కడప ఎడ్యుకేషన్ : ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన డీఎస్సీ ఫలితాలు ఎట్టకేలకు విడదలయ్యాయి.. రాష్ట్రంలోనే అతి తక్కువ పోస్టులున్న మన జిల్లాలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీపడ్డారు. పోస్టులు తక్కువ.. అభ్యర్థులు ఎక్కువ. ఇంత క్లిష్టపరిస్థితుల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు కొన్ని సబ్జెక్టుల్లో రాష్ట్రంలోనే ప్రథములుగా నిలిచారు. గ్రామీణ అభ్యర్థులు జిల్లాస్థాయిలో సత్తాచాటి ర్యాంకులు సాధించారు. తద్వారా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలను కైవసం చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తాచాటారు. జిల్లా నుంచి నలుగురు రాష్ట్రస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు.
జిల్లావ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 24 నుంచి 28 వరకు తొలి విడత డీఎస్సీ పరీక్ష ఆన్‌లైన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 148 పోస్టులకు 7739 మంది పరీక్షలు రాశారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ నాన్‌లాంగ్వేజ్, లాంగ్వేజ్, పిజీటీ, టీజీటీ, పీఈటీ, ప్రిన్సిపాల్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరిగాయి. రెండవ విడతలో ఎస్‌జీటీలకు జనవరి 18 నుంచి 31 వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. రెండో విడత డీఎస్సీకి కడప, పొద్దుటూరు, రాజంపేటలలోని 8 కేంద్రాలలో పరీక్షను నిర్వహించారు. ఇందులో 78 పోస్టులకు 15, 278 మంది పరీక్షలను రాశారు. రెండు విడతలు కలుపుకుని 226 పోస్టులకు 23,017 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
డీఎస్సీ పరీక్షల్లో వైఎస్సార్‌జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఉర్దూ విభాగంలో స్కూల్‌అసిస్టెంట్ సోషల్‌లో షేక్‌సుల్తానా 65.69 శాతం, ఎస్‌జీటీలో షేక్ హర్షద్‌బాషా 82.53 శాతం మార్కులను సాధించారు. పీజీటీ తెలుగులో కదిరి బాలాజీ 70.50 శాతం, íపీజీటీ బోటనీలో షేక్ నూర్ మహమ్మద్ 69.50 శాతం మార్కులు పొందారు. ఎస్‌జీటీలో మహమ్మద్ 83.4 శాతంతో ప్రథమ. లక్ష్మి ప్రసన్న 81.7 శాతం మార్కులతో రెండోర్యాంకు, సాయిలక్ష్మి 80.6 శాతం మార్కులతో మూడో ర్యాంకు పొందింది. çస్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీస్‌లో కలకత్తా గౌస్‌పీర్ 81.8 శాతం, మునగా యశ్వంత్ 78.3 శాతం,తిరుపతి శ్రీనివాస్ 77.9 మార్కులు పొందారు.
జిల్లాలో 226 పోస్టులకు
పోస్టుల వివరాలు ఇలా.. ఎల్‌పీ తెలుగు–2, ఎల్‌పీ హిందీ–1, మ్యూజిక్ – 5, పిఈటీ తెలుగు– 13.
ఎస్‌ఏ తెలుగు మీడియంకు సంబంధించి : స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్–5, స్కూల్ అసిస్టెంట్ తెలుగు – 24, స్కూల్ అసిస్టెంట్ హిందీ – 14, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–7, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 6, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ–12, స్కూల్ అసిస్టెంట్ సోషియల్ స్టడీస్–21, తెలుగు మీడియం ఎస్‌జీటీ – 34
ఎల్‌పీ ఉర్దూ మీడియంకు సంబంధించి : లాంగ్వేజ్ పండింట్ – 4, పీఈటీ– 8, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ –2, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–4, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 4, స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీ– 3, ఉర్దూ మీడియం ఎస్‌జీటీ – 18
మున్సిపాలిటీలకు సంబంధించి : లాంగ్వేజ్ పండిట్(తెలుగు)–1, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–2, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు–1,స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీస్– 2, స్కూల్‌అసిస్టెంట్ ఇంగ్లిష్–1, స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం–1, ఎస్‌జీటీ – 26; ఉర్దూ మీడియంకు సంబంధించి.. ఎల్‌పీ ఉర్దూ –1, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ –1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 1, స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీ– 2
మెరిసిన గాలివీడు ఆణిముత్యం
గాలివీడు : మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన అర్షద్ బాషా డీఎస్పీ ఏస్టీజీ ఉర్దూ విభాగంలో అత్త్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇతడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అరవీడు కస్బాలో ఉంటున్న అన్వర్‌బాష, ఆయేషా దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. తాజా డీఎస్పీ ఫలితాల్లో రెండో కుమారుడైన బాషా స్టేట్ ఫ్టస్ ర్యాంక్‌సాధించడం పట్ల కుటంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా రాణించేవాడు. పదవ తరగతి కడప ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. టీటీసీ ప్రవేశపరీక్షలో కూడా స్టేట్‌ఫస్ట్‌గా నిలిచాడు. తాజాగా డీఎస్పీ ఫలితాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ సాధించాడు.
సరస్వతీ ప్రసన్నురాలు
పెనగలూరు: డీఎస్సీ ఫలితాల్లో ఎస్‌జీటీలో పెనగలూరుకు చెందిన పాళెంపల్లె రెడ్డిలక్ష్మీ ప్రసన్న జిల్లాస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె తల్లి సర్వసతీ అంగన్‌వాడీ కార్యకర్త, తండ్రి నరసింహులు శెట్టి పోస్టల్ ఏజెంటుగా ఉంటున్నారు. వీరి ఏకైక పుత్రిక లకీŠ?ష్మప్రసన్న 10వ తరగతిలో 558 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్‌లో 971 మార్కులు సాధించింది. రాయచోటిలో శిక్షణలో కూడా టాప్‌ర్యాంకర్‌గా నిలిచింది. కేంద్రీయ విధ్యాలయ సెంట్రల్‌స్కూల్‌లో పని చేయాలనేది తన కోరిక అని అందుకుకూడా అర్హత సాధించినట్లు లక్ష్మీ ప్రసన్న తెలిపింది. తెలంగాణలో నాన్‌లోకల్ కింద డీఎస్సీలో ఎస్‌జీటీలో 5వ ర్యాంకు సాధించిందీమె.
Comments
Please login to add a commentAdd a comment