
ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకులతో కాల్పులు జరిపి ఓ వ్యక్తి నుంచి దొంగల ముఠా రూ.38 లక్షలు దోచుకెళ్లింది. ఈ సంఘటన తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోని కార్పొరేషన్ బ్యాంకు బ్రాంచి బయట సోమవారం మధ్యాహ్నం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ఓంవీర్ సింగ్ చెప్పారు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారన్నారు. అయితే వారి కాల్పుల్లో ఎవరూ గాయపడలేదన్నారు. దుండగులు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.