‘ఉమ్మడి’తో విద్యార్థులకు మేలు: గంటా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తే ఇరు రాష్ట్రాల విద్యార్థులకు మేలు కలుగుతుందని ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు, జాతీయస్థాయి కాలేజీల ప్రవేశాల్లో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఆదివారం గవ ర్నర్‌తో గంటా భేటీ అయ్యారు. అనంతరం గంటా మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో పరీక్షలపై సానుకూల పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.