కశ్మీర్లో ఉగ్రవాది హతం, ఏకే 47 స్వాధీనం | Terrorist killed in an encounter with security forces in Anantnag(J&K). One AK-47 recoveredc | Sakshi

కశ్మీర్లో ఉగ్రవాది హతం, ఏకే 47 స్వాధీనం

Jan 26 2016 7:00 AM | Updated on Sep 3 2017 4:21 PM

మరోసారి జమ్మూకశ్మీర్లో తుపాకులు చప్పుళ్లు చేశాయి. మంగళవారం వేకువ జామున ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ చేసుకొని ఒక ఉగ్రవాది మృతిచెందాడు

శ్రీనగర్: మరోసారి జమ్మూకశ్మీర్లో తుపాకులు చప్పుళ్లు చేశాయి. మంగళవారం వేకువ జామున ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ చేసుకొని ఒక ఉగ్రవాది మృతిచెందాడు. అతడి వద్ద నుంచి బలగాలు ఏకే 47 తుపాకీని, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం బలగాలను మరింత అప్రమత్తం చేసింది. ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement