శివలింగంపై అసభ్యకర పదాలు రాసి.. | Shiva Linga Desecrated In Punjab | Sakshi
Sakshi News home page

శివలింగంపై అసభ్యకర పదాలు రాసి..

Published Thu, Jun 4 2020 5:24 PM | Last Updated on Thu, Jun 4 2020 5:46 PM

Shiva Linga Desecrated In Punjab - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఓ భక్తుడు శివలింగంపై రాసి ఉన్న అసభ్య పదాలను చదివి..

లుధియానా : హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శివలింగంపై అసభ్యకర పదాలు రాసి కించపరిచారు కొందరు దుండగులు. ఈ సంఘటన పంజాబ్‌లోని లుధియానాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగరాన్‌లోని శివాలా చౌక్‌, శ్రీ సీతా రామ్‌ మందిర్‌లోని శివలింగంపై అసభ్యకర పదాలు రాసి కించపరిచారు గుర్తుతెలియని వ్యక్తులు. సాయంత్రం దేవుడ్ని దర్శించుకోవటానికి అక్కడికి వచ్చిన ఓ భక్తుడు శివలింగంపై రాసి ఉన్న అసభ్యకర పదాలను చదివి వెంటనే ఆలయ పూజారి బాబా మహేశ్‌ గిరికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పూజారి శివలింగాన్ని శుభ్రం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( అన్న ఇంటికే కన్నం వేసిన సోదరి )

సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫొటేజీల ఆధారంగా ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ పూజారి బాబా గిరి మాట్లాడుతూ.. ‘‘కొన్ని అసాంఘీక శక్తులు శివలింగంపై అసభ్యకర పదాలు రాసి, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి చూస్తున్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి’’ అని అన్నారు. ( చైనాలో దారుణ సంఘటన )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement