ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 6 నుంచి దరఖాస్తులు | Fee reimbursements Applications From 6 | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 6 నుంచి దరఖాస్తులు

Sep 4 2016 2:49 AM | Updated on Sep 5 2018 9:18 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద 2016-17 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

సాక్షి, హైదరాబాద్:ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద 2016-17 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 6  నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇంటర్, ఆ పైన చదివే పోస్టు మెట్రిక్ విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తులకు అర్హులు. 2016-17 విద్యా సంవత్సరంలో కొత్తగా కళాశాలల్లో చేరిన విద్యార్థులతోపాటు ఇప్పటికే చదువుకుంటున్న వారు epass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 7 లోగా పూర్తి వివరాలు అప్‌లోడ్ చేసిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద స్కాలర్‌షిప్‌లు మంజూరవుతాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఒక ప్రకటనలో తెలిపారు.

పాత బకాయిలకు మోక్షం ఎప్పుడో..?
 ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2015-16 విద్యా సంవత్సరంలో 14.15 లక్షల మంది విద్యార్థులు అర్హత పొందారు. వీరితో పాటు పాత బకాయిలు కలిపి మొత్తం రూ.3,062 కోట్లు విద్యార్థులకు చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.1,150 కోట్ల వరకు నిధులు విడుదల చేసింది. వీటిలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను రూ. 983.99 కోట్లు కాగా, మిగతా మొత్తం పాత బకాయిలు. ఇంకా రూ.1,800 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉండడంతో విద్యార్థులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తీవ్రమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement