దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..? | Dasari Narayanarao movie on Amma | Sakshi
Sakshi News home page

దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..?

Published Tue, Jan 3 2017 1:30 PM | Last Updated on Mon, May 28 2018 4:09 PM

దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..? - Sakshi

దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..?

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్తో

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానని ప్రకటించిన దాసరి, తరువాత ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు. దాసరి అనారోగ్య సమస్యలతో పాటు పవన్ కూడా రాజకీయాల్లో బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే సమయంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన వడ్డీకాసులవాడు సినిమా కూడా ఆగిపోయింది. ఈ రెండు ప్రాజెక్ట్లను పక్కకు పెట్టేసిన దాసరి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు.

తాజాగా అమ్మ అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాసరి స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement