సాక్షి, అమరావతి : చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ రేపే(శుక్రవారం) వెలువడనుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లుగా అనేక సాంకేతిక కారణాల నోటిఫికేషన్ ఆలస్యమైందని పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా టెట్ కమ్ టీఆర్టీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు కేటగిరీల్లో మొత్తం 7,675 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 2 వరకు వివిధ కేటగిరీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
వివరాలు : నోటిఫికేషన్ విడుదల అక్టోబరు 26
ఆన్‌లైన్ అప్లికేషన్ల గడువు : నవంబరు 1 నుంచి 16
సెంటర్ల ఆప్షన్ల ఎంపిక : నవంబరు 19 నుంచి
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : నవంబరు 29 నుంచి
స్కూలు అసిస్టెంట్స్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్ష : డిసెంబరు 6
స్కూలు అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) : డిసెంబరు 11
పీజీ టీచర్స్ పరీక్ష : డిసెంబరు 12,13
వయెపరిమితి పెంపు : ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకు, జనరల్ కేటగిరీ 44 ఏళ్లు
పోస్టుల్లో కోత పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
గతంలో 10 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలన్నీ తుంగలో తొక్కింది. 20 వేలకు పైగా టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోకుండా మరోసారి ఆశావహులను నిరాశకు గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment