ఈసారి ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
విశాఖపట్నం: ఈసారి ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 91.42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.
ఆ జిల్లాలో 98.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు, మూడు స్థానాలను తూర్పుగోదావరి (96.75శాతం), పశ్చిమగోదావరి(95.15శాతం) జిల్లాలు దక్కించుకున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా 71.29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
జూన్ 18 నుంచి టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలను జూన్ 18వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. బుధవారం పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించారు. పరీక్ష ఫీజును జూన్ 2వ తేదీ లోపు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాల్సి ఉంటుంది.