ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఈ నెల 10వ తేదీ నుంచి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరుగుతాయని వెల్లడించారు. మొత్తం 3.97 లక్షల మంది టెట్ పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మొత్తం 113 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలలో ఉపాధ్యాయ నియామకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులకు జులై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25,26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అధిక నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. చెట్టు కింద తరగతుల నిర్వహణకు ఇకపై స్వస్తి పలుకుతామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment