ఎంసెట్ ఉమ్మడిగానా లేదా వేర్వేరు గా నిర్వహించాలా అనే దానిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఉమ్మడిగానా లేదా వేర్వేరు గా నిర్వహించాలా అనే దానిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శాసన మండలి మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఉమ్మడిగా పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తిరుపతిలో ఐఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, గన్నవరంలో ఎన్‌ఐటీ సంస్థల ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నట్టు తెలిపారు.వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంగళగిరిలో ఏర్పాటవుతున్న ఏఐఐ ఎంఎస్ సంస్థ స్థల పరిశీలనకు శనివారం కేంద్ర కమిటీ వస్తోందని తెలిపారు.
పొడిగింపునకు ఒప్పుకోలేదు
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున 2 రోజుల పాటు శాసన మండలి సమావేశాలు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఒప్పుకోలేదని మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.