ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు... | Laughing Stuff Biplab Kumar Deb Comments | Sakshi

ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు...

May 1 2018 7:05 PM | Updated on May 1 2018 7:05 PM

Laughing Stuff Biplab Kumar Deb Comments - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహాభారతం కాలం నుంచి ఇంటర్నెట్‌ సౌకర్యం మనకుందంటూ వాదించి నవ్వులపాలైన త్రిపుర బీజేపీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేవ్‌ రోజుకో వ్యాఖ్యతో మనల్ని తెగ నవ్విస్తున్నారు. మెకానికల్‌ ఇంజనీర్లు కాకుండా సివిల్‌ ఇంజనీర్లు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను ఎంపిక చేసుకుంటే బాగుంటందని, ఎందుకంటే రెండింట్లో సివిల్‌ ఉందని, ఒక సివిల్‌ పట్ల ఉన్న అవగాహన రెండు సివిల్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య ట్విటర్‌లో నవ్వులు పూయిస్తోంది. ఎవరికివారు తమదైన శైలిలో ఆయన వ్యాఖ్యపై స్పందిస్తున్నారు.

‘మెకానికల్‌ ఇంజనీర్లు మెకానిక్స్, కెమికల్‌ ఇంజనీర్లు కేవలం కెమెస్ట్స్‌ కావాలి.....హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ హిల్‌ స్టేషన్లలో మాత్రమే చేయాలి....సింగ్‌లు మాత్రమే సింగర్లు కావాలి....వర్జిన్స్‌ మాత్రమే వర్జిన్‌ ఏర్‌లైన్స్‌లో ప్రయాణించాలి......లీవ్స్‌ కోసం ట్రీస్‌ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి....బస్టాప్‌లో బస్సు దొరికినప్పుడు, ఫుల్‌స్టాప్‌లో ఫుల్‌ ఎందుకు దొరకదు....ఇండియానా జోన్స్‌ ఇండియన్‌ ఎందుకు కాదు......హిప్సోస్‌కు మాత్రమే హిప్స్‌ ఉంటాయి. ...ఫిజిక్స్‌ డిగ్రీవారే ఫిజిషియన్లు అవుతారు.....జీబ్రాలు మాత్రమే బ్రాలు వేసుకోవాలి....అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement