విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసులు, చిత్రంలో మంత్రి సునీత తదితరులు
రాప్తాడు: రాప్తాడు కేజీబీవీలో వసతులు సక్రమంగా కల్పించకపోవడంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వసతులు లోపాలను గుర్తించిన ఆయన.. పాఠశాలను నిర్వహించాల్సింది ఇలాగేనా? అంటూ జిల్లా అధికారులు, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం రాప్తాడులోని ధర్మవరం ఫంగల్ రోడ్డు సమీపంలో ఉన్న కేజీబీవీని మంత్రి గంటా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయన వెంట రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, శాసన మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, డీఐజీ ప్రభాకర్‌రావు ఉన్నారు. ముందుగా ఆయన స్థానిక ఏపీ మోడల్‌స్కూల్‌ను పరిశీలించారు. కేజీబీవీ విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని కేజీబీవీల్లో నీటి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి, డీఈవో జనర్ధానాచార్యులు, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి, ఈఈ విజయ శేఖర్, ఏఎంవో జయచంద్రనాయుడు, సీఎం ఆనంద్‌బాబు, జీసీడీవో ఉషారాణి, ఎంపీడీఓ జల్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment