
కిరణ్ పార్టీలో చేరతా: మంత్రి శత్రుచర్ల
కాంగ్రెస్‌లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో చేరలేనని చెప్పారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులో చేరుతానని లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాని వెల్లడించారు. ఇవేమీ కాకుంటే రాజకీయాలనుంచి వైదొలుగుతానని శత్రుచర్ల అన్నారు.
విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని భావిస్తున్నారు. దీంతో మంత్రులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.