
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బికనీర్ నుంచి ప్రయాణికులతో వస్తున్న బస్సును 11వ నెంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి వారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలను చెప్పట్టారు.