
సాక్షి, హైదరాబాద్: కుకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చైతన్య స్వస్థలం విశాఖ జిల్లా దువ్వాడ. చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేకపోవడంతో పాటు, తల్లిదండ్రుల మాట కాదనలేక మానసిక వేదనతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి స్నేహితులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.