కొండగట్టు ప్రమాదం: డ్రైవర్‌ తప్పిదం వల్లే? | Vemulawada Depot Manager Explain Bus Accident In Kondagattu | Sakshi
Sakshi News home page

Sep 11 2018 12:42 PM | Updated on Sep 12 2018 12:35 AM

Vemulawada Depot Manager Explain Bus Accident In Kondagattu - Sakshi

సాక్షి, కొండగట్టు: ఆర్టీసీ బస్సు  ప్రమాదానికి గురి కావడంతో 57 మందికిపైగా మృతి చెందగా, మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండగట్టులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను వేములవాడ డిపో మేనేజర్‌ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే బస్సు కండీషన్‌లోనే ఉందని.. డ్రైవర్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

ఘాట్‌ రోడ్డుపై సైన్‌ బోర్డులు ఉన్నప్పటికి ఈ ప్రమాదం జరగడం బాధకరం అని పేర్కొన్నారు. బస్సు శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిందని తెలిపారు. బస్సులో ఎక్కువ శాతం మంది స్థానికులు ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం స్థానికుల సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

(ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement