సింహాచలం అప్పన్న చందనోత్సవం సోమవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది.
విశాఖపట్టణం: సింహాచలం అప్పన్న చందనోత్సవం సోమవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది. నృశింహుడి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్ధరాత్రి 2.30 గంటలకు స్వామి మూల విరాట్‌కు చందనం వలవడం ప్రారంభమైంది. అది పూర్తయ్యాక ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతి రాజు స్వామివారిని తొలిగా దర్శించుకున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
(సింహాచలం)