఒప్పయిపోతుందా?‘ఈనాడు’ దారుణమైన కథనాల్లో నిజమెంత? ఏది నిజం? ఐదేళ్ల కిందట... 2017లో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. నారాయణ విద్యాసంస్థల అధిపతికి స్వయానా వియ్యంకుడు. నారాయణ కూడా... మరో మంత్రి. అప్పట్లో టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఓ రేంజిలో జరిగింది. ‘నారాయణ’ సిబ్బంది కొందరు పేపర్లు లీక్ చేయటమే కాక... రోజూ తమ బ్రాంచీలకు జవాబులు పంపి మాస్ కాపీయింగ్‌కు తెగబడ్డారు. దీన్ని నాటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత సీఎం వై.ఎస్.జగన్ ఆధారాలతో సహా అసెంబ్లీలో పెట్టారు. గంటా, నారాయణ, చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెప్పారు. వీళ్లందరి భాష్యమూ ఒక్కటే!! పేపర్లు బయటికొచ్చాయి కానీ.. అది లీక్ కాదు!. కాపీయింగ్ జరిగింది కానీ.. మాస్ కాపీయింగ్ కాదు. జస్ట్ మాల్‌ప్రాక్టీస్. బస్! ఎవ్వరిపైనా కేసుల్లేవు. అంతా గప్‌చుప్!!. అందుకే... ‘ఈనాడు’ దృష్టిలో ఇది స్వర్ణయుగం. ఇప్పుడలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్‌కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ఏకంగా 60 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీరిలో నారాయణ స్కూళ్లకు చెందిన సూత్రధారులూ ఉన్నారు. 38 మంది ప్రభుత్వ అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉన్నారు. 2017లో 10వ తరగతి ప్రశ్నాపత్నాల లీజేజీలు, నారాయణ సిబ్బంది ప్రమేయాన్ని బయటపెట్టిన రుజువులివే.. ఆలోచనకు సంబంధించిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే వారెవరైనా ఇలాంటి చర్యల్ని అభినందిస్తారు. రామోజీ రూటే సెపరేటు!! మంచి ఫలితాల కోసం ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది కనకే వారిలా చేస్తున్నారని, అలాంటి అధ్యాపకులపై కేసులు పెట్టడమేంటని ‘ఈనాడు’ ఆక్రందనలు మొదలెట్టింది. రామోజీరావు గారూ!! ఇది ఏ స్థాయి జర్నలిజం? ఫలితాలు బాగుండాలనటం ఒత్తిడా? ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యేలా చక్కని ప్రమాణాలతో విద్యా బోధన సాగాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. దాదాపు లక్షన్నర మంది టీచర్లలో ఓ పిడికెడు మందికి మాత్రం అది ఒత్తిడి చేయటంలా కనిపించింది. వారు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించటంతో... వారికి జై కొడుతూ ‘ఈనాడు’ వారి వెనకన చేరిపోయింది. నిజానికి రామోజీ ఉద్దేశం వేరు. నారాయణ లాంటి స్కూళ్లు అక్రమాలకు పాల్పడకపోతే టెన్త్‌లో మంచి ఫలితాలు రావు. దీంతో వాటి పేరు దెబ్బతిని... అడ్మిషన్లు తగ్గి మొదటికే మోసం వస్తుంది. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితి కనక... వాళ్లను వెనకేసుకు రావటం మొదలెట్టారు. బాబు మిత్రులైన కార్పొరేట్ స్కూళ్లకోసం మరీ ఇంతలా దిగజారాలా? దానికి ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల్ని అడ్డం పెట్టుకోవాలా? విద్యావిప్లవం కనిపించటం లేదా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దటం మొదలెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాడు–నేడు అంటూ స్కూళ్ల రూపు రేఖలు మార్చారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలతో విద్యను అందరికీ చేరువ చేశారు. ఫలితం... కొన్ని ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. 6 లక్షలమంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు సర్కారీ స్కూళ్లకు వచ్చారు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషు మీడియం తెచ్చారు. విద్యార్థులకు మెరుగ్గా బోధించే బాధ్యత టీచర్లదే కనక... దానికి కొలమానంగా ఫలితాలుండాలని నిర్దేశించారు. ఇది తప్పా రామోజీ? అరకొర వసతులు, చాలీచాలనీ జీతాలిచ్చే ప్రైవేటు స్కూళ్లే తమ విద్యార్థులు సరైన మార్కులు తెచ్చుకోకుంటే టీచర్లను బాధ్యులను చేస్తాయి. మరి వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి... అన్నింటా మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం... పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆశించడం నేరమా? అది ప్రభుత్వ బాధ్యత కాదా? ‘ఈనాడు’కెందుకు ఇంత ఉలుకు? ఇది ఉపాధ్యాయుల్ని ఒత్తిడి చేయటమెలా అవుతుంది? ఎందుకీ వక్రభాష్యాలు? మంచి మార్కులు రావాలంటే మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ తప్పనిసరి అన్నట్టుగా ఏంటీ రాతలు? నాడు బాబు హయాంలో నిజంగా జరిగినా నోరుమెదపని ఈనాడు... ఇపుడు ఉన్నవీ లేనివీ పోగేసి ‘గురు’వింద రాతలు.. నారాయణ... నారాయణ ఈ సారి టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డదెవరో తెలియదా రామోజీ? తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తొలిరోజే నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు అక్రమాలకు టెంకాయ కొట్టేశారు. తిరుపతి నారాయణ వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్ రెడ్డి చిత్తూరులో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రలోభపెట్టి వాట్సాప్ ద్వారా పేపరు తెప్పించుకున్నాడు. దాన్ని నారాయణ, మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థల అధికారులు, సిబ్బందికి ఫార్వర్డ్ చేశాడు. కానీ ఈ కుట్రను పోలీసులు రట్టు చేయటంతో కథ అడ్డం తిగింది. గిరిధర్‌తో పాటు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆరీఫ్, డీన్ కె.మోహన్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడెమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్, శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పి.సురేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్‌కుమార్, బి. సోములను అరెస్టు చేశారు. ఇదే... ఈనాడు ఆగ్రహానికి అసలు కారణం మరి!!. టీడీపీ... మరో అడుగు ముందుకు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఏ స్థాయికైనా దిగజారాలన్నది టీడీపీ ‘వ్యూహం’. గతంలో రాష్ట్రం డ్రగ్స్ మయమైపోయిందని... గంజాయి పెరిగిపోయిందని చేసిన ప్రచారాలు ఈ కోవలోనివే. ఇటీవల తెలుగుదేశం తమ్ముళ్లు అత్యాచారాలకు తెగబడితే... చినబాబు లోకేశ్ వాటిని ప్రభుత్వానికి అంటగడుతూ ఎగిరెగిరి పడటమూ ఇలాంటిదే. ఇక టెన్త్ విషయంలో ఈ దుష్టచతుష్టయం మరో అడుగు ముందుకేసింది. శ్రీకాకుళం జిల్లా రొట్టవలస, కొత్తపేట జెడ్పీ హైస్కూళ్లలో హిందీ ప్రశ్నాపతాన్ని టీడీపీ నేతలే లీక్ చేసి వాట్సాప్‌లో వైరల్ చేశారు. పోలీసులు నిగ్గు తేల్చి ఏడుగురు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు కూడా. లీక్ వెనుక ఏబీఎన్–ఆంధ్రజ్యోతి సిబ్బంది పాత్ర కూడా ఉందంటే కుట్ర లోతును అర్థం చేసుకోవచ్చు. లీకేజీ వార్తల్ని ఆ చానలే పదే పదే ప్రసారం చేసింది. కళ్లముందున్న వాస్తవాలక్కూడా ఇన్ని రంగులేస్తున్న ఎల్లో మీడియా ఇంకెన్నాళ్లు జనాన్ని నమ్మించగలుగుతుంది? మీ అబద్ధాల్ని జనం ద్వేషిస్తున్నారని తెలియదా? వింటున్నారా రామోజీ!! -
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్ శనివారం లేఖ రాశారు. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు. ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా
తగరపువలస/కొమ్మాది(భీవిులి): విశాఖ జిల్లా మంగమారిపేటలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గోకార్టింగ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్‌పై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అధికారులు కొరడా ఝుళిపించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ డి.రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం గోకార్టింగ్ సెంటర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జేసీబీతో గోడలు, హట్లు, కంటైనర్ రెస్టారెంట్లను నేలమట్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడైన కాశీవిశ్వనాథ్, అతని కుటుంబ సభ్యులు మెస్సర్స్ కాశీ ఎంటర్ప్రైజెస్ అండ్ రిసార్ట్స్ పేరుతో 2014లో కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 299/1, 302/1సీ, 302/5సీలో ఉన్న 5.05 ఎకరాల్లో గోకారి్టంగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందుకు అప్పట్లో కె.నగరపాలెం పంచాయతీ అనుమతి తీసుకున్నారు. ఇక్కడ కార్ రేసింగ్, స్పోర్ట్స్ క్లబ్, రెస్టారెంట్ తదితరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 0.44 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించారు. అయితే భీమిలి మండలంలోని ఐదు తీరప్రాంత పంచాయతీల్లో ఒకటైన కె.నగరపాలెం జీవీఎంసీలో విలీనమయ్యింది. గోకార్టింగ్ సెంటర్‌ను నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినందున విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్వాహకులకు ఏడాది కాలంలో 2సార్లు నోటీసులిచ్చారు. అయినా వారి నుంచి స్పందన రాలేదు. మరోవైపు ఇక్కడ జూదానికి సంబంధించిన కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు ప్రభుత్వ భూమి ఆక్రమణ, సరైన అనుమతులు లేకపోవడం వల్ల చట్టప్రకారం నిర్మాణాలు తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సాగర తీరంలోని నిర్మాణాలకు అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ అవి లేకపోయినా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్‌ను స్వాధీనం చేసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు
-
‘వారిద్దరూ రాజకీయ వ్యాపారులు’
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యాపారులని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదని, హ్యాండ్ కర్ఛీఫ్ మార్చినట్లు.. పార్టీ మార్చే వ్యక్తి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని ఎద్దేవా చేశారు. రెండు నెలల పాటు తెలంగాణలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏం ఘన కార్యం చేశారంటూ మంత్రి అవంతి మండిపడ్డారు. (‘కూన’ కోసం గాలింపు) అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలు తగ్గిస్తే బ్రాండ్లు అమ్మడం లేదంటూ ఆయన రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయం కోసం జనానికి చంద్రబాబు మందు పోయించారని విమర్శించారు. కేరళకు మించిన అక్షరాస్యత కోసం అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేను గెలిపించకపోయినా విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (వెంకన్న సాక్షిగా.. పాపాలన్నీ బాబువే) -
గంటా శ్రీనివాస్ రావుకు షాక్
-
మాజీ మంత్రి ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: బ్యాంకు రుణం ఎగవేత వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంక్ ఈవేలం పద్దతిలో ఆస్తులను వేలం వేయనుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటాకు చెందిన ప్లాట్ ఉంది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా, గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.141.68 కోట్ల లోన్ తీసుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.220.66 కోట్లకు రుణం చేరింది. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటాతో పాటు ప్రత్యూష కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను కూడా ఇండిన్ బ్యాంక్ వేలానికి సిద్ధం చేసింది./ -
రాజధానికి విశాఖ అన్ని విధాల అనువైన నగరం
-
గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ఫ్రై లిమిటెడ్ పేరు మీద ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేశారని అధికారులు చెబుతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో డిసెంబర్ 20న ఆయన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం రుణ బకాయిలు రూ.200 కోట్లు కాగా తనాఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మిగతా బకాయిల కోసం గంటా వ్యక్తిగత ఆస్తిని వేలం వేసే అధికారం తమకు ఉందని ఇండియన్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్‌ను వేలం వేయనున్నట్లు సమాచారం. గంటా ఆస్తుల వేలం పాటు అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని గంటాపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ భూములను తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. -
బాబుతో భేటీకి 10 మంది డుమ్మా
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి ఝలక్ ఇచ్చారు. విజయవాడలో ఇసుక దీక్షకు గైర్హాజరై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి సైతం డుమ్మా కొట్టారు. చంద్రబాబుతో సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గమనార్హం. తాను నిర్వహించిన ఇసుక దీక్షకు ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఆందోళన చెందిన చంద్రబాబు వెంటనే శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇది ముఖ్యమైన సమావేశమని, అధినేత కీలక అంశాలపై మాట్లాడతారని, తప్పనిసరిగా రావాలని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ముఖ్య నేతలు ఒకటికి రెండుసార్లు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినా పది మంది గైర్హాజరయ్యారు. దీక్షకు బలవంతంగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా వేదికపై ఉండకపోవటంతో చంద్రబాబు కంగు తిన్నట్లు నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో సగం మందికిపైగా ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉండడంతో టీడీపీలో అన్ని స్థాయిల్లో గందరగోళం కనిపిస్తోంది. చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, పీజీవీఆర్ నాయుడు (గణబాబు), అనగాని సత్యప్రసాద్, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, బెందాళం అశోక్, వల్లభనేని వంశీ హాజరు కాలేదు. గన్నవరం ఎమ్మెల్యే వంశీని సస్పెండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించి షోకాజ్ నోటీసు ఇచ్చారు. వంశీ గతంలోనే టీడీపీకి రాజీనామా చేసినా సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు నేతలు చెబుతున్నారు. -
‘ఆయన పోలింగ్ ఏజెంట్లనే కొనేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: పోల్ మేనేజ్మెంట్లో మంత్రి గంటా శ్రీనివాసరావు నెంబర్‌వన్ అని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓటును రూ.10వేలకు కొంటున్నారని గంటా స్నేహితులే తనతో చెపుతున్నట్లు ఆయన ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి ఇక్కడ పోటీస్తున్నారని, గంటా శ్రీనివాసరావు విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని విమర్శించారు. బూత్ కమిటీల్లో అన్ని రాజకీయల పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీని ఓడిండమే తన లక్ష్యమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి గంటా శ్రీనివాసరావు దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. అవినీతికి మరోరూపం గంటా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గంటా గరం గరం
సాక్షి, విశాఖపట్నం: సీట్ల పంపిణీలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన సహచరుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తొలుత భీమిలి టికెట్ ఆశించారు. దానికి టీడీపీ అధిష్టానం నిరాకరించింది. తాను భీమిలి నుంచే బరిలోకి దిగుతానని గంటా స్పష్టంచేయగా, తొలుత పార్టీ అధిష్టానం విముఖత చూపింది. గంటా అలకబూనడంతో ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా గంటా ఇంటికి వెళ్లి మరీ ‘పార్టీ అదిష్టానం మాటగా చెబుతున్నా..నీకే భీమిలి సీటు’ అంటూ భరోసా ఇచ్చారు. అయితే అనూహ్యంగా తన కుమారుడు లోకేష్ ను పార్టీ అధినేత చంద్రబాబు తెరపైకి తీసుకు రావడం, ముందుగానే ఓ పథకం ప్రకారం ఓ పత్రికలో ప్రముఖంగా ప్రచురిం చడంపై గంటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటా అనుచరగణమే కాదు మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం భీమిలి నుంచి లోకేష్‌ను బరిలోకి దింపడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాగా అమరావతిలో జరిగిన సమన్వయ కమిటీ భేటీల్లో అధినేతచంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను భీమిలి నుంచి బరిలోకిదింపుతున్నట్టుగా తెగేసి చెప్పడంతో గంటాకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరం, గాజువాక, చోడవరంలలో ఏదో ఒకనియోజకవర్గాన్ని ఎంచు కోవాలని సూచించడంతో గంటా తీవ్రఅసంతృప్తి వ్చక్తంచేసినట్టుగా తెలిసింది. పార్టీ అను చరులు, నేతలు ఫోన్లు చేస్తుంటే వారిపై కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్ర బాబు తనను మోసగించాడని, తన కుమారుడి కోసం తన సీటును త్యాగం చేయమంటున్నాడంటూ అసహనం వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. అధినేత ఒంటెద్దు పోకడల పట్ల గంటా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. -
అమాత్య గణం అక్రమాల్లో ఘనం
భుకబ్జాలు, రికార్డుల తారుమారు, ఫోర్జరీలు, సర్కారీ భూముల తనఖా.. ఇలా భూ బాగోతాలతో విశాఖ నగర శివారులోని ఆ ప్రాంతం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. విశాఖలో భూములకు పెరిగిన డిమాండ్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు సొమ్ము చేసుకునే క్రమంలో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. అదే భీమిలి నియోజకవర్గం. అక్కడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి కూడా కావడాన్ని ఆసరా చేసుకొని ఆయన బంధువులు కొందరు, అనుచరులు, టీడీపీ నియోజకవర్గ నేతలు భూకబ్జాల పర్వానికి తెరతీశారు. ఆయన పేరుతో దందాలు సాగిస్తూ.. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సొంతం చేసుకున్నారు. చివరికి ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో ఈ నియోజకవర్గంలో సాగిన టీడీపీ నేతల అక్రమాల పర్వంపై ప్రత్యేక కథనం.. ప్రకాశం జిల్లా నుంచి వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చి స్థిరపడ్డారు గంటా శ్రీనివాసరావు. ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఎండీగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా అదే పార్టీ తరఫున గెలిచారు.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి 2014లో భీమునిపట్నం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా ఇతర నాయకుల్లా స్థిరంగా ఒక నియోజకవర్గం నుంచి కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ మరో స్థానానికి మారుతుంటారని గంటాకు పేరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన గంటా.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టారు. 2014లో టీడీపీ నుంచి ఎన్నికయ్యాక రెండోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్నారు. భాస్కరుడి ‘భూ’గోతాలు.. గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు ఆగడాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆయన గురించిన తెలిసిన వారు చెబుతారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామంలో 122–11లో 726 చదరపు గజాల భూమి, సర్వే నెం.122–8,9,10,11,12,13,14,15లలో 4.33 ఎకరాలు, సర్వే నెం.124–1,2,3,4 లలో 0.271 ఎకరాలు భాస్కరరావు కుదువ పెట్టిన వాటిలో ఉన్నాయి. వీటిలో సర్వే నెం.122/9ని పరిశీలిస్తే.. ఇందులో మొత్తం 59 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసమే ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకునే సమయానికి ముందు ఇక్కడ కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే పరుచూరి భాస్కరరావు పేరిట ఉంది. సర్వే నంబర్ 122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమిని ఎన్‌హెచ్ విస్తరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. ఇక్కడ భాస్కరరావు పేరిట ఒక్క గజం కూడా లేదు. ♦ సర్వే నెం. 122–11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమిలో 60 సెంట్లు కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్టుగా రికార్డుల్లో ఉంది. ఈ 60 సెంట్లలో బలహీన వర్గాల కాలనీ ఉంది. మిగిలిన ఆరు సెంట్లు కూడా ప్రభుత్వ మిగులు భూమిగానే చూపిస్తున్నారు. ♦ సర్వే నంబర్..122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి మాత్రమే ఉండగా.. కొంత ప్రభుత్వ భూమి, ఇంకొంత ప్రైవేటు వ్యక్తులది. భాస్కరరావుకు చెందిన 8 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉంది. కానీ ఇక్కడ 1.04 ఎకరాల భూమిని కూడా తనదిగానే బ్యాంకులో కుదువపెట్టాడు. భీమిలిలో అడుగు పెట్టాక.. గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక ఆయన అనుచరగణం ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి వందల కోట్ల రుణాలు పొందారు. ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో విఫలమైన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ, డైరెక్టర్ల ఆస్తులతో పాటు హామీదారుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూకుంభకోణాలతోఉక్కిరిబిక్కిరి.. ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విశాఖ భూకుంభకోణంలోనూ మంత్రి గంటాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోనే అవకతవకలు జరగడం వీటికి బలం చేకూర్చాయి. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే రూ.2,200 కోట్ల విలువైన భూముల కుంభకోణం జరిగినట్టు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇదీబ్యాంకు రుణంకథ.. విశాఖపట్నం వన్‌టౌన్ లక్ష్మీ టాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా సమీప బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావులున్నారు. ఈ కంపెనీకి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్ని అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబాగార్డెన్స్ శారదావీధిలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.141,68,07,584 రుణాలు తీసుకుంది. రుణం పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. 13–12–2016 నాటికి వడ్డీతో కలిపి రూ.196 కోట్ల 51 లక్షల 717 బకాయిగా ఇండియన్ బ్యాంకు తేల్చింది. దీనిపై బ్యాంకు డిమాండ్ నోటీసులు జారీ చేసినా రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనం మొదలు పెట్టింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్ల ఆస్తులతో పాటుగా హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరుల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నామని బ్యాంక్ స్వాధీనత ప్రకటన జారీ చేసింది. విశాఖ, గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడలలోని ప్రత్యూష కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. భీమిలి పరిసరాల్లో .. విశాఖ నగర శివారులో ఆర్థిక నగరాల నిర్మాణానికి అసైన్డ్, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరిస్తామని గతంలో వుడా ప్రకటించింది. గంటా వర్గీయులు ఎక్కడెక్కడ వుడా భూములు సేకరిస్తుందో తెలుసుకుని నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, (అసైన్డ్) డీ పట్టా భూములను ముందుగానే గుప్పిట్లో పెట్టుకున్నారు. డీ పట్టా భూములకు ఎకరాకు రూ.12 లక్షల వరకు, ఆక్రమణలో ఉన్న భూములకు ఎకరా రూ.3 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ. 2 లక్షలు చెల్లించి క్రయపత్రాలు రాయించుకున్నారు. ఖాళీ పేపర్ల పై సంతకాలు తీసుకుని తమ వద్దనే ఉంచుకున్నారు. తర్వాత మంత్రి తన పరపతి ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రకటన చేయించారన్న ప్రచారం జరిగింది. గంటా అనుచరులు రంగంలోకి దిగి ఆ భూములను సేకరించాల్సిందిగా రైతులతో వుడాకు దరఖాస్తు చేయించారు. ఇలా 358.47 ఎకరాల్లో బినామీలు పాగా వేయగలిగారు. ఇంతలో రూ.600 కోట్ల విలువైన ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో వుడా ఈ ల్యాండ్ పూలింగ్‌కు బ్రేకులు వేసింది. మంత్రి అల్లుడిపై కూడా దాదాపు రూ.100 విలువ చేసే భూములు వ్యవహారంలో ప్రమేయముందని ప్రచారంలో ఉంది. సాక్షి కథనంతో ఈ వ్యవహారానికి బ్రేక్ పడింది. -
మంత్రి కోసం ఐదు గంటల నిరీక్షణ
శ్రీకాకుళం: రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు రాక కోసం కింతలి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఐదు గంటలు ఆకలితో నిరీక్షించాల్సి వచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు మంత్రి వస్తారని శనివారం పాఠశాల హెచ్ఎంకి సమాచారం అందింది. పాఠశాల ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేబినెట్ సమావేశం ఉండడంతో శనివారం మంత్రి రావడం లేదని ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో హెచ్ఎంకు అధికారులు సమాచారం అందించారు. ఆదివారం 10 గంటలకు మంత్రి వస్తారని చెప్పడంతో సైకిళ్లు తీసుకోవాల్సిన విద్యార్థినులతోపాటు అందరు విద్యార్థులు పాఠశాలకు రావాలని హెచ్ఎం తెలియజేశారు. వారితోపాటు తల్లిదండ్రులను కూడా రప్పించారు. ఉదయం 9 గంటల సరికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. 10 గంటలకు రావాల్సిన మంత్రి మధ్యాహ్నం 2.15 గంటలకు రావడంతో అప్పటివరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. కొందరు స్థానికంగా ఉన్న తమ ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వస్తామని చెప్పినా ఉపాధ్యాయులు దీనికి నిరాకరించారు. మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన గుడ్లును ఉడకబెట్టి అప్పటికప్పుడు విద్యార్థులకు పంపిణీ చేశారు. మంత్రి తీరిగ్గా 2.15 గంటలకు వచ్చి 3.15 గంటల వరకు సైకిళ్లు పంపిణీ చేసి ఉపన్యాసం చేశారు. అప్పటిదాకా ఆకలితో ఉండాల్సి వచ్చింది. వేచి ఉన్న పత్రికా విలేకర్లు.. మంత్రి శ్రీకాకుళం నగరానికి వస్తున్నారని, అరసవల్లి జంక్షన్లో ఉన్న ఓ ప్రైవేటు అతిథి గృహంలో పత్రికా విలేకరుల సమావేశం ఉందని సమాచారం విలేకరులకు అందింది. 12 గంటలకు సమావేశమని చెప్పడంతో ఆ సమయానికి విలేకరులంతా అక్కడికి చేరుకున్నారు. మంత్రి గంటా మధ్యాహ్నం 2 గంటలకు నగరానికి రాగా విలేకరులతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విప్ రవికుమార్ వచ్చి మంత్రిని పక్కకు తీసుకెళ్లి ఏదో మాట్లాడారు. దీంతో మంత్రి కింతలిలో ఓ కార్యక్రమం ఉందని, అది పూర్తయిన తర్వాత వచ్చి విలేకర్లతో మాట్లాడతానన్నారు. మంత్రి 3.30 గంటలకు నగరానికి చేరుకొని పత్రికా విలేకరుల సమావేశం జరగాల్సిన అతిథి గృహానికి వచ్చి నేరుగా భోజనానికి వెళ్లారు. తర్వాత విలేకరులతో మాట్లాడతారని అందరూ భావించగా భోజనం చేసిన వెంటనే విశాఖపట్నం వెళ్లిపోయారు. అధికారులు, పత్రికా ప్రతినిధులు నిర్ఘాంతపోయారు. -
నీదంతా నీచ రాజకీయం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విలువలు, విశ్వసనీయత గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు విమర్శించారు. కేవలం విలువల కోసం పార్టీ మారిన తనను విమర్శించే స్థాయి, అర్హత మంత్రి గంటాకు లేదని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ‘అవంతి’ శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా శనివారం విశాఖ చేరుకున్న అవంతి విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. నమ్మిన నాయకులను, నమ్మిన పార్టీలను నట్టేట ముంచి రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే మంత్రి గంటాకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ‘గత ఎన్నికలకు ముందు భీమిలి టికెట్ ఇప్పిస్తానని చెప్పి టీడీపీలోకి తీసుకెళ్లి చివరికి నన్ను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించి.. ఆ టికెట్ కాజేసిన నీచ రాజకీయం నీది.. నీ సహచర మంత్రి అయ్యన్నపాత్రుడే నీ మీద సిట్ విచారణ వేయాలని లెటర్ రాశాడంటేనే నీ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. లోకేష్.. గంటాతో జాగ్రత్తగా ఉండు.. ఎప్పటికైనా మీ నాన్న కుర్చీకి ఎసరు పెడతాడు..’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను తిడితే చాలు.. టీడీపీలో పెద్ద పీట ‘ఏ ముఖ్యమంత్రి అయినా ఉదయమే ఫోన్ చేసి రాష్ట్ర అభివృద్ధి గురించో.. సంక్షేమ పథకాల గురించో మాట్లాడతారు.. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను తిట్టండని చెప్పే వాడని’ అవంతి చెప్పారు. ప్రజాసంకల్పయాత్రకు ముందు జగన్మోహన్రెడ్డి వేరని, ప్రజాసంకల్పయాత్రలో ప్రతి కార్యకర్త పేరు పిలిచి వారి సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడని కొనియాడారు. ఇప్పుడు కూడా తాను ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలన్నారంటే.. అది విలువలతో కూడిన రాజకీయమని.. వైఎస్ జగన్మోహన్రెడ్డికే అది సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. భారీ ర్యాలీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన అవంతి ఎయిర్‌పోర్టు నుంచి పెద్ద ఎత్తున కార్లు, బైకులతో భారీ ర్యాలీగా భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న సింహాచలం చేరుకున్నారు. కొండదిగువ తొలిపావంచా వద్దనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భీమిలి వెళ్లారు. -
కొత్త గురువులొస్తున్నారు..
కడప ఎడ్యుకేషన్ : ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన డీఎస్సీ ఫలితాలు ఎట్టకేలకు విడదలయ్యాయి.. రాష్ట్రంలోనే అతి తక్కువ పోస్టులున్న మన జిల్లాలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీపడ్డారు. పోస్టులు తక్కువ.. అభ్యర్థులు ఎక్కువ. ఇంత క్లిష్టపరిస్థితుల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు కొన్ని సబ్జెక్టుల్లో రాష్ట్రంలోనే ప్రథములుగా నిలిచారు. గ్రామీణ అభ్యర్థులు జిల్లాస్థాయిలో సత్తాచాటి ర్యాంకులు సాధించారు. తద్వారా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలను కైవసం చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తాచాటారు. జిల్లా నుంచి నలుగురు రాష్ట్రస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు. జిల్లావ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 24 నుంచి 28 వరకు తొలి విడత డీఎస్సీ పరీక్ష ఆన్లైన్లో జరిగిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 148 పోస్టులకు 7739 మంది పరీక్షలు రాశారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ నాన్‌లాంగ్వేజ్, లాంగ్వేజ్, పిజీటీ, టీజీటీ, పీఈటీ, ప్రిన్సిపాల్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులకు ఆన్లైన్లో పరీక్షలు జరిగాయి. రెండవ విడతలో ఎస్జీటీలకు జనవరి 18 నుంచి 31 వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. రెండో విడత డీఎస్సీకి కడప, పొద్దుటూరు, రాజంపేటలలోని 8 కేంద్రాలలో పరీక్షను నిర్వహించారు. ఇందులో 78 పోస్టులకు 15, 278 మంది పరీక్షలను రాశారు. రెండు విడతలు కలుపుకుని 226 పోస్టులకు 23,017 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. డీఎస్సీ పరీక్షల్లో వైఎస్సార్‌జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఉర్దూ విభాగంలో స్కూల్‌అసిస్టెంట్ సోషల్‌లో షేక్సుల్తానా 65.69 శాతం, ఎస్జీటీలో షేక్ హర్షద్‌బాషా 82.53 శాతం మార్కులను సాధించారు. పీజీటీ తెలుగులో కదిరి బాలాజీ 70.50 శాతం, íపీజీటీ బోటనీలో షేక్ నూర్ మహమ్మద్ 69.50 శాతం మార్కులు పొందారు. ఎస్జీటీలో మహమ్మద్ 83.4 శాతంతో ప్రథమ. లక్ష్మి ప్రసన్న 81.7 శాతం మార్కులతో రెండోర్యాంకు, సాయిలక్ష్మి 80.6 శాతం మార్కులతో మూడో ర్యాంకు పొందింది. çస్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీస్‌లో కలకత్తా గౌస్‌పీర్ 81.8 శాతం, మునగా యశ్వంత్ 78.3 శాతం,తిరుపతి శ్రీనివాస్ 77.9 మార్కులు పొందారు. జిల్లాలో 226 పోస్టులకు పోస్టుల వివరాలు ఇలా.. ఎల్పీ తెలుగు–2, ఎల్పీ హిందీ–1, మ్యూజిక్ – 5, పిఈటీ తెలుగు– 13. ఎస్ఏ తెలుగు మీడియంకు సంబంధించి : స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్–5, స్కూల్ అసిస్టెంట్ తెలుగు – 24, స్కూల్ అసిస్టెంట్ హిందీ – 14, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–7, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 6, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ–12, స్కూల్ అసిస్టెంట్ సోషియల్ స్టడీస్–21, తెలుగు మీడియం ఎస్జీటీ – 34 ఎల్పీ ఉర్దూ మీడియంకు సంబంధించి : లాంగ్వేజ్ పండింట్ – 4, పీఈటీ– 8, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ –2, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–4, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 4, స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీ– 3, ఉర్దూ మీడియం ఎస్జీటీ – 18 మున్సిపాలిటీలకు సంబంధించి : లాంగ్వేజ్ పండిట్(తెలుగు)–1, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–2, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు–1,స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీస్– 2, స్కూల్‌అసిస్టెంట్ ఇంగ్లిష్–1, స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం–1, ఎస్జీటీ – 26; ఉర్దూ మీడియంకు సంబంధించి.. ఎల్పీ ఉర్దూ –1, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ –1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 1, స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీ– 2 మెరిసిన గాలివీడు ఆణిముత్యం గాలివీడు : మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన అర్షద్ బాషా డీఎస్పీ ఏస్టీజీ ఉర్దూ విభాగంలో అత్త్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇతడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అరవీడు కస్బాలో ఉంటున్న అన్వర్‌బాష, ఆయేషా దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. తాజా డీఎస్పీ ఫలితాల్లో రెండో కుమారుడైన బాషా స్టేట్ ఫ్టస్ ర్యాంక్సాధించడం పట్ల కుటంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా రాణించేవాడు. పదవ తరగతి కడప ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. టీటీసీ ప్రవేశపరీక్షలో కూడా స్టేట్ఫస్ట్గా నిలిచాడు. తాజాగా డీఎస్పీ ఫలితాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ సాధించాడు. సరస్వతీ ప్రసన్నురాలు పెనగలూరు: డీఎస్సీ ఫలితాల్లో ఎస్జీటీలో పెనగలూరుకు చెందిన పాళెంపల్లె రెడ్డిలక్ష్మీ ప్రసన్న జిల్లాస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె తల్లి సర్వసతీ అంగన్వాడీ కార్యకర్త, తండ్రి నరసింహులు శెట్టి పోస్టల్ ఏజెంటుగా ఉంటున్నారు. వీరి ఏకైక పుత్రిక లకీŠ?ష్మప్రసన్న 10వ తరగతిలో 558 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్లో 971 మార్కులు సాధించింది. రాయచోటిలో శిక్షణలో కూడా టాప్‌ర్యాంకర్‌గా నిలిచింది. కేంద్రీయ విధ్యాలయ సెంట్రల్స్కూల్లో పని చేయాలనేది తన కోరిక అని అందుకుకూడా అర్హత సాధించినట్లు లక్ష్మీ ప్రసన్న తెలిపింది. తెలంగాణలో నాన్‌లోకల్ కింద డీఎస్సీలో ఎస్జీటీలో 5వ ర్యాంకు సాధించిందీమె. -
ఏపీడీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి, రాజమండ్రి: ఏపీడీఎస్సీ మెరిట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమండ్రిలో డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 85 శాతం మంది పరీక్షలకు హజరయ్యారని వెల్లడించారు. పరీక్షలు నిర్వహించిన 110 రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఎంపికైన టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూన్ 12న టీచర్లు విధుల్లో చేరుతారని వెల్లడించారు. -
భైరవా... నీ మార్గానికి మోక్షమెప్పుడు?
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): భైరవస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది. అలాగే సింహాచలం దేవస్థానానికి ఆదాయం కూడా పెద్ద ఎత్తున చేకూరుతోంది. ఇక్కడ పూజాసామగ్రి విక్రయానికి దేవస్థానం నిర్వహించే బహిరంగ వేలం పాటకు కూడా లక్షల్లో డిమాండ్ ఏర్పడింది. కానీ ఆలయానికి చేరుకునే మార్గానికే ఏళ్ల తరబడి మోక్షం లభించడం లేదు. అలాగే ఆలయం వద్ద భక్తులకు సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రోడ్డు వచ్చి తమ బాధలు ఎప్పుడు తీరతాయా అని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే ఆలయం వద్ద సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. వివరాలికి వేళ్తే.... సింహాచలం నుంచి శొంఠ్యాం వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో భైరవవాక ఉంది. అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అటవీ మార్గంలో పయనిస్తే భైరవస్వామి ఆలయం వస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహాచలం వచ్చే భక్తుల్లో చాలా మంది భైరవస్వామిని దర్శించుకునేందుకు భైరవవాకు వెళ్తుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లోను, భైరవుడి పుట్టిన రోజైన భైరవాష్టమిరోజుల్లోను, నెల నెలా వచ్చే అష్టమిరోజుల్లోను, ప్రతి శని, ఆదివారాల్లోనూ భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. స్వామికి అభిషేకాలు నిర్వహించి, విభూదిని భక్తులు సమర్పిస్తారు. అమృతకలశలను అందజేస్తారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న భైరవస్వామి ఆలయానికి చేరుకునే మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం భక్తులు నరకం చూస్తున్నారు. మార్గమంతా రాళ్లు తేలిన రోడ్డే ఉంటుంది. పెద్ద పెద్ద గోతులతో దర్శనమిస్తుంది. ఇక వర్షం వస్తే గోతుల్లో పెద్దె ఎత్తున నీరు నిలుస్తుంది. ఏళ్ల తరబడి భక్తులు ఈ దీనావస్థలో ఉన్న మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే అమావాస్య రోజుల్లో ఈ మార్గమంతా తీవ్ర రద్దీ నెలకుంటోంది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి ట్రాఫిక్ స్తంభిస్తోంది. అటవీశాఖ ఆధీనంలో ఆలయానికి వెళ్లే మార్గం–దేవస్థానం ఆధీనంలో ఆలయం భైరవస్వామి ఆలయానికి మార్గం వేయాలంటే ఒక ముఖ్య సమస్య నెలకుంది. ఆలయానికి చేరుకునే రెండున్నర కిలోమీటర్లు ఉన్న మార్గం అటవీశాఖ ఆధీనంలో ఉండగా, ఆలయం మాత్రం సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉంది. సింహాచలం దేవస్థానం మార్గాన్ని వైడల్పు చేసి రోడ్డు వేసేందుకు పలుమార్లు పూనుకున్నా అటవీశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇప్పటికే పలుమార్లు అటవీశాఖ, దేవస్థానానికి మధ్య రోడ్డు మార్గం ఏర్పాటుపై పరిశీలనలు కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ సమస్య తీరలేదు. ఆలయం వద్ద సౌకర్యాలు నిల్ ఇక ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించడంలో కూడా దేవస్థానం అశ్రద్ధ వహిస్తోంది. కనీసం భక్తులు తాగడానికి మంచినీరుకూ కూడా నోచుకోవడం లేదు. అలాగే విశ్రాంతి తీసుకునేందుకు షెల్టర్లులేవు. ఇక్కడ ఉన్న బోరు పనిచేయకపోగా, నుయ్యి ఎండిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయమేస్తోంది నేను ప్రతి అమావాస్యకు భైరవస్వామి ఆలయానికి వస్తుంటాను. వచ్చినప్పుడల్లా నడిచే వెళ్తుంటాను. రోడ్డు మార్గంలో ఉన్న రాళ్లను చూస్తే నడవడానికి భయవేస్తోంది. అలాగే రాళ్లు తేలిన రోడ్డుపై చిన్నారులను ఎత్తుకుని నడిచే పలువురి భక్తులు పడే బాధ కూడా కలచివేస్తోంది. ఇప్పటికైనా మార్గాన్ని వెడల్పు చేసి రోడ్డు వేయాలి.–కె.సత్యనారాయణ, వేపగుంట మంత్రి గంటా హామీ మాటలకే పరిమితం భైరవస్వామి ఆలయానికి రోడ్డుమార్గం వేయడానికి కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు హామీలు కురిపించారు తప్ప ఆ తర్వాత పట్టించుకోలేదు. పలుమార్లు గంటా శ్రీనివాసరావు భైరవస్వామి దర్శనానికి వచ్చారు. అప్పట్లో పలువురు భక్తులు, స్థానికులు రోడ్డు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని హామీలు ఇచ్చారు తప్ప ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోలేదు. -
ప్రభుత్వ అధికారులతో మంత్రిల బంతాట!
-
సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి
వైవీయూ: సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని ప్రగతిపథంలో నడవాలని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జ్ఞానభేరిలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 25వేల కోట్లను విద్యకు కేటాయిస్తోందన్నారు. విలువలతో కూడిన విద్య అందించాలన్నారు. విద్యారంగంలో 17వ స్థానంలో ఉన్న మనరాష్ట్రం నేడు 3వ స్థానంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక ఐడియా మీ జీవితాలనే మారుస్తుందని.. సరికొత్త ఆలోచనగా అమరావతిలో ల్యాండ్‌పూలింగ్ విధానం విజయవంతమైందన్నారు. ప్రణాళికాబద్ధంగా హార్డ్‌వర్క్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చలనం ఉన్న ఏదీ ఆగిపోకూడదని.. లక్ష్యం చేరేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కర్బారీ, డాక్టర్ అశ్వంత్‌లు మాట్లాడుతూ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు శ్రమించాలని.. జీవితంలో సాధించలేనిది లేదన్నారు. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలే తప్ప నేలచూపులు తగవన్నారు. మాటలు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని.. వినడం కూడా ఒక కళ అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎస్. విజయరాజు, కార్యదర్శి వరదరాజన్‌లు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని.. ఆకాశమే హద్దుగా నవ ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. జ్ఞానభేరి కార్యక్రమానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను జ్ఞానభేరి యాప్‌ద్వారా తెలియజేయాలన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. వర్లు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మనందరం మారాలని సూచించారు. నిద్రానంగా ఉన్న శక్తులను మేల్కొలిపి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. అవధాని గరికపాటి నరసింహారావు, సినీ నేపథ్యగాయకుడు గంగాధరశాస్త్రిలు మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞానం అందించిన గొప్ప పుణ్యభూమి భారతదేశమన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, చదువు, సంస్కారం, సమాజహితం, మానవ జీవనంలో భగవద్గీత ప్రాధాన్యత, లక్ష్యాల గురించి సుదీర్ఘంగా వివరించారు. వైవీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల వయసు గల విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి దాదాపు 80వేల మంది విద్యార్థులను జ్ఞానభేరిలో భాగస్వాములను చేశామన్నారు. ఉన్నత విద్యామండలి ప్రతినిధి వెంకట్ ఈదర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే ప్రభుత్వం రూ.లక్షలాది రూపాయలు సబ్సిడీ ఇస్తూ చదివించేందుకు సరికొత్త పథకం తెస్తోందన్నారు. ఇందులో భాగంగా టెక్సాస్ యూనివర్సిటీ వారితో ఒప్పందం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. చంద్రయ్య స్వాగతోపన్యాసం చేయగా.. వైవీయూ అధ్యాపకులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, వినోదినిలు తమ సంభాషణలతో సభికులను అలరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులు, వైవీయూ పాలకమండలి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలిస్తానని మోసం చేస్తావా?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘జాబు కావాలంటే బాబు రావాల’ని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే భిక్షమేసినట్లు ఏడు వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మోసం చేశారని, వారికి వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం వారు వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతకుముందు నగరంలోని శకుంతల కల్యాణ మండపం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. డీఎస్సీ పోస్టులను పెంచాలని, సిలబస్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, గంటాకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మద్దతు ప్రకటించి.. వారితో పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఏడు వేల పోస్టులను నోటిఫికేషన్లో చూపించి అందులోనూ వెయ్యి పోస్టులను కుదించడం అన్యాయమన్నారు. ఏటా డీఎస్సీని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం..నాలుగున్నరేళ్లుగా మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. ప్రస్తుత డీఎస్సీలో కొన్ని విభాగాల్లో పోస్టులే లేవని, అలాంటప్పుడు ఏళ్లుగా వాటి కోసమే చదువుతున్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక అభ్యర్థితో రెండు పరీక్షలకు డబ్బు కట్టించుకున్న ప్రభుత్వం..పరీక్ష మాత్రం ఒక్కదానినే రాయాలని పేర్కొనడం దారుణమన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మోసం చేసిన ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థులు బుద్ధి చెప్పాలని బీవై రామయ్య పిలుపునిచ్చారు. 22 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యి.. ప్రతి పోస్టు భర్తీకి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ కోసం ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే ఏడు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. ఇది కూడా ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. నిరుద్యోగ భృతి కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి డీఎస్సీ పోస్టులను పెంచాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఆసిఫ్, కృష్ణకాంత్‌రెడ్డి, రవిబాబు, జగన్నాథరెడ్డి, వై.రాజశేఖరరెడ్డి, ధనుంజయాచారి, భాస్కరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో!
సాక్షి, అమరావతి: ఉద్యోగ క్రమబద్ధీకరణపై కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చెయ్యలేమని, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంది. సుమారు 40 వేల మంది ఆశలకు మంగళం పాడింది. గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎన్ఎండీ ఫరూక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు సమస్యల కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ఉపసంఘం తేల్చిచెప్పింది. 2014 నుంచి పలు దఫాలుగా, వివిధ రకాల హామీలిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు వారికి రిక్తహస్తం చూపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వడమే కాకుండా, మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఈ విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తుందని ఊహించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. కొద్దిమందికే లబ్ధి విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు మాత్రమే వర్తించేలా మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుంది. మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపునకు, ఇప్పటివరకూ 10 నెలల వేతనం మాత్రమే ఇస్తుండగా, ఇకపై 12 నెలలకు ఇవ్వడానికి అంగీకరించారు. ఇకపై డీఏ లేకుండా సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) వర్తింప చేస్తామన్నారు. దీనివల్ల 3,800 మందికి లబ్ధి జరుగుతుంది. ఈ నిర్ణయాల వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ. 38 కోట్ల భారం పడుతుందని ఉపసంఘం సభ్యులు చెప్పారు. వివిధ శాఖలలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని యనమల పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇదే మాట చెబుతూ వచ్చి, ఇప్పుడు కూడా కొద్ది మందికే లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకోవడం దారుణమని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను మోసం చేసిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామని పేర్కొన్నారు. ఆరు సంస్థలకు భూ కేటాయింపులు రాజధాని అమరావతి పరిధిలో మరో ఆరు సంస్థలకు భూములు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు నారాయణ, గంటా, నక్కా ఆనందబాబుతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. సవిత విశ్వవిద్యాయానికి 40 ఎకరాలు చొప్పున రెండు విడతలగా మొత్తం 80 ఎకరాలు, అంతర్జాతీయ క్రికెట్ అకాడెమీకి 10.2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు, ఏపీపీఎస్సీకి 1.5 ఎకరాలు, ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్‌కు ఒక ఎకరం, యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్‌కు 2.65 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఆందోళనలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్ధం కాంట్రాక్టు ఉద్యోగులను సర్కారు దగా చేసిందని పబ్లిక్‌హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు జి.ఆస్కారరావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. దీనిపై కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులందరూ అండగా నిలవాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక జీవోలు జారీచేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన విషయం ఈ సర్కారుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జీవో నెం.119 ఇచ్చి వందలాది మంది కాంట్రాక్టు డాక్టర్లను, స్టాఫ్ నర్సులను గరిష్టంగా 45 మార్కులు వెయిటేజీ ఇచ్చి రెగ్యులరైజ్ చేశారన్నారు. జీవో నెం.1246 ద్వారా 2469 మంది ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. జీవో నెం.625 ద్వారా ఆరోగ్యశాఖలో ఉన్న 711 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని అన్నారు. ప్రస్తుత సర్కార్ నిర్ణయంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఉద్యోగులందరూ దీనికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మంత్రుల నిర్ణయం శోకం మిగిల్చిందని వైద్యవిధానపరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ విమర్శించారు. చట్టాన్ని సవరించైనా క్రమబద్ధీకరణ చేసే అవకాశమున్నప్పుడు ఆ పని ఎందుకు చెయ్యట్లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. -
తమాషాగా ఉందా.. అంతా మీ ఇష్టమేనా..?
‘నాకు చెప్పకుండానే ఉత్సవాలు చేసేస్తారా?.. అంతా మీ ఇష్టమేనా??.. నాకు కన్పించొద్దు.. సెలవు పెట్టి వెళ్లిపోండి’.. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిపై మంత్రి గంటావారి హూంకరింపులివి..ఉత్త పుణ్యానికే.. ఇంటికి పిలిపించి మరీ ఒంటికాలిపై లేచిన అమాత్యుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కార్యదర్శి ఉదయకుమార్ దీర్ఘకాల సెలవుపై వెళ్లిపోయారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 15న.. గ్రంథాలయ వారోత్సవాల రెండోరోజే చోటుచేసుకుంది. ప్రతి ఏటా జరిగే రీతిలోనే గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించడమే ఆయన చేసిన తప్పట!..కొద్ది నెలల క్రితమే ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇదేరీతిలో ఇంటికి పిలిపించిమరీ వాయించేసిన మంత్రి.. ఆనక ఆత్మీయ సమావేశం పేరుతో రెవెన్యూ అధికారులతో భేటీ అయిచల్లబర్చారు.మళ్లీ ఇప్పుడు గ్రంథాలయ కార్యదర్శిపై విరుచుకుపడటం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆయనపై మంత్రి అలా విరుచుకపడటానికి వేరే కారణముందన్న వాదన కూడా వినిపిస్తోంది. గంటాకు చెందిన ప్రత్యూష సంస్థకు గ్రంథాలయ సంస్థ స్థలం కేటాయింపు వివాదంలో కార్యదర్శి ఉదయకుమార్ గ్రంథాలయ సంస్థకు అనుకూలంగా నివేదిక ఇవ్వడమే.. ఆయన రుసరుసల వెనుక ఆంతర్యమని అంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు.. పైకి సౌమ్యంగానే కన్పిస్తారు. నవ్వుతూనే అందర్నీ పలకరిస్తుంటారు. కానీ తనకు అనుకూలంగా పని చేయకపోతే మాత్రం గంటకొట్టి మరీ వా యించేస్తారు. నిన్నగాక మొన్న ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకు ని నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఆనక నాలుక కరుచుకుని కాళ్లబేరానికి వెళ్లారు. ఆత్మీ య సదస్సు పెట్టి అందర్ని ప్రాధేయపడ్డారు. ఈ ఘటన ఇంకా మరువకముందే మరో ఘటన చో టు చేసుకుంది. ఈసారి తన మంత్రిత్వశాఖ అధీ నంలో ఉండే జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి పై నిప్పులు చెరిగారు. గంటా ఆగ్రహానికి గురైన సదరు అధికారి గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న వేళ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అండగా నిలవాల్సిన సహచర అధికారులు, ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయారు. తమాషాగా ఉందా? ‘ఏం తమాషాగా ఉందా? నీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తావా? మంత్రిని.. నేను జిల్లాలో ఉండగా.. ఒక్క మాటైనా చెప్పక్కర్లేదా?అంతా మీ ఇష్టమేనా? నువ్వు నా ఎదుట కన్పించకు.. ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు. సెలవుపై వెళ్లిపో’అం టూ విద్యా శాఖకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పువ్వాడ ఉదయకుమార్‌పై మం త్రి గంటా నిప్పులు చెరగడం చర్చనీయాంశమైం ది. గంటాకు ఎదురుచెప్పలేక ఆ కార్యదర్శి ఈ నెల 15వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో పర్యక్షించాల్సిన సెలవు పెట్టేయడంతో వారోత్సవాల వైభవం కనిపించలేదు. అసలేం జరిగింది? ఏటా నవంబర్ 14నుంచి 20వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. తొలిరోజు జాతీయ పతాకావిష్కరణతో పాటు వారం రోజు ల పాటు వివిధ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు.ఈ ఏడాది అదే తరహా ఏర్పాట్లు చేశారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి మంత్రిగారికి కోపమొచ్చింది. ‘అత్తెరి నాకు చెప్పకుండా ఉత్సవాలా? అంటూ ఒంటికాలిమీద లేచారు. పీఏతో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. సెలవుపై వెళ్లిపో..నాకు కనిపించకు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పీఏతోనే డైరెక్టర్‌కు ఫోన్ చేసి ఉదయ్‌ను సెలవుపై పంపించాలంటూ హుకుం జారీ చేయించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఉదయ్ మొరపెట్టుకున్నా వారంతా మిన్నకుండిపోయారు. కన్నెత్తి చూడని గంటా.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కూడా గంటా మంత్రిగా కొనసాగారు. ఆ రెండు ప్రభుత్వాల్లోనూ ఒకే శాఖకు ప్రాతినిధ్యం వహిం చారు. గడిచిన పదేళ్లుగా విద్యాశాఖకు ప్రాతి నిధ్యం వహిస్తున్నా ఏనాడైనా గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్నారా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. జిల్లా స్థాయి కా దు..రాష్ట్రస్థాయి వారోత్సవాల్లో కూడా పాల్గొన్న దాఖలాల్లేవు. కానీ ఇప్పుడెందుకిలా జరిగింది..ఆ అధికారినే లక్ష్యంగా చేసుకుని ఎందుకు నిప్పులు చెరిగారో ఆ శాఖ అధికారులు, సిబ్బం దికి కూడా అంతుచిక్కడం లేదని ఓ సీనియర్ లైబ్రేరియన్ ‘సాక్షి’ వద్ద వాపోయారు. పోనీ సదరు కార్యదర్శి ఏమైనా వివాదాస్పద అధికా రా? అంటే అదీ లేదు. నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. స్థల వివాదమే కారణమా? మంత్రి ఆగ్రహం వెనుక మరొక కోణం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష కంపెనీకి గతంలో గ్రంథాలయ స్థలాన్ని కేటాయించారు. ప్రజాసంఘాలు గగ్గోలు పెట్టడంతో ఆ లీజు రద్దయింది. ఆ వ్యవహారం వివాదస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. కమిటీ కూడా గ్రంథాలయ సంస్థకు అనుకూలంగానే నివేదికిచ్చింది. ఆ వ్యవహారంలో తాను చెప్పినట్టు వ్యవహరించలేదన్న అక్కసుతోనే గంటా ఇలా మండిపడ్డారన్న వాదన తెరపైకి వచ్చింది. మంత్రికి వ్యతిరేకంగా నివేదిక తయారీ కావడంలో కార్యదర్శి పాత్ర కూడా ఉన్నట్టు వెలుగులోకి రావడంతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఈ నెల 28న గ్రంథాలయాల అసెంబ్లీ కమిటీ జిల్లాకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఎటువైపునకు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో కార్యదర్శి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం ఆ శాఖలో ప్రకంపనలకు దారితీస్తోంది. -
ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మొదటి సంవత్సరం, ఫిబ్రవరి 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహించనుంది. జనవరి 28న హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, 30న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్, ఫిబ్రవరి ఒకటి నుండి 20వ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. -
రేపే డీఎస్సీ నోటిఫికేషన్ : గంటా
సాక్షి, అమరావతి : చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ రేపే(శుక్రవారం) వెలువడనుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లుగా అనేక సాంకేతిక కారణాల నోటిఫికేషన్ ఆలస్యమైందని పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా టెట్ కమ్ టీఆర్టీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు కేటగిరీల్లో మొత్తం 7,675 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 2 వరకు వివిధ కేటగిరీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వివరాలు : నోటిఫికేషన్ విడుదల అక్టోబరు 26 ఆన్లైన్ అప్లికేషన్ల గడువు : నవంబరు 1 నుంచి 16 సెంటర్ల ఆప్షన్ల ఎంపిక : నవంబరు 19 నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ : నవంబరు 29 నుంచి స్కూలు అసిస్టెంట్స్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్ష : డిసెంబరు 6 స్కూలు అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) : డిసెంబరు 11 పీజీ టీచర్స్ పరీక్ష : డిసెంబరు 12,13 వయెపరిమితి పెంపు : ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకు, జనరల్ కేటగిరీ 44 ఏళ్లు పోస్టుల్లో కోత పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతంలో 10 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలన్నీ తుంగలో తొక్కింది. 20 వేలకు పైగా టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోకుండా మరోసారి ఆశావహులను నిరాశకు గురిచేసింది. -
గెలిచే నియోజకవర్గం ఏదీ!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై పలువురు మంత్రులు ఊగిసలాడుతున్నారు. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయని పలువురు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు తమపై వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని సురక్షిత స్థానాల కోసం పావులు కదుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రివర్గంలో ముఖ్యులుగా ఉన్న వారు పోటీ చేసే స్థానాలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. రాజధాని వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో చిత్తూరు జిల్లా తిరుపతి స్థానంపై దృష్టి పెట్టినా చివరికి నెల్లూరు సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి గత ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా తెరవెనుక మంత్రాంగం నడిపి టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రి అయిన నాటి నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. లోకేష్‌కు సురక్షిత స్థానం కోసం అన్వేషణ విమర్శల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ ఇటీవలే ప్రకటించారు. దొడ్డిదారిన మంత్రివర్గంలో చేరారని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదని ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన సులువుగా గెలిచే నియోజకవర్గం కోసం అన్వేషిస్తున్నారు. మొదట్లో కృష్ణా జిల్లా పెనమలూరును పరిశీలించినా అక్కడ అంత ఈజీ కాదని తేలడంతో విరమించుకున్నారు. తన మామ, సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అయితే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినా, కుటుంబంలో ఇబ్బంది వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీకాదు సొంత జిల్లా చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తే బాగుంటుందని, అదీ చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. చంద్రగిరిపైనా వారి దృష్టి కనిపిస్తోంది. అయితే చివర్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఆలోచనే విరమించుకునే అవకాశం కూడా లేకపోలేదు. పక్కచూపులు చూస్తున్న దేవినేని ఉమ కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి మైలవరాన్ని వదిలివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉండి చక్రం తిప్పినా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన చూపు నూజివీడుపై పడినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు మైలవరం నుంచి గెలిచిన నేపథ్యంలో ఈసారి ప్రజలు మార్పు కోరుకునే పరిస్థితులున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. మంత్రయ్యాక ఆయన తీరు మారిపోయిందని సొంత క్యాడరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మైలవరంలో తాను హ్యాట్రిక్ కొడతానని పైకి చెబుతున్నా లోలోపల మాత్రం ప్రత్యామ్నాయ సీటు కోసం చూస్తున్నారు. అయితే దేవినేని ఉమ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది. డోలాయమానంలో గంటా విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాను భీమిలిని వదిలేది లేదని ప్రకటించినా చివర్లోనైనా నియెజకవర్గం మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన టీడీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రులు అచ్చెంనాయుడు, ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీట్లకు గ్యారంటీ కనిపించడంలేదు. అచ్చెంనాయుడు, ఆది, పుల్లారావులను ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. సీటు డౌటే ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్థానానికి గ్యారంటీ కనిపించడంలేదు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆ సీటును దక్కించుకోవడం కష్టమేనని చెబుతున్నారు. ఆ సీటు కోసం రాజప్ప ప్రత్యర్థి బొడ్డు భాస్కరరామారావు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం, అది ఆయన సొంత నియోజకవర్గం కావడంతో రాజప్ప సీటు గల్లంతేనని ప్రచారం జరుగుతోంది. ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పార్టీ అధినేత సీటు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. -
శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..మంత్రి గంటా విడుదల చేసిన శ్వేత ప్రతం అంతా తప్పుల తడక అని విమర్శించారు. అది శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం అని దుయ్యబట్టారు. అందులో ఉన్నదంతా బూతేనని మండిపడ్డారు. పెట్రోలియం విశ్వవిద్యాలం కోసం సబ్బవరం భూవివాదాన్ని పరిష్కరించలేని చేతగాని మంత్రి గంటా శ్రీనివాసరావని ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాసంస్థలపై మాట్లాడే హక్కు గంటాకు లేదన్నారు. ఐఐఎంకు సంబంధించి ప్రారంభోత్సవంలో హడావుడిగా బోర్డు తగిలించి ప్రభుత్వానికి చూపించేశారని విమర్శించారు. అక్కడ కరెంటు, వాటర్ ఇవ్వకుండా నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో 33 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు..అందులో 70 శాతం గంటా వియ్యంకుడు పి. నారాయణకు చెందిన నారాయణ కాలేజీల్లోనే జరిగాయని..దీనికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. కేంద్ర విద్యాసంస్థలపై విడుదల చేసిన శ్వేతపత్రం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. -
భూ కుంభకోణాలపై సిబిఐ విచారణకు సిద్ధమా?
-
'జేసీబీలు తగలబెడతానంటే జనం నమ్మరు'
సాక్షి, విశాఖపట్నం : దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్తుల కోసం పొట్లాడుకుంటున్నారని వైస్సార్సీపీ ఆనకాపల్లి సమన్వయ కర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలం ప్రత్యుషా కంపెనీకి కేటాయించినప్పుడు అయ్యన్న ఏం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జేసీబీలు తగల బెడతానంటే జనం నమ్ముతారా అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నర్సీపట్నం ప్రజల దృష్జి మరల్చేందుకే అయ్యన్న డ్రామాలు చేస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు. -
స్కూల్ విజిట్‌లో మంత్రి గంటాకు ఊహించని షాక్!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఊహించని షాక్ తగిలింది. ఓ విద్యార్థిని తల్లి నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చురకలు అంటించడంతో ఆయన బిత్తర పోయారు. వివరాలు.. భీమిలిలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్‌ను మంత్రి గంటా శనివారం సందర్శించారు. ఇటీవల చోటుచేసుకున్న కలుషితాహార ఘటనపై స్కూల్ యాజమాన్యంతో ఆయన మాట్లాడుతుండగా.. కాలం చెల్లిన పప్పుల ప్యాకెట్‌ను మంత్రి ముందు ఉంచిన ఓ విద్యార్థిని తల్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘చూడండి సార్, మంచి పప్పులు పందికొక్కులు తింటున్నాయ్. ఇలాంటి కాలం చెల్లిన పప్పులను పిల్లలకు పెడుతున్నార’ని ఆమె కడిగిపారేశారు. ఈ పప్పులు తింటే పిల్లలు రేపటి పౌరులు కాదు.. రోగులు అవుతారని వ్యాఖ్యానించారు. అనుకోని సంఘటనతో మంత్రి గంటా కంగుతిన్నారు. -
బూటు కాలితో తన్నిన ఘటన; మంత్రి సీరియస్
సాక్షి, తిరుపతి: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని బూటు కాలితో తన్నిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తిరుపతి అన్నమయ్య కూడలిలో గల సదరు కళాశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు ఆర్.ఐ.ఓతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న అనంతరం ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు బాధ్యుడైన అధ్యాపకుడిపైనా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. -
మీ పని మీరు చేసుకోండి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకుని తిట్టిన వ్యవహారంలో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు తహసీల్దార్‌కు బాసటగా నిలిచారు. అదే సందర్భంలో అసలేం జరిగిందో తెలుసుకుని అప్పుడే మంత్రిపై స్పందిస్తామని వ్యాఖ్యానించారు. తనకు మాటమాత్రం చెప్పకుండా మండలంలోని 18 ఎకరాల భూములను టిట్కోకు కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను దూషించిన వైనంపై ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైరాన్ని నింపింది. జిల్లావ్యాప్తంగా అధికారవర్గాలతో పాటు కలెక్టరేట్ వర్గాల్లో కలకలం రేపిన ఈ కథనంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజనలు స్పందించారు. తమను బుధవారం ఉదయం కలిసిన తహసీల్దార్ ఈశ్వరరావుతో మాట్లాడుతూ ‘మీ పని మీరు చూసుకోండి.. సెలవుపై వెళ్లొద్దు’.. అని భరోసా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపిస్తే ఒకటి, రెండు రోజులు క్యాజువల్ లీవ్ తీసుకోవాలని సూచించారు. అయితే రెవెన్యూ సంఘాల నేతలు మాత్రం లీవుపై వెళ్తే వేరే సంకేతాలు వస్తాయి.. అందువల్ల యధావిధిగా ఉద్యోగం చేసుకోనివ్వండి .. అని సూచించడంతో ఈశ్వరరావు బుధవారం మధ్యాహ్నం నుంచి యధావిధిగా ఆనందపురం వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. సహజంగా గంటా అలా అనరు: జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇచ్చిన అధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు.. అదే సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావును మాత్రం పల్లెత్తు మాట అనేందుకు సాహసించలేదు. సహజంగా మంత్రి అలా అనరు.. మరి ఈశ్వరరావును ఏ సందర్భంలో ఎందుకన్నారోనని జిల్లా కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇక ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ నాగేశ్వరరెడ్డి కూడా తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇస్తూనే మంత్రి గంటాను వెనకేసుకొచ్చారు. ఇంతవరకూ ఆయన అధికారులను తిట్టిన దాఖలాల్లేవు.. ఇది ఎందుకు జరిగిందో తెలియదు.. అందుకే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాం.. ఉద్యోగ సంఘాల నేతలందరూ వచ్చారు. సీరియస్‌గా చర్చించాం... మంత్రి గంటాతో, జిల్లా కలెక్టర్‌తో ముఖాముఖి చర్చలు జరిపాక నిర్ణయం తీసుకుంటామని నాగేశ్వరరెడ్డి బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అ«ధ్యక్షుడు ఈశ్వరరావు ఇదే విషయమై స్పందిస్తూ.. వాస్తవానికి గంటా అలా అనరు.. అలా అంటే ఖండిస్తాం... అని వ్యాఖ్యానించారు. -
సివిల్ ఇంజనీరింగ్ నూతన భవనం ప్రారంభం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి నూతనంగా నిర్మించిన అదనపు భవన సదుపాయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 2.38 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ భవనాలను తలపించే రీతిలో ఆధునికత ఉట్టేపడే విధంగా భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. బోధన విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను సబ్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో సుదీర్ఘ కాలం తరువాత నియామకాలు చేపట్టడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జగదీష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్ అవధాని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహనరావు, పాలక మండలి సభ్యుడు డాక్టర్ పి.సోమనాథరావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య జి.వి.ఆర్ శ్రీనివాస రావు, వజీర్ మహ్మద్, ఎం.జి మాధవబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీసెట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి: భాషా పండితుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్పీసెట్)కు నోటిఫికేషన్‌ను విడుదలైంది. జూలై 6 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్లో aplpcet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్లో అర్హత తదితర వివరాలు పొందుపరిచారు. ఆన్లైన్ మినహా మాన్యువల్‌గా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు. జూలై 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. జూలై 31న ఎల్పీసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 1న ఎల్పీసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఆగస్టు 9 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 13,14 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. -
గంటాపై చంద్రబాబుకు కందుకూరు ఎమ్మెల్యే ఫిర్యాదు
-
వర్సిటీ ఘటనపై మంత్రి ఫైర్
సాక్షి, అమరావతి: ఇటీవల రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై దాడికి యత్నించిన ఘటనపై స్పందించిన గంటా దాడికి యత్నించిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ఫ్రోపెసర్ రతనప్ప చౌదరిని సస్పండ్ చేయాలని యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీను ఆదేశించారు. ఘటనకు కారకులైన డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్ తిరుపతయ్యపై వేటు వేయాలన్నారు. తిరుపతయ్య కళాశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని రాయలసీమ వర్సిటీ వీసిని ఆదేశించారు. ఉన్నతాధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేదిలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. -
మంత్రిగారూ.. డిగ్రీ కళాశాల ఏదీ ?
నక్కపల్లి(పాయకరావుపేట) : పాయకరావుపేట నియోజకవర్గంలో గత విద్యా సంవత్సరంలోనే డిగ్రీకళాశాల ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇచ్చిన హమీ ఏమైందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ప్రశ్నించారు. ఏడాది ముగిసి రెండో ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా డిగ్రీ కళాశాలకు మోక్షం కలగలేదన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏడాది క్రితం ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విద్యా సంవత్సరంలోనే డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని, భవనాలు కూడా గుర్తించినట్టు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హమీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. నక్కపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, గొడిచర్లలో జూనియర్ కళాశాల, మత్య్స కారుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల, చినదొడ్డిగల్లులో అసంపూర్తిగా ఉన్న పీహెచ్‌సీని పూర్తిచేయడం, నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని 50 పడకల స్థాయి ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామని, పాయకరావుపేట పట్టణంలో మెయిన్‌రోడ్డును విస్తరిస్తామంటూ హమీలు గుప్పించారన్నారు. వీటిలో ఏఒక్కటీ నెరవేరలేదన్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీకళాశాల లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. రైన సదుపాయాలు లేక పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు కళాశాలల్లో వేలాది రూపాయలు వెచ్చించి డిగ్రీ చదవలేక చదువుకు మధ్యలో స్వస్తి పలుకుతున్నారన్నారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధిపనులు చేశామని ఉపన్యాసాలు ఇస్తున్న తెలుగు దేశం నాయకులు నెరవేరని ఈ హమీల గురించి ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు కావాల్సినవి ఇవేనన్నారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులతో రోడ్లు, పంచాయతీ భవనాలు, కాలువలు, అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని వాస్తవంగా ఈ నిధులు కేంద్రప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా సంబంధం లేదన్నారు. డిగ్రీకళాశాల ఏర్పాటు చేసేస్తున్నామంటూ విద్యార్థులను మోసం చేశారన్నారు. నాలుగేళ్ల నుంచి వేలాది మంది విద్యార్థులు డిగ్రీకళాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(మిడ్ డే మీల్స్) అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 ఇంటర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని గంటా వెల్లడించారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
10 నుంచి ఏపీ టెట్.. జులైలో డీఎస్సీ
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఈ నెల 10వ తేదీ నుంచి 19 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరుగుతాయని వెల్లడించారు. మొత్తం 3.97 లక్షల మంది టెట్ పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మొత్తం 113 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలలో ఉపాధ్యాయ నియామకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులకు జులై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25,26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అధిక నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. చెట్టు కింద తరగతుల నిర్వహణకు ఇకపై స్వస్తి పలుకుతామని అన్నారు. -
కరువు సీమకు కల్పతరువు..
సాక్షి, అనంతపురం : ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్శిటీ జిల్లాలో ప్రారంభం కానుంది. యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాశ్వత భవనాలను నిర్మించేంత వరకు తరగతులను తాత్కాలికంగా ఎస్కేయూ, జెఎన్‌టియూ క్యాంపస్‌లో నిర్వహిస్తామని తెలిపారు. గత విద్యాసంవత్సరం నుంచే సెంట్రల్ యూనివర్శిటీ తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తరగతుల నిర్వహణకు సరైన స్థలాన్ని గుర్తించాలని కమీషనర్ పాండాదాస్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా యూనివర్శిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యను అందిస్తున్న జెఎన్‌టియూ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుతో జిల్లాలో మూడు యూనివర్శిటీలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనున్నాయి. కురువు సీమను విద్యా సీమగా చూడాలన్నదే మా లక్ష్యమని మంత్రి తెలిపారు. -
ఇంటర్ సప్లిమెంటరీలో స్వల్పమార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. డీసెట్ పరీక్షల నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన జనరల్, ఒకేషనల్ పరీక్షలు వాయిదా వేసినట్టు తెలిపారు. ఆ పరీక్షలను 23, 24 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. అదే విధంగా 30 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 31న ఎన్విరాన్ మెంటల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇక 23 నుంచి 27 వరకు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 25 నుంచి 29కి వాయిదా వేసినట్టు గంటా తెలిపారు. విద్యార్ధులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జరిగిన మార్పులను గమనించాలని మంత్రి అన్నారు. -
ముస్లింలకు ‘దేశం’లో ఇంతేనా మర్యాద
‘వేదికపై బ్యానర్లో జిల్లాకు చెందిన ఒక్క మైనారిటీ నాయకుడి ఫొటో లేదు.. అసలు ఇది ముస్లింల ఆత్మీయ సదస్సేనా?!..తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఇచ్చే గౌరవం ఇంతేనా’.. ఇదీ మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రెహ్మాన్ ఆవేదన, ఆక్రోశం.అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు దీన్నేమాత్రం పట్టించుకోలేదు..నాకు అర్జంట్ పనుంది.. రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతాను.. అని ముందుకొచ్చారు.దానికి రెహ్మాన్ కుదరంటే కుదరదని స్పష్టీకరించారు.. మా ముస్లిం మైనారిటీ నేతలు మాట్లాడే వరకు ఉండలేరా.. మా బాధలు కూడా వినలేరా.. మీ ప్రసంగాల కోసమే మేం వచ్చామా?.. అని రుసరుసలాడారు.దీంతో అలిగిన గంటా సభలో మాట్లాడకుండానే వేదిక దిగి వెళ్లిపోయారు.శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో చోటుచేసుకున్న ఈ హాట్ హాట్ పరిణామాలు.. పార్టీలో మైనారిటీలకు లభిస్తున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాయని స్వయంగా ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీలో ముస్లిం మైనారిటీలకు ఏపాటి గౌరవం ఉందో తేటతెల్లమైంది. కేవలం ఆ వర్గం కోసం నిర్వహించిన సమావేశంలో కూడా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడంపై మైనారిటీలు మండిపడుతున్నారు. నగరంలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విశాఖ జిల్లా ముస్లిం మైనారిటీల సదస్సుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రెహ్మాన్, టీడీపీ విశాఖ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేశ్, పంచకర్ల రమేష్ హాజరయ్యారు. సదస్సు ఆ పార్టీలోని మైనారిటీ నేతల పట్ల వివక్షను బట్టబటయలు చేసింది. పార్టీలో ముస్లిం మైనారిటీలకు విలువే లేకుండా పోతుందని మొత్తుకున్నా పట్టించుకోకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు విసురుగా వెళ్లిపోవడం వివాదాస్పదమవుతోంది. ఇదీ పరిస్థితి తొలుత వాసుపల్లి, పంచకర్ల, చాంద్ బాషా మాట్లాడిన తర్వాత మంత్రి గంటా ప్రసంగించేందుకు ముందుకొచ్చారు. ఆ సమయంలో పక్కనే సభావేదికపైన ఉన్న రెహ్మాన్ లేచి... ఇది జిల్లా మైనారిటీల ఆత్మీయ సదస్సేనా... జిల్లా ముస్లిం నేత ఒక్కరు కూడా మాట్లాడకుండా మీరు మాట్లాడేసి వెళ్లిపోతే ఎలా.. అని గంటాను నిలదీశారు. ఇందుకు గంటా .. నాకు పనిఉంది.. రెండు నిమిషాలు మాట్లాడేసి వెళ్లిపోతాను అని చెప్పుకొచ్చారు. దీనిపై రెహ్మాన్ ఘాటుగా స్పందించారు. మొక్కుబడిగా మాట్లాడేందుకు ఎందు కు అని నిలదీస్తుండగా, వాసుపల్లి గణేష్ పరుగుపరుగున వచ్చి.సార్‌కు పని ఉంది.. ఆయన్ను మాట్లాడనివ్వండి.. అని రెహ్మాన్‌కు సూచించారు. దానికి ఆయన అంగీకరించలేదు. దీంతో అలిగిన గంటా అగ్రహంతో సభావేదిక దిగి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు..ఆ విషయాన్ని గంటా వద్ద ప్రస్తావించగా స్పందించకుండా వెళ్లిపోయారు. గంటా వెళ్లిన తర్వాత పార్టీ శ్రీకాకుళం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నహీబుల్లాఖాన్ మాట్లాడుతూ..జిల్లా ముస్లిం మైనారిటీ ఆత్మీయ సభావేదిక బ్యానర్‌పై జిల్లాలో ఉన్న ఒక్క ముస్లిం సోదరుడి ఫొటోనైనా వేశారా?..ఇదేనా టీడీపీలో ముస్లింలను గౌరవించుకోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీం తో అప్పటి వరకు కూర్చున్న జిల్లా రూరల్ అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు విసురుగా లేచి వెళ్లిపోయారు. ముస్లిం మైనారిటీలు తమ కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినందుకే మంత్రి గంటా, పంచకర్లలు ఏమాత్రం లెక్కలేకుండా విసురుగా వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో చర్చాంశనీయమైంది. టీడీపీలోనే ఎమ్మెల్యేగా, వుడా చైర్మన్‌గా పనిచేసి సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న రెహ్మాన్ ఆవేదనను కనీసం పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. -
ఏపీ టెన్త్ ఫలితాలు : బాలికలదే పైచేయి
-
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల..
సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్సైట్లలో ఫలితాలను చూడవచ్చు. మొత్తం హాజరైన విద్యార్థులు : 6,13,378 ఉత్తీర్ణత శాతం : 94448 మొదటి స్థానం : ప్రకాశం జిల్లా (97.93 శాతం ) చివరి స్థానం : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (80.37 శాతం) బాలుర ఉత్తీర్ణతా శాతం : 94.41 బాలికాల ఉత్తీర్ణతా శాతం : 94.56 వంద శాతం ఉత్తీర్ణత సాధించిని పాఠశాలలు : 5,340 సున్నా శాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలు : 17 ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం : 78.35 10జీపీ సాధించిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులు : 26,475 10జీపీ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు : 3745 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ టెన్త్ ఫలితాలు నేడే..
సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్సైట్లలో ఫలితాలను చూడవచ్చు. -
కేజీబీవీలో సౌకర్యాల లేమిపై మంత్రి గంటా ఆగ్రహం
రాప్తాడు: రాప్తాడు కేజీబీవీలో వసతులు సక్రమంగా కల్పించకపోవడంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వసతులు లోపాలను గుర్తించిన ఆయన.. పాఠశాలను నిర్వహించాల్సింది ఇలాగేనా? అంటూ జిల్లా అధికారులు, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం రాప్తాడులోని ధర్మవరం ఫంగల్ రోడ్డు సమీపంలో ఉన్న కేజీబీవీని మంత్రి గంటా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, శాసన మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, డీఐజీ ప్రభాకర్‌రావు ఉన్నారు. ముందుగా ఆయన స్థానిక ఏపీ మోడల్‌స్కూల్‌ను పరిశీలించారు. కేజీబీవీ విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని కేజీబీవీల్లో నీటి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి, డీఈవో జనర్ధానాచార్యులు, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, ఈఈ విజయ శేఖర్, ఏఎంవో జయచంద్రనాయుడు, సీఎం ఆనంద్‌బాబు, జీసీడీవో ఉషారాణి, ఎంపీడీఓ జల్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఏపీలో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..!
సాక్షి, విజయవాడ: ఈ నెల 29న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం విజయవాడలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డీఎస్సీ ఇప్పట్లో లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. డీఎస్సీ కంటే ముందు మరో టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జూన్ 18న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామన్నారు. మంత్రి తాజా ప్రకటనతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారికి ఈ ఏడాది కూడా నిరాశ మిగిలింది. -
డీసెట్ గడువు పెంపు
అమరావతి : డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీసెట్) గడువు ఈ నెల 24 వరకు పెంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజానికి డీసెట్ దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసిందని, కానీ విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీసెట్ పరీక్ష గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ డీసెట్‌కు అందిన దరఖాస్తులు 31,610. ఆన్లైన్లో ఈ నెల సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
అమీ.. తుమీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కొత్త పాలకవర్గ ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఇరువురు మంత్రులు అమీతుమీకి సిద్ధపడుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరుడైన గాడు వెంకటప్పడును డీఎల్‌డీఏ కొత్త చైర్మన్‌గా ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు పాతపాలకవర్గాన్ని కొనసాగించాలని తాను ఇచ్చిన సిఫారసు లేఖను పక్కన పెట్టి ఏవిధంగా ఎన్నికలు నిర్వహిస్తారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సిఫారసు లేఖ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికార యంత్రాంగంపై సీఎంవోతో పాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై తీవ్రస్వరంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు కలెక్టర్ ఆఘమేఘాల మీద ఆ ఎన్నికను నిలుపుదల చేశారు. మంత్రి లేఖ బయట పెట్టారన్న సాకుతో పశుసంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావు, డీఎల్‌డీఏ ఈవో సూర్యప్రకాష్‌లను సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కొత్త పాలకవర్గ ఎన్నిక కొలిక్కివచ్చే వరకు ఈవోతో పాటు చైర్మన్ బాధ్యతలను జేసీ–2 ఎ.సిరికి అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనల మేరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనా కొత్త చైర్మన్ గాడు వెంకటప్పడు బృందం న్యాయపోరాటానికి సిద్ధమైనప్పటికీ మంత్రి గంటాతో ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి విశాఖనగరానికి వచ్చిన గంటాతో వెంకటప్పడు బృందం బేటీ అయ్యేందుకు యత్నించినా మంత్రికున్న కార్యక్రమాల వల్ల వీలు పడలేదు. దీంతో శుక్రవారం ఉదయం మంత్రితో బేటీ అయి జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే తమ ఎన్నికలు నిర్వహించారని, అలాంటప్పుడు మా ఎన్నిక చెల్లదనడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.తమకు జరిగిన అన్యాయంపై చినరాజప్ప సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని కోరనున్నారు.ఈ వ్యవహారంపై మంత్రి గంటా కూడా సీరియస్‌గానే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని అయ్యన్న పాత్రుడు వివాదం చేస్తున్నారని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీఎల్‌డీఏ పాత పాలకవర్గం ఇప్పటికే రెండు దఫాలు పనిచేసిందని, పైగా కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉన్న ఈ పాలకవర్గాన్ని ఇంకా కొనసాగించాలని సిఫారసు చేయడం పట్ల మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి సమక్షంలోనే చర్చించాలని భావిస్తున్నారు. మరో వైపు జరిగిన పరిణామాలు..తాను తీసుకున్న చర్యలపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కూడా వివరణ ఇచ్చేం దుకు సిద్దమవుతున్నారు. సమీక్షలో డీఎల్డీఏపై ఇరువురు మంత్రులు సిగపట్లు çపడతారన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. అయితే సమీక్ష సందర్భంగా ఎలాంటి రచ్చ చేయొద్దని, పార్టీ కార్యాలయంలో కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ప్రతిపాదన చినరాజప్ప తెచ్చే అవకాశాలు కన్పిస్తు న్నాయి. సమీక్ష పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే జరగాలని, ఏదైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించుకుందామన్న ప్రతిపాదన పలువురు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు. సమీక్ష అనంతరం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. సమీక్షలో కాకున్నా పార్టీ సమావేశం లోనైనా రచ్చకెక్కిన ఈ అంశంపై చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలంటున్నారు. -
ఏ మలుపు తిరిగేనో..!
సాక్షి, విశాఖపట్నం:ఆబోతుల కుమ్ములాటలో లేగదూడలు బలైనట్టుంది జిల్లా అధికారుల పరిస్థితి ఉంది. జిల్లా పశుగణాభివృద్ధి సంఘం (డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ)నూతన పాలకవర్గ నియామక విషయంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదం అధికారులకు నిజంగానే ప్రాణసంకటంగా మారింది. తనకు చెప్పకుండా ఎన్నికలు నిర్వహించిన ఈవో సూర్యప్రకాశరావుతో పాటు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావులపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం పశుసంవర్థక శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. మరో వైపు ఈ వ్యవహారంలో తమకేపాపం తెలియదంటూ ఆ శాఖాధికారులు వాపోతున్నారు. కావాలనే గంటా ఒత్తిళ్ల మేరకే తన సిఫార్సులను పక్కన పెట్టేశారని భావిస్తున్న అయ్యన్న కలెక్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కలెక్టర్‌కు తెలిసే అంతా.. ఏప్రిల్ 5వ తేదీతో గడువు ముగియనున్న డీఎల్‌డీఏకు కొత్త పాలకవర్గం ఏర్పాటుకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జనవరిలోనే స్వయంగా ఆదేశాలు జారీ చేశారని పశుసంవర్థక శాఖ అధికారులంటున్నారు. ‘కలెక్టర్ ఆదేశాల మేరకు 17మందిని నామినేట్ చేశాం. ఆయన సూచనల మేరకే ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం. చివరకు ఎన్నికల నిర్వహణ కోసం 21వ తేదీన సభ్యులకు కలెక్టర్ రిఫరెన్స్ నోట్‌తోనే నోటీసులు కూడా జారీ చేశాం. 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం కూడా కలెక్టర్‌కు తెలుసు’నని ఆ శాఖాధికారులు వాదిస్తున్నారు. ఈ విషయంలో తాము చేసిన తప్పేంటో అర్థం కావడం లేదంటున్నారు. అయ్యన్న లేఖపై చర్చించనందునే చర్యలు డీఎల్‌డీఏ కమిటీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, పాత పాలక వర్గాన్నే మరోవిడత కొనసాగించాలంటూ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తనకు రాసిన లేఖపై తనతో చర్చించాలని పశు సంవర్థక శాఖ జేడీ కోటేశ్వరరావుకు పంపానని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెబుతున్నారు. ఆ లేఖపై తనతో చర్చించాలని స్పష్టంగా రాసినా పట్టించుకోకుండా, తనకు చెప్పకుండా అత్యుత్సాహంతో ఎన్నికలు నిర్వహించేశారన్నది కలెక్టర్ వాదన. మంత్రుల మధ్య వైరంలో తమను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసమని పశుసంవర్థక శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొ త్తం వ్యవహారంలో తమకే పాపం తెలియదని పశుసంవర్థక శాఖాధికారులు వాదిస్తుంటే... తనతో చర్చించి ఉంటే పరిస్థి తి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని కలెక్టర్ అంటున్నారు. 19న లేఖ రాస్తే 23న జేడీకి రిఫర్ చేస్తారా? మరో పక్క పాత పాలకవర్గాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని డీఎల్‌డీఏ జనరల్ బాడీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని కోట్ చేస్తూ తాను చేసిన సిఫార్సు లేఖను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ లైట్‌గా తీసుకోవడం పట్ల మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడుతున్నారు. ప్రస్తుత పాలకవర్గాన్ని మరో ఏడాది కొనసాగించాలంటూ తాను గత నెల 19వ తేదీన లేఖ రాశానని, ఆ లేఖపై చర్చించకుండా ఎన్నికలకు 21వ తేదీన నోటీసులు ఎలా జారీ చేస్తారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నిస్తున్నారు. పైగా తాను లేఖ ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ప్లీజ్ డిస్కస్ అని జేడీకి పంపడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు నోటీసుల జారీ, జరిగే తేదీ కలెక్టర్‌కు తెలిసే ఉంటుందని తాము భావిస్తున్నామని, మంత్రి గంటా శ్రీనివాసరావు ఒత్తిడి మేరకే మిన్నకుండిపోయి ఉంటారని అయ్యన్న అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల నిర్వహణ కోసం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆదేశాలు జారీ చేసి ఆనక మాట మార్చడంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కాగా ఈ వ్యవహారంపై స్పందించేందుకు కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారులు నోరు మెదిపేందుకు ససేమిరా అంటున్నారు. నేడు గంటా దృష్టికి డీఎల్‌డీఏ వ్యవహారం గంటా అనుచరుడైన గాడు వెంకటప్పడు చైర్మన్‌గా 17 మంది సభ్యులతో ఏర్పడిన ఈ కమిటీ మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న దశలో ఇలా బ్రేకుపడడం చర్చనీయాంశంమైంది. తన ఎన్నిక పూర్తిగా నిబంధనల మేరకు బైలా ప్రకారం జరిగిందని, ఎందుకు ఆపాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని వెంకటప్పడు వాదిస్తున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకైనా తాము వెనుకాడబోమని కమిటీలో మరికొంతమంది సభ్యులు వాదిస్తున్నారు. బుధవారం జిల్లాకు రానున్న మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి జరిగిన విషయాన్ని తీసుకెళ్లేందుకు వెంకటప్పడు బృందం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
పశుగణ క్షేత్రంలో..మంత్రుల రణం
సాక్షి, విశాఖపట్నం:జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నూతన పాలకవర్గ నియామకం జిల్లా మంత్రులు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య మరోసారి చిచ్చు రేపింది. చీటికీ మాటికీ వీరిద్దరి మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న జిల్లా యంత్రాంగానికి ఈ పరిణామం ప్రాణసంకటంగా మారింది. తొలుత గంటా సిఫార్సుతో కొత్త పాలకవర్గ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అయ్యన్న ఆగ్రహంతో యూ టర్న్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ ఆదేశాల మేరకే నియామకాలు.. ఎన్నికలు నిర్వహించామని, ఇప్పుడు తమపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమంటూ పశుసంవర్ధక శాఖాధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సిన తరుణంలో.. పాలకవర్గ ఎన్నిక జరిగి 65 రోజులు దాటిపోయింది. మరో రెండ్రోజుల్లో పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఎన్నిక ముగిసి బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాత పాలకవర్గాన్నే కొనసాగించాలంటూ తాను సిఫార్సు చేసినా పట్టించుకోకుండా కొత్త పాలకవర్గాన్ని ఎందుకు నియమించారంటూ సోమవారం ఉన్నట్టుండి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికలు ఆపమని, పాత పాలకవర్గాన్ని కొనసాగించాలంటూ తాను సిఫార్సు చేసినా పట్టించుకోకుండా ఎన్నికలు ఎందుకు నిర్వహించారంటూ ఒంటికాలిపై లేచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈ కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ కలెక్టర్‌పై చిందులు తొక్కారు. అంతా నీ ఇష్టమేనా? అంటూ ఆయనపై మండిపడ్డారు. అంతే కాకుండా సీఎంఒ కార్యాలయంతోపాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. పైగా ఈ ఎన్నికను సాయంత్రంలోగా నిలుపుదల చేయకపోకే మంత్రి పదవికే తాను రాజీనామా చేస్తానంటూ బెదిరింపులకు దిగారు. మంత్రి అయ్యన్నతోపాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్ప సైతం ఫైర్ అవడంతో కలెక్టర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు పశుగణాభివృద్ధి సంస్థ ఈవోతోపాటు పశుసంవర్ధక శాఖ జేడీ, ఇతర అధికారులను పిలిపించుకొని పరిస్థితిని సమీక్షించారు. తొలుత 17మందిని నామినేట్ చేయడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు స్వయంగా ఆదేశాలిచ్చిన కలెక్టర్ మంత్రి అయ్యన్న ఒత్తిళ్లతో కొత్త పాలకవర్గ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ వివాదం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ పాలకవర్గం ప్రస్తుత పదవీ కాలం ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. రాఘవేంద్రరావు అధ్యక్షునిగా ఉన్న ఈ పాలకవర్గాన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేశారు. రెండు దఫాలుగా ఈ కమిటీయే కొనసాగుతోంది. కొత్త పాలకవర్గం ఏర్పాటు కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న రాఘవేంద్రరావు నేతృత్వంలోని పాత పాలకవర్గాన్ని కొనసాగించడంపై మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిందేనని కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 17మందిని నామినేట్ చేస్తూ కలెక్టర్ జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. నామినేట్ చేసిన 21 రోజుల తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికల కోసం జనవరి 21న కలెక్టర్ పేరిటే నోటీసులు జారీ చేశారు. సరిగ్గా అదే సమయంలో 23వ తేదీన పాతపాలకవర్గాన్ని కొనసాగించాలంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు సిఫార్సు లేఖ పంపారు. అయితే అప్పటికే ఎన్నికకు నోటీసులు జారీ చేయడం, మంత్రి గంటా ఒత్తిళ్లు కారణంగా 27వ తేదీన బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో భీమిలికి చెందిన మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గాడు వెంకటçప్పడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్‌తోపాటు ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో కూడా అదే నెలలో నియమామకం పూర్తయినట్టుగా లేఖ కూడా రాశారు. నా నియామకాన్ని ఎందుకుఅడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు బీసీ మంత్రి అయి ఉండి కూడా బీసీ అభ్యర్థినైన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. నేనే పార్టీలో సీనియర్ కార్యకర్తను. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడగా ఉన్నాను. గతంలో రెండుసార్లు భీమునిపట్నం ఎంపీపీగా చేశాను. మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మండల పార్టీ అధ్యక్షునిగా కూడా చేశా. పార్టీలో సీనియర్ అయిన నన్ను కాదని కాంగ్రెస్‌కు చెందిన పాత పాలకవర్గ అధ్యక్షుడు రాఘవేంద్రరావు నేతృత్వంలోని కమిటీని కొనసాగించాలంటూ అయ్యన్న సిఫార్సు చేయడం ఎంతవరకు సమంజసం? నా ఎన్నిక పూర్తిగా నిబంధనల మేరకే జరిగింది. నాతో సహా 17 మందిని కలెక్టర్ స్వయంగా నామినేట్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అంతా బైలా ప్రకారం జరిగిన ఈ ఎన్నికలో నేను అధ్యక్షునిగా ఎన్నికయ్యా. నేనేమీ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు.. పక్కా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఏ కారణంతో అయ్యన్న నా నియామకాన్ని అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు.–గాడు వెంకటప్పడు, డీఎల్‌డీఎ చైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి -
అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. గత భర్తీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై 2015లో ఐదుగురి సభ్యులతో ఏర్పాటు చేసిన రాఘవులు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని గంటా తెలిపారు. 14 యూనివర్సిటీల్లో ఉన్న 3258 పోస్టులను భర్తీ చేయాలని కమిటీ తేల్చగా.. ఇందులో 48 శాతం ఇప్పటికే భర్తీ జరిగినట్ట వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన పోస్టుల భర్తీ జరుగుతుందని, వీటిని భర్తీ చేసుందుకు రెండు దశలుగా ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఇందుకోసం 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఈ నెల 25 నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. -
ట్రిపుల్‌ఐటీని నెలకోసారి సందర్శిస్తా
నూజివీడు: ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటుచేసిన ట్రిపుల్ఐటీల్లో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నెలకోసారి సందర్శిస్తానని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీని సందర్శించిన మంత్రి విద్యుత్ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మెస్‌లను తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ట్రిపుల్ఐటీల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని కనీసం వెయ్యి మంది విద్యార్థులతో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు నాటికి ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఏటా బడ్జెట్లో రూ.25 వేల కోట్లు ఖర్చుచేస్తుందన్నారు. విద్యార్థులకు నీటి సమస్యలేకుండా కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. విలేకర్ల సమావేశంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు, నూజివీడు, శ్రీకాకుళం డైరెక్టర్లు ఆచార్య వీరంకి వెంకటదాసు, హరశ్రీరాములు పాల్గొన్నారు. నేడు నూజివీడు ట్రిపుల్ఐటీకి త్రిసభ్య కమిటీ రాష్ట్రంలోని ట్రిపుల్ఐటీల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఈనెల 12న నూజివీడు ట్రిపుల్ఐటీకి వస్తున్నట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు తెలిపారు. ఈ త్రిసభ్య కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీబీఎస్ వెంకటరమణ చైర్మన్‌గా, జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ ఎం స్వరూపారాణి, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎంకే రహమాన్‌లను సభ్యులుగా ఉన్నారు. ఈకమిటీని గతనెల మొదట్లో ప్రభుత్వం నియమించిందన్నారు. విచారణ చేసి 15రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
చిన్నారులతో ఐటెమ్ సాంగ్స్‌కు డ్యాన్సులు
-
టెట్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలను (టెట్)– 2017ను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకూ టెట్ జరగనుంది. మార్చి 12న టెట్ కీ విడుదల చేసి, 16న ఫలితాలను వెల్లడిస్తారు. టెట్ వాయిదాకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. టెట్‌కు దాదాపు 4.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీ పేపర్-1కు 1,80,749 మంది, పేపర్-2కు 2,12,795 మంది దరఖాస్తు చేసుకున్నారు. భాషా పండితులు పేపర్‌కు 53, 289 మంది అప్లై చేసుకున్నారు. టెట్‌కు సిద్ధమవ్వడానికి తగినంత వ్యవధి లేదని, సిలబస్ కూడా ఎక్కువ ఉందని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గతంలో కూడా వాయిదా వేశారు. -
ఏపీ సెట్స్-2018 షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ సెట్స్ -2018 షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఇక్కడ విడుదలచేశారు. పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి. ► ఎడ్ సెట్ ఏప్రిల్ 19 వ తేదీ ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ► లా సెట్ ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 3 నుండి 4-30 వరకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ► ఎంసెట్ ఇంజినీరింగ్ ఏప్రిల్ 22 నుండి 25 వరకూ ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 2-30 నుండి 4 వరకు కాకినాడలోని జేఎన్టీయూలో నిర్వహిస్తారు. ► ఎంసెట్ బైపీసీ ఏప్రిల్ 26 న ఉదయం 9 నుండి 12, మధ్యాహ్నం 2 -30 నుండి 4 వరకు కాకినాడ జేఎన్టీయూలో నిర్వహిస్తారు. ► ఐ సెట్ మే 2 న ఉదయం 10-30 నుండి 12-30 వరకు , 2-30 నుండి 5 వరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ► ఈ సెట్ మే 3 న ఉదయం10 నుండి 1 వరకు అనంతపురం జేఎన్టీయూలో నిర్వహిస్తారు. ► పీజీఈ సెట్ మే 10 నుండి 12 వరకు ఉదయం 10 నుండి 12, 2 నుండి 4 వరకు వరకు ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ► పీఈ సెట్ మే 4 న 9 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తారు. -
నిలదీతలతో ఆరంభం
సాక్షి, నెట్వర్క్ / అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి ఐదో విడత కార్యక్రమం తొలిరోజు నిరసనలు, నిలదీతలతో హోరెత్తింది. పాత సమస్యలపై పదేపదే వినతిపత్రాలు ఇవ్వాల్సి రావటంతో మంగళవారం పలుచోట్ల అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. అర్హులను పట్టించుకోకుండా అనర్హులకు ప్రయోజనాలు చేకూరుస్తున్నారని మండిపడ్డారు. దీంతో పోలీసు బందోబస్తుతో గ్రామసభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ⇔ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామ సభలో బైరబోగు రావమ్మ అనే వృధ్దురాలు గత మూడేళ్లలో 29 సార్లు ఫించను కోసం దరఖాస్తు ఇచ్చినా మంజూరు కాకపోవడంపై కన్నీటి పర్యంతమైంది. ⇔ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పాతనౌపడలో తమకు ఇల్లు మంజూరు చేయకుండా రెండేసి ఇళ్లు ఉన్న వారికి ఇస్తున్నారంటూ పలువురు గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ⇔ తూర్పు గోదావరి జిల్లాలో రుణమాఫీ విషయంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను రైతులు నిలదీశారు. ⇔ బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని కొత్తపేట మండల పరిధిలోని కండ్రిగ గ్రామ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ⇔ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం జన్మభూమి గ్రామసభను అడ్డుకున్న ఎత్తిపోతల పథకం రైతులు తమ భూములకు పరిహారం పెంచాలని ధర్నా చేశారు. ⇔ బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో గ్రామ సభలను ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ⇔ పెరవలిలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు చేదు అనుభవం ఎదురైంది. రేషన్‌కార్డులు ఉన్నా రేషన్ ఇవ్వకపోవడంపై మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ⇔ కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు, ఆలూరు మండలం హత్తిబెలగల్, కల్లూరు మండలాల్లో గ్రామసభలను వివిధ సమస్యలపై స్థానికులు అడ్డుకున్నారు. ⇔ అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించటం లేదని రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును సిద్దనగౌడ ప్రజలు నిలదీశారు. ⇔ విశాఖపట్నం జిల్లాలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలకు జన్మభూమి సభలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గిరిజన ఎమ్మెల్యేగా ఎలా సమర్థిస్తావంటూ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నిలదీశారు. చినలబుడులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై గిరిజనులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ⇔ భీమిలి రూరల్ మండలం కాపులుప్పాడలో జన్మభూమిలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ‘ప్రతి జన్మభూమిలో దరఖాస్తు ఇస్తూనే ఉన్నా.. గత నాలుగు విడతల్లో ఇచ్చా.. మళ్లీ ఈ సభలో కూడా మీకే ఇస్తున్నా...’అని గ్రామానికి చెందిన కొండపు నరసింహ (70) మంత్రి గంటాను నిలదీశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేపగుంట వద్ద ప్రజలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు ఎన్నైనా చెప్పండి...మీ సమస్యలు విననంటే వినను. ఇది సంక్షేమం.. సంతృప్తి సభ మాత్రమే. మీ సమస్యలు వినడానికి ఇది వేదిక కాదు’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇔ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో విద్యార్థులతో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టించి ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ రేషన్‌కార్డులు, డ్వాక్రా రుణమాఫీ అంశాలపై అధికారులను నిలదీయడంతో జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అర్ధాంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత ఉదయభాను నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ⇔ గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా సభా వేదికపై లేకుండానే టీడీపీ ఇన్చార్జి మద్దాలి గిరి, టీడీపీ నేతలు షౌకత్ వంటి వారు వేదికపై కూర్చొని జన్మభూమి సభలో హల్చల్ చేశారు. అయితే ఎమ్మెల్యే ముస్తఫా ప్రజల్లో కూర్చొని వారి పక్షాన సమస్యల గురించి అధికారులు, నేతలను ప్రశ్నించారు. ⇔ అమరావతిలో రాజధాని గ్రామాలకు సీడ్‌యాక్సిస్ రోడ్డు భూ సేకరణ నోటిఫికేషన్‌కు సంబంధించి జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు అధికారులను నిలదీశారు. -
గంటాపై గుర్రు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ మంత్రి గంటా ఉత్సవంగా మారి పోయింది. ఉత్సవాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తన ఇంటి కార్యక్రమంలా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారంటూ సహచర ఎమ్మెల్యేల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం సమీక్షలు కాదు కదా.. ఏర్పాట్లలో కూడా ఏ ఒక్కరినీ భాగస్వామ్యం చేయకపోవడంపై వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గంటా తీరుపై కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలంతా.. విశాఖ ఉత్సవ్‌కు గైర్హాజ రుతో తమ నిరసనను తెలియజేశారు. వరసగా రెండో రోజు కూడా మంత్రి అయ్యన్నతో సహా ఎమ్మెల్యేలు ఉత్సవాలకు డుమ్మా కొట్టడం అధికార టీడీపీలో చర్చకు దారి తీసింది. రచ్చకెక్కిన విభేదాలు గంటా–అయ్యన్న మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. అవకాశం దొరికినప్పుడల్లా గంటాపై ఒంటికాలిపై లేచే మంత్రి అయ్యన్న ఆయన ఒంటెద్దు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన మూడేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న అయ్యన్న.. ఈసారి కూడా ఉత్సవాల దరిదాపుల్లోకి రాలేదు. కనీసం సమీక్షల్లో కూడా ఎక్కడా ఆయన పాల్గొనలేదు. ప్రస్తుతం శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మంత్రి అయ్యన్న శనివారం సొంత నియోజకవర్గమైన నర్సీపట్నంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చివరి రోజు కూడా ఆయన వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. రెండు రోజూ ఎమ్మెల్యేలు డుమ్మా మరో వైపు మంత్రి గంటా తీరుపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఉత్సవాల దారిదాపులకు వెళ్లలేదు. తొలిరోజు ఏకంగా శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వచ్చినా.. ఒక్క ఎమ్మెల్యే కూడా ఉత్సవాల్లో పాల్గొనలేదు. కనీసం ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ, గెస్ట్‌హౌస్‌లో పలకరించేందుకు కూడా రాలేదు. స్పీకర్‌గా బ్రహ్మరథం పడతారని నగరానికి వచ్చిన కోడెలకు ఆశాభంగం ఎదురైంది. గంటా, అమర్నా«థ్లతో కలసి కార్నివాల్లో పాల్గొన్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పటికీ.. ముక్తసరిగా నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. రెండోరోజు మంత్రి అయ్యన్న మాటెలాగున్నా నగర ఎమ్మెల్యేలు, ఎంపీలైనా వస్తారని అంతా భావించారు. కానీ ఒక్క గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఉత్సవాల చుట్టుపక్కల కనిపించలేదు. రెండో రోజైన శుక్రవారం కొల్లు రవీంద్ర, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ విశాఖ ఉత్సవ్‌కు హాజరయ్యారు. అసంతృప్తిలో వెలగపూడి ఉత్సవాలు జరిగే ఆర్కేబీచ్ ప్రాంతం తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. చివరకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉత్సవాలకు డుమ్మా కొట్టారు. గంటాపైన, అధికారుల తీరుపైన వెలగపూడి ఒంటికాలిపై లేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని, ఆహ్వాన పత్రికల్లో మిగిలిన ఎమ్మెల్యేలతో కలిపి పేర్లు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో సహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా గంటా తీరుపై గుర్రుగా ఉన్నారు. జిల్లా అధికారులు గంటా అడుగులకు మడుగులొత్తుతూ తమను పట్టించుకోవడం లేదంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌తో సహా ఎమ్మెల్యేలందరూ మండిపడుతున్నారు. టూరిజం ఈడీ తీరుపై ఆగ్రహం ప్రస్తుతం విశాఖ ఉత్సవ్‌కు టూరిజం ఈడీ శ్రీరాములునాయుడు తీరుపై ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గంటాను తప్ప ఇతర ప్రజాప్రతినిధులను ఆయన పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా పిలవడం కానీ, కనీసం ఆహ్వాన పత్రాలు స్వయంగా ఇవ్వడం కానీ చేయలేదని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఉత్సవాల పేరిట లెక్కా పత్రం లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుండడం ఎంతవరకు సమంజసమని మంత్రి అయ్యన్నే గతంలో విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. మొత్తం మీద విశాఖ ఉత్సవాలు అధికార టీడీపీలో విబేధాలకు మరోసారి కేంద్రమయ్యాయి. -
అందాల పోటీలను ఆపాలని ఆందోళన
సాక్షి, విశాఖపట్నం/ద్వారకానగర్: అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాక్షాత్తు మహిళా పోలీసులే సాటి మహిళలపై అనుచితంగా ప్రవర్తించి వివస్త్రలుగా చేయాలని ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సేవ్ గర్ల్ పేరిట ‘మిస్ వైజాగ్–2017’ అందాల పోటీలను నవంబరు 11న విశాఖ నగరంలో నిర్వహిస్తున్నట్టు క్రియేటివ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్, రేస్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీమ్స్ ఈవెంట్స్ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆశీల్మెట్టలోని ఓ హోటల్లో ఆడిషన్స్ నిర్వహణకు సన్నద్ధమయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోలీసులు మహిళలను అక్కడ నుంచి బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జి చేయడంతో పాటు పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. -
మిస్ వైజాగ్ పోటీలను ఆపండి
-
మల్టీనేషనల్ కంపెనీలా డీజీపీ ఆఫీస్: గంటా
సాక్షి, విజయవాడ : ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 21న కూడా పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని, విధుల్లో భాగంగా మరణించిన పోలీసులకు ఆరోజు నివాళ్లు అర్పిస్తామని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్టేషన్లకు పౌరులను పిలిచి వారికి ఆయుధాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇకపై ఇంట్లో ఉన్నా లేకపోయినా వారి కుటుంబానికి పోలీస్ నుంచి భరోసా కల్పిస్తామన్నారు. ఏడాది స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాకు పది స్కూళ్లని దత్తత తీసుకొని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను తొలిసారి అమరావతిలోని డీజీపీ కార్యాలయానికి వచ్చానని, అచ్చం చూడడానికి మల్టీనేషనల్ కంపెనీలా అద్భుతంగా ఉందన్నారు. విద్యకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి అని, రాష్ట్రంలో 860 పోలీస్ స్టేషనలు ఉన్నాయని, పోలీస్ స్టేషన్ కి ఒకటి చొప్పున దత్తత తీసుకోవటంపై డీజీపీని, పోలీసులను ప్రభుత్వం అభినందిస్తున్నదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యపై ఈ రోజు ప్రేవేట్ స్కూల్, కాలేజీ యాజమాన్యాలతో, విద్యార్థి సంఘాలతో సీఎం సమావేశం కానున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులుపై ఒత్తిడి తీసుకురాకుండా చదివించాలని కోరుతున్నామన్నారు. -
ర్యాగింగ్‌పై మంత్రి గంటా ఆగ్రహం
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్ ఘటన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీయూకేటీ డైరెక్టర్‌తో ఆయన మాట్లాడి ర్యాగింగ్ నిరోధానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఘటనలను ఏమాత్రం సహించవద్దని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్ ఘటనలు, తీసుకొన్న చర్యలపై నివేదిక పంపాలని ఆదేశించారు. పవిత్రమైన విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను సహించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. -
విశాఖలో రుణమాఫీ కుంభకోణం
-
మార్చి1 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు
విజయవాడ: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఏడాది 10 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జంబ్లింగ్ పద్ధతిపై చిన్న చిన్న సమస్యలున్నాయని.. వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. 1445 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామన్నారు. కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. అర్టీసీ అధికారులతో చర్చించి విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా మార్చి9 న జరగాల్సిన పరీక్షను 19న నిర్వహిస్తామన్నారు. -
మేనేజ్మెంట్ కోటా సీట్లకు నీట్ తప్పనిసరి
హైదరాబాద్: కేవలం ప్రభుత్వ కోటా సీట్లకు మాత్రమే నీట్ నుంచి మినహాయింపు ఉన్నందున ప్రైవేటు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం విద్యార్థులు నీట్-2 ను రాయాల్సిందేనని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వ కోటా సీట్లను ఎంసెట్‌తో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకు సంబంధించి విద్యార్థులు పూర్తిగా నీట్‌ను అనుసరించాల్సిందేనని చెప్పారు. నీట్లో సీబీఎస్ఈ సిలబస్‌ను అనుసరిస్తున్నందున రాష్ట్ర సిలబస్‌లో కూడా తగు మార్పులు చేస్తామన్నారు. సిలబస్ రూపకల్పనకు త్వరలో నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
'అమరావతి'కి తలా రూ.10 ఇవ్వండి..
-
'ర్యాగింగ్ లేని రాష్ట్రంగా ఏపీ'
⇒ ర్యాగింగ్ రుజువైతే విద్యకు శాశ్వతంగా దూరం విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడితే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తామన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలతో ర్యాగింగ్‌ను కట్టడి చేయనున్నట్లు పేర్కొన్నారు. వైస్‌చాన్స్‌లర్ లే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడైనా రాజకీయ జోక్యంతో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు. విద్యార్థుల ఫలితాలను విడుదల చేయాల్సిందిగా తాము లేఖ రాసినా స్పందించలేన్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, వైఎస్ఆర్ జిల్లా నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని మంత్రి వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు. -
'నారాయణ అయినా మరొకరైనా శిక్ష తప్పదు'
తిరుపతి: 'ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదు..తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు..నారాయణ అయినా మరొకరైనా చట్టానికి అందరూ సమానమే' అని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని నారాయణ కాలేజ్ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల మృతి పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ముగిసింది. దీంతో నివేదికను సోమవారం కమిటీ చైర్మన్ విజయలక్ష్మీ తిరుపతిలో గంటాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మృతిపై త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసిందని, ఇంకా పరిశీలించలేదన్నారు. నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయమని అధికారులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా పలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయం చేయాలని మృతుల తల్లిదండ్రులు అడిగినమాట వాస్తవమేనని ఆయన సాక్షికి తెలిపారు. ఆత్మహత్యల ఘటనపై కమిటీ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. పవన్ వ్యాఖ్యల్ని తాము పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని, పరోక్షంగా పవన్ తమకు సహకరించారని ఆయన అన్నారు. -
'ర్యాగింగ్‌పై ఉక్కుపాదం'
తాడేపల్లిగూడెం: కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్ నిరోధానికి కళాశాలల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు ప్రతి విద్యార్థికి బార్ కోడింగ్, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కుల, మత సంఘాలకు సంబంధించి ఎలాంటి ప్రచార బోర్డులను అనుమతించేది లేదన్నారు. గతంలో విద్యాభివృద్ధికి 10 శాతానికి మించి బడ్జెట్ ఉండేది కాదని, ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్‌ను 17 శాతానికి పెంచి రాష్ట్రాన్ని 'ఎడ్యుకేషన్ హబ్'గా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. విద్యతోపాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం బీవీ పట్టాభిరామ్, చాగంటి కోటేశ్వరరావు వంటి వారితో విద్యాసంస్థల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని కళాశాలల్లో వైఫై సౌకర్యంతోపాటు బయోమెట్రిక్ పద్ధతి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తమ విద్యాబోధన అందించే చర్యల్లో భాగంగా విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు. -
'బాధ్యులు ఎవరైనా వదిలేది లేదు'
విజయవాడ: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులు ఎంతటి వారైనా వదలబోమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ఓ హోటల్లో బస చేసిన మంత్రిని రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయ్ కలిశారు. తమ కుమార్తె మరణానికి కారణమై, తమకు తీవ్ర వేదన మిగిల్చిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు. ' మా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రాకూడదు' అంటూ రిషితేశ్వరి తల్లిదండ్రులు మంత్రి వద్ద బోరున విలిపించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రిషితేశ్వరి ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నివేధిక ఆధారంగా బాధితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్
హైదరాబాద్: వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1230, కడప ట్రిపుల్ ఐటీలో 770 సీట్లు భర్తీ చేస్తామని చెప్పారు. అయితే అవకాశం దక్కనివారి కోసం అదనంగా 224 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సౌకర్యాలు, ఫ్యాకల్టీ పూర్తిస్థాయిలో లేనందున ట్రిపుల్ ఐటీలో సీట్ల సంఖ్యను పెంచలేదని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
'కడియం శ్రీహరిది అసత్యప్రచారం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి రికార్డులను తాము అడగడం లేదని తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేయడం సరికాదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాము పలుమార్లు రికార్డులు ఇవ్వాలని అడిగినా స్పందించకుండా లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి, తాను చర్చించామని, ఆతరువాత గవర్నర్ సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులతో కూడి తామిద్దరం చర్చించామని తెలిపారు. ఆ సమావేశంలో రికార్డులన్నింటినీ అప్పగిస్తామని కడియం శ్రీహరే స్వయంగా అంగీకరించి తరువాత మాటతప్పారన్నారు. తాము పలుమార్లు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తమ రికార్డులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా మీడియా బాధ్యత తీసుకుంటే తెలంగాణ మంత్రి కడియం శ్రీహరితో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చర్చలకు మంత్రి కడియం రావాలని పేర్కొన్నారు. తాము అనేక ప్రయత్నాలు చేసినా రికార్డులు ఇవ్వకుండా తిరిగి అసత్యప్రచారాలు చేయడం కడియం శ్రీహరికి తగదని హితవు పలికారు. అయిదుసార్లు లేఖలు రాశాం వేణుగోపాలరెడ్డి తమ రికార్డులు అప్పగించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి, తెలంగాణ ప్రభుత్వానికి తాము అయిదుసార్లు లేఖలు రాసినా అక్కడినుంచి స్పందన లేకుండా పోయిందని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ నరసింహరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సంప్రదింపులు చేసిన వివరాలను అందించారు. అనేకమార్లు లేఖలురాసినా స్పందించకుండా తాము సంప్రదించలేదనడం దారుణమన్నారు. రికార్డులకోసం కమిటీవేసి విభజన చేద్దామని తమనుంచి పేర్లు ప్రతిపాదించినా వారు రికార్డులు ఇవ్వకుండా జాప్యంచేస్తున్నారని పేర్కొన్నారు. రికార్డులకోసం సమయం, తేదీ తెలియచేయాలని తాము కోరినా వారినుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. -
'శత్రుదేశం కన్నా దారుణంగా టీ సర్కారు తీరు'
మా ఓపిక నశించింది ఇక కేంద్రం జోక్యం చేసుకోవాలి మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్: శత్రుదేశం కన్నా దారుణంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ దేశంలో ఆ రాష్ట్రం ఒక అంతర్భాగమన్న అంశాన్ని విస్మరిస్తోందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆప్రాంత ప్రజలు, విద్యార్ధుల పట్ల అన్యాయంగా ప్రవరిస్తోందని విమర్శించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఇప్పటివరకు చాలా ఓపికతో ఉన్నాం. రాజీధోరణితో వెళ్తున్నా మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు కావాలని అడుగుతున్నాం. మా ఓపిక నశిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్ రాకతప్పదు’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారిగా కాకుండా రాజకీయ సమావేశం మాదిరిగా అధికారులతో భేటీ అయి పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ తమకే చెందుతాయని, అక్కడి ఆంధ్రా సిబ్బందిని పంపేయండని, ఎవరికీ సహకరించవద్దని ఆదేశించడం దారుణమన్నారు. చివరకు ఏపీకి చెందిన లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో కూడా తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. అంబేద్కర్వర్సిటీలో ఉమ్మడి పరీక్షలు నిర్వహించి కేవలం తెలంగాణ ఫలితాలు విడుదల చేసి ఏపీవి నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తమను రెచ్చగొట్టడమేనన్నారు. ఉన్నత విద్యామండలి రికార్డులు అందిస్తామని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి స్వయంగా అందరి ముందు అంగీకరించి చివరకు ఒక్క ఫైలుకానీ, చివరకు కంప్యూటర్లలోని డేటాను కూడా తీసుకోనివ్వకుండా చేశారని ఆరోపించారు. లక్షలమంది ఎంసెట్ అడ్మిషన్లతో ముడిపడి ఉన్నప్పటికీ రికార్డులు ఇవ్వలేదని, అయినా విద్యార్ధులు ఇబ్బంది పడకుండా సకాలంలో అడ్మిషన్లు పూర్తిచేయించామన్నారు. ఎన్టీరామారావు మానసపుత్రిక అయిన తెలుగువర్సిటీలో ఏపీవారికి ప్రవేశం లేదనడం ఏమేరకు సమంజసమన్నారు. ఎన్నిసార్లు భేటీ అయినా ఫలితం శూన్యం తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ నరసింహన్‌ను ఈ ఆరునెలల్లో 27 సార్లు కలసి విన్నవించామని, అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదని మంత్రి వాపోయారు. మరోసారి గవర్నర్‌ను కలుస్తామని, న్యాయపోరాటమూ సాగిస్తామని చెప్పారు. కేంద్రప్రభుత్వంపై కూడా అనేకరకాలుగా ఒత్తిడి చేస్తున్నామని, మళ్లీ వెళ్లి ఇక్కడి సమస్యలను కేంద్రానికి గట్టిగా చెబుతామని వివరించారు. గవర్నర్‌ను మార్చాలా వద్దా అన్నది ముఖ్యం కాదని చట్టం ప్రకారం నడచుకోవాలని పేర్కొంటున్నామన్నారు. -
' పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే'
-
పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే: గంటా
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఎమ్మెల్సీ టికెట్లను పార్టీ అధిష్టానం సీనియర్లకే కేటాయించిందని ఆయన అన్నారు. కన్నబాబు రాజుకు పార్టీ పట్ల అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని.. ఆయన పోటీ చేయటంపై మరోసారి పునరాలోచించుకుంటే మంచిదని కోరినట్టు గంటా ఈ సందర్భంగా తెలిపారు. కన్నబాబు రాజు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. పోటీ అనివార్యమైతే భారీ మెజారిటీతో గెలుస్తామని గంటా పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవటంతో కన్నబాబు రాజు... రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 15 నుంచి బడులు
వారం రోజుల పాటు బడిబాట హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏటా జూన్ 12వ తేదీనే పాఠశాలలు పునఃప్రారంభ మవుతుంటాయి. కానీ ఈసారి జూన్ 12వ తేదీ శుక్రవారమైంది. తరువాత 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం రెండూ సెలవు దినాలు ఉన్నాయి. 12వ తేదీన స్కూళ్లు ప్రారంభిస్తే వెంటనే వరుసగా రెండు సెలవు దినాలు ఉండడంతో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు అధికారులు బడుల ప్రారంభ తేదీని 15వ తేదీకి మార్చారు. ఆరోజునుంచి బడిబాట కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. బడిబయట ఉన్న పిల్లలందర్నీ పాఠశాల ల్లో చేర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరంలో ప్రారంభించనున్నారు. -
హైదరాబాదీలే టాపర్లు
ఏపీ ఎంసెట్‌లో మెడిసిన్, ఇంజనీరింగ్ మొదటి ర్యాంకర్లిద్దరూ నగరవాసులే హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులను హైదరాబాదీలే కైవసం చేసుకున్నారు. మెడికల్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులను హైదరాబాద్ విద్యార్థులే సాధించడం విశేషం. అంతేకాదు ఇంజనీరింగ్, మెడికల్.. రెండు విభాగాల్లోనూ టాప్ ర్యాంకర్లే కాకుండా అత్యధిక ర్యాంకులు సాధించిన వారు హైదరాబాద్ కేంద్రంగా చదివిన వారు, లేదా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నవారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్‌లో మొదటి పది ర్యాంకులను.. వ్యవసాయ, మెడికల్ విభాగంలో మొదటి పదిలో ఏడు ర్యాంకులను బాలురే సాధించారు. అయితే, ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలురతో పోలిస్తే.. బాలికల శాతమే అధికంగా ఉండటం విశేషం. కాకినాడ జేఎన్టీయూ ఈ నెల 8న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ఎంసెట్- 2015 (ఇంజనీరింగ్, అండ్ అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు గురువారం కాకినాడలో విడుదల చేశారు. ఈ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 1,70,681 మంది దరఖాస్తు చేయగా 1,62,817 మంది హాజరయ్యారు. వీరిలో 1,41,143 మంది అభ్యర్ధులు (77.42%) అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 84,732 మంది దరఖాస్తు చేయగా 81,010 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 79,398 మంది (89.89%) అర్హత సాధించారు. ర్యాంకుల పరంగా బాలురదే పై చేయి కాగా, ఉత్తీర్ణతాశాతంలో మాత్రం బాలికలదే హవా. ఇంజనీరింగ్‌లో బాలురు 1,01,472 మంది పరీక్షకు హాజరవ్వగా 74.44 శాతంతో 75,532 మంది అర్హత సాధించారు. అదే బాలికల్లో 61,345 మంది పరీక్ష రాయగా 50,521 మంది (82.36%) అర్హులుగా నిలిచారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో బాలురు 29,515 మంది పరీక్షకు హాజరవ్వగా 25,819 (87.48%) మంది పాసయ్యారు. అదే బాలికల్లో 51,495 మంది పరీక్ష రాయగా 47,001 (91.27%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్పరీక్షా ఫలితాల వెల్లడి కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం, కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉదయలక్ష్మి, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్, ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌లో అనిరుధ్ రెడ్డి.. మెడికల్‌లో శ్రీ విధుల్ ఇంజనీరింగ్ విభాగంలో జూబ్లీహిల్స్‌కు చెందిన కొండపల్లి అనిరుధ్‌రెడ్డి 157 మార్కులు సాధించి మొదటి ర్యాంక్ సాధించాడు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన అక్షిత్ రెడ్డి 156 మార్కులతో రెండో ర్యాంకు, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కోసూరు జోషి 156 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారు. మెడికల్ విభాగంలో శ్రీ విధుల్ మొదటి ర్యాంక్ సాధించగా, రాళ్లబండి సాయి భరద్వాజ్, దామిని 2, 3 స్థానాల్లో నిలిచారు. విధుల్కు 151 మార్కులు, సాయి భరద్వాజ్‌కు 151 మార్కులు, శ్రీరామ ధామినికి 150 మార్కులు వచ్చాయి. వీరు ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారే. ఇంకా ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లా దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ఆహ్వాన్ రెడ్డికి 4వ ర్యాంకు, విజయనగరం జిల్లా కె.ఎల్పురంకు చెందిన ఎం.సందీప్‌కుమార్‌కు 5వ ర్యాంకు, రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన సాయిసందీప్‌కు 6వ ర్యాంక్, హైదరాబాద్, నాచారం వాస్తవ్యుడైన జి.శ్రీనివాసరావుకు ఏడో ర్యాంక్, హైదరాబాద్, కూకట్‌పల్లికి చెందిన ఎం.యశ్వంత్‌కుమార్‌కు 8వ ర్యాంక్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఒ.అఖిల్‌కు 9 వ ర్యాంక్, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన విద్యాసాగర్ నాయుడు 10వ ర్యాంక్ సాధించారు. మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకర్ శ్రీవిధుల్, రెండో ర్యాంకర్ సాయిభరద్వాజ, 3వ ర్యాంకర్ దామిని, ఆరో ర్యాంకర్ అన్షుగుప్త, 8వ ర్యాంకర్ ఫతీమాలు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా శీలం ఛరిష్మా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వారు. మెడికల్ విభాగంలో 4, 5, 7 ర్యాంకులు గుంటూరు జిల్లాకు చెందినవారికి రాగా, 10వ ర్యాంక్ సాధించిన అనుదీప్ వైజాగ్ వాసి. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. తప్పులతో నష్టపోయాం ఎంసెట్‌లో 160 ప్రశ్నలకు 2.30 గంటల్లో సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ప్రతీ ప్రశ్నకు దాదాపు 55 సెకన్ల సమయం లభిస్తుంది. ఎంసెట్ 2015లో ఇంజనీరింగ్‌లో మూడు తప్పులు, మెడిసిన్‌లో 7 తప్పులు దొర్లాయి. ఆ తప్పుల కారణంగా, ఆ ప్రశ్నలకు తాము కేటాయించిన విలువైన సమయాన్ని కోల్పోయామని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. దాంతో తమ ర్యాంకులు తగ్గాయని చెబుతున్నారు. 150 ప్రశ్నలకు ఆన్సర్ చేసి పది ప్రశ్నలు వదిలేసిన వారికీ, అన్ని ప్రశ్నలకూ ఆన్సర్ చేసిన తమకూ అవే ర్యాంకులు వచ్చాయన్నారు. ప్రశ్నాపత్రాల్లోని తప్పులను పక్కన పెట్టి ఇంజనీరింగ్‌ను 157 మార్కులకు, మెడిసిన్‌కు 153 మార్కులకు పరిమితం చేసి లెక్కించడం సరి కాదని కొన్ని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఎంసెట్‌లో క్వాలిఫై.. ఇంటర్లో ఫెయిల్ ఎంసెట్‌లో అర్హత సాధించిన పలువురు ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఎంసెట్‌లో అర్హత సాధించినవారిలో ఇంజనీరింగ్‌లో 11,395 మంది, మెడికల్‌లో 4,093 మంది ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అయ్యారు. దాంతో ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ వీరిని మినహాయించి ర్యాంకులను ప్రకటించారు. పేదలకు వైద్య సేవలు: శ్రీవిధుల్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌రోడ్‌లోని మహేష్‌నగర్ ప్రాంతానికి చెందిన కంటి వ్యాధుల నిపుణుడు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రమాదేవిల కుమారుడు శ్రీవిధుల్ ఏపీ ఎంసెట్-2015 మెడికల్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. వైద్యరంగంలో ఉన్నత చదువులు చదివి సమాజానికి మేలు చేయడమే కాకుండా, ఉచితంగా పేదలకు వైద్యసేవలు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా విధుల్ పేర్కొన్నాడు. అనుకున్నట్లే ఐదు లోపు: సాయి భరద్వాజ్ ‘టాప్-5 లోపు ర్యాంకు వస్తుందని ఆశించాను. అనుకున్నట్లుగానే రెండో ర్యాంకు రావడం సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ కూడా చాలా బాగా రాశాను. అందులో కూడా ర్యాంకు తప్పనిసరిగా రావడం ఖాయం. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్మర్కు ప్రిపేర్ అవుతున్నాను. వాటిలో మంచి ర్యాంక్ వస్తే అక్కడే మెడిసిన్ చేస్తాను’. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్: అనిరుధ్‌రెడ్డి ‘ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నా. మాదాపూర్ కావూరి హిల్స్‌లోని శ్రీ చైతన్య-నారాయణ కాలేజీలో ఇంటర్ చదివాను. జేఈఈ మెయిన్స్‌లో 337 మార్కులు సాధించాను. అందులో ఆలిండియా థర్డ్ బెస్ట్ మార్కులు నావే. మా నాన్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ జెన్కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాగా, అమ్మ మాధూరీలత గృహిణి. వారి ప్రోత్సాహంతోనే ఈ ర్యాంక్ సాధించా’. ఐఏఎస్ లక్ష్యం: అక్షిత్‌రెడ్డి హన్మకొండలోఎలక్ట్రికల్ మోటార్ రిపేర్ షాప్ నిర్వహించే దొంతుల రఘోత్తమ్‌రెడ్డి, రజిత దంపతుల మొదటి సంతానం అక్షితరెడ్డి. ఎస్ఎస్సిలో 9.8 జీపీయే పొదిన అక్షిత్ ఇంటర్లో 980 మార్కులు సాధించాడు. ‘ముంబైలో కంప్యూటర్ సైన్స్ విద్య చదివి ఐఏఏస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని అక్షిత్‌రెడ్డి చెప్పారు. జాతీయ సంస్థలో మెడిసిన్ చేస్తా: దామిని తల్లిదండ్రులు మాధవి, మునిరత్నంల ప్రోత్సాహం, అధ్యాపకుల ఉత్తమ బోధన ద్వారానే మెడిసిన్‌లో మూడు ర్యాంకు సాధించానని శ్రీరామ దామిని చెప్పారు. ఎనిమిదో తరగతిలో ఉండగానే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ రాసి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. ‘ఇంతకన్నా మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించా. చివరకు మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ఎంసెట్ కూడా రాశా. టాప్ ర్యాంకు దక్కుతుందని నమ్మకం ఉంది. స్థానిక కళాశాలల్లో కంటే జాతీయ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తాను. -
బాలికలదే పైచేయి
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల విశాఖపట్నం: ఈసారి ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 91.42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో 98.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు, మూడు స్థానాలను తూర్పుగోదావరి (96.75శాతం), పశ్చిమగోదావరి(95.15శాతం) జిల్లాలు దక్కించుకున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా 71.29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. జూన్ 18 నుంచి టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలను జూన్ 18వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. బుధవారం పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించారు. పరీక్ష ఫీజును జూన్ 2వ తేదీ లోపు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాల్సి ఉంటుంది. -
మే 26న ఏపీ ఎంసెట్ ఫలితాలు :గంటా
విశాఖపట్నం: మే 26న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అలాగే మే20న పదో తరగతి, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. గంటా శ్రీనివాసరావు సోమవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాజాగా జరిగిన డీఎస్సీలో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని గంటా శ్రీనివాసరావు సూచించారు. -
వైభవంగా అప్పన్న చందనోత్సవం
విశాఖపట్టణం: సింహాచలం అప్పన్న చందనోత్సవం సోమవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది. నృశింహుడి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్ధరాత్రి 2.30 గంటలకు స్వామి మూల విరాట్‌కు చందనం వలవడం ప్రారంభమైంది. అది పూర్తయ్యాక ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతి రాజు స్వామివారిని తొలిగా దర్శించుకున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. (సింహాచలం) -
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి
సమున్నత గిరి శిఖరాలు.. కనుచూపుమేరా పచ్చని తివాచీలు పరిచినట్టు అగుపించే మనోహరమైన లోయలు.. గిరుల పాదాలకు మువ్వల పట్టీలు చుట్టినట్టు గలగలలాడే సెలయేళ్లు.. వనకన్యల సిగల్లో గుత్తులుగా అమరినట్టుండే అడవి పూల మాలికలు.. మైదాన ప్రాంతం నుంచి ప్రయాణించి, మలుపుమలుపూ దాటుతూ ఎత్తుకు పోయే కొద్దీ కనిపించే అందం అద్భుతం. సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి వెళుతున్నకొద్దీ తిప్పుకోలేనంత శోభాయమానమైన సొగసు చూపరుల కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు కనిపించే లోయలు కశ్మీరాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. లంబసింగిని దత్తత తీసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఈ ప్రాంతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. చింతపల్లి: చింతపల్లి మండలంలోని ఈ గూడేంలో ఏళ్లతరబడి సుమారు మూడు వందల పీటీజీ కుటుంబాలు నివసిస్తున్నాయి. రోడ్డు కిరువైపులా లోయల మధ్య ప్రయాణం మనస్సును కొత్తలోకాల్లోకి తీసుకు వెళ్తోంది. ఇక్కడికి వస్తున్న సందర్శకులకు లంబసింగి అందాలు కట్టిపడేస్తున్నాయి. దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మెండుగా అవకాశాలున్నాయి. ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాల గ్రామాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మన్యంలో కశ్మీర్ వాతావరణం తలపించే లంబసింగిని దత్తత తీసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఈ ప్రాంతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇదేమాట గతంలోనే అప్పటి మంత్రి పసుపులేటి బాలరాజు ప్రకటించారు. ఇక్కడ సీతాకోక చిలుకల పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మంత్రి గంటా నోట అదేమాటతో మరోసారి పర్యాటక హంగులపై ఆశలు కలుగుతున్నాయి. కశ్మీరు వాతావరణం ఉండే లంబసింగి ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉంంది. ఏజెన్సీ ముఖద్వారమైన డౌనూరు నుంచి సుమారు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే లంబసింగి వస్తుంది. ఈ మార్గమంతటా కొండలు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే ఈ మార్గం ప్రయాణికులకు వింత అనుభూతి కలిగిస్తుంది. శీతాకాలంలో ఎర్రగా విరగ్గాసే కాఫీ తోటలు, పసుపు ఆరబోయినట్లు ఉండే వలిసెపూల తోటలు పర్యాటకుల మనస్సులను దోచుకుంటాయి. వేసవిలో కూడా లంబసింగి ప్రాంతంలో చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా కమ్ముకునే పొగమంచు ప్రకృతి ప్రియుల మనస్సులను దోచుకుంటాయి. మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే సూర్యకాంతి పరవశింపజేస్తుంది. తాజంగి రిజర్వాయర్, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రిజర్వాయర్‌లో ఇటీవల ప్రైవేటు వ్యక్తులు బోటు షికారును కూడా ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు, అద్భుతమైన అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో ఇటీవల బోడకొండమ్మ ఆలయానికి సమీపంలో ఒక అద్భుతమైన జలపాతం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఇక్కడ అందాలను తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నంలో బస చేసి ఇక్కడికి రావడం అసౌకర్యంగా ఉంటోంది. లంబసింగిలో పర్యాటకుల బసకు అనువైన వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈమేరకు గతంలోనే పర్యాటకశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు ప్రకటించారు. అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ప్రైవేటు వ్యక్తులు ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. స్టాళ్లు, పర్యాటకులు బస చేసేందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు స్థానిక గిరిజనుల నుంచి భూములను లీజుకు తీసుకుంటున్నారు. ఈ దశలో మంత్రి గంటా ప్రకటన ఈ ప్రాంత అభివృద్ధిపై మరిన్ని ఆశలు రేకెత్తించాయి. ఆయన హమీలు ఎంత వరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే. -
విద్యా శాఖకు భారీ బడ్జెట్
రూ.18,250 కోట్లు కేటాయింపు పరీక్ష హాళ్లలో సీసీ కెమెరాలు మంత్రి గంటా వెల్లడి విశాఖపట్నం సిటీ: రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ విద్యా శాఖకు రూ. 18,250 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని రాష్ట్ర మానవ వనరుల, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రోటరీ ఇండియా లిటరసీ మిషన్ కార్యక్రమంలో భాగంగా చెన్నై రోటరీ అందిస్తున్న రూ. 20 లక్షల విలువైన 32లక్షల పుస్తకాలను జీవీఎంసీ ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం ఓ హోటల్లో జరిగింది. విశాఖలోని 54 మున్సిపల్ పాఠశాలలకు బుక్ బ్యాంక్ కోసం ఈ 32 లక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ 2017 నాటికి రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యతకు ప్రయత్నిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్ జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.ఎయిడెడ్ పాఠశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని మార్పులు చేయబోతున్నామని, పిల్లల యూనిఫాంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక టాయిలెట్లు వంటి సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. -
పంతం నెగ్గించుకున్న గంటా
వచ్చిన కొద్దిరోజులకే అనకాపల్లి ఆర్డీవో బదిలీ వుడా కార్యదర్శి..ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకూ.. పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌కు స్థానచలం సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికారిక సంస్థ(సీఆర్డీఏ)కు డిప్యూటీ కలెక్టర్లుగా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 36 మందికి స్థానచలం కలిగించగా, వారిలో జిల్లాకు చెందిన నలుగురున్నారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతికి కూడా ఈ బదిలీల్లో వేటు పడింది. అనకాపల్లి ఆర్డీవోగా ఆమె నియామకాన్ని రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించారు. అయినప్పటికీ మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చక్రం తిప్పి ఆమెను జిల్లాకు రప్పించారు. నాటి బదిలీల్లో పట్టుబట్టి మరీ పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా పోస్టింగ్ ఇప్పించారు. నాటి నుంచి మంత్రి గంటాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌లు ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏదోవిధంగా ఆమెను సాగనంపేందుకు మంత్రి గంటా విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు తనపంతం నెగ్గించుకున్నారు. నవంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చిన ఆమె అనతి కాలంలోనే బదిలీ వేటుకు గురయ్యారు. కాగా వుడా కార్యదర్శిగా పనిచేస్తున్న జీసీ కిషోర్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూ టీవ్ డెరైక్టర్ ఎఎన్ సలీం ఖాన్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.పద్మలతలు సీఆర్డీఏకు బదిలీ అయ్యారు. అదే విధంగా విశాఖపట్నం సెంట్రల్ మెడికల్ స్టోర్ ఇన్చార్జిగా అనకాపల్లి యూఎఫ్‌డబ్ల్యూసీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎఫ్.రవీంద్రను నియమిస్తూ వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేను కానీ, గంటా కానీ ...
విశాఖపట్నం: టీడీపీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నది తమ నిర్ణయం కాదని ఏపీ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు గురువారం విశాఖపట్నంలో విలేకర్ల సమావేశంలో తెలిపారు. తాను కానీ, తన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ పార్టీలో సభ్యులం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనే తుది నిర్ణయం మాత్రం చంద్రబాబు నాయుడిదేనని ఆయన వెల్లడించారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొణతాల ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో చేరికపై జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు వెనుక ఉండి నడిపిస్తున్నారని ప్రచారం జరగుతుంది. టీడీపీలోకి కొణతాల ప్రవేశాన్ని అడ్డుకోవాలని జిల్లాకు చెందిన ఓ సామాజిక వర్గం బలంగా వ్యతిరేకిస్తుంది. ఆ క్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రితోపాటు ఓ ఎంపీ పావులు కదుపుతున్నారు. అందుకు ఎంపీ నివాసం వేదికగా కొణతాల వర్గాన్ని టీడీపీలో చేరకుండా అడ్డుకునేందుకు వ్యూహారచన చేసినట్లు సమాచారం. కొణతాలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు అయ్యన్న పాత్రుడే మమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారని ఇదే జిల్లాకు చెందిన పచ్చ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ సమావేశంలో తమ ఆవేశాన్ని ప్రదర్శించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొణతాలను టీడీపీ చేరేందుకు ప్రయత్నిస్తున్నారటగా అని విలేకర్లు అడిగి ప్రశ్నకు అయ్యన్నపాత్రుడు పై విధంగా స్పందించారు. -
మంత్రి గంటా రాజకీయ ఊసరవెల్లి
అమాత్యుని అవినీతి పెరుగుతోంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ విశాఖపట్నం (తగరపువలస): తరచూ పార్టీని..నియోజకవర్గాన్ని మార్చే మంత్రి గంటా శ్రీనివాసరావును రాజకీయ ఊసరవెల్లిగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుద్‌హుద్ తుపాను తర్వాత భీమిలి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పర్యటించారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడంతో విఫలమైనందున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మందలించారన్నారు. అందువల్లే గంటా అలిగి పడుకున్నారన్నారు. వైఎస్.జగన్మోహనరెడ్డి భీమిలి తోటవీధి, బోయివీధిలో పర్యటించినప్పుడు గంటా ఇక్కడే ఉండి ఇప్పటివరకు తాము బతికున్నామో చచ్చామో కూడా చూడలేదని మత్స్యకారులు వాపోయిన సంగతిని గుర్తు చేశారు .అలాంటి గంటాకు వైఎస్.జగన్మోహనరెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. పోటీ చేయాలని ఉవ్విళ్లూరితే అసెంబ్లీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి కర్రి సీతారామ్‌పై పోటీచేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. అవినీతి, కబ్జాలకు మారుపేరు గంటా.. మంత్రి అనుచరుడు భాస్కరరావు ఇటీవల రూ.475 కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడినట్టు ఒక దినపత్రికలోనే ప్రచురితమైందన్నారు. తుపాను తర్వాత 20 రోజులకు తన తల్లిపేరిట కార్యక్రమానికి వ్యాపారులను, విద్యాసంస్థలను బెదిరించి రూ.లక్షలు చందాలుగా వసూలు చేశారని అమర్నాథ్ ఆరోపించారు. ఎయిడెడ్ ఉపాద్యాయుల విరమణ వయసు పెంచడానికి విద్యాశాఖలో అవినీతి జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రాబాబే ఇతర మంత్రుల ముందు అంగీకరించి తర్వాత గంటాను వెనకేసుకురావడంతో ఆయనకూ ఇందులో వాటా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అక్రమంగా ఉపాధ్యాయులను బదిలీ చేయడానికి పైరవీలు చేస్తూ గంటా కుటుంబ సభ్యులే రూ.లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. భీమిలి ఇన్చార్జ్ కర్రి సీతారామ్ మాట్లాడుతూ భీమిలిలో గంటా గెలుపు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఓట్లు చీల్చలేకపోవడంతోనే సాధ్యమైందన్నారు. 2009లో భీమిలిలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్ల కంటే 2014లో తనకే అధికంగా ఓట్లు లభించాయన్నారు. దమ్ముంటే మళ్లీ ఇప్పుడు తనపై పోటీచేసి గెలవాలన్నారు. భీమిలి పట్టణ ఇన్చార్జి అక్కరమాని వెంకటరావు మాట్లాడుతూ చిట్టివలస జూట్‌మిల్లును తెరిపించడంతో మంత్రి గంటాతో పాటు కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విఫలమయ్యారన్నారు. నేటినుంచి వైఎస్సార్సీపీ వార్డు కమిటీలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలో వార్డు కమిటీలు ప్రకటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భీమిలి విలీనంపై పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత జోన్లో కూడా కమిటీల వేస్తామన్నారు. -
ఎంసెట్ నిర్వహణపై రెండు రోజుల్లో స్పష్టత: గంటా
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఉమ్మడిగానా లేదా వేర్వేరు గా నిర్వహించాలా అనే దానిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శాసన మండలి మీడియా పాయింట్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడిగా పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తిరుపతిలో ఐఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, గన్నవరంలో ఎన్ఐటీ సంస్థల ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నట్టు తెలిపారు.వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంగళగిరిలో ఏర్పాటవుతున్న ఏఐఐ ఎంఎస్ సంస్థ స్థల పరిశీలనకు శనివారం కేంద్ర కమిటీ వస్తోందని తెలిపారు. పొడిగింపునకు ఒప్పుకోలేదు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున 2 రోజుల పాటు శాసన మండలి సమావేశాలు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఒప్పుకోలేదని మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. -
కదిలే చెక్క గుర్రంలా విద్యా శాఖ
ఏపీ విద్యా శాఖ సమీక్షలో మంత్రి గంటా శ్రీనివాసరావు సాక్షి, విజయవాడ బ్యూరో: ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, ఎంత ప్రయత్నించినా విద్యా శాఖపై రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడంలేదని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యా శాఖ కదిలే చెక్క గుర్రంలా తయారైందని, నడుస్తున్నట్లుగా పైకి కనిపిస్తున్నా, ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖాధికారులతో సోమవారం ఇక్కడ నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఆ తర్వాత విలేకరులతోనూ గంటా మాట్లాడారు. విద్యా శాఖలో ఆధార్ లింకేజి, వెరిఫికేషన్‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాదినుంచి ఆధార్ ఆధారంగానే అన్ని పనులూ జరుగుతాయని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి విద్యా శాఖాధికారులంతా నెలలో రెండు రోజులు బడిలోనే ఉండేలా వచ్చే నెల నుంచి ‘బడిలో బస’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లలో సదుపాయాల అభివృద్ధిపై ఒక కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనానికి అన్ని స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. విద్యార్థినులపై వేధింపులు జరగకుండా ఉపాధ్యాయుల ప్రవర్తనను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, వెబ్‌క్యామ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా నియమించే 10,300 మందినీ ఒక చోట చేర్చి సీఎం ప్రమాణం చేయిస్తారని చెప్పారు. అధికారులంతా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో నెలకొల్పాలనుకున్న నిట్‌ను కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేయాలనుకున్న ట్రిపుల్ ఐటీని తాడేపల్లిగూడేనికి మారుస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా, మార్పు రాలేదని అన్నారు. మార్చి 11 నుంచి ఏపీలో జరిగే ఇంటర్ పరీక్షలకు 9,90, 164 మంది హాజరవుతున్నారని తెలిపారు. -
టెన్త్ పరీక్షలు మార్చి 26 నుంచి
ఏప్రిల్ 11తో ముగియనున్న పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2015 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 రోజులు జరగనున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పాల్గొన్నారు. విభజన తరువాత ఏపీలోని 13 జిల్లాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి వివరించారు. మిగతా పబ్లిక్ పరీక్షలకు ఇబ్బంది లేకుండా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఎస్ఎస్సీ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అది ఇచ్చే నివేదికను పరిశీలించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త పద్ధతి అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
‘ఉమ్మడి’తో విద్యార్థులకు మేలు: గంటా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తే ఇరు రాష్ట్రాల విద్యార్థులకు మేలు కలుగుతుందని ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు, జాతీయస్థాయి కాలేజీల ప్రవేశాల్లో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఆదివారం గవ ర్నర్‌తో గంటా భేటీ అయ్యారు. అనంతరం గంటా మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో పరీక్షలపై సానుకూల పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ముందుకు విశాఖ రాజకీయం
-
విద్యాస్పర్థలు ఇంకెన్నాళ్లు!
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత విద్యారంగం వివాదాలకు ఆలవాలమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అడుగడుగునా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్, ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల మధ్య విభేదాలు-నిత్యం వివాదాలే. ఈ వైఖరులపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముఖ్యాంశాలు... తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రశ్న: విభజన తరువాత విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలేమిటి? జవాబు: పరీక్షలు, ప్రవేశాల కౌన్సెలింగ్, ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డు నిర్వ హణ అన్నీ సమస్యలే. ఉన్నత విద్యామండలి, బోర్డులు ఉమ్మడిగా ఉంటే ఏ ప్రభుత్వం మాట వినాలి? ఉద్యోగులు ప్రాంతాల వారీగా చీలిపోయారు. మా పరీక్షలు మేము నిర్వ హించుకుంటామంటే వారు వద్దంటారు. విభజన చట్టంలో పరీక్షలు ఉమ్మడిగా నిర్వ హించాలని లేదు. కొన్ని ప్రధాన విద్యాసంస్థల్లో నాలుగైదు సీట్లు పోతాయన్న ఉద్దే శంతో కేంద్రాన్ని ప్రభావితం చేసే వారు కొందరు 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉండా లని వీటిని పదో షెడ్యూల్లో చేర్పించారు. పదో షెడ్యూల్లోని సంస్థలు పరస్పర అంగీకారంతో విడిపోయే వీలుంది కదా.. పరస్పర అంగీకారం అంటే.. మరొకరి అనుమతి అని కాదు. చట్టస్ఫూర్తిని వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకరు విడిపోవడానికి అసలు అంగీకరించమంటే ఎలా? అక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు ఇక్కడ అడ్మిషన్లు ఇస్తాం. తప్పు చేస్తే కేంద్రం, కోర్టులు ఉన్నాయి. వాటి జోక్యం లేకుండా పరిష్కరించుకుందామంటే చంద్రబాబు ప్రతిదానిని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై వివాదం ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ జరిగింది. కౌన్సెలింగ్ వేళకి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కౌన్సెలింగ్ నిర్వహించాలంటే వృత్తి విద్యా కళాశాలల్లో నిబంధనల మేరకు జెఎన్టీయుహెచ్ నిర్వహించి వాటికి గుర్తింపు ఇవ్వాలి. కొత్త రాష్ట్రం.. తని ఖీల నిర్వహణకు సమయం కావాలి. అక్టోబర్ 31 నాటికి ప్రవేశాలు పూర్తి చేస్తామన్నాం. ఇదే సుప్రీంకోర్టుకు చెప్పాం. ఆంధ్రా ప్రభుత్వం అంగీకరించక, ఆగస్టు 31లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని అఫిడవిట్ వేసింది. ఉమ్మడి ఉన్నత విద్యామండలి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తుంది? అందుకే మా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసుకున్నాం. కోర్టు తీర్పు మేరకు ఎందుకు కౌన్సెలింగ్ పూర్తి కాలేదు? సాధ్యం కాదని మాకు తెలుసు. కోర్టు ఇచ్చిన గడువులో మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. రెండో కౌన్సెలింగ్ నిర్వహిస్తామంటూ వారు మళ్లీ కోర్టుకు వెళ్తే.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మొదట్లో మేము చెప్పినదానికి అంగీకరించి ఉంటే.. అక్టోబర్ చివరి నాటికి కౌన్సెలింగ్ జరిగి విద్యార్థులందరికీ అవకాశం దక్కేది. తొలి ఏడాదే అడ్మిషన్లలో ఉమ్మడిగా నిర్వహణ సాధ్యం కాదని తేలింది. ఇక ఉమ్మడి పరీక్షలు సాధ్యమా? ఉమ్మడిగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇబ్బందేమిటీ? ఇంటర్ పరీక్షలు ఎవరికి వారే నిర్వహించుకోవడం తక్షణ కర్తవ్యం. ఆంధ్రా లేదా తెలంగాణలో వేర్వేరుగా విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో పరీక్షలు వాయిదా వేసే పరిస్థితి వస్తే రెండో ప్రాంతం పరిస్థితి ఏమిటీ? ఎపీ ప్రభుత్వంతో వివాదం ఎందుకు? మేము సామరస్యంగా వెళ్లాలని అనుకుంటున్నాం. ఇంటర్ పరీక్షల గురించి విద్యామంత్రుల సమావేశానికి ఆంధ్రా మంత్రే చొరవ తీసుకున్నారు. కాని చంద్రబాబు ఈ అంశాన్ని కోర్టుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆంధ్రా విద్యార్థులకు సీట్లు దక్కవన్న భ యాలు ఉన్నాయి కదా? అలాంటివేమీ అక్కర్లేదు. ఆంధ్రా విద్యార్థులకు 15 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో దక్కుతాయి. రాష్ట్ర పునర్య్వవస్థీకరణ చట్టం అదే చెప్పింది. డీఎస్సీ ఎప్పుడు జరుగుతుంది? ఉపాధ్యాయుల పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప.. ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయి.. ఎక్కడ ఎక్కువగా ఉన్నారన్న విషయం తెలియదు. అది తెలిస్తే తప్ప డీఎస్సీ నిర్వహించలేం. అందుకే హేతుబద్ధీకరణపై దృష్టిపెట్టాం. హేతుబద్ధీకరణ తరువాత ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడ్తాం. పాఠ్యాంశాల మార్పు ఎంతవరకు వచ్చింది? పాఠ్యాంశాలు మారుస్తున్నాం. ఇక్కడి చరిత్ర, చరిత్ర పురుషుల విశేషాలను చేరుస్తాం. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ప్రకటించారు. ఎంత వరకు వచ్చింది? ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై పట్టుదలతో ఉన్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభిస్తాం. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్న: విభజన తరువాత విద్యావ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలేమిటి? జవాబు: పదో షెడ్యూల్లోని ఉమ్మడి విద్యాసంస్థల మీద సమస్యలు వస్తున్నాయి. ఇరు ప్రాంతాల విద్యార్థుల సమానావకాశాల కోసం వాటిని పదో షెడ్యూల్లో చేర్చారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలి. అలా జరగకనే ఈ సమస్యలన్నీ. ఏదైనా చర్చలతో పరిష్కరించువచ్చునని ఆశిస్తున్నాం. రాష్ట్రం విడిపోయింది. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించుకుంటే తప్పేమిటని తెలంగాణ అంటోంది! ఎవరైనా చట్టం స్ఫూర్తిని గౌరవించాలి. పదో షెడ్యూల్‌తో వచ్చే ఇబ్బందుల గురించి కేసీఆర్ నాడే చెప్పాల్సింది. ఇపుడు గౌరవించబోమంటే ఎలా? ఇప్పుడైనా కూర్చొని మాట్లాడుకోవాలి. కేసీఆర్ అందుకు భిన్నంగా వెళ్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలపై ప్రతిష్టంభన ఇంకెన్నాళ్లు? ఈ పరీక్షలు ఉమ్మడిగానే జరగాలని చెబుతున్నాం. ఎంసెట్, జేఈఈ వంటి పరీక్షలలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ అమలవుతున్నందున కామన్ మెరిట్‌లిస్టు రూపొందించాలంటే ఉమ్మడిగానే పరీక్షలు జరగాలి. వేర్వేరుగా జరిగితే మార్కులు, ర్యాంకుల విషయంలో అపోహలొస్తాయి. మొదటి సంవత్సరం ఉమ్మడిగా పరీక్షలు రాయించి, రెండో ఏడాది వేర్వేరుగా నిర్వహిస్తామంటే ఎలా? దీని మీద వచ్చే ఏడాది నిర్ణయించుకోవచ్చని చెబుతున్నాం. ఓపెన్‌కోటా సీట్ల కేటాయింపే పదో షెడ్యూల్ స్ఫూర్తి అని, ఉమ్మడి పరీక్షలు కాదని టి.నేతలు చెబుతున్నారు? చట్టం ఉద్దేశం అదికాదు. కామన్ అడ్మిషన్లుండాలన్నారు. అయితే అడ్మిషన్లు వేరే, పరీక్షలు వేరే అని ఉండదు. ఈ ఏడాది ఇంటర్‌పరీక్షలు వేర్వేరుగానా?ఉమ్మడిగానా? ఉమ్మడిగానే ఉండాలంటున్నాం. తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చించాం. వారి స్పందన రాలేదు. ఇది లక్షలాది మంది తెలుగు పిల్లల భవిష్యత్తుకు సంబంధించినది. కనుక విశాల దృక్పథంతో చూడాలి. పరీక్షలు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ చెబుతోంది! మార్గమేమిటి? ఉమ్మడిగా పరీక్షలకు వెళ్లడమొక్కటే మార్గం. వరదలూ తుపాన్లవల్ల ఏపీలో పరీక్షలు వాయిదా పడితే, తెలంగాణకు ఇబ్బంది అనడం సరికాదు. తెలంగాణలో సమస్య వచ్చినా అంతే. ఈ ఇబ్బందులు ఉమ్మడి రాష్ర్టంలోనూ వచ్చాయి. అలాంటప్పుడు ఉమ్మడి బోర్డు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఎంసెట్ ఈసారి గందరగోళంగా జరిగింది. వచ్చే ఏడాది ఏం చేస్తారు? ఎంసెట్ ఉమ్మడిగానే ఉండాలి. ఎంసెట్ ఉంచాలా? తీసేయాలా? ఎంసెట్ పెట్టినా ఇంటర్ మార్కులే ప్రధానంగా సీట్లు కేటాయించాలా? వంటి అంశాల గురించి ఆలోచన జరుగుతోంది. తెలంగాణలోనూ ఎంసెట్ తీసేయాలనే అభిప్రాయం ఉన్నట్లు సమాచారం. అలా అయితే ఇరుప్రాంతాలు ఒకే విధానంతో వెళ్లొచ్చు. ఈ వివాదాలకు పరిష్కారమెలా? చట్టం స్ఫూర్తిని గౌరవిస్తూ, విద్యార్థుల బాగుకు రెండు రాష్ట్రాలు సమన్వయంతో సాగాలి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డును ఏర్పాటు చేయడంతో గందరగోళం తలెత్తింది. అందుకోసమే ఇటీవల నేనే రెండు రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇది తొలి అడుగే. మరికొన్ని భేటీలతో స్పష్టత వస్తుంది. డీఎస్సీ ప్రకటన ఎప్పుడు? బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జీటీకి అవకాశమివ్వాలని సీఎం చెప్పారు. కేంద్రంతో మాట్లాడాం. వారి ఆదేశాల మేరకు చేస్తాం. కొత్త రాష్ట్రంలో పాఠ్యప్రణాళికలో మార్పులు చేస్తారా? ఇప్పటికివే. వచ్చే ఏడాది సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆపై మార్పులు తెస్తాం. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు ఎప్పుడు? విశాఖలో ఐఐఎంకు, తిరుపతి సమీపంలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ల కోసం స్థలాలను ఎంపికచేశాం. ఎన్ఐటీకి తాడేపల్లిగూడెంలో రెండు ప్రాంతాలు ఎంపికచేశాం. సీఎం ఒక దానిని ఖరారు చేస్తారు. ట్రైబల్ వర్సిటీకి విశాఖపట్నం దగ్గర సబ్బవరం సమీపంలో స్థలాన్ని చూస్తున్నాం. సెంట్రల్ వర్సిటీ, ట్రిపుల్ ఐటీలపై కేంద్రం కమిటీని వేయాలి. వచ్చే ఏడాదినుంచి తాత్కాలిక భవనాల్లో ఐఐటీ, ఐఐఎంలను ప్రారంభించాలనుకుంటున్నాం. -
అర్హులందరికీ పరిహారం
పారదర్శకంగా నష్టం అంచనాలు వేయండి సర్వే గడువు మరో మూడురోజులు పొడిగిస్తాం జాబితాలను గ్రామసభల్లో పెట్టండి అధికారులతో మంత్రులు గంటా, పత్తిపాటి సాక్షి, విశాఖపట్నం: ‘గతంలో విపత్తులు సంభవించినప్పుడు..ఎన్నడూ ఇవ్వలేని స్థాయిలో రెట్టింపు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనర్హులకు అందినా ఫర్వాలేదు కానీ, అర్హుల్లో ఏ ఒక్కరూ మిస్ కావడానికి వీల్లేదు’ అని రాష్ర్టమంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నష్టం అంచనాలపై సమీక్షించారు. తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి నుంచి గ్రామ నౌకరు వరకు ప్రతీ ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించాం. కేవలం ఆరు రోజుల్లోనే సాధారణ పరిస్థితుల్లోకి రాగలిగాం. ఇప్పుడు నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్య’మని మంత్రులు అన్నారు. గ్రామాల్లో నష్టం అంచనాలను పారదర్శకంగా చేపట్టండి. తుది జాబితాలను గ్రామసభల్లోనే కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించండి.. అభ్యంతరాలుంటే స్వీకరించి అర్హుల్లో ఏ ఒక్కరూ జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండని సూచించారు. ప్రతీ ఒక్కర్ని ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నష్టం అంచనాల కోసం క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే గడువు మరో మూడురోజులు పెంచే విషయమై కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లి అనుమతి తీసుకుంటామన్నారు. పలువురు మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ నగరంలో అందుతున్న వేగంగా గ్రామస్థాయిలో నిత్యావసరాలు,కూరగాయల పంపిణీ జరగడం లేదన్నారు. విశాఖలో మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కోరారు. విశాఖలో తొమ్మిది సరుకులిస్తుంటే గ్రామాల్లో ఐదు సరుకులే ఇస్తున్నారని దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. వరిపొలం పచ్చగా ఉన్నా తుఫాన్ ప్రభావానికి గురైనట్టుగానే పరిగణనలోకి తీసుకోవాలని,కొబ్బరి, జీడిమామిడి, మామిడి, సపోటా వంటి హార్టికల్చర్ పంటలకు కోళ్లఫారాలకు, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ఉదారంగా స్పందించాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవానీ, ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, జిల్లాసహకార శాఖాధికారి ప్రవీణ, ఆర్డీవో వెంకట మురళి, భీమిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్శన్ గాడు చిన్న కుమారి లక్ష్మి పాల్గొన్నారు. -
రసాభాస
నోరుపారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిలదీసినవైఎస్సార్సీపీ సభ్యులు అరుపులు, కేకలతో సాగిన జెడ్పీ సమావేశం తుపాను నష్టంపై చర్చ నామమాత్రం తుపాను బాధితులకు పునరావాసం, పరిహారం విషయమై చర్చిం చాల్సిన జెడ్పీ సాధారణ సమావేశం నామమాత్రంగా సాగింది. పరస్పర దూషణలతో రసాభాసగా మారింది. ఒక్క తీర్మానం చేయలేదు. ఎందుకు సమావేశం నిర్వహించారో, ఏ సమస్యకు పరిష్కార మార్గం చూపించారో ఎవరికి తెలియదు. చైర్పర్సన్ నడిపించాల్సిన సభను నిబంధనలకు విరుద్ధంగా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వేదికపై కూర్చొని అంతా తానై వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కేవలం 10 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అసలు హాజరుకాలేదు. తుపాను కారణంగా నష్టపోయిన ఏజెన్సీ మండలాల్లో గిరిజన సమస్యలపై చర్చించాలని కోరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు విరుచుకుపడ్డారో, అందులో తప్పేముందో ఎవరికీ అర్థం కాలేదు. విశాఖ రూరల్ : జిల్లా పరిషత్ సాధారణ సమావేశం నామమాత్రంగా సాగింది. తుపాను కారణంగా కష్టాల్లో ప్రజలు ఉన్న నేపథ్యంలో నిర్వహించిన జెడ్పీ తొలి సాధారణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. ఒక్క అంశంపై కూడా సుదీర్ఘ చర్చ జరగలేదు.పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఒక సందర్భంలో అనుచిత వ్యాఖ్య చేయడంతో సభలో పెద్ద దుమారమే లేచింది. ఈ కమంలో అజెండా ప్రారంభించినప్పటికీ ఒక్క అంశంపై కూడా పూర్తిస్థాయిలో చర్చించలేదు. స్థానిక సమస్యలపై మాట్లాడాలని ప్రయత్నించినా జెడ్పీటీసీలకు ఎమ్మెల్యేలు అవకాశమివ్వకపోవడం పట్ల టీడీపీ సభ్యులే సభలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం అయిదు అంశాలపై పదేసి నిమిషాలు అధికారుల నివేదికలు విని అర్ధంతరంగా సమావేశాన్ని ముగించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తాం సమావేశం ప్రారంభమైన తరువాత తుపానులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన బాధితులకుందరికీ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తుపాను వచ్చిన రెండు రోజునే జిల్లాకు వచ్చి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టిన సీఎం చంద్రబాబునాయుడుకు, తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాన్ని వేగంగా ముగించడానికి సభ్యులు సహకరించాలని ఆమె కోరగా.. దారుణమైన విపత్తుకు ప్రజలు నష్టపోయారని, కష్టాల్లో ఉన్నారని, సుదీర్ఘంగా చర్చ జరిగి వారి సమస్యలు పరిష్కరించాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సూచించారు. దుమారం రేపిన బండారు వ్యాఖ్యలు తుపాను బాధితుల సమస్యలపై చర్చించాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరగా.. వెంటనే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్వరంతో ఒంటికాలిపై లేచారు. ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా.. పెద్దగా కేకలు వేస్తూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అజెండాపై మాత్రమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జరిగిన వాగ్వివాదంలో ఎమ్మెల్యే కిడారితో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యానం చేయడం పెద్ద దుమారాన్ని దారి తీసింది. పరిస్థితి ఇరు పార్టీల సభ్యుల మధ్య తోపులాటల వరకు వెళ్లింది. తుపాను బాధితుల సమస్యల పరిష్కారం కోసం చర్చించాలని కోరితే.. గిరిజన ఎమ్మెల్యే అయిన తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ కిడారి సర్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తూ కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కింద కూర్చున్నారు. సభలో అమర్యాదగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని, తుపాను బాధితుల సమస్యలపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. కిడారిని ఉద్దేశించి బండారు వ్యాఖ్యలు చేయలేదని టీడీపీ సభ్యులు సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇంతలో బండారు మాట్లాడుతూ తాను అలా అనలేదని, తాను తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెబుతానన్నారు. సమస్యలపై అజెండాలో చర్చిద్దామని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చైర్పర్సన్ లాలం భవాని చెప్పడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు తిరిగి వారి సీట్లలో కూర్చున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పీలా గోవింద సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
15న విశాఖలో ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవం
మంత్రి గంటా వెల్లడి మంజుభార్గవి పర్యవేక్షణలో కూచిపూడి నాట్య ప్రదర్శనలు విశాఖపట్నం-కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్‌లో అక్టోబర్ 15న భారీస్థాయిలో రాష్ట్రస్థాయి ఉత్సవాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (ఎన్ఎండీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల ‘ఏపీ బ్రాండ్ కూచిపూడి-2014’ పోస్టర్‌ను మంత్రి తన కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవ సందర్భంగా 15న సాయంత్రం ఏపీ పర్యాటక రంగానికి తలమానికంగా భాసిల్లే రామకృష్ణా బీచ్‌లో 30 అడుగుల ఎత్తై కూచిపూడి నాట్య చిహ్నం (సత్యభామ జడ) సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. కాళీమాత ఆలయం ఎదుట ఏర్పాటు చేసే వేదికపై సుప్రసిద్ధ కూచిపూడి నర్తకీమణి ‘శంకరాభరణం’ఫేం మంజుభార్గవి పర్యవేక్షణలో 2 గంటలపాటు నాట్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు గంటా వెల్లడించారు. 11,12 తేదీల్లో పోటీలు భారతీయ సంప్రదాయ కళలపై విద్యార్థులకు అవగాహన పెం పొందించేందుకు పలు రంగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఏపీ బ్రాండ్ కూచిపూడి అనే ఇతివృత్తంపై చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన, జామ్ పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ ఛాయా చిత్రనిపుణుడు దివాకర్ శ్రీనివాస్ కాళీమాత ఆలయ ప్రాంగణంలో పలు భారతీయ నృత్య రీతుల ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో జాలాది చారిట బుల్ ట్రస్టు వ్యవస్థాపక కార్యదర్శి జాలాది విజయ, ఆడిటర్ వెలుగుల శ్రీధర్ డాక్టర్ శ్రీధర్ బిత్ర, వైశాఖిజల ఉద్యానవన డైరక్టర్ చింతపూడి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీతో విశాఖ టూరిజం అభివృద్ధి
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి విశాఖపట్నం : పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విశాఖ టూరిజం అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రుషికొండ ఏపీ టూరిజానికి చెందిన హరితా రిసార్ట్స్‌లో బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ టూరిజం అధికారులు, కలెక్టర్, జీవీఎంసీ అధికారులతో విశాఖ టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ముందుగా టూరిజం శాఖ ఎండీ చందన్ఖాన్ విశాఖలో చేపట్టనున్న ప్రాజెక్టులు, వాటికి ఎంతెంత నిధులు కేటాయించనున్నారో వివరించారు. విశాఖ రీజియన్‌లో సింహాచలం, లంబసింగి, పాడేరు, తొట్లకొండ, అరకువేలీ, మత్స్యగుండం, కొండకర్ల తదితర ప్రాం తాల అభివృద్ధికి రూ.183 కోట్లు కేటాయించామన్నారు. మరో రూ.51 కోట్లతో విశాఖ-భీమిలి బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నామన్నారు. రూ.300 కోట్లతో మధురవాడలో టూరిజం పార్కు, పాడేరులో రూ.55 కోట్లుతో బొటానికల్ గార్డెన్స్, రూ.3 కోట్లతో ఆర్కే బీచ్‌లో 26 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో గల రవీంద్రభారతి తరహాలో రూ.50 కోట్లతో విశాఖలో కూడా ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. విశాఖ ఉత్సవాలను డిసెంబర్ 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నామని తెలిపారు. ఈనెల 27న మధురవాడ జాతరలో రాత్రి బజార్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు. మంత్రి గంటా మాట్లాడుతూ సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌లో అధికారులుంటే ఎలా? హైదరాబాద్‌లో టూరిజం అధికారులుంటే విశాఖలో అభివృద్ధి ఎలా జరుగుతుందంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు అధికారులను నిలదీశారు. టూరిజం అధికారులు విశాఖను నిర్లక్ష్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అందుకే టూరిజం అభివృద్ధి పనులు జరగడంలేదని అనడంలో అర్థంలేదన్నారు. పాడేరులో టూరిజం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించగా, రూ.4.5 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. చిరంజీవి అన్నే నిధులు కేటాయించారు : గత ప్రభుత్వం హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మం త్రిగా ఉన్న చిరంజీవి అన్న విశాఖ బీచ్ అభివృద్ధికి కృషి చేశారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ మంత్రులు పదేళ్లగా విశాఖలో పర్యాటకం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇదే వేదికపై చెబుతుంటే, అవంతి మాత్రం గత ప్రభుత్వంలో అన్న చిరంజీవి పర్యాటకం అభివృద్ధికి కృషి చేశారనడం విశేషం. సమీక్షలో మంత్రి కామినేని శ్రీ నివాసరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, వాసుపల్లి గణేష్కుమార కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ, టూరిజం విభాగం అధికారులు పాల్గొన్నారు. -
ఐఐటీ, ఐఐఎస్ఈఆర్కు స్థల పరిశీలన
శ్రీకాళహస్తి, ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని మేర్లపాక, పంగూరు, జంగాలపల్లె, చింతలపాళెం, తిరుపతికి సమీపం లోని సూరప్ప కశంలోని ప్రభుత్వ భూముల్లో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ల ఏర్పాటుకు గురువారం రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావుతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్రబృందం సభ్యులు భాస్కర్మూర్తి(ఐఐటీ చెన్నై), యూబీ దేశాయ్(ఐఐటీ హైదరాబాద్), నీలం సహాని (ఐఏఎస్, రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ), శైలేంద్రశర్మ (సీపీడబ్యూడీ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్), ప్రవీణ్‌ప్రకాష్ (సాంకేతిక విద్యా నిపుణులు), వినోద్‌సింగ్(ఐఐటీ నిపుణులు) ఆయా ప్రాంతాల్లో కలియతిరిగారు. భూములు బాగానే ఉన్నాయని.. అయితే అటవీప్రాంతంకావడంతో క్రూరమృగాలతో ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చించా రు. మంత్రులు మాట్లాడుతూ భూములపైభాగంలో సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. మరోవైపు రేణిగుంట విమానాశ్రయం, మన్నవరం ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు, చెన్నై, కృష్ణపట్నం, దుగ్గిరాజుపట్నం ఓడరేవులు, రాష్ట్ర రాజధాని విజయవాడకు రోడ్డు, రైలు రవాణామార్గలు ఈ ప్రాంతానికి ఎన్నికిలోమీటర్ల దూరంలో ఉన్నాయనే అంశాలపై చర్చించారు. అనంతరం భూముల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు సూచించారు. ఆయన మేర్లపాక లో 440 ఎకరాలు, పంగూరులో 366, చింతలపాళ్లెంలో 758, పాగాలిలోని 559, పల్లంలోని 929 ఎకరాల భూములున్నాయన్నారు. కేంద్ర బృందంతో తి రుపతి ఎమ్మెల్యే వెంకటరమణ , జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్‌గుప్త, తిరుపతి ఆర్డీవో రంగయ్య ఉన్నారు. -
ఏయూ నియామకాలు సరికాదు
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మూడు నియామకాలు సరికాదని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. బుధవారం సర్య్కూట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విలేకరుల అడిగిన ప్రశ్నకుమంత్రి సమాధానమిచ్చారు. ప్రాధమిక విచారణలో ఇది అక్రమమని తేలిందన్నారు. కొద్ది వారాల క్రితం వర్సిటీలో వివిధ పథకాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు అబ్జార్బ్ పేరుతో వర్సిటీలోని సోషల్ వర్క్, సోషియాలజీ, అకడమిక్ స్టాఫ్ కళాశాలలో నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో కమిటీ నియమించి విచారణ జరిపించాలని ఆదేశించారు. కమిటి ప్రాధమిక విచారణలో నియామకాలు తప్పుపట్టిం దన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్.ఏ.డి పాల్‌ను అకడమిక్ స్టాఫ్ కళాశాలలో, డాక్ట ర్ హరనాథ్‌ను సోషల్ వర్క్ విభాగంలో, సార్క్ అధ్యయన కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ శ్రీమన్నారాయణను సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు. వీటి ని అబ్జార్బ్ చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిపే ఉద్యోగాల భర్తీలో వీటిని ఖాళీలుగా చూ పే అవకాశం ఉండదంటూ వర్సిటీలో దుమా రం రేగింది. ఎటువంటి నోటిఫికేషన్, ఇంట ర్వ్యూలు లేకుండా నియామకాలు జరపడంపై నిరుద్యోగులు సైతం తీవ్ర ఆవేదన చెందారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ప్రాధమిక విచారణతో తప్పు తేలడంతో వర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనే విషయం త్వరలో తేలే అవకాశం ఉంది. విద్యార్థులతో ఆటలొద్దు: గంటా సాక్షి, విశాఖపట్నం : స్థానికత అంశంలో విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ప్రభుత్వ అతిథి గృహంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌కు ఇది సరికాదని మంత్రి హితవుపలికారు. సినీ పరిశ్రమ విశాఖ వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ ఒకరిద్దరి అభిప్రాయమో కాకుండా సినీ రంగంలోని అన్ని విభాగాల ప్రతినిధుల సలహా, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు తెలపారు. బీఈడీ, డీఎడ్ చదువుతోన్న తాజా అభ్యర్థులకు అవకాశం కల్పించడంపై న్యాయపరమైన అంశాల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రంగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని, విద్యాశాఖలోనే 62 శాతం సిబ్బంది లోటున్నట్టు లెక్కలు చెప్తున్నాయన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసమే బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి మాట్లాడారని, వారికి నష్టం కలగని రీతిలోనే తవ్వకాలు చేపడతారన్నారు. గిరిజనులు వ్యతిరేకిస్తే బాక్సైట్ తవ్వకాల్ని నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. -
సింహాచలంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్
భూ సమస్య త్వరలో పరిష్కారం కనకమహాలక్ష్మి, అప్పన్న ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభోత్సవంలో మంత్రి గంటా పాతపోస్టాఫీసు/ సింహాచలం : బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాల్లో నిత్యాన్నదాన పథకాన్ని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. తొలుత కనకమహాలక్ష్మి ఆలయం లో ప్రారంభించి ప్రసంగించారు. సింహాచలం దేవస్థానంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ, కోస్ట్‌గార్డు కళాశాలలు ఏర్పాటు చేయాలి చూస్తున్నట్టు తెలిపారు. సింహాచలం భూముల వివాదం ఒకటి, రెండు నెలల్లో పరిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. కొండపై కాటేజీలు నిర్మాణం చేసే యోచన ఉందన్నారు. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని, ప్రణాళికలు తయారుచేసి కార్యాచరణకు దిగుతామన్నారు. తాజ్, ఒబెరాయ్, ఫోర్‌పాయింట్స్ హోటల్స్‌కు సింహాచలం దేవస్థానానికి చెందిన కొంత స్థలాలు కేటాయించి వాటిలో షేర్ తీసుకోవడం, వుడా, జీవీఎంసీ సంయుక్త భాగస్వామ్యంతో దేవస్థానం స్థలాల్లో ఐటీ అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి యోచిస్తున్నట్టు వివరించారు. తొలుత కనకమహాలక్ష్మి అమ్మవారికి మంత్రి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ పాల్గొన్నారు. కొండపై రోజుకు 5వేల మందికి అన్నదానం సింహగిరిపై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారం భించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ రోజుకు ఐదు వేల మందికి అన్నదానం చేయనున్నట్టు తెలిపారు. దేవస్థానం తరఫున వైద్య సదుపాయం అందించేందుకు అడవివరం ఆరోగ్య కేందాన్ని దత్తత తీసుకోవాలా లేదా కొత్తగా వైద్యశాల నిర్మించాలా వంటి ఆలోచన చేస్తున్నా మన్నారు. తొలుత శ్రీగోకుంలో గోపూజల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణాపురంలోని గోశాలలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి
విశాఖపట్నం : విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమిర్ ఘోష్ ప్రొడక్షన్‌పై బత్తుల అమర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘టైమ్ బాలేదు’ లఘుచిత్రం ఆదివారం విడుదలైంది. ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గంటా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, జర్నలిజం ప్రొఫెసర్ బాబివర్ధన్లు వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖలో ఎంతో మంది నైపుణ్యం గల యువకులు ఉన్నారన్నారు. కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం సాధించవచ్చునని పేర్కొన్నారు. రచయిత్రి జాలాది విజయ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అన్నంరెడ్డి వాణి, ప్రతినిధి కేదారలక్ష్మి, లఘు చిత్రం హీరో కేదార్ వెంకటేష్, హీరోయిన్ నవ్యగోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడముఖం పెడముఖం
బాబు సమక్షంలోనూ మారని మంత్రుల తీరు సీఎం పర్యటనలోనూ కొనసాగిన విభేదాలు సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రడు,గంటాశ్రీనివాసరావుల విభేదాలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు పర్యటనలోనూ బయటపడ్డాయి. కలిసి పనిచేసుకోవాలని గతంలో చంద్రబాబు వీరిద్దరికి హితవు పలికినా.. తమ పద్ధతి ఇంతేనని చాటుకుంటున్నారు. సీఎం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దగ్గర నుంచి తొలిరోజు పర్యటన ముగిసేవరకు అక్కడక్కడా చిన్న పలకరింపు మినహా అసలు మాట్లాడుకోలేదు. చివరకు ప్రసంగించే వాహనంపైకి బాబు ఎక్కి మాట్లాడుతున్నా వెనుక ఇద్దరూ దూరందూరంగా నిల్చున్నారు. ఆ తర్వాత గంధవరంలో అయ్యనపాత్రుడు కాన్వాయ్‌ను వదిలి చోడవరం బహిరంగ సభ వద్దకు ముందుగానే వెళ్లిపోయారు. చాలామంది ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేయగా, వీరు మాత్రం విడివిడిగా తమ పని కానిచ్చారు. చోడవరం బహిరంగ సభ వేదికపైనా ఇద్దరూ వేర్వేరుగా కూర్చున్నారు. గంటా,వ్యవసాయ మంత్రి పుల్లారావు పక్కపక్కన కూర్చుని ఇద్దరూ అదేపనిగా మాట్లాడుకుంటే అయ్యన్న మౌనంగా కూర్చున్నారు. కనీసం బాబు సమక్షంలోనూ పలకరించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వాస్తవానికి సీఎం జిల్లా పర్యటన తొలుత ఖరారైనప్పుడు అధికారులు ఇద్దరు మంత్రులను సమీక్షకు ఆహ్వానించారు. దీనికి అయ్యన్న ముందుహాజరవ్వగా, గంటా ఆలస్యంగా వచ్చారు. దీంతో అయ్యన్న గంటాను ఉద్దేశించి ఎంత సేపు వెయిట్ చేయించావేంటి అని ఆగ్రహించారు. దీనికి గంటా కూడా గతంలో నువ్వుకూడా అలాగే చేశావు కదా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనకాపల్లిలో రాత్రి బస విషయంలోనూ ఇద్దరి మధ్య పంతాలు నడిచాయి. అనకాపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రి బస ఉండాలని గంటా పట్టుబట్టగా, అయ్యన్న మాత్రం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రలోనే బస ఉండాలని పట్టుబట్టి చివరకు మాట నెగ్గించుకున్నారు. చివరకు ఇలా సీఎం పర్యటనలోనూ ఇద్దరు దూరందూరంగానే ఉండడంతో జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఇద్దరిలో ఎవరిని ముందుగా పలకరించాలో తెలియక దూరంగా వెళ్లిపోయారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
నేడు రేపు జిల్లాలో టూర్ అనకాపల్లి అగ్రిపాలిటెక్నిక్లో బస ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు జిల్లాలో ఏర్పాటు పూర్తయ్యాయి. తొలిరోజు శుక్రవారం అనకాపల్లి, చోడవరం ప్రాంతాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి వ్యవసాయపరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)లో బస చేస్తారు. ఈమేరకు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. సీఎం రాత్రికి బస చేసే అగ్రి పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితులు, అందులో సదుపాయాలను మంత్రులిద్దరూ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో 8.30 గంటలకు సీఎం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.45 వరకు అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 9.30 వరకు రిజర్వులో ఉంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10 గంటలకు అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళతారు. దర్శనానంతరం ఉదయం 10.15 నుంచి 11గంటల వరకు రిజర్వులో ఉంటారు. తిరిగి 11 గంటలకు తుమ్మపాల, 11.40కి గంధవరం,12.25గంటలకు గజపతినగరం గ్రామాలకు వెళ్లి స్థానికులతో ముచ్చటిస్తారు. 12.55 గంటలకు చోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో లంచ్ చేసి 2.30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 వరకు చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రైతులు, ఉపాధిహామీ కార్మికులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 5.30కు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)కు వెళ్లి శాస్త్రవేత్తలు, విద్యార్థులతో సమావేశమవుతారు. సాయంత్రం 6.30 నుంచి 8గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 8.30గంటల వరకు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. -
కదం తొక్కిన మురికివాడ వాసులు
మంత్రి గంటా ఇల్లు ముట్టడి ఉన్న చోటే ఇళ్లు కట్టివ్వాలని ఇందిరాగాంధీ కాలనీవాసుల డిమాండ్ పక్కా ఇళ్ల హామీతో ఆందోళన విరమణ విశాఖపట్నం: తామున్న చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైల్వే న్యూకాలనీ ఇందిరాగాంధీ కాలనీ వాసులు మంత్రి గంటాశ్రీనివాసరావు ఇంటిని మంగళవారం ఉదయం ముట్టడించారు. ఎంవీపీ కాలనీలో మంత్రి ఇంటి వద్ద ఆందోళనకారులనుద్దేశించి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ 70 ఏళ్ళుగా ఇందిరాగాంధీ కాలనీలో ఉంటున్న మురికివాడవాసులను ఖాళీ చేయాలంటూ జీవీఎంసీ నోటీసులు జారీ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అక్కడే నెహ్రూ పథకం కింద పక్కా ఇళ్లు నిర్మించాలని, మిగిలిన వారికి జ్ఞానాపురం లారీస్టాండ్ ప్రాంతంలో నిర్మించిన నెహ్రూ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం జీవీఎంసీ కమిషనర్‌తో ఈ విషయమై చర్చిస్తామని హామీ ఇచ్చిన మంత్రి గంటా ఆ హామీని విస్మరించినందుకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించామని లక్ష్మి పేర్కొన్నారు. ఆందోళనకారులు శాంతించకపోవటంతో జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, చీఫ్ సిటీప్లానర్ వెంకటరత్నం, జోన్-4 జోనల్ కమిషనర్ నాగనరసింహారావులను మంత్రి గంటా అక్కడికి రప్పించారు. అనంతరం మంత్రి ఆందోళనకారులతో మాట్లాడారు. మురికివాడ స్థలంలోనే లేఅవుట్ వేసి పక్కా ఇళ్లు నిర్మించాలని, మిగిలిన వారికి జ్ఞానాపురం లారీస్టాండ్లోని నెహ్రూ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీనితో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో మురికివాడల నివాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.రవి, ప్రధాన కార్యదర్శి కె.నిర్మల, ఐఎఫ్టీయూ ప్రతినిధి మల్లయ్య, భారత నాస్తిక సమాజం ప్రతనిధి నూకరాజు, అరుణోదయ సంస్థ నుంచి వెంకటలక్ష్మి, ఇందిరాగాంధీ కాలనీ హరిజనసేవా సంఘం నాయకులు ఈ.లక్ష్మి, దాలమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి గంటా ఇంటి ముట్టడించిన కాలనీ వాసులు
విశాఖపట్నం: ఇందిరానగర్‌లోని తమ గృహాలను తొలగించవద్దని విశాఖపట్నం నగరంలోని ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులోభాగంగా మంగళవారం విశాఖపట్నంలోని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసాన్ని ఇందిరానగర్ కాలనీ వాసులు ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా కాలనీ వాసులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తాము ఎంతో కాలంగా ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్నామని చెప్పారు. నగరం సుందరీకరణ పేరుతో తమను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం ఎంత వరకు సబబని వారు ప్రశిస్తున్నారు. అయితే ఇళ్లు కోల్పోయినవారికి కొత్త ఇళ్లు కేటాయిస్తామని జీవీఎంసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఇకపై ఏటా ఆస్తిపన్ను పెంపు
మంత్రులు నారాయణ, గంటా విశాఖపట్నం: ఏటా భూముల ధరలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకున్నట్టే ఆస్తిపన్ను కూడా నిర్దిష్ట శాతం మేరకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ, మానవ వనరులు, విద్యాశాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వారు సోమవారం విశాఖ నగరంలో విలేకరులతో మాట్లాడారు.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర అన్ని సంస్థల్ని అనుసంధానిస్తూ రాష్ట్రంలో అధునాతన ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని వారు వివరించారు. -
అయ్యన్నపాత్రుడు , గంటా మధ్య విభేదాలు
మరోసారి బయటపడ్డ అయ్యన్న, గంటా మధ్య విభేదాలు సమీక్షకు గంటా మూడు గంటలు ఆలస్యం అయ్యన్న అసహనం పరస్పరం విసుర్లు సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే వీరిద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమీక్షలో తేటతెల్లమైంది. సీఎం చంద్రబాబు ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అయ్యన్న ఉదయం 10 గంటలకే ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. మంత్రి గంటా మాత్రం సమావేశం ఉందని తెలిసీ గంభీరం పర్యటనకు వెళ్లిపోయారు. దీంతో అయ్యన్న గంటా ఎంతసేపటికీ రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్‌తోపాటు అధికారులంతా గంటా వెనుకే వెళ్లడంతో అయ్యన్న వద్ద ఒక్క జిల్లా అధికారి మినహా మరెవరూ లేరు. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుండడంతో వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ఆయన బయటకు వచ్చేశారు. ఈలోగా గంటా రావడంతో ఆయన్ను ఉద్దేశించి ‘ఏం మంత్రిగారు.. మమ్మల్ని మూడు గంటలు నిరీక్షింపచేస్తారా’? అని ప్రశ్నించగా, ‘నువ్వు కూడా నన్ను గతంలో చాలా వెయిట్ చేయించావు కదా’ అని గంటా బదులిచ్చి నేరుగా లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా సమావేశం ముగించారు. నవ్వులు విరిశాయ్... చేతులు కలుస్తాయా? అవును... మీరు చూస్తున్నది మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులనే. ఈ చిత్రం ఆదివారం సాయంత్రం చోడవరంలో కనిపించింది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షకు చోడవరం వచ్చిన వీరు స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కార్యాలయంలో పక్కపక్కనే కూర్చున్నారు. చలోక్తులు వేసుకొని నవ్వుకున్నారు. గంటా ముందు ముభావంగానే ఉన్నా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే రాజుపై చలోక్తులు వేయడంతో గంటాతో పాటు ఎంపీ ముత్తంశెట్టి కూడా చిరునవ్వు చిందించారు. దీంతో రాజు కాస్త చిన్నబుచ్చుకున్నట్లు కనిపించినా తర్వాత ఆయన కూడా నవ్వులు కలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చలో మాత్రం గంటా ఆధిక్యం ప్రదర్శించడంతో అయ్యన్న వినడానికే పరిమితమయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రులిద్దరూ వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించడం గమనార్హం. మీ శాఖలో నేను వేలుపెట్టలేదంటూ అయ్యన్న చెబితే... ఈ విషయం ఫోన్లో అడిగావు కదా అంటూ గంటా సమాధానమివ్వడం ఈ పర్యటనలో కొసమెరుపు. మరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కలసినట్టేనా అంటే ఏమో అనే సంశయమే ఇంకా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. - చోడవరం టౌన్ చెప్పింది చాల్లే.. : ముత్తంశెట్టిపై గంటా విసుర్లు విశాఖపట్నం : ఇంతవరకూ గంటా మాటే వేదమని భావించిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి నిండుసభలో నివ్వెరపోయారు. వేపగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి తన ప్రసంగంతో రాష్ట్ర మంత్రి నారాయణను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మంత్రి నారాయణను కొనియాడుతూనే నగరంలో పెండింగ్ ప్రాజెక్టుల జాప్యాన్ని, అధికారుల అనాలోచిత చర్యలను గుర్తు చేశారు. ఇలా ప్రసంగిస్తుండగా, మంత్రి గంటా ఆయన వైపు ఒకింత అసహనంగా చూశారు. ఎంపీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ‘చాల్లే చెప్పింది.. ఇక ఆపు...’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ముత్తంశెట్టి అవాక్కయ్యారు. మీరు ఎంపీ పదవిని అనుభవించారు... అయినా మంత్రిగారు కాస్త ఒత్తిడితో ఉన్నట్లున్నారు...సభకు నమస్కారం అంటూ ప్రసంగం ఆపేశారు. ఆ తర్వాత మంత్రి గంటా మైకుతీసుకుని ముత్తంశెట్టిని మరోమారు చమత్కరించారు. ముత్తంశెట్టికి ఎంపీ పదవి తొలిసారి...అందుకే ఇంత ఉత్సాహం అంటూ...వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు: గంటా
న్యూఢిల్లీ: 1956 స్థానికత వివాదం, ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దేశరాజధానిలో రాజ్‌నాథ్‌సింగ్, అనిల్ గోస్వామి, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు అని అన్నారు. 1956 స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371 డి, ఆరుసూత్రాలు నాలుగేళ్లు ఎక్కడ నివసిస్తే అక్కడే స్థానికుడిగా గుర్తించాలనే నిబంధనలున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి హామీఇచ్చారని మంత్రి గంటా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. -
ఉల్లంఘిస్తే రూ.లక్ష!
లెసైన్స్దార్లకు ‘ఎక్సైజ్’ హెచ్చరిక జిల్లాలో 22 తనిఖీ బృందాలు విశాఖపట్నం : అధిక ధరకు విక్రయించే మద్యం దుకాణాలపై కొరడా ఝళిపించేందుకు ఎక్సైజ్ శాఖ సమాయత్తమవుతోంది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయించే దుకాణాలను ఇకపై వదలకూడదని నిర్ణయించింది. రూపాయి ఎక్కువ తీసుకున్నా రూ. లక్ష పెనాల్టీ విధించాలని ఆదేశాలిచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తనిఖీలు చేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారుల సమీక్షలో రెండ్రోజుల క్రితం మానవ వనరులశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఎమ్మార్పీ ఉల్లంఘనులపై దాడులు చేయాలని మంత్రులే ఆదేశించినప్పుడు ఆ దుకాణాలను నడుపుతున్న ఏ పార్టీ వారెవరైనా కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ అధికారులు కూడపలుక్కున్నారు. శనివారం నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా 22 తనిఖీ బృందాలను అప్రమత్తం చేశారు. విశాఖ జిల్లాలో ప్రతి నెలా రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. రోజు కూలీలు, ఆటో రిక్షా కార్మికులు, కార్మికులు, ప్రభుత్వ క్లాస్ త్రీ, ఫోర్ ఉద్యోగులు తాగే మద్యం బాటిల్‌పై రూ.10లు అధికంగా దోచేవారు. ప్రతి దుకాణంలోనూ డెరైక్టర్స్ స్పెషల్ విస్కీ, ఆఫీసర్స్ ఛాయిస్, మేన్షన్ హౌస్ అనే బ్రాండ్లకు చెందిన 180 ఎంఎల్ బాటిళ్లే ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. వీటి అమ్మకాల ద్వారానే ఒక్కో దుకాణం కనీసం రోజుకు దాదాపు రూ.30 నుంచి రూ. 40 వేల అదనంగా సంపాదించేది. మిగిలిన బ్రాండ్ల అమ్మకాలన్నీ కలిపి భారీగానే దుకాణాలకు రాబడి ఉండేది. ఏడాది కాలంగా ఎమ్మార్పీ ఉల్లంఘన జరిగినా పట్టనట్టు ఎక్సైజ్ మామూళ్ల మత్తులో నిద్రపోయింది. చేతికందినంతా దండుకుని మిగిలింది మీరే ఎంజాయ్ చేయండన్నట్టు మద్యం యాజమానుల కొమ్ముకాసింది. మంత్రి ఉపదేశంతో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ నిద్ర లేచి దాడులకు సిద్దపడుతోంది. 22 బృందాలు రెడీ! ఎమ్మార్పీ ధర ఉల్లంఘిస్తే ఊరుకోం. ఎవరి దుకాణమై నా కేసులు నమోదు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించి న వారిపై కేసులు నమోదుకు 22 ప్రత్యేక తని ఖీ బృందాలను నియమించార . స్పెషల్ టా స్క్‌ఫోర్స్ అదనంగా తనిఖీలు చేస్తుం టుంది. బెల్ట్ దుకాణాలు, అధిక ధరలని ఎక్కడ వినిపించినా రూ. లక్ష పెనాల్టీ వేస్తాం. - ఎం. సత్యన్నారాయణ, డిప్యూటీ కమిషనర్-ఎక్సైజ్ -
ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట
నగర విద్యార్థుల హవా వరుసగా 3, 4, 5 ర్యాంకులు ఏయూ క్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్2014లో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. గురువారం సా యంత్రం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. గణితం విభాగంలో ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన వై.లక్ష్మీ అనసూయ 104 మార్కులతో తృతీయ స్థానంలో నిలి చారు. బయాలాజికల్ సెన్సైస్స్లో బుచ్చిరాజుపాలేనికి చెందిన బి.పవనకీర్తి 105 మార్కులతో నాల్గవ స్థానాన్ని, పెదబొడ్డేపల్లికి చెందిన సీహెచ్.గౌతమ్ 104 మార్కులతో ఐదవ ర్యాంక్‌ను కైవ సం చేసుకున్నారు. విశాఖ జిల్లా పరిధిలో మొ త్తం 5,791 మంది దరఖాస్తు చేయగా 4,965 మంది పరీక్షకు హాజరై 4,911 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 98.91 శాతం విద్యార్థు లు అర్హత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సిం హాచల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకం గా మెడికల్, ఇంజినీరింగ్ తరహా విద్యాసంస్థలను నిర్వహించే ఆలోచన ఉందన్నారు. టీటీడీ తరహాలో విద్యారంగాన్ని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. ఏయూకు సెంట్రల్ హోదా కల్పనపై చర్చ జరుగుతుందని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి 11 జాతీయ విద్యా సంస్థలను మూడు ప్రాంతాలకు సమానంగా అందిస్తామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రాంతానికి, ముఖ్యంగా ఏయూ పూర్వ విద్యార్థిగా మంత్రి గంటాపై వర్సిటీ ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షత వహించారు. వీసీ మాట్లాడుతూ ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలను ఏయూ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఎటువంటి బాధ్యతనైనా నిర్వహించడానికి తా ము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మా వెంకటరావు పరీక్ష నిర్వహణ తీరును వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు సీహెచ్.వి.రామచంద్రమూర్తి, ఆర్.సత్యరాజు, డీన్ టి.కోటేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి, ఆచార్య జి.నాగేశ్వరరావు, వి.వల్లీకుమారి, కె.రాంజీ, రాఘవరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. చదివించి రాశానంతే... గోపాలపట్నం : చదివింది రాశానంతే... పదవర్యాంకు లోపు వస్తుందని ఆశిస్తే మూడవ ర్యాంకు వచ్చిందని బీఈడీ(మేథ్స్)లో మూడో ర్యాంకు సాధించిన వై.లక్ష్మీఅనసూయ సంతోషం వ్యక్తం చేసింది. తన తండ్రి వై.ఎల్.ఎన్.శర్మ రిటైర్డు ఉపాధ్యాయునిగా సేవలందించారని, తానూ ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకుంటున్నట్టు చెప్పింది. భవిష్యత్తులో లెక్చరర్ని కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. -
బండారుకు పూర్తి సహకారం
మంత్రి గంటా పరవాడ: పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలు ఉంటాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వెన్నలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండా రు స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడారు. ఎమ్మెల్యే బండారుకు మంత్రి పద వి రాలేదని నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడు తూ కష్టపడి పనిచేసిన తన లాంటి వారిని అధిష్టానం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల నుంచి తన కుటుంబం రాజకీయాల నుంచి విరమిం చుకుంటుందని చెప్పారు. మంత్రి గంటా అండదండలతో నియోజక వర్గ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అంతకు ముం దు బండారుతో గంటా చర్చలు జరిపారు. -
అయ్యన్నకు అందలం
గంటాకు అప్రాధాన్యం చింతకాయలకు పంచాయతీరాజ్ శాఖ శ్రీనివాసరావుకు విద్యా శాఖ జిల్లాపై పెత్తనం అయ్యన్నదేనని చంద్రబాబు సంకేతాలు డీలా పడిన గంటా వర్గం విశాఖపట్నం: అసలే ఉప్పూ నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య శాఖల కేటాయింపు ఆజ్యం పోయనుంది. జిల్లాలో ఆధిపత్య పోరును మరింత రాజేసేలా జిల్లా మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. కీలకమంత్రిత్వ శాఖలు దక్కించుకోవాలన్న పోటీలో గంటాపై అయ్యన్న పెచైయ్యి సాధించారు. అయ్యన్నపాత్రుడికి కీలకమైన పం చాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖను చంద్రబాబు కేటాయించారు.ఆయనతో పోలి స్తే గంటా శ్రీనివాసరావుకు తక్కువ ప్రాధాన్యమున్న విద్యా శాఖను కేటాయించడం గమనార్హం. కీలకమైన విధులూ, నిధులతో సంబంధమున్న పరిశ్రమల శాఖ గానీ, పురపాలక శాఖగానీ వస్తుందని ఆశించిన గంటాకు తాజా పరిణామం కొంత అశనిపాతమే. అదే సమయంలో అత్యధిక నిధులతోపాటు విస్తారమైన అధికార పరిధి ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ అయ్యన్నకు దక్కడం గమనార్హం. గంటాకు తగ్గిన ప్రాధాన్యం: కీలక శాఖను దక్కించుకోవడం ద్వారా జిల్లాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాల న్న గంటా శ్రీనివాసరావు ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లా రు. గత ప్రభుత్వంలో ఆయన కీలకమైన మౌలికవసతుల కల్పన, పెట్టు బడులు, వాడరేవుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈసారి కూడా భారీ నిధులు, విధులతో విస్తారమై న అధికార పరిధి ఉన్న శాఖను ఆయన ఆశించారు. గంటా కు పరిశ్రమ శాఖ కేటాయించవచ్చని తొలుత వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంటుంది. అందుకే ఆ శాఖను గంటా ఆశించారని టీడీపీ వర్గాలే లీకులు ఇచ్చాయి. పరిశ్రమల శాఖ కాకుంటే ఆయన కు పురపాలక శాఖను కూడా కేటాయించవచ్చని భావించా రు. భారీ నిధులతో కొత్త రాజధాని నిర్మాణ బాధ్యతను పురపాలక శాఖే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన శాఖ తమ నేతకు దక్కితే పండగేనని గంటా అనుచరులు సంబర పడ్డారు. కానీ వారి ఆశ అడియాశే అయ్యింది. గంటా కు విద్యా శాఖను కేటాయిస్తూ చంద్రబాబు బుధవారం నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యా శాఖ కూడా ప్రాధాన్యమైనదే కానీ పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలతో పోలిస్తే అధికార పరిధి తక్కువేనని చెప్పొచ్చు. అయ్యన్నదే ఆధిపత్యం: శాఖల కేటాయింపులో అయ్యన్న కు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. ఆయనకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖను కేటాయిం చారు. నిధుల లభ్యత, బడ్జెట్ కేటాయింపు, అభివృద్ధి పనుల విషయంలో ఈ శాఖ ప్రాధాన్యమైనదే. పంచాయతీరాజ్‌శాఖకు స్థానిక సంస్థల నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి దండిగా నిధులు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక సంఘం నిధులు కావలసినన్ని వస్తాయి. గంటా వర్గానికి చెక్ : ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లా లో గంటా వర్గానికి చంద్రబాబు మెల్లగా చెక్ పెడుతున్నారు. గంటాకు అనుకూలుడైన సీనియ ర్ నేత బండారు సత్యానారాయణమూర్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. బండారు సామాజిక వర్గానికే చెందిన అయ్యన్నపాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఇక ఆయనకు అవకాశం లేనట్లే. శాఖల కేటాయింపులోనూ గంటా కంటే అయ్యన్నకే ప్రాధాన్యం లభించింది. దాంతో అయ్యన్న వర్గం జోష్ మీద ఉండగా... గంటా వర్గం కొంతవరకు డీలా పడిపోయింది. శాఖల కేటాయింపులో అసంతృప్తి టీడీపీ వర్గ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. -
ఛాన్స్ ఎవరికి?
అయ్యన్నా ...బండారా? జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అయ్యన్నవైపే చంద్రబాబు మొగ్గుతారని అంచనాలు అర్ధరాత్రి వరకు బాబు నుంచి ఫోన్ల కోసం ఆశావహుల ఎదురుచూపు ధీమా సడలని గంటా వర్గీయులు సాక్షి, విశాఖపట్నం: టీడీపీ కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స నెలకొంది. శనివారం అర్థరాత్రికే పదవి లభించే నేతలకు ఫోన్ వస్తుందని భావించినా అది జరగలేదు. సీనియర్ నేతలు అయ్యన్న,బండారు సత్యనారాయణ మూర్తి, ఎన్నికల ముందు పార్టీలో చేరిన గంటా శ్రీనివాసరావులలో ఇద్దరికి ఛాన్స్ రావచ్చని ఊహగానాలు వెలువడుతున్నాయి. తొలివిడత అయ్యన్న, బండారులలో ఒకరికి మాత్రమే పిలుపురావచ్చని తెలుస్తోంది. ఒకే సామాజికివర్గానికి చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. శనివారం రాత్రికే పదవులపై స్పష్టత వస్తుందని నేతలంతా ఆశించారు. తమకు బాబు నుంచి ఫోన్ వస్తుందని అయ్యన్న, బండారు ఎదురు చూశారు. అలాంటి కాల్ రాలేదు. దీంతో సస్పెన్షన్ వీడలేదు. సీనియర్‌తోపాటు గతంలో అనేక పదవులు చేపట్టినందున తనకే అవకాశం ఉంటుందని అయ్యన్న విశ్వసిస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనకు పంచాయతీరాజ్‌శాఖ దక్కవచ్చని అంచనా వేసుకుంటున్నారు. విశాఖ నగర పరిధిలో భీమిలి నుంచి గంటాకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిటీ పరిధిలో బండారుకు అవకాశం లేదని,గ్రామీణ జిల్లాలో తనకే పదవి వస్తుందని అయ్యన్న భావిస్తున్నారు. బండారు సైతం అంతే ధీమాతో ఉన్నారు. అయ్యన్నతో పోల్చితే తాను సౌమ్యు డినని విశ్లేషిస్తున్నారు. గంటాకు విస్తరణలో... : కాపు సామాజికవర్గం కింద గంటాకు డిప్యూటీసీఎం పదవి వరిస్తుందని ఆయన వర్గీయులు భావించినా అనుహ్యంగా ఈ పదవి అదే సామాజికవర్గానికి చెందిన నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు ఇవ్వడానికి బాబు నిర్ణయించుకోవడంతో ఆశలు గల్లంతయ్యాయి. మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఒకసారి పార్టీనుంచి వెళ్లిపోయి మళ్లీ కొత్తగా వచ్చిన నేపథ్యంలో వెంటనే ఈయకు పదవిస్తే పార్టీ క్యాడర్,నేతలకు వేరే సంకేతాలు వెళ్తాయనే సంశయంతో అధిష్ఠానం కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మలివిడతలో ఛాన్స్ ఇద్దామనే ధోరణితో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. గంటా మాత్రం తనకు మొదటివిడతలో పదవి వస్తుందని క్యాడర్‌తో చెబుతున్నారు. అయ్యన్న,బండారు ఇద్దరిలో అంతిమంగా చంద్రబాబు అయ్యన్నవైపే మొగ్గుచూపుతారని పార్టీ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. -
పచ్చ గుట్టు.. పబ్లిగ్గా రట్టు!
అనకాపల్లి లాడ్జిలో ‘దేశం’ యవ్వారం నోట్ల పంపిణీకి ‘పెద్దల’ రహస్య వ్యూహం లాడ్జీలోనే ‘పచ్చచొక్కాల’ మకాం.. మంతనాలు ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు అప్పటికే పలాయనం అనకాపల్లి నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : అనకాపల్లిలో తెలుగుదేశం గుట్టు లాడ్జి సాక్షిగా రచ్చకెక్కింది. పచ్చనోట్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు సాగుతున్నట్టు అక్కడి వాతావరణాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ సిండికేట్ తెరచాటున నడిపిన వ్యవహారం స్థానికుల అప్రమత్తత కారణంగా వెలుగు చూసింది. ప్రజాగ్రహం వెల్లువ కావడంతో పచ్చముఠా కంగుతింది. ముందే తోక ముడిచింది. ఫిర్యాదు అందడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు లాడ్జిని నిశితంగా సోదా చేయగా అనుమానాస్పద ఆధారాలు లభించినా, అసలు కథ మాత్రం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. వారం రోజులుగా తెలుగు తమ్ముళ్లకు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ఈ కథ చోటు చేసుకుంది. అసలేం జరిగింది? : అనకాపల్లిలోని ఓ లాడ్జి ముందుకు గత రాత్రి ఓ వాహనం వచ్చింది. ఆ వాహనంలో వచ్చిన వ్యక్తులు అందులోంచి కొన్ని బ్యాగులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కరపత్రాలు, జెండాలు దించడాన్ని స్థానికులు గమనించారు. అనుమానంతో చుట్టపక్కల వా ళ్లు నిఘా పెట్టారు. రాత్రి 12 గంటల తర్వాత ఆ లాడ్జిలోని రూములోకి కొందరు దఫదఫాలుగా రావడం, చేతి సంచులతో వెళ్ళడం స్థానికుల కళ్లబడింది. లోపల టీడీపీ నేతలున్నట్టు తేలిం ది. చుట్టపక్కల చోటామోటా నేతలతో బేరాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఎవరిని ప్రశ్నించి నా సంతృప్తికరమైన సమాధానం రాలేదు. శుక్రవారం ఉదయం కూడా మరో వాహనం రావ డం, మళ్ళీ బ్యాగులు లోనికి వెళ్లడం స్థానికుల దృష్టికి వచ్చింది. సందేహించిన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారు లు లాడ్జికి బయల్దేరారు. కానీ ఈ సమాచా రం ముందే లాడ్జిలో ‘ముఖ్యులకు’ చేరింది. దాంతో వారు ఆఘమేఘాల మీద లాడ్జి నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ కరపత్రాలు, ఎన్నికల ప్రచార సామాగ్రిని మాత్రం వదిలేశారు. గంటా, అవంతి లింక్? లాడ్జీలో అణువణువూ శోధించిన పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. నోట్ల కట్టలపై ఉండే లేబుల్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సందేహాలు కమ్ముకుంటున్నాయి. హడావిడిలో మరచిపోయిన సెల్‌ఫోన్‌ను పోలీసులు తనిఖీ చేసినట్టు తెలిసింది. అందులోంచి గంటాకు, అవంతికి గత రెండు రోజులుగా ఎక్కువసేపు కాల్స్ వెళ్లినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. లాడ్జిలో మకాం వేసిన ఇద్దరి కోసం పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. ఈ లోగానే గంటా వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు అనకాపల్లి రూరల్: పట్టణంలోని శ్రీనివాస లాడ్జిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన వారు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. రెండురోజులుగా లాడ్జిలో ఈ తతంగం నడుస్తున్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. ప్రతీ రూమ్‌లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. ఒక రూమ్ తాళాలు లేవని లాడ్జి సిబ్బంది బుకాయించారు. అయితే తాళాలు వెంటనే తెచ్చి రూమ్‌ను తెరవకపోతే లాడ్జిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వెంటనే తాళాలు తెచ్చి రూమ్‌ను తెరిచారు. రూమ్‌లో తెలుగుదేశం పార్టీ కరపత్రాలు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లాడ్జి సిబ్బందిని ప్రశ్నించగా రామారావు అనే వ్యక్తి పేరు మీద ఒకరు రూమ్ తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు గురించి సీఐ చంద్రను ప్రశ్నించగా, నగదు దొరకనందున కేసు నమోదు చేయలేదని చెప్పారు. దాడుల్లో ఎన్నికల నియమావళి అమలు సిబ్బంది బి. సత్యనారాయణ, బి. వెంకటేశ్వరరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సిబ్బంది కె. రత్నాకర్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
చరిత్రను చెరిపేశారు!
సాక్షి, విశాఖపట్నం: ‘భీమునిపట్నం మున్సిపాలిటీ.. దక్షిణ భారత దే శంలో అతి పురాతన మున్సిపాలిటీ. దేశంలో దీనికి రెండో స్థానం. డచ్(నెదర్లాండ్) దేశస్థుల వలస స్థావరంగా వినుతికెక్కింది. అలాంటి చారిత్రక ప్రాశస్థ్యాన్ని కాలదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జీవీఎంసీలో విలీనం చేశారు. స్థానికులు, చరిత్ర ప్రేమికులు ఎంతగా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటు కోసం మా కాళ్ల దగ్గరకొస్తున్నాడు. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకుల్ని మేం మాత్రం కాలదన్నక ఊరుకుంటామా..?’ ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై భీమిలివాసుల ఆక్రోశం. స్వార్థ ప్రయోజనాలే పరమార్థం నగరంలో రియల్ జోరుతో.. నివాస స్థలాలు అందనంత దూరాన ఉన్నాయి. ఏళ్లతరబడి విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో భీమిలి తీరాన సేదతీరాలని విశ్రాంత ఉద్యోగుల కోరిక. నివాస స్థలాలు కాస్త అందుబాటు ధరలో ఉండడంతో పాటు భీమిలి చారిత్రక ప్రాశస్త్యంపై మక్కువతోనే ఇక్కడ శేష జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడ్డామని రెవెన్యూ విభాగంలో పనిచేసి పదవీ విరమణ తర్వాత భీమిలి చేరిన రమణమూర్తి సాక్షికి తెలిపారు. ఇలాంటి మున్సిపాలిటీని జీవీఎంసీలో విలీనం చేయాలన్న ఆలోచన రావడమే దారుణమని చెప్తున్నారు. చారిత్రక ప్రాశస్త్యం కంటే స్వార్థ ప్రయోజనాలే గంటా గ్యాంగ్‌కు ఎక్కువైపోయాయని భీమునిపట్నం విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పంతం వీడని రెబల్స్
దారికి తెచ్చుకునేందుకు టీడీపీ సకల యత్నాలు బుజ్జగించేందుకు లక్షలు కుమ్మరింపు ‘దేశం’కు తలనొప్పిగా మారిన స్వతంత్రులు నజరానాల ఆశ చూపిస్తున్న పెద్దలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తిరుగుబాటుదారులను దారికి తెచ్చుకోవడం టీడీపీకి శిరోభారంగా తయారైంది. జిల్లాలో ఎన్నడూ లేనంతగా రెబల్స్ తాకిడి ఈ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తుండడంతో వీరినెలాగైనా దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అధిష్టానం పడింది. వారేమి అడిగినా ఓ యస్ అంటోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో ఉన్నవారికి భారీగా నజరానాల ఆశ చూపిస్తున్నారు. ఏకంగా రూ.25 లక్షలు వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. అయినా ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాకపోవడంతో పార్టీలో కలవరం మొదలైంది. భారీ మొత్తంలో ముట్టజెప్పడంతో పాటు భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇస్తామంటూ ఆశలు కల్పిస్తున్నా పట్టువీడటం లేదు. భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు రెబల్‌గా సకురు అనిత నా మినేషన్ వేశారు. పార్టీ అధినాయకులు ఆమె తో చేసిన సంప్రదింపులు ఫలించిన దాఖలా లు లేవు. గాజువాకలో చంద్రబాబు నేరుగా మాట్లాడి పార్టీ పదవి ఇస్తామని చెప్పినా కోన తాతారావు ససేమిరా అనడం అక్కడి అభ్యర్థి పల్లాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. యలమంచిలి టికెట్‌ను పంచకర్లరమేష్బాబుకు కేటాయించడంతో సుందరపు విజయ్‌కుమార్ ఏకంగా నిరాహార దీక్ష చేశారు. దీక్ష విరమించి నా ఆయన అసమ్మతి బాట వీడలేదు. చివరి రోజున రెబెల్‌గా నామినేషన్ వేయడం ఆయనింకా దారికి రాలేదనడానికి తార్కాణంగా కనిపిస్తోంది. అరకు సీటు విషయంలో చివరి క్షణంలో హైడ్రామా సాగిన విషయం తెలిసిం దే. మూడు రోజుల క్రితం కుంబా రవిరాబుకు బి-ఫారం ఇచ్చి ఆఖరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సివేరిసోమకు మరో బి-పారం ఇవ్వడంతో రవిబాబు అనుయాయులు రగిలిపోతున్నారు. సోమను ఓడించి తీరుతామని బ హిరంగంగా ప్రకటిస్తున్నారు. సీనియర్ నాయకుల బుజ్జగింపులకు రవిబాబు మెత్తబడలేదని తెలిసింది. పొత్తులో భాగంగా పాడేరు స్థానా న్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థులుగా ఎం.వి.ఎస్.ప్రసాద్, కె.సుబ్బారావులు నామినేషన్ వేశారు. విశాఖ-ఉత్తరం కూడా బీజేపీకి కేటాయించడంతో ఆ టికెట్‌ను ఆశించిన దువ్వారపు రామారావు టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. వీరందరు నామినేషన్లు ఉపసంహరించుకోడానికి టీడీపీ అభ్యర్థులు ఎంత ముట్టజెప్పడానికైనా సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా టికెట్‌ను ఆశించిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వారు చేసిన ఖర్చులతో పాటు మరికొంత అ‘ధనం’గా ఇచ్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు తప్పని బెడద జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వేలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోను రెబ ల్స్ బెడద కనిపిస్తోంది. నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన పీసీసీ ప్రధానకార్యదర్శి మీసాల సు బ్బన్న తన పదవికి,పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనుచరులతో చర్చించి రెండురోజుల్లో రాజకీయ భవిష్యత్‌పై ప్రకటిస్తానని పేర్కొన్నారు. విశాఖ ఎంపీ స్థానానికి చివరి వరకు పేరు వినిపించిన డాక్టర్ కూటికూప్పల సూర్యారావుకు కాదని బొలిశెట్టి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. దీంతో సూర్యారావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చోడవరం అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ కిలి శంకరరావును ప్రకటించి చివరి నిమిషంలో గూనూరు అచ్యుతరావుకు టికెట్ ఇచ్చింది. శంకరరావు రెబల్‌గా పోటీ చేస్తున్నారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రభాగౌడ్కు వ్యతిరేకంగా గంపలగోవింద్ నామినేషన్ వేశారు. వీరందరిని బుజ్జగించడానికి కాంగ్రెస్ పెద్దలు కూడా భారీగా ఆశలు చూపిస్తున్నారు. -
టీఢీపీ!
మరో ఆరు చోట్ల అభ్యర్థుల ఖరారుతో టీడీపీలో మోగిన రె‘బెల్స్’ భగ్గుమంటున్న కేడర్ స్వతంత్రులుగా పోటీకి నేతలు రెడీ సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రకటించిన మలివిడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై క్యాడర్ భగ్గుమంటోంది. ఆ పార్టీ ఆరు చోట్ల సోమవారం తెల్లవారుజామున అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా నిరసన ధ్వనులు పెల్లుబుకాయి. గంటా శ్రీనివాసరావు(భీమిలి), వాసుపల్లి గణేష్ (విశాఖ దక్షిణం), పల్లా శ్రీనివాస యాదవ్( గాజువాక), పైల గోవింద్ (అనకాపల్లి), పంచకర్ల రమేష్(యలమంచిలి), వంగల పూడి అనిత (పాయకరావుపేట) పేర్లను పార్టీ ఖరారు చేసింది. అరకు అసెంబ్లీ అభ్యర్థి {పకటన వాయిదా వేసింది. విశాఖ లోక్ సభ స్థానాన్ని బీజేపీ నుంచి తిరిగి వెనక్కు తీసుకోవడానికి కొన్నిరోజులుగా శతవిధాలా ప్రయత్నించింది. ఇది తేలే వరకు దానితోముడిపడి ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటను వాయిదా వేసింది. బీజేపీ ససేమిరా అనడంతో చేసేదిలేక చివరాఖరుకు మాజీ మంత్రి గంటాకు భీమిలి అసెంబ్లీ టికెట్ కేటాయించింది. అక్కడ టికెట్ ఆశించిన అవంతి శ్రీనివాస్‌ను గంటా కోసం ఇబ్బంది పెట్టి అనకాపల్లి లోక్‌సభకు పంపింది. అనకాపల్లి లేదా యలమంచిలి ఇస్తారనుకున్న పంచకర్లకు చివరకు యలమంచిలి సీటును ఖరారు చేసింది. నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్‌కు మొండిచేయి చూపింది. అనకాపల్లి సీటును బయటి నేతలకు ఇవ్వొద్దని స్థానిక నేతలు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా పార్టీ బేఖాతరు చేసి పైలా గోవింద్‌కు సీటిచ్చింది. పాయకరావుపేటలో వంగలపూడి అనిత టికెట్‌పైనా అదే నిరసన. స్థానిక నేతల తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా ఈమె పేరును ఖరారు చేసింది. రెబల్స్ పోటు నియోజక వర్గాల్లో నిరసనాగ్నులు రగులుతున్నాయి. గాజువాకలో అయ్యన్న వర్గం నేత కోన తాతారావు, యలమంచిలి నియోజక వర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్, భీమిలి నుంచి మాజీ మంత్రి అప్పలనరసింహరాజు, సకురు రఘువీర్ తదితరులు నిప్పులు కక్కుతున్నారు. పార్టీని ఓడించడానికి రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని సిద్ధపడుతున్నారు. భర్త రఘువీర్‌కు భీమిలి టికెట్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అనిత సకురు భీమిలిలో రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. గంటా బ్యాచ్ నేత కన్నబాబురాజు తన కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ స్థానం కోసం ప్రయత్నించినా దక్కలేదు. చివరకు తనకూ సీటు లేదు. ఈ నేపథ్యంలో త్వరలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన బలం నిరూపించుకుని టీడీపీకి సవాల్ విసరాలని నిర్ణయించుకున్నారు. మూర్తికి, అయ్యన్నకు మొండిచేయే! మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ సీటును బీజేపీకి ఇవ్వడంతో భీమిలి నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ స్థానం గంటాకు ఇవ్వడంతో ఆయనకు టికెట్ దొరకలేదని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి అయ్యన్న వర్గానికి చెందిన కోన తాతారావుకు గాజువాక టికెట్ దక్కలేదు. అయ్యన్నకు వ్యతిరేకంగా గంటా చక్రం తిప్పడం, అక్కడ నియమించిన ఫైవ్మెన్కమిటీ సూచించిన వలస నేత పైల శ్రీనివాస్‌కు సీటు ఖరారు చేయడంతో అయ్యన్న వ్యతిరేక వర్గం పైచేయి సాధించింది. -
టైం బాగాలేదు
గంటాకు అడుగడుగునా గండాలే విశాఖ ఎంపీ సీటు బీజేపీకే.. గంటా..పంచకర్ల సీట్లపై తొలగిన సందిగ్ధత చింతలపూడి..పీలా రుసరుస టీడీపీలో నిరసన సెగలు సాక్షి, విశాఖపట్నం : ఏ ముహూర్తాన టీడీపీ తీర్థం పుచ్చుకున్నామో గానీ.. అస్సలు టైం బాలేదు. మన్లో ఎవరో.. ఐరెన్ లెగ్‌లున్నట్టున్నారు..! ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ అంతర్మథనం. గత కొన్ని రోజులుగా టీడీపీలో రాష్ట్రంలోని అన్ని సీట్ల కంటే గంటా బృందం సీట్లపై అనిశ్చితే ఎక్కువ. అది కూడా కేవలం గంటా వల్లే కావడం ఆ పార్టీ స్థానిక నేతలకు మింగుడుపడట్లేదు. ఇపుడు స్థానాలపై స్పష్టత వచ్చినా.. గంటా బృందానికి ఆనందంమాత్రం లేదు. టీడీపీలో చేరినప్పటి నుంచీ గంటా పోటీ చేసే స్థానం జరుగుతోన్న కసరత్తు అంతా ఇంతా కాదు. తొలుత అనకాపల్లి నుంచి బరిలో దిగాలనుకున్న ఆయనకు సొంత సర్వేతో భ్రమలు తొగాయి. గాజువాకపై పెట్టుకున్న ఆశలు పల్లా శ్రీనివాస్‌తో అడుగంటాయి. తర్వాత భీమిలిపై కన్నేశారు. పార్టీ అధిష్టానం మాత్రం శుక్రవారం వరకు ఆయన్ని విశాఖ లోక్‌సభ స్థానం నుంచే బరిలో దించేందుకు ప్రయత్నించింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించినా వారికి కాకినాడ అప్పగిస్తూ దీన్ని గంటాకు కేటాయించాలనుకున్నారు. ఈ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థితో పోటీపడి గెలిచే అవకాశాల్లేవని తేలడంతో పోటీకి గంటా ససేమిరా అంటూ వచ్చారు. కాకినాడ కంటే తమకు విశాఖ ఎంపీ స్థానమే కావాలని బీజేపీ తేల్చిచెప్పింది. దీంతో గంటా స్థానంపై స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆయనకు భీమిలి, పంచకర్ల రమేష్‌బాబు యలమంచిలి, పీలా గోవింద్ అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి, అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో నిలిచేందుకు జాబితా సిద్ధమైనట్టు సమచారం. దీంతో గంటాను నమ్ముకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్న గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు యలమంచిలి స్థానాన్ని పంచకర్లకు కేటాయిస్తారన్న సమాచారంతో ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న సుందరపు విజయ్‌కుమార్ కత్తులు నూరుతున్నారు. కాగా భీమిలి స్థానం కేటాయిస్తున్నారన్న ఆనందం గంటాలో లేశమాత్రమైనా కానరావట్లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జీవీఎంసీలో భీమిలి మున్సిపాలిటీతోపాటు, సమీపంలోని ఐదు గ్రామపంచాయితీల విలీనానికి గంటాయే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు గంటా బృందానికి చెందిన అవంతి శ్రీనివాసరావు ఇక్కడ బరిలో నిలిస్తే మూకుమ్మడిగా ఓడించడానికి స్థానికులు సన్నద్ధమయ్యారు. -
విశాఖ లోక్‌సభ బరిలో ‘గంటా’?
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు పోటీకి ససేమిరా అంటున్న గంటా విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కష్టాలు వెంటాడుతున్నాయి. విశాఖ లోక్‌సభకు పోటీచేయాలని తెలుగుదేశం అధిష్టానం నుంచి తాజాగా ఒత్తిడి రావడంతో ఆయన షాక్ అయ్యారు. బీజేపీని బుజ్జగించి విశాఖ లోక్‌సభ స్థానం బదులు కాకినాడ కేటాయించేందుకు ఇరు పార్టీల మధ్య ఇప్పటికే అంగీకారం కుదిరినట్టు సమాచారం. దీంతో ఆరునూరైనా విశాఖ లోక్‌సభ నుంచే గంటాను బరిలో దింపేందుకు పార్టీ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. కానీ, గంటా మాత్రం విశాఖ లోక్‌సభ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది. ఈ స్థానంలో వైఎస్సార్సీపీ నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదా షర్మిల పోటీచేస్తారన్న ప్రచారంతో ముందేఆయన చేతులెత్తేశారు. వారిద్దరిలో ఎవరు బరిలో నిలిచినా ఢీకొనే సత్తాలేదనే పోటీకి విముఖత చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభకు కాకుండా అనకాపల్లి అసెంబ్లీ సీటు కోసం ఆయన ప్రయత్నించారు. అక్కడ సర్వేల ద్వారా దారుణ పరాభవం తప్పదని తేలడంతో భీమిలీ వైపు దృష్టి సారించారు. తాజాగా అధినేత చంద్రబాబు గంటాను రెండు రోజుల కిందట తన వద్దకు పిలిపించుకుని విశాఖ ఎంపీగా బరిలో దిగాల్సిందేనని, లేకుంటే వేరే స్థానం కష్టమని తేల్చిచెప్పడంతో ఎటూతేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది. నిర్ణయించుకోవడానికి గడువు కోరి అనుచరగణంతో మంతనాల్లోనే మునిగితేలినట్టు సమాచారం. పోటీచేసి ఓటమి మూటగట్టుకునేకంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటేనే మేలేమోనని అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
ఏడుపిస్తున్న సీట్లు
ఆరింటికి టీడీపీ అభ్యర్థులు ఖరారు ఏడు చోట్ల ఎంపిక అసలైన సవాల్ అయోమయంగా పంచకర్ల భవితవ్యం గంటా తాజా ప్రతిపాదనతో నిరసనలు నేటి జాబితాయే కీలకం సాక్షి, విశాఖపట్నం : అభ్యర్థుల ఎంపిక టీడీపీని గందరగోళంలోకి నెట్టింది. పేర్లు ప్రకటిస్తే అసంతృప్తులు భగ్గుమంటారనే భయం నెలకొంది. అందుకే బుధవారం వివాదాల్లేని ఆరుచోట్ల అభ్యర్థులను ప్రకటించింది. వెలగపూడి(తూర్పు), రామానాయుడు(మాడుగుల), కేఎస్ఎన్ రాజు(చోడవరం), అయ్యన్న(నర్సీపట్నం), బండారు సత్యనారాయణమూర్తి(పెందుర్తి)ల పేర్లను ఖరారు చేసింది. రెండు సీట్లు బీజేపీకి కేటాయించగా ఇప్పుడు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న గంటా శ్రీనివాసరావుతోపాటు పంచకర్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. తొలుత పంచకర్ల ఉత్తరం సీటు ఆశించగా పొత్తులో బీజేపీకి వెళ్లింది. పెందుర్తి స్థానం ఇస్తారని భావిస్తే తాజా జాబితాలో అక్కడ బండారును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పంచకర్ల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. చేసేది లేక అనకాపల్లి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. గంటా బృందం పరిస్థితి అటూ ఇటూ.. అనకాపల్లిలో ఓటమి భయంతో గంటా భీమిలి నుంచి పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కూడా పోటీకి పైరవీలు చేసుకుంటున్నారు. సకురు రఘువీర్, అప్పల నరసింహరాజు తదితరులు ఇప్పటికే పార్టీ బలోపేతం పేరుతో భారీగా ఖర్చుచేశారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి (సిట్టింగ్ ఎమ్మెల్యే) అవంతికి టికెటిస్తే ఓడిపోతారని పార్టీ సర్వేలో తేలడంతో ఇప్పుడాయన్ను అనకాపల్లి లోక్‌సభకు గంటా ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. అనకాపల్లి ఎమ్మెల్యేగా తన బృంద సభ్యుడైన పంచకర్ల పేరును తాజాగా గంటా సూచిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే స్థానికంగా ఆయా స్థానాల్లో చాలాకాలంగా పాతుకుపోయి పనిచేసుకుంటున్న టీడీపీ నేతల్లో అసమ్మతి పెల్లుబుకుతుందనే భయం పార్టీ వర్గాలను వెంటాడుతోంది. విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్, మాజీ వుడా చైర్మన్ రెహమాన్‌లు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతపూడికి టికెట్ హామీలేకపోవడంతో కోన తాతారావు, పల్లా శ్రీనివాస్‌లు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. పాయకరావుపేటలో ఇన్చార్జి అనితకు వ్యతిరేకంగా క్యాడర్ నిప్పులు కక్కుతోంది. యలమంచిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు, సుందరపు విజయ్‌కుమార్, పప్పల చలపతిరావు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరూ పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. అరకు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు కాకుండా కుంభా రవిబాబుకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇదే జరిగితే అరకు నిరసనాగ్ని సెగలు రేగడం ఖాయమంటున్నారు. ఇలా ఏడు నియోజక వర్గాల్లో రకరకాల తలనొప్పులు పార్టీని వేధిస్తున్నాయి. గురువారం విడుదల చేయబోయే మలివిడత జాబితాలో దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. ఈ సీట్ల ప్రకటన తర్వాత చాలా నియోజక వర్గాల్లో పార్టీకి అసమ్మతి సెగలు తీవ్రమవనున్నాయి. సీటురాని వారిలో చాలామంది రెబల్ అభ్యర్థులుగా సైతం రంగంలోకి దిగడానికి నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. -
టీడీపీ షాక్
కంగుతిన్న గంటా బృందం ఉత్తరంలో పంచకర్ల బిత్తరపాటు రెండు ఎంపీ స్థానాలూ కమలానికే అడక్కుండానే అరకు కత్తులు దూస్తున్న తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పొత్తులతో జిల్లా టీడీపీ చిత్తయింది. రెండు ఎంపీ, రెండు ఎంఎల్ఏ సీట్లు బీజేపీకి దక్కడంతో టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. ఎన్నో ఆశలతో దేశం తీర్ధం పుచ్చుకొన్న గంటా బృందం కంగు తింది. ఇప్పటికే ఈ మాజీ మంత్రిని నమ్మి నట్టేటమునిగామని సహచర శాసనసభ్యులు గగ్గోలు పెడుతున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా బలపడాల్సిన టీడీపీ అందుకు విరుద్ధంగా గందరగోళంలో పడిపోయింది. తాము గెలవని స్ధానాలు, బలం లేని స్ధానాలు తమకు కట్టబెట్టి టీడీపీ మిత్రద్రోహానికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అరకు ఎంపీ, పాడేరు ఎంఎల్ఏ స్ధానాల విషయంలో ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. విశాఖతో పాటు ఊహించని విధంగా అరకు ఎంపీ స్ధానం, విశాఖ ఉత్తరతో పాటు పాడేరు ఎంఎల్ఏ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.విశాఖ ఎంపీ సీటు పోవడంతో పార్లమెంటుకు వెళ్లాలనే గంటా ఆశలకు గండిపడింది. ఉత్తర నియోజక వర్గంపై కోటి ఆశలతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తిని వదిలి పంచకర్లకు సీటే లేకుండా పోయింది. చింతలపూడి వెంకట్రామయ్య, కన్నబాబులకు సీట్లు లేవని ఇప్పటికే తేలిపోయింది. ఈ పరిణామాలు టీడీపీలో ముఖ్యంగా గంటా శిబిరంలో కల్లోలాన్నే రేపాయి. బీజేపీతో పొత్తు కుదరడంతో ఇంతకాలం సీట్లపై ఉన్న చిరు ఆశలు కూడా ఆవిరైపోవడం గంటా బృందంలో చిచ్చురేపింది. కన్నబాబు, పంచకర్ల తదితరులు బీజేపీతో పొత్తు కుదిరిన వెంటనే గంటాకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు టికె ట్లు ఇప్పించలేనప్పుడు నమ్మించి పార్టీ మార్పించడం, వెంటతిప్పుకోవడం ఎందుకని వీరు నిలదీసినటు తెలిసింది. టీడీపీ లో టికెట్లు రావనే అభిప్రాయానికి వచ్చిన వీరు ఆదివారం నాడే హడావుడిగా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. తొందరపడి గంటా ట్రాప్‌లో పడి నష్టపోయామని, కొద్దిరోజులు ఆగివుంటే పరిస్ధితి మరో విధంగా వుండేదని గంటా బృందం శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గంటా ఒంటరైపోయారు. సాటి శానసభ్యులకు టికెట్ హామీలు ఇప్పించలేకపోయిన గంటా తన పరిస్ధితి ఏమిటో తెలియక నిర్వేదంలో పడిపోయారని తెలిసింది. కాగా నగరంలోనూ ఏజెన్సీలో టీడీపీ శ్రేణులు పొత్తుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. బహిరంగంగా నిరసనలు వ్యక్తంచేశాయి. నగరంలోని పార్టీ కార్యలయం వద్ద భారీగా టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. పొత్తులతో తమకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం తీరును దుయ్యబట్టారు. ఏజెన్సీలో నిరసన సెగలు పాడేరు : బీజేపీతో పొత్తు మేరకు ఏజెన్సీలో కీలకమైన పాడేరు అసెంబ్లీ సెగ్మెంటును ఆ పార్టీకి కేటాయించారనే ప్రచారంతో స్థానిక టీడీపీ నేతల్లో అలజడి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ సీపీఐతో పొత్తుతో డీలా పడిన టీడీపీ నాయకులు ప్రస్తుత ఊహాగానాలను జీర్ణించుకోలేకపోతున్నారు. 2009వూ సీపీఐ ఓటమితో టీడీపీ నేతలంతా పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో విస్తృతం చేశారు. ఐదేళ్లుగా పాడేరు టికెట్‌ను మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ నేతలు బొర్రానాగరాజు, కొట్టగుల్లి సుబ్బారావు, ఎంవీఎస్ ప్రసాద్‌లు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరికి టీడీపీ సీటు ఖాయమని భావిస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు మాట వారందర్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ కూడా ఈ టికెట్‌ను ఆశించారు. ఆమె కూడా నిరాశకు గురవుతున్నారు. నియోజక వర్గంలోని టీడీపీ కేడర్ కూడా ఈ పొత్తును జీర్ణించుకోలేకపోతోంది. పొత్తు విషయం ఖరారయితే.. వెంటనే పార్టీనీ వీడేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అలాగే అధినేతతో తాడో పేడో తేల్చుకోవడానికి సీనియర్ నేతలంతా సిద్ధమవుతున్నారు. -
చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు
ఎమ్మెల్యే రాజుపై మండిపడుతున్న ఓ వర్గం సీనియర్లను విస్మరిస్తున్నారని ఆరోపణ తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థుల్లో ఆందోళన చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు బలంగా కనిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా టీడీపీకి అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పట్ల పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక విషయంలో కేఎస్ఎన్ చివరి వరకు నాటకీయతకు తెరతీయడంతో టికెట్టుపై ఆశపెట్టుకున్న అభ్యర్థుల్లో మరింత అసంతృప్తికి కారణమైంది. ముందుగా అభయం ఇచ్చిన వారికి కాకుండా చివరి నిమిషంలో మరో అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతూ వస్తున్నారు. వీరంతా అదనుకోసం చూస్తున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలోను ఇటువంటి అసంతృప్తులే అప్పటి జెడ్పీటీసీ అభ్యర్థి దాడి గంగరాజు ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. చోడవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బెన్నవోలుకు చెందిన మజ్జి గౌరీశంకర్‌కు టికెట్టు దాదాపు ఖరారయిందని భావించిన సమయంలో ఇదే టికెట్టు కోసం మండలంలోని గంధవరం మాజీ సర్పంచ్ పల్లా అర్జున యాదవ్ కూడా ఆశ పెట్టుకున్నారు. వీరితోబాటు గోవాడకు చెందిన ఏడువాక సన్యాసినాయుడు, గజపతినగరం గ్రామానికి చెందిన కనిశెట్టి సన్యాసిరావు(మత్స్యరాజు ) పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అనూహ్యంగా కనిశెట్టి మత్య్సరాజుకు టికెట్టు ఖరారు కావడంతో మిగిలిన ఆశావాహులంతా కంగుతిన్నారు. ఇంతకాలం ఎమ్మెల్యే రాజు వెంట ఉన్నప్పటికీ ధన బలం ఉన్న వారికే టికెట్టు ఇచ్చారని ఆశావహులు మధనపడుతున్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన గంటా వర్గీయులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై కూడా ఆ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గంటా వర్గీయులు జెడ్పీటీసీ, లేదా ఎంపీపీ పదవికాని తమకు కేటాయించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజు వీరిని పట్టించుకోకపోవడంతో వారంతా రాజు తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాల్లోని సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన వారినే ప్రోత్సహిస్తున్న రాజు తీరుపై సీనియర్లు అక్కసుతో ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలా రాజుపై ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థులు మధనపడుతున్నారు. -
గంటా ఎత్తు.. బీసీ చిత్తు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, భీమిలి నియోజకవర్గాల నుంచి నలుగురు ఓసీ అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా మాజీ మంత్రి గంటా ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గ పరంగా బలంగా తమను దెబ్బతీసేందుకు గంటా కుయుక్తులు పన్నుతున్నట్లు ఆ పార్టీ బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈమేరకు ఎంవీవీ ఎస్ మూర్తి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణలతో గంటా లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొని జాబితాను రూపొందించారని తెలిసింది. ఉత్తరం, దక్షిణం, భీమిలి నియోజకవర్గాల నుంచి ఎక్కువమంది బీసీ అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నారని, వీరిలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయించిన మిగిలిన వారు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందనే సాకుతో ఓసీలకు కేటాయిస్తే ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ విజయానికి మేలు జరుగుతుందని చంద్రబాబును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీసీ నేతలే బాహాటంగా అంటున్నారు. దీనిపై బీసీ నేతలు గంటా తీరుపై గరంగరంగా ఉన్నారు. ఉత్తరంలో పంచకర్లకు టికెట్ ఇప్పించే క్రమంలో బీసీ సామాజికవర్గ నేతలైన భరణికాన, పైలా ముత్యాల నాయుడులకు ప్రాతినిథ్యం దక్కకుండా పావులు కదుపుతున్నారని భోగట్టా. అలాగే దక్షిణ ంలో వాసుపల్లికి బీజేపీ పొత్తును సాకుగా చూపి ఓసీ అభ్యర్థి సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును, లేని పక్షంలో చివరగా ఎంవీవీ ఎస్ మూర్తిని గాని పోటీ లో నిలిపేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. బీసీ నేతల మధ్య అనైక్యతను చూపుతూ భీమిలి నుంచి తన సామాజిక వర్గానికి చెందిన ధనబలమున్న అవంతి శ్రీనివాస్‌ను, తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబులకు టికెట్లు ఖరారు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది. లోక్‌సభ పరిధిలోని పశ్చిమం, గాజువాక, పెందుర్తి, ఎస్.కోట నియోజకవర్గాల్లో కూడా ఒకటి రెండు చోట్ల ఆర్థిక స్తోమత ఉన్న ఓసీలకు సీట్లు ఇప్పించేందుకు ఈ మాజీమంత్రి యత్నిస్తున్నట్లు తెలిసింది. -
అయోమయంలో ఆ నలుగురు
తాజాగా పంచకర్లకు పొత్తు దెబ్బ ముత్తంశెట్టికి సర్వే స్ట్రోక్ టీడీపీలో గంటాకు మాత్రమే టికెట్ ఛాన్స్ మిత్ర బృందానికి దూరమవుతున్న టికెట్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీలో గంటా బృందం పరిస్ధితి ‘పంచపాండవులు- మంచంకోళ్లు ’ సామెతలా తయారైంది. ఐదుగురు శానసభ్యులు కలసి జట్టుగా ఒకేసారి టీడీపీ తీర్ధం పుచ్చుకొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బృందంలో ఒక్కరికి మినహా ఎవ్వరికీ టికెట్లు లభించే అవకాశాలు కనిపించడం లేదు. తన స్వార్ధం కోసం తనతో క లసి నడిచే బృందాన్ని నడిసంద్రంలో ముంచేస్తారనే పేరుపడ్డ గంటా టికెట్ విషయంలో ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారన్న ప్రచారం జోరందుకొంది. గంటాతో కలసి టీడీపీలో చేరిన శానసభ్యులు యూవీ రమణమూర్తి(కన్నబాబు), చింతలపూడి వెంకట్రామయ్యలకు టికెట్ ఇచ్చే అవకాశాలే లేవని ప్రారంభంలోనే తేలిపోయింది. తాజాగా, పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు కూడా ఈ జాబితాలో చేరిపోనున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా పంచకర్ల రమేష్‌బాబు ఆశపెట్టుకొన్న విశాఖ ఉత్తర సీటు గల్లంతు అవుతుండగా, తాము చేపట్టిన సర్వేలో ఏమాత్రం ప్రజాబలం లేదని తేలినందున ముత్తంశెట్టికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా వీరికి టికెట్లు ఇవ్వడం కష్టమన్నట్లుగా వ్యాఖ్యానించడం ఇప్పుడు గంటా శిబిరంలో కలకలం రేపుతోంది. ఎంఎల్ఏ టికెట్ ఎవరికి రాదన్న అనుమానం కలిగినా అనకాపల్లి లోక్‌సభ అంటూ ఆశలు చిగురింపజేసే గంటా తాజాగా వీరందరితో అదే గేమ్ ఆడుతున్నారు. తొలుత, అనకాపల్లి ఎంపీ టికెట్‌కు కన్నబాబు పేరును ప్రచారంలోకి తీసుకువచ్చిన గంటా ఇప్పుడు ముత్తంశెట్టి,పంచకర్ల అభ్యర్ధిత్వాలను అనకాపల్లికి పరిశీలిస్తున్నట్లు చెబుతూ తనను నమ్ముకొని వచ్చిన వారినే అయోమయంలో పడేస్తున్నారు. ఈ ఐదుగురిలో గంటాకు తప్ప మరెవ్వరికీ టికెట్ వచ్చే అవకాశాలు కనిపించకపోవడం వీరి అనుచరులను డైలమాలో పడేస్తోంది. వీరికి భరోసా ఇవ్వాల్సిన గంటా కూడా ఒక రోజు భీమిలి అని, మరో రోజు విశాఖ ఎంపీ అని, తాజాగా అనకాపల్లి అసెంబ్లీ అని అందరినీ గందరగోళపరుస్తున్నారు. మొత్తం మీద గంటా స్వార్థ రాజకీయం తమ రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేసిందన్న అవేదన వీరిలో ప్రారంభమైంది. మూర్తికి షాక్.. ఈ పర్యాయం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారని తెలిసింది. పదేళ్లుగా ప్రజల్లోనే లేని మీరు ఎన్నికల్లో ఎలా పోటీచేస్తారని చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేయడంతో మూర్తి ఇప్పుడు ఆయనపై వత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. -
ఇదేంట్రా ‘బాబూ’!
*గంటా బృందానికి చంద్రబాబు షాక్ *భవిష్యత్తుపై హామీ ఇస్తారనుకుంటే జెడ్పీ ఎన్నికల బాధ్యత *అధినేతతో భేటీ తర్వాత మరింత అయోమయం గంటా బృందం తెలుగుదేశంలో చేరిన ముహూర్తం ఏ మాత్రం బాగున్నట్టు లేదు. వీరికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సొంత క్యాడర్ కలసి రాక, తెలుగుదేశం క్యాడర్ అంగీకరించక అష్టకష్టాలు పడుతున్న ఈ బృందానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కూడా ఊరట లభించడం లేదు. వేల మందిని కూడగట్టి ప్రజాగర్జన పెట్టి అయ్యన్నపాత్రుడితో తిట్లుతిని అభాసుపాలైన గంటా బృందానికి మరో షాక్ తగిలింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పార్టీలో తమ భవిష్యత్, సీట్ల గురించి చంద్రబాబుతో మాట్లాడదామని హైదరాబాద్ వెళ్లిన గంటా బృందానికి ఎటువంటి హామీ లభించకపోగా, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వచ్చి పడింది. ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీలో చేరి, అక్కడి పరిణామాలతో తీవ్ర నిరాశకు గురైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసన సభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి(కన్నబాబు)లు మూడు రోజుల పాటు చంద్రబాబుపైనా అలిగారు. ఆయన సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తే ఎందు కు మందలించలేదని మధనపడ్డారు. ఆ కోపం తో చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు హాజరుకాలేదు. విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు వీ డ్కోలు పలకలేదు. గంటా ఇంట్లో నిరసన సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ పర్యవేక్షకుడైన నారాయణను పిలిచి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాకపోవడం, మరో పక్క నియోజక వర్గాల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో గత్యంతరం లేక ఆదివారం వీరంతా హైదరాబాద్ బాటపట్టా రు. నారాయణ సమక్షంలో చంద్రబాబును కల సిన వీరికి ఊరట లభించకపోగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బాధ్యత మీద పడింది. వీరి భవిష్యత్‌పై ఎటువంటి హామీ ఇవ్వని చంద్రబాబు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిం చి తీసుకురావాలని స్పష్టం చేశారు. నియోజక వర్గాల్లో తెలుగుదేశం క్యాడర్ తమతో కలసిరావడం లేదని చెప్పుకొనే అవకాశాన్ని కూడా ఆయన వీరికి ఇవ్వలేదు. భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను కాదని మాజీ శాసన సభ్యుడు అప్పల నరసింహరాజు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుపోతున్నారు. పెందుర్తిని వదిలేసి ఉత్తర నియోజక వర్గంలో పనిచేస్తున్న పంచకర్లకు ఇ క్కడా, అక్కడా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ఇక టికెట్టే రాదని చెబుతున్న వెంకట్రామయ్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. యలమంచిలి లో ఇంతకాలం తమకు నరకం చూపించిన కన్నబాబుతో కలిసేదే లేదని దేశం నేతలు తెగేసి చెబుతున్నారు. ప్రతి ఎన్నికలకు నియోజక వర్గం మారే గంటా పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్న ఆయనకు ఎక్కడ పనిచేయాలో అర్థం కావడం లేదు. ఈ అంశాలపై కాస్త స్పష్టత కోసం హైదరబాద్ వెళ్లిన గంటా బృందం చంద్రబాబుతో భేటీ తర్వాత మరింత అయోమయంలో పడిపోయింది. -
ఎందుకొచ్చాంరా‘బాబు’
గంటా బృందంలో అభద్రత సహకారంలేక, పార్టీలోనూ మద్దతులేక సతమతం వెంటాడుతున్న ఏకాకి భావన తొందరపడ్డామా? అంటూ మదనపాటు సాక్షి,విశాఖపట్నం : ఘనంగా ఊహించుకున్నారు. ఎర్రతివాచీ పరుస్తారనుకున్నారు. బాబుతో పాత సాన్నిహిత్యం పెద్దపీట తెచ్చిపెడుతుందని భ్రమపడ్డారు. తీరాచూస్తే అవమానాలు, అవహేలనలు, ఎత్తిపొడుపులు.. నేతలు,కార్యకర్తల నుంచి ఈసడింపులు..అధినేత నుంచి కొరవడ్డ ఊరడింపులు.. ఇదీ ప్రస్తుత గంటా బృందం రాజకీయ పరిస్థితి. కాంగ్రెస్‌నుంచి టీడీపీలో చేరిన వీరంతా పార్టీలో గౌరవంలేక విలవిల్లాడుతున్నారు. అసలు పార్టీలోకి ఎందుకొచ్చాంరా బాబు అనుకుని మధనపడుతు న్నారు. టీడీపీలో చేరిన గంటాతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవంతిశ్రీనివాస్,పంచకర్ల రమేష్,కన్నబాబురాజు,చింతలపూడి బృందాన్ని అభద్రతా భావం వెన్నాడుతోంది. అయ్యన్నను ఎదుర్కోలేక గంటా దిగాలుపడ్డారని తెలిసింది. చంద్రబాబు ముందే నిందించినా తనను ఊరడించకపోవడంతో పార్టీలో ఊహించుకున్నంత విలువలేదని భావిస్తున్నట్లు భోగట్టా.ఎక్కడ టిక్కెట్ వచ్చినా క్యాడర్ మద్దతు ఉంటుందా?లేదా? అనే డోలాయమానంలో ఉన్నారు. కన్నబాబు వెంట ఎలమంచిలో కాంగ్రెస్ క్యాడర్ రావడానికి ససేమిరా అంటోంది. క్యాడర్‌ను వెంట రమ్మంటున్నా వారంతా కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ కార్యకర్తలు కన్నబాబు రాజు అరాచకాలు,వేధింపులను గుర్తుకు తెచ్చుకుంటూ తలోదిక్కు పార్టీని వీడుతున్నారు. చంద్రబాబు కూడా ప్రజాగర్జనలో గంటాతో మినహా ఈయనతో మాట్లాడలేదు.పార్టీలో చేరేముందు తనను చూసి బాబు నువ్వేనా?కన్నబాబు అంటూ ఎగాదిగా చూశారని ఈమధ్య చెప్పుకుని సంగతి తెలిసిందే. ఈయనకు టిక్కెట్‌పై బెంగపట్టుకుంది. భీమిలి ఎమ్మెల్యే అవంతి తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని బహిరంగంగా ప్రకటించడంతో క్యాడర్ భగ్గుమంటోంది. టీడీడీలో చేరకముందు పార్టీ కార్యకర్తలను రకరకాలుగా వేధించిన సంఘటనలు గుర్తుచేసుకుని వీరంతా రగిలిపోతున్నారు. ఈమధ్య బాబుకుకూడా ఫిర్యాదు చేశారు. ఈయనకు టిక్కెట్ ఇస్తే రెబల్ అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్,టీడీపీ క్యాడర్ కలిసిరాక,చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా పలుకుబడిలేక,పూర్తిగా గంటాపైనే ఆధారపడ్డంతో పార్టీలో మద్దతు దొరకడం లేదనే వేదనతో ఉన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లపై ఉత్తరం కార్యకర్తలు, ఇంఛార్జి భరణికాన ఊగిపోతున్నారు. ఈయనకు సహకరించకూడదని తీర్మానించుకున్నారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడికి వెంట నేతలు,కార్యకర్తలు ఎవరూలేరని తెలుస్తోంది. టిక్కెట్ వస్తుందనే గ్యారంటీకూడా లేకపోవడంతో భవిష్యత్తు ఈయనకు అర్థంకావడంలేదు. ఈనలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎవరి మద్దతు దొరక్క గంటాతోనే ఎక్కువసేపు గడుపుతున్నారు. -
నీరసంగా గర్జన
-
నీరసంగా గర్జన
విశాఖపట్నం: లక్షల మందితో జరుగుతుందనుకున్న తెలుగుదేశం ప్రజా గర్జన తుస్సుమనిపించింది. జన స్పందన లేని చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం బోరు కొట్టించింది. గంటా బృందం చేరికను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న అయ్యన్న పాత్రుడి ‘పంచ్’ల ప్రసంగం పార్టీ పెద్దలకు చెమటలు పట్టించింది. ముచ్చటగా మూడోసారి మారిన వేదికపై మూడున్నర లక్షల మందితో భారీగా జరుగుతుందని చెప్పిన ప్రజాగర్జనకు ముప్పైవేల మంది కూడా హాజరుకాకపోవడంతో తెలుగుదేశం నేతలు నిరుత్సాహపడ్డారు. తొలుత ఏయూ మైదానంలో ఆ తర్వాత బీచ్‌రోడ్‌లో మూడున్నర లక్షల మందితో భారీగా జరుపతలపెట్టిన సభను వన్‌టౌన్ మున్సిపల్ స్డేడియానికి మార్చిన సంగతి తెలిసిందే. మున్సిపల్ స్డేడి యం చిన్నదైనందున గర్జన సభకు తరలివచ్చే మూడున్నల లక్షల మంది అందులో పట్టరన్న కారణంగా బయట ఎల్సీడీ స్క్రీన్లను ఏర్పా టు చేస్తున్నట్లు పార్టీ నేత గరికపాటి మోహనరావు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చెప్పారు. సభా వేదిక బయట ఎల్సీడీల ఏర్పాటు చేయకపోగా, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్సీడీలను తిలకించేంత జనం రాకపోవడం గమనార్హం. 30 వేల మంది పట్టే స్డేడియం సగం ఖాళీగా కనిపించింది. 22 వేల సామర్థ్యం ఉన్న గ్యాలరీల్లో సగం ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంతో బోరు కొట్టించారు. ఆయన ప్రసంగానికి కార్యకర్తల నుంచి స్పందన కరువైంది. ఆయన ప్రసంగం ప్రారంభించగానే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా బృందాన్ని చేర్చుకొనేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ అధినేత్రి అవినీతి కొండలను పెంచి పోషించిందని వ్యాఖ్యానించి వీరికే షాక్ ఇచ్చారు. మొదటి నుంచి గంటా బృందానికి చుక్కలు చూపిస్తున్న అయ్యన్న తన ప్రసంగంతో చంద్రబాబుకే చెమటలు పట్టించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉన్న కార్యకర్తలను ఎన్నికల సమయంలో విస్మరిస్తే పార్టీకి భవిష్యత్ ఉండదని, ఇప్పుడు పార్టీలో చేరే నేతలు ఐదేళ్లపాటు పార్టీలో ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయ్యన్న ప్రసంగిస్తుండగా గంటా హడావుడిగా గరికపాటి వద్దకు వెళ్లి మంతనాలు జరిపారు. -
పచ్చని చిచ్చు
విశాఖపట్నం : గంటా శ్రీనివాసరావుది ఐరెన్‌లెగ్ అని టీడీపీ నేత అయ్యన్న చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పార్టీలో చర్చిం చుకుంటున్నారు. గంటా బృందం టీడీపీలో అడుగుపెట్టినప్పటి నుం చీ అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయంటూ ఉదహరించుకుంటున్నారు. సమైక్య ఉద్యమం సమయంలో దారుణంగా ఉన్న టీడీపీ పరిస్ధితి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని భావిస్తున్న సమయంలో ఈ బృందం చేరిక పార్టీకి పెద్ద షాకయింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శానససభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి (కన్నబాబు)లు తెలుగుదేశంలోకి రావడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనుచరులెవరూ వీరివెంట రాలేదు. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్యాడర్ వీరిరాకను వ్యతిరేకిస్తోంది. వీరితో వేగేదెలా అన్న సందిగ్ధం అధిష్టానాన్ని వెంటాడుతోంది. నిన్నటి వరకూ పార్టీ అధినేత చంద్రబాబును అవినీతి పరుడు,రాష్ట్రాన్ని విడగొట్టిన అసమర్ధుడు అని విమర్శించిన గంటా బృందం ఇప్పుడు ఎలా ఆయనను సమర్ధిస్తుందని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. కన్నబాబుకు వ్యతిరేకంగా యలమంచిలి కాంగ్రెస్ కార్యకర్తలు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనతో వెళ్లేదే లేదని తేల్చిచెప్పారు. కన్నబాబు పదేళ్లుగా తమను వేధింపులకు గురిచేసి, తప్పుడు కేసులతో అరెస్టు చేయించారని టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. అడారి తులసీరావు కుమార్తెను కూడా అరెస్టు చేసిన కన్నబాబును నేతగా అంగీకరించేదే లేదని చెబుతున్నారు. గంటా అనకాపల్లిలో వ్యాపార భాగస్వామి భాస్కర్‌కు పగ్గాలు అప్పగించి అరాచకం సృష్టించారని, చివరకు పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరింపజేయకుండా అడ్డుకొన్నారని అక్కడి పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. భీమిలిలో ముత్తంశెట్టిదీ ఇదే పరిస్ధితి. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమితప్పదని మాజీ శానసభ్యుడు అప్పల నరసింహరాజు స్పష్టం చేశారు. హిందుజా కంపెనీ ఏజెంట్‌గా వ్యవహరించి టీడీపీ నేతలపై పోలీసులను ఉసిగొల్పిన పంచకర్లను ఎలా అంగీకరించాలని ఉత్తర నియోజక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. యాదవుల సీటును మరో వర్గానికి చెందిన పంచకర్లకు కేటాయిస్తే సహించేది లేదని ఆ సంఘ నేతలు ఇప్పటికే గట్టి హెచ్చరికలు పంపారు. గంటా రాజకీయం కారణంగా టికె ట్ రేసులోనే లేని వెంకట్రామయ్య వెంట వెళ్లేదే లేదని గాజువాక కాంగ్రెస్ నేతలు సమావేశంలోనే బహిరంగంగా చెప్పారు. ఆయన పోటీలో లేనప్పుడు ఆయనతో మనకె ందుకని దేశం క్యాడర్ దూరంగా వుంది. పలు పార్టీలు మారి దేశంలో చేరిన వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రహ్మాన్ ఆ సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మత్స్యకార వర్గానికి చెందిన పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కాదని రహ్మాన్‌కు టికెట్ ఇస్తే తఢాకా చూపుతామని మత్స్యకారనేతలు స్పష్టంచేస్తున్నారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో గంటా బృందం చేరిన తరువాత విశాఖలో టీడీపీ పరిస్ధితి పెనం మీది నుంచి పొయిలో పడ్టట్లైంది. -
హస్తవ్యస్తం
పార్టీ టికెట్ కోసం పైరవీలు..రాజధాని చుట్టూ ప్రదక్షిణలు..సీటు ఖరారయ్యేంత వరకు హైరానా..ఇదంతా కాంగ్రెస్ పార్టీ గత వైభవం. ఇప్పుడు పరిస్థితి దయనీయం. జిల్లాలో ఈ పార్టీ ఖాళీ అయిపోతోంది. రాష్ట్ర విభజన ఆగ్రహానికి గురయి నేతలను దూరం చేసుకుంటోంది. పార్టీ జెండా మోసే నాథుడే కరువయ్యే పరిస్థితికి చేరుకుంది. విశాఖపట్నం: ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఖాళీ అయిపోయింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పార్టీని వదలి వెళ్లిపోతుండడంతో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర విభజన పట్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండడం. అందుకు కాంగ్రెస్ అధిష్టానం కారణంగా కావడంతో నేతలంతా తమ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే విశాఖ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పురందేశ్వరి, అనకాపల్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ శాననసభ్యులు తైనాల విజయకుమార్, ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి (కన్నబాబు)లు పార్టీకి రాజీనామాలు సమర్పించారు. ఎంఎల్సీ సూర్యనారాయణరాజ కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పార్టీని వీడి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పెట్టే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరి బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌కు బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో, గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని అధికార కాంగ్రెస్ ఎదుర్కోనుంది. జిల్లాకు చెందిన ముఖ్యనేతల్లో నేతల్లో మాజీ మంత్రి బాలరాజు , విశాఖ దక్షిణ నియోజక వర్గ శానన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌లు మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగేట్లు కనిపిస్తోంది. మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులు మళ్ల విజయప్రసాద్, బోళెం ముత్యాలపాప ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే దృష్టి సారించారు. దీంతో కొన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండా మోసే నాథుడే కరవయ్యాడు. గతంలో కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉన్నా నియోజక వర్గ స్దాయి నేతలకు కొదవ ఉండేది కాదు. ఇప్పడు కాంగ్రెస్ పేరు చెబితే చాలు జనం ఛీత్కరించే పరిస్ధితులు నెలకొనడంతో చెప్పుకోదగ్గ స్థాయి ఉన్న నేతలు కూడా కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న వారు వైఎస్సార్ కాంగ్రెస్‌కు తొలిప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ అవకాశం లేకపోతే టీడీపీ, బీజేపీల వైపు చూస్తున్నారు. గంటా బృందం టీడీపీ తీర్ధం పుచ్చుకోగా, పురందేశ్వరి బీజేపీలోకి వెళుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది మరిన్ని వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని నియోజక వర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలకూ కొరత తప్పదని కాంగ్రెస్ పెద్దలు భయపడుతున్నారు. -
‘దేశం’లోకి దొంగలొస్తున్నారు!
జాగ్రత్తగా ఉండండి.. నమ్మకద్రోహులను తరిమికొట్టండి అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు నక్కపల్లి, న్యూస్‌లైన్: దేశంలో దొంగలు పడుతున్నారు జాగ్రత్త... ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు! కాదు.. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చేసిన హెచ్చరికలు! బుధవారం మండలంలో వేంపాడులో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. గతంలో టీడీపీని వీడిన పిఏసీఎస్ డెరైక్టర్, పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లేపల్లి బాబ్జీరాజు తిరిగి పార్టీలోకి చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో కొంతమం ది స్వార్థపర నాయకులు పదవీ వ్యామోహంతో దొంగలుగా టీడీపీలోకి వచ్చి పార్టీని భ్రష్టుపట్టించాలని చూస్తున్నార ని ఆయన విమర్శించారు. ఇటువంటి దొంగలను, నమ్మకద్రోహులను నివారించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని హెచ్చరించారు. ‘భర్తతో కాపు రం చేస్తేనే సంసారమవుతుంది, కాకుం టే వ్యభిచారమవుతుంది. రాజకీయ నాయకుడన్నవాడు స్థిరంగా ఓ పార్టీలో ఉండాలి. విలువలతోకూడిన రాజకీయాలు చేయాలి. ఇలాంటి దొంగల వల్ల పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుంది.’ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నాలు గు పార్టీలు మారే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పుడూ అధికారమే అనుభవించాలని దురాశకు పోవడం తగదన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి పార్టీలో చేరితే దేశంలో దొంగలు పడినట్లేనన్నారు. గతంలో టీడీపీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అనుభవించి ప్రజారాజ్యంలో చేరారని, ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక మంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ పార్టీ కష్టాల్లో ఉంటే తిరిగి టీడీపీలో చేరడం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ప్రభుత్వం హయంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించగల సత్తా చంద్రబాబుదేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు గవిరెడ్డి రామానాయుడు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ ఇన్చార్జి అనిత మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పా రు. గునిపూడిసర్పంచ్ లక్ష్మణరావు, ఉపసర్పంచ్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గంటా... ఓ ఊసరవెల్లి
ఆయన నిష్ర్కమణతో పార్టీకి పట్టిన చీడ వడిలింది ఆయన పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అనకాపల్లి, న్యూస్‌లైన్: ‘గంటా శ్రీనివాసరావు ఓ ఊసరవెల్లి. స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం ఆయనకు రివాజు. అధికారమే పరమావధిగా రంగులు మార్చడం ఆయన నైజం. రాష్ట్రంలోని ఏ జిల్లా వాడో కూడా స్పష్టంగా తెలియని గంటాను ప్రజలు అక్కున చేర్చుకుని ఆదరిస్తే వారినే మోసం చేసిన ఘనుడాయన. ఇప్పటికైనా ప్రజలు అటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం అనకాపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గంటా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గంటా కాంగ్రెస్ పార్టీని వీడడంతో పీడ విరగడైపోయిందన్నారు. సమైక్యాంధ్ర పేరుతో పదవి కోసం ప్రజల్ని గంటా మోసం చేశారని విమర్శించారు. ‘ఆయన ఏ రోజైనా ఉద్యమంలో పాల్గొన్నారా...నిరాహార దీక్ష చే శాడా... జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యా సం పుచ్చుకుంటా’ అని ధర్మశ్రీ సవాలు విసిరారు. ఇప్పటికైనా గంటా నైజాన్ని గుర్తించి జిల్లా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని, ఆయనను జిల్లా నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడిమిశెట్టి రాంజీ మాట్లాడుతూ పార్టీ నాయకులంతా సమైక్యంగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో నిమ్మదల సన్యాసిరావు, బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, గెంజి సత్యారావు, పంపాన సత్తిబాబు పాల్గొన్నారు. -
జిల్లా దేశంలో ముసలం
చిచ్చురేపుతున్న గంటా బృందం చేరిక కీలక సమావేశాన్ని బహిష్కరించిన అయ్యన్న వర్గం వెలగపూడి, పప్పల కూడా దూరం బాహాటమైన వర్గ విభేదాలు సాక్షి, విశాఖపట్నం: జిల్లా తెలుగుదేశంలో ముసలం మొదలైంది. రెండుగా చీలుతున్నట్లు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. గంటా బృందాన్ని చేర్చుకోవద్దని స్వరం పెంచిన అయ్యన్న వర్గం శుక్రవారం మరో అడుగు ముందుకేసింది. గంటా పాల్గొన్న కీలక సమావేశాన్ని బహిష్కరించింది. దీంతో అసమ్మతి స్పష్టంగా పాగా వేసినట్టయింది. గంటాతోపాటు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, ముత్తంశెట్టి,అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల తదితరులను పార్టీనేతలు,కార్యకర్తలకు పరిచయం చేసేందుకు గురువారం సాయంత్రం ఎంవీవీఎస్ మూర్తి నగరంలో ఓ సమావేశం నిర్వహించారు. దీనిని అయ్యన్న వర్గం పూర్తిగా బహిష్కరించింది. ఎలాగూ రారని పార్టీ తరఫున వీరికి ఆహ్వానం కూడా పంపలేదని తెలిసింది. అయ్యన్న మద్దతుదారులుగా పేరొందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, మరోనేత పప్పలచలపతిరావు, కోనతాతారావు తదితర సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. మహిళా సదస్సు ఏర్పాట్లపై ఉదయం జరిగిన సమావేశానికి మాత్రం వచ్చారు. అయ్యన్న వర్గం దానికి కూడా హాజరుకాలేదు. సమావేశంలో గంటాతోపాటు ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో పార్టీనేతలతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు గాని అయ్యన్న వర్గం పేర్లను విస్మరించారు. పార్టీలో ఇతర నేతలు కూడా వీరిపేర్లను ప్రస్తావించలేదు. పప్పల చలపతిరావు పేరు మినసా అయ్యన్న వర్గం గురించి ప్రస్తావించలేదు. గంటారాకతో పార్టీలో ముదిరిపోయిన విబేధాలు పరిచయ కార్యక్రమం ద్వారాబయపడ్డాయి. చంద్రబాబు గురువారం విశాఖనుంచి హైదరాబాద్ బయలుదేరే సమయంలో ఆయన్ను అయ్యన్న కలిశారు. మరోసారి గంటారాకపై తన అభ్యంతరం వ్యక్తంచేశారు.అధినేతకూడా గంటావైపే మొగ్గుచూపడం,తన తనయుడికి అనకాపల్లి పార్లమెంట్ సీటుపై హామీ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్రస్థాయిలో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు శుక్రవారం సమావేశానికి కూడా అయ్యన్నవర్గం దూరమవడంతో మున్ముందు పార్టీలో వీరి పాత్ర ఎలా ఉంటుందనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా పరిచయ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జులతోపాటు వీవీఎస్మూర్తి,బండారు,గవిరెడ్డి,ఆడారితులసీరావు తదితర నేతలు హాజరయ్యారు. -
చేరికలా..చేదుగుళికలా..
విశాఖపట్నం: కొత్త నేతల చేరికలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్దతలనొప్పి తె చ్చిపెడుతున్నాయి. ఇంతకాలం అధికారంలో వుండి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందుల పాల్జేశారనే విమర్శలెదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు బృందాన్ని అడ్డుకొనేందుకు సీనియర్లు, బీసీ నేతలు ఏకతాటిపైకి రావడంతో పరిస్ధితి గందరగోళంగా మారింది. పీఆర్పీ తరపున ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్యలను తెలుగుదేశం పార్టీలోేర్చుకొంటే తాము పార్టీని వీడతామంటూ పలువురు బీసీ నేతలు, సీనియర్లు హెచ్చరిస్తుండడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మాజీ మున్సిపల్ రామారావు నేతృత్వంలోని బీసీ సంఘాల నేతలు మంగళవారం బస్సుల్లో హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలసి పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గంటా బృందం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం వుండ దని వివరించారు. అనకాపల్లిలో గంటా, పెందుర్తిలో పంచకర్ల తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించారని అటువ ంటి వారిని పార్టీలోకి తీసుకొంటే ఎప్పటినుంచో ఉన్న క్యాడర్ దూరమవుతుందనివివరించినట్లు తెలిసింది. ఇక, బుధవారం విజయనగరంలో జరగనున్న పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబును ఈ విషయమై క లసేందుకు నగరంలోని పార్టీ బీసీ నేతలు సిద్ధమౌతున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన దేశం పార్టీ విశాఖలో బీసీలను కాదని ఓసీలకు, పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తే పార్టీని వీడేందుకు సిద్ధమని భరణికాన రామారావు నేతృత్వంలోని పలువురు చంద్రబాబుకు స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన పార్టీ ఎంఎల్సీ, సీనియర్‌నేత యనమల రామకృష్ణుడును కలసిన బీసీ సంఘాల నేతలు ఈ విషయాన్ని ఆయనతో చర్చించి నిర్ణయాన్ని స్పష్టం చేశారు. గంటా బృందం తెలుగుదేశంలో చేరకముందే తాము పోటీచేయనున్న అసెంబ్లీ సీట్లపై ప్రచారాన్ని సాగించడం కూడా వివాదాస్పదంగానే మారింది. -
తమ్ముళ్లు ససేమిరా!
గంటా బృందం రాకను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు పార్టీలో చేర్చుకోవద్దంటూ అధిష్టానానికి ఫ్యాక్స్‌లు గంటా బృందాన్ని పార్టీలోకి స్వాగతించేందుకుతెలుగుదేశంలోని కొందరు సుముఖంగా లేరు. ‘దేశం’ పంచన చేరేందుకు ‘ఆ నలుగురు’ముహూర్తం ఖరారు చేసుకున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వర్గం టీడీపీకి కలిగించిన నష్టాన్ని గుర్తు చేస్తూప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్‌ల పరంపర వెళ్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు గ్రూపునకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. పదేళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అష్టకష్టాలు పడి పార్టీని నిలబెట్టిన తమను కాదని నిన్నటి వరకూ అడుగడుగునా అధికార దర్పం ప్రదర్శించి తమకు నరకం చూపించిన ఈ బృందాన్నిస్వాగతించడమేమిటని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. వీరిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఫ్యాక్స్లపరంపర కురిపిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, పెందుర్తి శానసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు, భీమిలి శానసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాక శాసనసభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్య టీడీపీలో చేరి తిరిగి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల 8న విశాఖలో నిర్వహించతలపెట్టిన సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఎవరెవరు ఏ యే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపైనా ఇప్పటికే ఒక అవగాహన కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే తెలుగుదేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఎదురుగాలి ఇలా.. కష్టకాలంలో పార్టీని నమ్ముకొని కార్యక్రమాలు చేసి, క్యాడర్‌ను కాపాడుకున్న తమను కాదని వీరికి పెద్దపీట వేయటమేమిటని పలువురు నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. గంటా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశం పార్టీ వారిపై వేధింపులు, కేసులు ఎక్కువయ్యాయని గుర్తు చేస్తున్నారు. గంటా తన నియోజక వర్గమైన అనకాపల్లిలో ఆ ప్రాంతంలో ఎటువంటి సంబంధం లేని వ్యాపార భాగస్వామి అయిన పరుచూరి భాస్కరరావును ఇన్చార్జిగా నియమించి అనుక్షణం వేధింపులకు గురి చేశారంటూ పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఫ్యాక్స్‌లు పంపుతున్నారు. పంచకర్ల రమేష్‌బాబు వివాదాస్పద హిందుజా థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఏజెంట్‌గా మారి ప్లాంట్ వ్యతిరేక ఉద్యమకారులపై లాఠీచార్జీలు జరిపించి అరెస్టులు చేయించిన సంఘటనలను దేశం నేతలు గుర్తు చేస్తున్నారు. భీమిలి, గాజువాక శాసనసభ్యులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడమే గాక భూకబ్జాలకు పాల్పడితే తామే ఉద్యమాలు చేశామని, అటువంటి వారితో ఇప్పుడు కలసి ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి బీసీల పార్టీగా ముద్రవేసుకొనే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న పప్పల చలపతిరావు, గుడివాడ నాగమణి, అమరనాథ్, గొంతిన నాగేశ్వరరావు వంటి బీసీ కాపులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాలనుంచి వలస వచ్చిన ఓసీ కాపులైన వీరికి పెద్ద పీట వేయడంపైనా కూడా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలుగా వీరిపై సహజంగానే ఓటర్లలో వ్యతిరేకత ఉంటుందని, అటువంటి వారితో ప్రయోగం చేయడం పార్టీకి మంచిది కాదని సీనియర్ తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు. వీరి చేరిక వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీరి చేరికపై పునరాలోచన జరపాల్సిందిగా చంద్రబాబుపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. -
నిగ్గదీసిన నేరానికి పీఈటీ ‘ఔట్’!
గంటాతో తంటా? ‘గ్రేటర్’ విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఢీఅన్న డ్రిల్ మాస్టారికి స్థాన చలనం అనకాపల్లి, న్యూస్‌లైన్: సాధారణంగా పాఠశాల విద్యార్థులను పీఈటీలు ఆటలాడిస్తారు. ఔట్లు ప్రకటిస్తారు. కాని అనకాపల్లిలో రాజకీయ నాయకులు పీఈటీలతో ఆటలాడుకుంటూ వారిని ఔట్ చేస్తున్నారు. వినడానికి ఆసక్తిగా ఉన్నా విద్యారంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న పెత్తందారీ తనానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. కేవలం తోటి ఉద్యోగుల జీతాల కోసం మంత్రిని నిలదీసినందుకు, గతంలో తోటి ఉపాధ్యాయుల విధి నిర్వహణ తీరుపై ప్రశ్నించినందుకు అనకాపల్లి పీఈటీతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న మునిసిపల్ అధికారుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌కు తరిమిన తీరిదీ.. గ్రేటర్ విశాఖలోకి అనకాపల్లి పట్టణాన్ని విలీ నం చేయడంతో ఉద్యోగులకు ఆరు నెలల నుం చి జీతాలు సరిగ్గా అందలేదు. సాంకేతిక త ప్పిదాలకు తోడు అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం ఇన్నాళ్లు కనిపిస్తే, దాని ని ప్రశ్నించినందుకు గాంధీనగరంలో పీఈటీగా వ్యవరిస్తున్న పైసా మాస్టార్‌ను గ్రేటర్ విశాఖకు తరిమేశారు. పరి పాలనా సౌలభ్యం కోసమంటూ అధికారులు కుంటుసాకులు చూపుతున్నా ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమం కారణంగానే ఆయనను బ దిలీ చేశారన్నది సర్వ విదితం. మంత్రి హోదా లో మునిసిపల్ కార్యాలయానికి విచ్చేసిన గంటా శ్రీనివాసరావును జీతాల బకాయిల కోసం ఉపాధ్యాయులు నిలదీయగా ఉపాధ్యాయులకు నాయకత్వం వహించారు పైసా మాస్టార్. తమకు సమాధానం చెప్పాలని మంత్రిని డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయిన మంత్రి పోలీసులతో అరెస్టు చేయించాలని ప్రయత్నించడం కొసమెరుపు. ఇదిలావుండగా బదిలీలు అవసరంలేని ప్రస్తుత సమయంలో పైసా మాస్టార్‌ను విశాఖపట్నానికి పంపించడం ద్వారా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారని స్పష్టమవుతోంది. గతంలోనూ పీఈటీ పైసా మాస్టార్‌ను లక్ష్యంగా చేసుకొని ఒక కమిషనర్ కేసులు పెట్టించడం గమనార్హం. 2011లో మునిసిపల్ మెయిన్ హైస్కూల్ పీఈటీగాను, స్టేడియం ఇన్‌ఛార్జిగాను పనిచేసిన పైసా మాస్టార్‌ను అప్పట్లో రాజకీయ వత్తిళ్లతో గాంధీనగరం హైస్కూల్ శెలవుల సమయంలోబదిలీ చేశారు. పైసా మాస్టార్ కంటే జూనియర్‌కు స్టేడియం ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి పీఈటీలలో విభజించే పాలనకు తెరలేపారు ఈపాలకులు. -
పోయే వారికిపొగ!
=జంపింగ్ నేతల నియోజక వర్గాల్లో కొత్త నాయకత్వం =జాబితా సిద్ధం చేసిన డీసీసీ,విశాఖ నగర కాంగ్రెస్ =11, 12ల్లో పరిశీలకుల రాక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమనుకునే వారికి తామే పొగబెట్టి పంపే దిశగా జిల్లా, నగర కాంగ్రెస్ విభాగాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే అనుమానితుల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులను తెర మీదకు తెచ్చి కొన్ని రోజుల్లో వారికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనకాపల్లి, భీమిలి, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా మరో నలుగురు ఎమ్మెలు పార్టీకి టాటా చెప్పడం ఖాయమని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నారు. న ర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాపను అనుమానిత జాబితాలో ఉంచారు. ఈ నెల 23 తర్వాత వీరంతా పార్టీని వీడితే ఆయా నియోజకవర్గాల్లో ఒక్కసారిగా నాయకుడు లేకుండా పోతారనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉండగానే వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌ల నియామక ప్రక్రియ మొదలెట్టారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచన మేరకు డీసీసీ అధ్యక్షుడు ధర్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ తరపున నిలిపే అభ్యర్థులను బట్టి సామాజిక, ఆర్థిక బలసమీకరణలను అంచనా వేసి తమ అభ్యర్థిని తెరమీదకు తెచ్చే పనిలో పడ్డారు. ఏఐసీసీ ఆదేశం మేరకు ఈ నెల 11, 12వ తేదీల్లో కర్ణాటక ఎమ్మెల్యే యశ్వంత్రీగౌడ్ పరిశీలకునిగా జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు సంబంధించి చోడవరం, పాడేరులో రెండు సమావేశాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు యోచిస్తున్నారు. విశాఖ సిటీ సమావేశం ఎక్కడ నిర్వహించేదీ ఇంకా ఖరారు కాలేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను సూచిస్తే పరిశీలకులు వాటిని ఢిల్లీకి తీసుకుని వెళ్లి పీసీసీ ద్వారా మరింత సమాచారం సేకరించి స్థానిక పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ ముఖ్య నాయకుడొకరు ‘సాక్షి’కి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నియోజకవర్గాల వారీగా నేతలు ఖరారు చేసిన అభ్యర్థుల జాబితా ఇలా వుంది. అనకాపల్లి : కె. జగన్, రఘుబాబు, కాపు సా మాజికవర్గం నుంచి ఎం. రమణ రావు, లేదా ఆయన సతీమణి ధనమ్మ, సన్యాసినాయుడు యలమంచిలి : గంధం నందగోపాల్, బి.వెంకటేశ్వరరావు, గవర నుంచి పోటీకి దింపాలనుకుంటే ఎన్ఆర్ఐ ఒకరి పేరు పరిశీలనలో ఉంది. మాడుగుల : ధర్మశ్రీ. ఆయన అనకాపల్లి ఎంపీకి పోటీ చేసేట్లయితే రామ్మూర్తినాయుడు, తులపట్ల భాస్కర్. చోడవరం : ధర్మశ్రీ లేదా గొర్లె సూరిబాబు, స్థానికుడైన ఒక డాక్టర్. పెందుర్తి : శరగడం చిన అప్పలనాయుడు, బిజి నాయుడు, దొర్ల రామునాయుడు, తాలపు మీన, తోట విజయలక్ష్మి భీమిలి : మాజీ శాసనసభ్యుడు కర్రి సీతారాం నర్సీపట్నం : ముత్యాలపాప. ఈమె పార్టీ మారితే ప్రత్యామ్నాయంగా తూర్పుకాపు, వెలమ, క్షత్రియ సామాజిక వర్గాల నుంచి పేర్లు పరిశీలనకు తీసుకోవాలని నిర్ణయించారు. -
కిరణ్ పార్టీలో చేరతా: మంత్రి శత్రుచర్ల
హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో చేరలేనని చెప్పారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులో చేరుతానని లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాని వెల్లడించారు. ఇవేమీ కాకుంటే రాజకీయాలనుంచి వైదొలుగుతానని శత్రుచర్ల అన్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని భావిస్తున్నారు. దీంతో మంత్రులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. -
పచ్చతోరణం
=గంటా చుట్టూ తిరిగిన టీడీపీ సమీకరణాలు =తీరు మారని అయ్యన్న.. పెళ్లికి దూరం =నేతల వైఖరి క ళ్లకు కట్టిన కళ్యాణ వేడుక విశాఖలో బుధవారం జరిగిన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత వివాహ వేడుక భవిష్యత్ రాజకీయ పరిణామాలను చూచాయగా వెల్లడించే వేదికైంది. ఇది పూర్తిగా గంటా కుటుంబ కార్యక్రమం అయినా రాబోయే రోజుల్లో ఎవరెటు అనే విషయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కళ్లకు కట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి లాంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరైనా రాజకీయ వర్గాల ఊహాగానాలన్నీ చంద్రబాబు- గంటా చుట్టూనే తిరిగాయి. మంత్రి బాలరాజు సీఎం కిరణ్‌తో సహా వివాహానికి హాజరు కావడం, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన మద్దతుదారులైన నాయకులు విశాఖలోనే ఉన్నా మర్యాదపూర్వకంగానైనా పెళ్లికి హాజరు కాకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్లో హైలెట్స్. విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : రాష్ట్రాన్ని చీల్చాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మిగిలిన కాంగ్రెస్ నాయకుల్లానే గంటా శ్రీనివాసరావుకు కూడా రాజకీయ జ్వరం పట్టుకుంది. దీంతో ఎటో ఒక వైపు వెళ్లడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిన ఆయన కచ్చితంగా ఎటు వెళ్లాలి?, ఏ స్థానం నుంచి పోటీకి దిగాలి? అనే విషయంలో గందరగోళంలోనే ఉన్నారు. ఎన్నికల నాటికి రాజకీయం ఏ మలుపైనా తీసుకోవచ్చని, ఎవరైనా తన ను పిలిచి అవకాశం ఇవ్వొచ్చనే అంచనాతో ఉన్న ఆయన ఎక్కడికక్కడ కర్చీఫ్‌లు వేసి చోటు రిజర్వ్ చేసుకునే రాజకీయం నడుపుతున్నారు. కొత్త పార్టీ గురించి జరుగుతున్న ఆలోచనలు కూడా ఆయన్ను ఈ రకమైన అడుగులు వేయిస్తున్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం వర్గాలు మాత్రం గంటా అండ్ గ్రూప్ తమ పార్టీలో చేరడం ఖాయమనే వాదన గట్టిగా వినిపిస్తున్నాయి. గంటాపై పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుండడం, మరో ముఖ్యనేత బండారు సత్యనారాయణమూర్తి సానుకూలంగా ఉండడం కూడా టీడీపీలో జరగబోయే పరిణామాలను అంచనా వేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. గంటా రాక పట్ల తనకున్న వైఖరిని మరో సారి అధినేతకు స్పష్టం చేసేందుకే అయ్యన్న బుధవారం విశాఖలోనే ఉన్నా వివాహ వేడుకకు రాలేదు. బండారు సత్యనారాయణమూర్తితో పాటు ఆయన మద్దతుదారులైన నేతలంతా పెళ్లికి వెళ్లడం టీ డీపీలోని గ్రూపు రాజకీయాన్ని రక్తి కట్టించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పెళ్లికి హాజరై చాలా సేపు గడపడం ద్వారా తన నిర్ణయం ఎలా ఉంటుందనే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పకనే చెప్పారు. మంత్రి గంటాపై ఒంటి కాలిపై లేస్తున్న మంత్రి బాలరాజు వివాహానికి హాజరు కావడం విశేషం. పైగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటే ఆయన వివాహ వేదిక వద్దకు రావడం చర్చనీయాంశమైంది. గంటా, కిరణ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బాలరాజు తీరు సైతం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో అసలే గందరగోళంలో ఉన్న గంటా ఈ పరిణామాలన్నింటినీ ఎలా పరిగణిస్తారు?.. భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. -
దేశంలో మంట
=టీ బిల్లు రావడమే ఆలస్యం =టీడీపీలోకి గంటా అండ్ కో =అయ్యన్న వ్యతిరేక వర్గం స్వాగతం =అగ్గి మీద గుగ్గిలమవుతున్న చింతకాయల =గంటాకు విశాఖ లోక్‌సభ, పంచకర్లకు విశాఖ నార్త్ టికెట్ల హామీ =భీమిలి, మాడుగుల పరిశీలనలో ముత్తంశెట్టి =అనితకు అనకాపల్లి ఇస్తే ఎలా ఉంటుందోనని యోచన =టీడీపీలో రగులుతున్న గ్రూపుల రాజకీయం తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు మరో సారి భగ్గు మనబోతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. దీనిని జీర్ణించుకోలేని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. గంటా గ్రూప్ పార్టీలోకి వస్తే జిల్లాలో కాపు బలం, కాసు బలం చేకూరుతుందనే లెక్కతో చంద్రబాబు సాగిస్తున్న రాజకీయం చివరకు అయ్యన్న? గంటానా? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విభజన బిల్లు నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాగానే గంటా ఆయన అనుచర ఎమ్మెల్యేలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో సైకిలెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనకుకాంగ్రెస్పార్టీ అడుగులు వేసిన తొలినాళ్లలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్యలకు రాజకీయ జ్వరం ప్రారంభమైంది. హస్తం గుర్తు మీదే మళ్లీ పోటీ చేస్తే గల్లంతు కాక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కూడా వీరి వర్గంలో సభ్యత్వం తీసుకున్నారు. వీరంతా కలిసి ఒకే పార్టీలో చేరాలని అనేక ఆలోచనలు చేశారు. చివరకు టీడీపీలో తన మద్దతు దారులందరికీ టికెట్లు ఇప్పించేందుకు గంటా చేసిన డిమాండ్ పూర్తిగా నెరవేరలేదు. ఇందులో కన్నబాబు, చింతలపూడి వెంకట్రామయ్యకు చోటు దక్కలేదని తెలిసింది. ఈ ఇద్దరినీ ఏదో ఒక రీతిలో సంతృప్తి పరచే ఒప్పందం కుదుర్చుకున్న గంటా గ్రూప్ సైకిల్ ఎక్కేందుకే నిర్ణయించుకుంది. అయితే గంటాతో వున్న రాజకీయ వైరం, ఆయన వర్గం మొత్తం వస్తే పార్టీలో గంటాకు పెరిగే ఆధిపత్యం ఆలోచనతో పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు జీర్ణించుకోలేక తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు చెప్పినా అయ్యన్న అవుననేందుకు ఇష్టపడలేక పోతున్నారు. ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావుకు విశాఖ లోక్‌సభ టికెట్, పంచకర్ల రమేష్ బాబుకు విశాఖ నార్త్ నియోజక వర్గాలను చంద్రబాబు ఖరారు చేశారని సమాచారం. ముత్తం శెట్టి శ్రీనివాసరావును అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని తొలుత చంద్రబాబు భావించినా ఇంత వరకు ఖరారు కాలేదు. చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం ప్రకారం గంటా శ్రీనివాసరావును విశాఖ లోక్‌సభ స్థానం నుంచి, పంచకర్ల రమేష్ బాబును విశాఖ నార్త్ నుంచి పంచకర్ల రమేష్‌బాబు పోటీ చేయడానికి రంగం సిద్ధమైందని తెలిసింది. ముత్తం శెట్టి శ్రీనివాసరావును మళ్లీ భీమిలి నుంచి కానీ, మాడుగుల నియోజక వర్గం నుంచి కానీ పోటీ చేయించే ఆలోచన జరుగుతోంది. ముత్తం శెట్టికి భీమిలి ఇచ్చేట్లయితే సకురు రఘువీర్‌కు బదులు ఆయన సతీమణి అనితను అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీచేయించే ఆలోచనలో టీడీపీ పెద్దలు వున్నారు. చింతలపూడి వెంకట్రామయ్యకు మాత్రం టికెట్ ఖరారు చేసే పరిస్థితి లేక పోవడంతో ఎన్నికల తర్వాత ఏదో ఒక రీతిలో సంతృప్తి పరిచే హామీ ఇచ్చినట్లు సమాచారం. కన్నబాబుకు కూడా టికెట్ విషయమై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలపై అయ్యన్న పాత్రుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చక చకా పావులు కదిపారు. తమ మద్దతు దారులందరితో గంటాకు ఘన స్వాగతం పలికించే ఏర్పాట్లు చేశారు. సంకట స్థితిలో చంద్రబాబు అయ్యన్ననే అక్కున చేర్చుకుంటారా? లేక గంటాకే జై కొడతారా? ఇద్దరు కావాలనే రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తే అయ్యన్నను ఏ విధంగా సంతృప్తి పరుస్తారనేది ఆసక్తి కరంగా మారింది. -
బంద్ ప్రశాంతం
=స్వచ్ఛందంగా దుకాణాలు, విద్యా సంస్థల మూసివేత =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు =ర్యాలీలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ఏపీ ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. వివిధ పార్టీల పిలుపు మేరకు బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు పలికాయి. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు పార్టీ శ్రేణులు జిల్లా అంతటా ఆందోళనలు చేపట్టాయి. అరెస్టులతో బంద్ భగ్నానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. పాఠశాలలు, దుకాణాల్ని స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పలుచోట్ల థియేటర్లు, పెట్రోల్ బంకులు మూతపపడ్డాయి. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బైటాయింపు, రోడ్లు దిగ్బంధంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 39 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చినా కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అక్కడక్కడ ఆందోళనలు నిర్వహించారు. న్యాయవాదులు కోర్టుకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో నేతలు ఆందోళనలు చేశారు. విద్యుత్ జేఏసీ నేతలు విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు చోడవరం, రావికమతంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు పాల్గొన్నారు. బంద్ భగ్నానికి పోలీసులు ప్రయత్నించినా నిరసనకారులు ప్రతిఘటించారు. దీంతో 39మందిని అరెస్టు చేశారు. మాడుగుల నియోజకవర్గం కేజేపురంలో జరిగిన కార్యక్రమంలో చొక్కాకుల వెంకట్రావు, దేవరాపల్లిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ బూడి ముత్యాలనాయుడు, కె.కోటపాడులో సమన్వయకర్త పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. నర్సీపట్నంలో బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. రహదారుల్ని వైఎస్సార్సీపీ శ్రేణులు దిగ్బంధం చేశాయి. సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ, టీడీపీ, ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీనాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బుద్ద నాగజగదీశ్వరరావు, ఏపీ ఎన్జీవో నేతలు ఎం.పరమేశ్వరరావు, కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత కడింశెట్టి రాంజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కొండకొప్పాకలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కశింకోట, తాళ్లపాలెంలో కూడా బంద్ నిర్వహించారు. యలమంచిలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. పలుచోట్ల యూపీఏ, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాంబిలి, మునగపాకల్లోనూ బంద్ విజయవంతమైంది. పాయకరావుపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో పాయకరావుపేట,ఎస్.రాయవరం, నక్కపల్లిలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్బంధం చేశాయి. రాస్తారోకో, బైటాయింపు, ర్యాలీలతో పాడేరు నియోజకవర్గం దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, జి.ఈశ్వరి, సీకరి సత్యవాణి ఆధ్వర్యంలో పాడేరులో బంద్ జరిగింది. టీడీపీ నేతలు కూడా బంద్ పాటించారు. మాజీ మంత్రి మత్సరాస మణికుమారి, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అరకు నియోజకవర్గం పరిధిలోని అరకు, అనంతగిరి, డుంబ్రిగుడలో బంద్ జరిగింది. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు కుంబా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు, దన్ను దొర ఆధ్వర్యంలోధర్నాలు, ర్యాలీలు జరిగాయి. -
చప్పగా సాగిన సీఎం పర్యటన
సాక్షి ప్రతినిధి-తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన చప్పగా సాగింది. జిల్లాకు మంజూరు చేసిన ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం బుధవారం వచ్చిన ఆయనను జనం పెద్దగా పట్టించుకోలేదు. సొంత నియోజకవర్గమైన పీలేరులోని కలకడలో నిర్వహించిన సభ జనం లేక వెలవెలపోయింది. అక్కడి రచ్చబండ కూడా అంతంతమాత్రంగానే సాగింది. సీఎం పర్యటనలో జిల్లా నేతల కంటే ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, ఇన్చార్జి మంత్రి పార్థసారథి తదితరుల హడావుడే ఎక్కువగా కనిపించింది. గతంలో కంటే భిన్నంగా చిత్తూరు శాసనసభ్యుడు సీకే బాబుకు ఈ పర్యాయం కిరణ్ కాస్త ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశమైంది. తొలుత శ్రీసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆ తరువాత తిరుపతి అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి, పద్మావతి మహిళా వైద్య కళాశాలకు, చిత్తూరు మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. జిల్లేళ్లమందలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు జనసమీకరణ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని విద్యాసంస్థల వాహనాలను మంగళవారం నుంచే తమ ఆధీనంలోకి తీసుకొని జనాన్ని సమీకరించడంతో ఆ కార్యక్రమం కాస్త బాగా సాగింది. ఆ తర్వాత జరిగిన కలకడ సభలో వేదిక ముందు ఏర్పాటు చేసిన వీఐపీ గ్యాలరీ సైతం ఖాళీగానే కనిపించింది. తిరుపతిలో జరిగిన శంకుస్థాపనలు కూడా మొక్కుబడిగానే సాగాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రాష్ట్ర విభజనకు వేగంగా పావులు కదుపుతుండడం ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్‌ను పూర్తిగా నిర్వేదంలో పడేసింది. ముఖ్యమంత్రికి గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు రాలేదు. తమ వల్లే వేల కోట్ల ప్రాజెక్టులు చిత్తూరుకు వస్తున్నాయని చెప్పుకొనే ప్రయత్నం కూడా ఆ పార్టీ నేతలు చేయకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజన కసరత్తు జోరుగా సాగుతున్న సమయంలో సమైక్యవాదుల నుంచి ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్విమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సమైక్యవాదులు ముఖ్యమంత్రిని కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. -
హద్దు మీరొద్దు
=గంటాపై ధ్వజమెత్తిన బాలరాజు =పరిధి దాటి మాటాడొద్దని స్పష్టీకరణ =ఎవరి పని వారే చేయాలని హితవు =లేదంటే తీవ్రపరిణామాలని హెచ్చరిక సాక్షి, విశాఖపట్నం: సీఎంపై ధ్వజమెత్తిన మంత్రి బాలరాజు ఇప్పుడు విమర్శల ను జిల్లాకు చెందిన మరో మంత్రి గం టా శ్రీనివాసరావు వైపు మరల్చారు. గంటా పరిధి దాటి, అన్నీ తానై అనుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు సం బంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని విమర్శించారు. ‘ఆయన వైఖరి చూస్తుంటే నాకు ఓ కథ గుర్తుకొస్తుంది. ఎవరు చేసే పని వారు చేయాలి. ఇంకొకరి పనిచేస్తే ఫలితమేంటో అందరికీ తెలిసిందే’ అని అన్యాపదేశంగా గంటాకు చురకలు అందించారు. అవే పరిణామాలు గంటాకు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని బాలరాజుకు అందించారని, అందులో అధికారులు, సీఎం కార్యాలయ వర్గాల తప్పేం లేదని, మంత్రి బాలరాజు అలా చెప్పడం సరికాదని మంగళవారం జిల్లాకు చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై బాలరాజు ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన బుధవారం కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంటాపై ఘాటుగా స్పందించారు. సీఎం పర్యటన వ్యవహారం తనకు, సీఎం పేషీకి సంబంధించిన వ్యవహారమని,మధ్యలో జోక్యం చేసుకోవడానికి గంటా ఎవరని ప్రశ్నించారు. అసలేం జరిగిందో చెప్పాల్సిన ఉద్యోగం నీది కాదని స్పష్టం చేశారు. అలా మాట్లాడమని ముఖ్యమంత్రి చెప్పారా? లేదంటే నీకు నువ్వే చెప్పావా? దీనిని తేల్చాలి’ అని డిమాండ్ చేశారు. ‘అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో ఆధారాలున్నాయి. తప్పు ఒప్పులు నిర్ణయించడానికి ,సమాచారం నాకు అందిందని చెప్పడానికి గంటా ఎవరు’ అని బాలరాజు ప్రశ్నించారు. ఎవరినో భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించాలనుకోవడం తగదన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా గంటా మాట్లాడటం తగదన్నారు. గంటాతో కూడా తనకు విభేదాలు లేవని ముక్తాయింపు ఇచ్చారు. తన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. -
రసకందాయంలో ‘బాలరాజ’కీయం
=అధిష్టానంపై విధేయత యత్నం =తాడో పేడోకి సిద్ధం =రసకందాయంలో ‘బాలరాజ’కీయం విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: చాలాకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా అసమ్మతి రాజకీయం నడిపే ప్రయత్నం చేసిన మంత్రి బాలరాజు ఒక్కసారిగా తన టార్గెట్ మార్చారు. అనూహ్యంగా ఆయన సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. పార్టీ విధేయులను సీఎం అణగదొక్కుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ చర్యతో బాల రాజు సీఎంతో నేరుగా సమరానికి సిద్ధమయ్యారు. కిర ణ్‌కుమార్‌రెడ్డి సీ ఎం అయినప్పట్నుంచి బాలరాజు ఆ యనకు జిల్లాలో ముఖ్యుడిగా మెలిగారు. తద్వారా తన నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల అభివద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలసిపోవడం, ఆ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మంత్రి కావడంతో జిల్లాలో బాలరాజుకు కష్టాలు మొదలయ్యాయి. గంటా దూకుడుకు బాలరాజు తట్టుకోలేక పోయారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనను గంటా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనీ, పార్టీలో, జిల్లా అధికార యంత్రాంగంలో ఆయన ఆధిపత్యం తీవ్రమైందని బాలరాజు పలుమార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యలో గంటాకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. దీంతో జిల్లా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం గంటాకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. జిల్లా వ్యవహారాల్లో సైతం గంటా చెప్పిందే జరుగుతూ వచ్చింది. ఇవన్నీ బాలరాజు, గంటా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం ఒకరు అవునంటే మరొకరు కాదనే తీరుకు వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో గంటా పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే వైఖరి అందుకున్నారు. దీంతో బాలరాజు షరామామూలుగానే పార్టీ విధేయత వాదన మొదలెట్టారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా డ్రామాలు ఆడేవాడిని కాదనీ, అధిష్టానం అభీష్టం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు. తన వ్యతిరేకిని ప్రోత్సహిస్తున్నారని సీఎం మీద ఎప్పట్నుంచో కారాలు, మిరియాలు నూరుతున్న ఆయన సమైక్యాంధ్ర వ్యవహారంలో సీఎం తీరును కూడా ఎండగడుతూ వచ్చారు. పార్టీ వ్యతిరేకులతో తాను చేతులు కలిపేది లేదనే నినాదంతో జిల్లాలో సీఎం ఎన్ని సార్లు పర్యటించినా డుమ్మా కొడుతూ వచ్చారు. ఇటీవల చోడవరంలో జరిగిన రచ్చబండ బహిరంగ సభకు కూడా ముఖం చాటేశారు. రచ్చబండలో తన శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ గిరిజనుడు అయినందువల్లే సీఎం కార్యాలయం తనకు కనీస సమాచారం ఇవ్వలేదని బహిరంగ విమర్శలకు దిగారు. రచ్చబండ సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజు పాల్గొని సీఎంను, గంటాను వీరులు, శూరులు, విక్రమార్కులని కీర్తించడం బాలరాజుకు మండేలా చేసింది. పార్టీ వ్యతిరేకులంతా ఒక చోట చేరి ప్రభుత్వ కార్యక్రమంలో ఒకరినొకరు కీర్తించుకునేందుకే పరిమితమయ్యారని బాలరాజు విమర్శలకు దిగారు. నెలాఖరులో తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు బయల్దేరాయి. ఇదే మంచి తరుణమనుకున్న బాలరాజు రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్‌లో చక్రం తిప్పేందుకు సీఎంనే టార్గెట్ చేశారు. నాలుగైదు రోజులుగా జిల్లాలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాతే బాలరాజు మంత్రి గంటాను కాకుండా సీఎం కిరణ్‌నే లక్ష్యంగా చేసుకుని రాజకీయ యుద్ధానికి దిగడం ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ కోణంలోనే ఆయన సోమవారం సీఎంపై నేరుగా రాజకీయ పోరాటానికి దిగినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత రసవత్తర అంకానికి తెరలేపబోతున్నాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.